Breaking News

Nizamabad News

ఓటు ద్వారానే రాజ్యాంగం బలోపేతం

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్య దేశాల్లో మన భారతదేశం ఎంతో అడ్వాన్స్‌గా ఉందని అది ఓటు ద్వారానే సాధ్యమవుతున్నదని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎలక్టోరలల్‌ లిటరసీ క్లబ్‌ నోడల్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజల చేత ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి మన రాజ్యాంగం తయారు చేసుకోవడం జరిగిందని, దీనికి ప్రపంచంలోనే ఎంతో గౌరవం ఉందన్నారు. దీనికి కారణం ...

Read More »

జాతీయ నిరుద్యోగ రిజిస్టర్‌ కాంపెయిన్‌

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ యువజన కాంగ్రెస్‌ అధ్వర్యంలో జాతీయ నిరుద్యోగ రిజిస్టర్‌ను నిర్వహించేందుకు మిస్డ్‌ కాల్‌ కాంపెయిన్‌ను బుదవారం నిజామాబాద్‌లో రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ కార్యదర్శి బొబ్బిలి రామకష్ణ ప్రారంభించారు. పట్టభద్రులైన నిరుద్యోగ యువత 8151994411 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని రామక్రిష్ణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రూరల్‌ యువజన కాంగ్రెస్‌ నాయకులు మోత్కురి నవీన్‌ గౌడ్‌, దేవేందర్‌, నవనీష్‌, నవీన్‌, విజయ్‌, మహేందర్‌, మనోజ్‌ ఉదయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కాలోజీవాడి గ్రామానికి చెందిన పైడి జగన్‌ రెడ్డి (59) తొమ్మిది నెలల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ దేశానికి గొర్ల కాపరిగా వెళ్లాడు. గత 17 రోజుల క్రితం విధినిర్వహణలో అక్కడే గుండె పోటుతో మతి చెందాడు. విషయం తెలుసుకొని మతుడు పైడి జగన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను గల్ఫ్‌ వెల్పేర్‌ అండ్‌ కల్చరల్‌ అద్యక్షుడు పాట్కూరి బసంత్‌ రెడ్డి, ఓర్ల శ్రీనివాస్‌ రెడ్డి మతుని కుటుంబాన్ని ...

Read More »

ట్రాక్టర్లు కొనుగోలు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, పంచాయతీరాజ్‌ అధికారులు, మండలాల ఎంపీఓలతో పల్లె ప్రగతి కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు సేకరించడం అత్యంత ప్రధానమైన విషయమని ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో ప్రత్యేకంగా ఉన్నారన్నారు. ప్రతి గ్రామపంచాయతీ తప్పనిసరిగా ట్రాక్టర్‌ ...

Read More »

బిఎల్‌ఎఫ్‌లో చేరిన సిపిఎం నాయకులు

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్‌ బిఎల్‌ఎఫ్‌ పార్టీలో చేరారు. నిజామాబాద్‌ నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గహంలో బుదవారం జరిగిన కార్యక్రమంలో బహుజన లెఫ్ట్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దండి వెంకట్‌ ఆధ్వర్యంలో గంగాధర్‌ బిఎల్‌ఎఫ్‌లో చేరారు. బిఎల్‌ఎఫ్‌ జిల్లా అద్యక్షులు ముత్యాల శ్యామ్‌ బాబు బహుజన లెఫ్ట్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అద్యక్షులు ఆర్టీసీ సంజీవ్‌, నగర అద్యక్షులు కొటారి రాములు పాల్గొన్నారు.

Read More »

ప్రతిభా పరీక్ష విజయవంతం చేయండి

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రతిభా పరీక్షను ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2న ఆదివారం ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు పదవ తరగతి చదువుతున్న ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులు వారి యొక్క పేర్లను క్రింద తెలుపబడిన నంబర్లకు నమోదు ...

Read More »

హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న లచ్చా గౌడ్‌ అనే హెడ్‌ కానిస్టేబుల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Read More »

ఆదర్శ పాఠశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

రెంజల్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి 2020-21 గాను ప్రవేశాలకు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ బలరాం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతికి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 29 వ తేదీ వరకు, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు, ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఏప్రిల్‌ 9 నుంచి ...

Read More »

ముదిరాజ్‌ సంఘం భవనానికి భూమి పూజ

రెంజల్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో బుధవారం సర్పంచ్‌ వికార్‌ పాషా ముదిరాజ్‌ సంఘం నూతన భవనానికి భూమిపూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా ఐదు లక్షల రూపాయల వ్యయంతో ముదిరాజ్‌ సంఘం భవనం నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ముదిరాజుల భవనం కోసం సిడిపి నిధులను ఐదు లక్షలు అందించిన ఎమ్మెల్యే మహమ్మద్‌ షకీల్‌ అమీర్‌కు ముదిరాజ్‌ సంఘం సభ్యులు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ హైమద్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు కుర్మె సాయిలు, ముదిరాజ్‌ ...

