Breaking News

వార్డు అభివృద్దికి పాటుప‌డ‌తా…

బోధ‌న్‌, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బోధన్ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. బెంజర్ గంగారాం ను కమిషనర్ రామలింగం ప్రమాణ స్వీకారం చేయించారు.

భారత రాజంగ్య సాక్షిగా దేశసార్వ భౌమాధికారన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్రతను కాపాడుతనని కర్రోళ్ల గంగారాం సభాముఖంగా ప్రమాణం చేశారు. చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ సోహెల్, ముఖ్య నాయకులు వి ఆర్ దేశాయ్, టీఆర్ఎస్‌ శ్రేణులు నూతన కౌన్సిలర్‌ను సన్మానించారు.

బోధన్ మునిసిపాలిటీ 18 వార్డ్ ఉప ఎన్నికల్లో ఈనెల 3న వెలువడిన ఫలితాల్లో ఘనవిజయం సాధించిన టిఆర్ఎస్ అభ్యర్థి గంగారాం శ‌నివారం నుండి కౌన్సిలర్ గా కొనసాగుతారని కమిషనర్ రామలింగం తెలిపారు.

మున్సిపల్ 18 వార్డు ను అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అన్నివిధాలా పాటుపడుతామని ఆయన అన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ, అబ్దుల్లా, జావిద్, దుప్ సింగ్, టిఆర్ఎస్ నాయకులు, సత్యం, రవీందర్ యాదవ్, తోకల గంగారెడ్డి, నక్క లింగారెడ్డి, కుర్మా వీరన్న దళిత నాయకులు మొగులయ్య, విద్య సాగర్ తదితరులు పాల్గొన్నారు

Check Also

ప్రజాస్వామ్యం ప్రమాదంలోకి నెట్ట బడుతుంది

బోధన్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ పాల‌నలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఐఎఫ్‌టీయూ జిల్లా ...

Comment on the article