Breaking News

సోమవారం నుండి కూలీలు పెరగాలి

నిజామాబాద్, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను సోమవారం నుండి పెంచాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం సంబంధిత అధికారులతో నర్సరీలు , హరిత హారం, లేబర్ టర్నౌట్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు.

ఎంపిడివో, ఎపిఓ లతో మాట్లాడుతూ లేబర్ టర్నౌట్ పెంచాలని గతములో ఆదేశించామని కాని ఆశించిన మేర కాలేదని కావున ఏపిఓలు బాధ్యతతో పని చేయాలని హెచ్చరించారు. కొన్ని మండలాల‌లో పెరిగినప్పటికి చాలా మండలాలలో పెరుగుదల లేదని అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

లేబర్ టర్నవుట్ పైన జిల్లా అభివృది ఆధారపడి వుంట‌ది కావున సోమవారం నుండి ప్రతి మండలం లో 200కు పెరగాలి, అదేవిధంగా వచ్చే గురువారం వరకు 250 వరకు వెళ్ళాలి కావున జూన్ మాసం మొత్తం 250 ఉండాలని ఎంపిడిఓలను ఆదేశించారు.

ఇప్పుడు కోవిడ్ చాలా వరకు నార్మల్ గా ఉన్నది , కోవిడ్ వచ్చిన వారిని ప్రక్కకు పెట్టి మిగితా వారితో పని చేయించాలి. ఏ రోజు ఏ పనులు పెడితే లేబర్ వస్తారో చూసుకొని పనులు పెట్టాలి. ప్రతి ఒక్కరికి ఉపయోగము కలిగే విధంగా పనులు పెట్టాలి, అప్పడే చేసిన పనులకు సంతృప్తి. ఏపిఓలు ఒక వ్యవస్థ అని ప్రణాళిక చేసుకొని ముందుకు పోవాలని క్రింది స్థాయి లో ఉన్న వారితో పనులు చేపించి లేబర్ పెంచాలని ఆదేశించారు.

లేబర్ పెరగకుంటే మాత్రం చర్యలు వుంటాయ‌ని ప్రతి ఆక్టివ్ లేబర్ కు 40 శాతం రావాల‌ని, ఎన్ ఆర్ ఇ జి ఎస్‌ డబ్బులు ఎక్కడికి పోవు డబ్బులు వ‌స్తాయ‌ని చెప్పారు. ప్రతి మండలంలో , ప్రతి జిపి వారీగా ఇచ్చిన నర్సరీ టార్గెట్ ను ఏ మేరకు చేసినారో పరిశీలించాలని అదేవిధంగా హరితహారం కు సిద్ధంగా ఉండాల‌న్నారు.

సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ముఖ్య మంత్రి కోరిక మేరకు ప్రతి గ్రామములో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వాల‌ని, అదికూడా వారికి నచ్చిన మొక్కలు ఇవ్వాల‌ని, ఒక‌వేల లేకుంటే స‌రి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్లాంటేషన్ విషయములో పంచాయతీ సెక్ర‌టరీ లు ఒక ప్రణాళిక ప్రకారము పోవాల‌ని, హరిత హారం పై ప్రభుత్వము చాలా సీరియస్ గా ఉన్నద‌ని, పెట్టిన ప్రతి మొక్క బ్రతకాలని, హరిత హారంలో ఏ ఒక్క మొక్క చనిపోవద్దని చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వెంటనే సరి చేసుకోవాలని గ్రామ పంచాయతీ సెక్ర‌ట‌రీ లకు ఆదేశించారు.

మొక్కలు తగలపెడుతే వారి పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి మెడికల్ కిట్ ఇవ్వాలని ఇది నిరంతరం జరగాలని అధికారులను ఆదేశించారు

సమావేశములో అదనపు కలెక్టర్ లత, జడ్పీ సీఈఓ గోవింద్, చందర్, డిఆర్డిఏ పిడి, డిపివో జయసుధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article