Breaking News

ఆర్టీసీ ఉద్యోగులకు నేడే వ్యాక్సిన్

నిజామాబాద్, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల 30న ఆదివారం కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

శనివారం సాయంత్రం ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డీవో లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం జిల్లాలోని సుమారు 537 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వ్యాక్సినేషన్ చేయుటకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ లలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఏ ఒక్క ఉద్యోగి కూడా మిస్ కాకుండా చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలన్నారు.

కాన్ఫరెన్స్ లో ఆర్టీసీ ఆర్ఎం సుదా ప‌రిమ‌ళ‌, ఆర్డివోలు రవి, శ్రీనివాస్, రాజేశ్వర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article