Read More »

చిన్నతనం నుంచే సేవా భావాన్ని అలవరచాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు ఉద్బోదించారు. నిజామాబాదు నగరంలోని టీఎన్‌జివో భవన్‌లో మంగళవారం రాత్రి జేసిఐ ఇందూర్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కార్యక్రమానికి విఠల్‌ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తోడు జేసిఐ లాంటి స్వచ్చంద సంస్థలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. పిల్లలకు ...

Read More »

జిల్లా కార్యాలయాలు దిక్సూచిగా పని చేయాలి

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రభుత్వ కార్యాలయాలు కిందిస్థాయి కార్యాలయాలకు దిక్సూచిగా పనిచేసి ప్రజల సేవలు వేగవంతం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ప్రగతి భవన్‌, కలెక్టరేట్‌, అక్షర ప్రణాళిక భవన్‌, వెల్నెస్‌ సెంటర్‌, శిక్షణ కేంద్రంలోని కార్యాలయాలను ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు, సెలవుపై వెళితే వారి సెలవు పత్రాలను పరిశీలించారు. చాలా కార్యాలయాలలో హాజరీ విషయంలో ఆయన అసంతప్తి వ్యక్తం ...

Read More »

బాసరకు పాదయాత్ర

బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సరస్వతి మాల ధారణ స్వాముల బాసర పాద యాత్రను సరస్వతి ఆలయ ధర్మకర్త పోచారం శంభు రెడ్డి మంగళవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. మాల ధారణ స్వాములతో పాటు బాన్సువాడ ఎంపీపీ నీరజ రెడ్డి కూడా స్వాములతో పాదయాత్రలో పాల్గొంటూ బాసర వెళ్లనున్నారు. మంగళవారం రాత్రి వరకు బోధన్‌ చేరుకొని అక్కడ రాత్రి బసచేసి బుధవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించి, సాయంత్రం వరకు బాసర చేరుకుంటామని ...

Read More »

ఏసిబికి చిక్కిన అధికారి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపెట్‌ గ్రామంలోని స్మశాన వాటిక బిల్లు నిమిత్తం కాంట్రాక్టర్‌ వద్ద నుండి లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు చిక్కిన మాచారెడ్డి మండల ఈజీఎస్‌ ఎపిఓ రాజేందర్‌.

Read More »

డివిజన్‌ ప్రజల వద్దకు కార్పొరేటర్‌ బంటు వైష్ణవి

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల నిజామాబాద్‌ 26 వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బంటు వైష్ణవి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. తనకు ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.

Read More »

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో మంగళవారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో భీంగల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ మల్లెల రాజశ్రీ, వైస్‌ ఛైర్మన్‌ బాలభగత్‌తో పాటు కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

కెటిఆర్‌ను కలిసిన మేయర్‌

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికైన దండు నీతూ కిరణ్‌ మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ భవన్‌లో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నీతు కిరణ్‌ను కెటిఆర్‌ అభినందించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌ గుప్త, జీవన్‌ రెడ్డి, జాజిరెడ్డి గోవర్దన్‌తో పాటు మేయర్‌ భర్త దండు శేఖర్‌ కూడా కెటిఅర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Read More »

పల్లె ప్రగతి పనులు వందశాతం పూర్తి చేయాలి

రెంజల్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములై నెలాఖరులోగా వంద శాతం పనులను పూర్తి చేయాలని ఎంపీపీ రజిని మండల ప్రత్యేక అధికారి విజయ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ లోలపు రజినీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. ప్రధాన శాఖల అంశాలను పరిగణనలోకి తీసుకుని మిగతా శాఖలను కొనసాగించకుండానే సమావేశం ముగించారు. వ్యవసాయ శాఖ, వైద్య శాఖ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్‌, ...

Read More »

క్రీడల వల్ల ఉల్లాసం

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజు పనుల్లో నిమగ్నమయ్యే ఉద్యోగులకు క్రీడల వల్ల ఉత్సాహం ఏర్పడుతుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు అన్నారు. మంగళవారం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా 33వ జిల్లాస్థాయి క్రీడలను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ కాబట్టి రోజువారీగా బిజీగా ఉండే మీరు శాఖల వారీగా పనిలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఉల్లాసం, ఆనందం కొరకు ...

Read More »

పాఠశాల అభివద్ధికి పూర్వ విద్యార్థి చేయూత

రెంజల్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల అభివద్ధికి చేయుత అందించేందుకు పూర్వవిద్యార్ధులు బాగస్వాములవుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి రెండవ విడతలో జిల్లా కలెక్టర్‌ సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాల అభివద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారు. మండలంలోని దూపల్లి గ్రామ నివాసి పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి రఘుపతి లక్ష్మణ్‌ పాఠశాల బెంచీలు (బల్లలు) కొనుగోలుకు రూ. 20 వేల నగదును మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యయడు దేవదాస్‌, పాఠశాల ఛైర్మన్‌ బక్కయ్యకు అందచేశారు. కార్యక్రమంలో పిఆర్‌టియు మండల ...

Read More »

వసంత పంచమి, శ్రీ పంచమి

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతాయని హేమాద్రి తెలిపారు. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. ‘మాఘ శుద్ధ ...

Read More »