Breaking News

మానుకోట స్ఫూర్తిగా ముందుకు సాగుదాం..

కామారెడ్డి, మే 28

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మానుకోట సంఘటన జరిగి నేటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం ద‌గ్గర ఘనంగ
నివాళులర్పించారు.

కామారెడ్డి జిల్లా తెలంగాణ జనసమితి నాయకుడు కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ కోదండరామ్ పిలుపుమేరకు అమరవీరులకు నివాళులర్పించిన‌ట్టు తెలిపారు. 2010 మే 28 నాటికి మానుకోట సంఘటన జరిగి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆనాటి సంఘటన గుర్తు చేసుకోవడం జరిగింద‌న్నారు.

ముఖ్యంగా జెఏసి నాయకులు యువత ప్రాణాలు సైతం లెక్కచేయకుండా జగన్ పర్యటనను అడ్డుకున్నార‌ని, ఒక వైపు జగన్ ప్రైవేటు సైన్యం తూటాల వర్షం కురిపించిన కూడా అవేవి లెక్కచేయకుండా ముందుకు సాగిన గొప్ప సంఘటన తెలంగాణ అస్థిత్వాన్ని ఆత్మగౌరవాణ్ణి నిలబెట్టడానికి మానుకోట తిరుగుబాటు ఒక దివిటి అని, మే 28 న మానుకోట స్ఫూర్తితో తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు పునరంకితమవుదామని అన్నారు.

కార్యక్రమంలో స్వామి, కిరణ్, రాజు పాల్గొన్నారు

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article