Breaking News

క‌రోనా బాధితునికి ఆక్సీజ‌న్ అంద‌జేత

కామారెడ్డి, మే 28

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేస్తున్న మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ వారి షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకి సమయానికి కాంగ్రెస్ నాయకులు ఆక్సిజన్ సిలిండర్ అందించి ప్రాణాలు కాపాడారు.

కామారెడ్డి పట్టణానికి చెందిన స్వాతంత్ర సమర యోధుడు ఇసన్నపల్లీ నారాయణరెడ్డి కుమారుడు భూమన్న కరోన వ్యాధితో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి శ్వాస తీసుకోలేక బాధపడుతున్నాడు. విష‌యం తెలుసుకున్న ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు ఆక్సిజన్ సిలిండర్ అందించి కాపాడారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ వారికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.

అలాగే దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఈనాడు పత్రిక పాత్రికేయుడు గాలి బాలకిషన్ తల్లి గాలి వెంకటలక్ష్మి కి సమయానికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసి వారి ప్రాణాలు కాపాడారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న త‌మ‌కు ఆక్సిజన్ అందించిన షబ్బీర్ అలీ మేలు ఎప్పటికి మర్చిపోలేము అన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article