Breaking News

ఆపరేషన్ నిమిత్తం యువకుని ర‌క్త దానం

కామారెడ్డి, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో బిబీపేట్ గ్రామానికి చెందిన ఎల్లవ్వ (75) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ను సంప్రదించారు.

పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడిన‌ట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు రక్తం అవసరమైనప్పుడు తమను సంప్రదించాలని, కుటుంబ సభ్యులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని తెలిపారు.

రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article