Breaking News

అటవీ భూముల ఆక్రమణలు అరికట్టాలి

కామారెడ్డి, మే 28

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః అటవీ భూముల ఆక్రమణలను అరికట్టాలని, వృక్షజాతిని కాపాడాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఫారెస్టు, రెవిన్యూ, పోలీసు అధికారులతో కూడిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీలో అటవీ భూముల పరిరక్షణపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అటవీ భూముల సమస్యలకు సంబంధించి రెవిన్యూ, ఫారెస్టు శాఖలు జాయిట్ సర్వేల ద్వారా అటవీ భూములను గుర్తించాలని, అటవీ భూముల ఆక్రమణను అరికట్టాలని ఆదేశించారు. అడవులలో చెట్టు నరకబడకుండా చూడాలని, ఎవరైనా అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమ రవాణా వాహనాలను సీజ్ చేయాలని, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసు, రెవిన్యూ శాఖల సహాయం తీసుకోవాలని ఫారెస్టు అధికారులకు సూచించారు.

జూన్ ఒకటవ తేదీ నుండి అటవీ సరిహద్దు గ్రామాలలో అడవులను కాపాడుకోవడంపై రెవిన్యూ సిబ్బంది సహకారంతో అవేర్‌నెస్ ప్రోగ్రాములు, టామ్ టామ్ కార్యక్రమాలు నిర్వహించాలని, అందరి సహకారంతో అడవుల అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జీ అదనపు కలెక్టరు బి.వెంకట మాధవరావు, ఉమ్మడి జిల్లాల ఫారెస్టు అధికారి సునీల్, అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ అన్యోన్య, ఆర్ డిఓ ఎస్.శీను, ఫారెస్టు డివిజనల్ అధికారి శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article