Breaking News

త‌ప్పుడు విడియోలు ప్ర‌చారం చేస్తే చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు

నిజామాబాద్, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోషల్ మీడియాలో ఇటీవల నిజామాబాద్ హాస్పటల్ లో ఒక వ్యక్తిని అమానుషంగా పోలీసు వారు కొడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంద‌ని, కానీ ఇది వాస్తవం కాద‌ని, ఎక్కడో వేరే ప్రాంతంలో తీసిన వీడియోను నిజామాబాద్‌లో జరిగినట్లుగా వ్రాస్తూ ప్రచారం చేస్తున్నార‌ని నిజామాబాద్ పోలీసు క‌మీష‌న‌ర్ కార్తికేయ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఇలాంటి తప్పుడు వీడియోలను వైరల్ చేసినట్లయితే చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌ని, “వాట్సప్ గ్రూప్ అడ్మిన్ కి మరి ఫెస్ బుక్ ఖాతాదారులకు, ఇతర సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తులపై ” సైబర్ క్రైమ్ ” ద్వారా నిఘా పెట్టి పట్టుకొని కేసు నమోదు చేయ డం జరుగుతుంద‌న్నారు.

కావున తప్పుడు వీడియోను ఎవరూ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేయ కూడదని సూచించారు. వెంటనే డెలిట్ చేయగలరని ప్రార్ధన,

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article