Breaking News

వానా కాలం సాగుకు విత్తనాలు, ఎరువుల కొరత లేదు

కామారెడ్డి, మే 28

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః వచ్చే వానా కాలం సాగుకు విత్తనాలు, ఎరువుల కొరత లేదని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ తెలిపారు.

శుక్రవారం జిల్లా కలెక్టరు తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ కె.కేశవులు, ఉమ్మడి జిల్లాల విత్తనాభివృద్ధి సంస్థ రీజినల్ మేనేజరు కె.విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్్క ఫెడ్ మేనేజరు జితేందర్, వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగు కావలసిన విత్తనాలు, ఎరువులపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, వచ్చే వానాకాలానికి సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో వున్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని తెలిపారు. వారికి సంబంధించి 33 వేల క్వింటాళ్ల అవసరానికి గాను 57 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో వున్నాయని, కందులు, పెసలు, మినుములు వంటి అవ‌స‌రాల విత్తనాలు 600 క్వింటాళ్లు సిద్ధంగా వున్నాయని, అవసరమైతే ఇతర జిల్లాల నుండి తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు.

ఎరువులకు సంబంధించి 44,206 మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను 14,893 మెట్రిక్ టన్నులు, డిఎపి 5458 మెట్రిక్ టన్నులకు గాను 1209 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్ ఎరువు 21830 మెట్రిక్ టన్నులకు గాను 6320 మెట్రిక్ టన్నులు, పొటాష్ 3820 మెట్రిక్ టన్నులకు గాను 875 మెట్రిక్ టన్నులు సిద్ధంగా వున్నాయని, మిగతావి దఫాలుగా జిల్లాకు సరఫరా జరుగుతుందని తెలిపారు.

నాసిరకం పత్తి విత్తనాల సరఫరాను అరికట్టడానికి రెవిన్యూ, వ్యవసాయ, పోలీసు బృందాలతో కూడిన 4 స్క్వాడ్‌ల‌ను వేయడం జరిగిందని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టరు డాక్టర్ కె.కేశవులు మాట్లాడుతూ, పచ్చిరొట్ట విత్తనాలు జిల్లాకు 7 వేల క్వింటాళ్లు సరఫరా చేయడం జరిగిందని, మరో 4 వేల క్వింటాళ్లు రెండు మూడు రోజుల్లో సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు సోయాబీన్ విత్తనాలు ఎక్కడి నుండి తీసుకున్నా ముందస్తుగా 70 శాతం మొలక శాతం నిర్ధారించుకున్న తర్వాతనే విత్తుకోవాలని తెలిపారు.

ఈసందర్భంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పోస్టర్లను, బోచర్లను ఆవిష్కరించారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article