Breaking News

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్‌, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కొనసాగుతున్న సూపర్ స్ప్రెడర్ల కొరకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు.

ఆయన శనివారం చంద్రశేఖర్ నగర్ కాలనీ, దుబ్బ యుపిహెచ్సి పరిధిలోని వారి కొరకు ప్రభుత్వ గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో వ్యాక్సినేషన్ తీరును ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని అన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని డాక్టర్లను సిబ్బందిని నిర్వాహకులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, తదితరులు ఉన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article