పసి పాపల ఏడ్పు వినిపిస్తే తలుపులు తెరవద్దు! నిజామాబాద్ న్యూస్.ఇన్: బండిపోట్ల ముఠాలు అనునిత్యం కొత్త తరహాలో దోచుకునే పన్నగాలు పన్నుతున్నారు. ఇటీవల చిన్న పిల్లల రోదన తో కూడిన శబ్దాలను తలుపుల వద్ద చేసి, ఇంట్లఉన్నవాళ్లను తప్పుదారిపట్టించి తలుపులు తీయగానే చితకబాది దోచుకొని పోతున్నారు. ఇక ఫై జాగ్రత్త ఉండమని పోలీసులు తెలుపుతున్నారు.
Read More »పంటపొలాలు ధ్వంసం.
నిజామాబాదు జిల్లా నవీపేట్ మండలం జాన్నేపల్లి నాలేశ్వరం పరిసర గ్రామాలలోని పంటపొలాలు అకాల వడగండ్ల వానకు ధ్వంసం.
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన TNREDCL చైర్మన్
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితతో కలిసి తెలంగాణ నూతన పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ (TNREDCL) చైర్మన్ సయ్యద్ అబ్దుల్ అలీం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలీం సిఎంకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఛైర్మన్ పదవిని ఇచ్చారని, మీ నమ్మకాన్ని నిలబెడతానని అలీం సిఎంతో అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు.
Read More »తెరాస గూటికి కామారెడ్డి మునిసిపల్ ఛైర్పర్సన్
– గులాబి కండువా కప్పుకున్న ఛైర్పర్సన్ సుష్మ కామారెడ్డి, సెప్టెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుకున్నట్టే జరిగింది… ఊహించిన విధంగానే కామారెడ్డి మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యుడు గంప గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇదివరకే కాంగ్రెస్‌లో గెలిచిన కౌన్సిలర్లు చాలా మంది తెరాస కండువా కప్పుకున్న నేపథ్యంలో ఛైర్మన్ సైతం తెరాసలో చేరుతారన్న అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలో ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ తెరాసలో చేరడం సర్వత్రా ...
Read More »జిఎస్టి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జిఎస్టి) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది.’ ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా యావత్ సభ మద్దతు తెలిపింది. జిఎస్టికి మద్దతు తెలిపిన సందర్భంలో సభలో 197 మంది సభ్యులు సభలో ఉన్నారు. జిఎస్టి చట్టం రూపు సంతరించుకొని అమలులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకటే పన్ను అమలులోకి రానుంది. జిఎస్టి బిల్లును స్వాగతిస్తున్నాం : కెటిఆర్ జిఎస్టి బిల్లును తాము స్వాగతిస్తున్నామని తెలంగాణ మంత్రి కెటిఆర్ అన్నారు.
Read More »తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ
తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత ...
Read More »జీతాలు చెల్లించని కంపెనీలు కోర్టుకు – యూఏఈ డిక్రీ
జీతాలు చెల్లించని కంపెనీలను కోర్టుకు ఈడ్చే దిశగా చర్యలు తీసుకోబడ్తాయని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ మంగళవారం వెల్లడించింది. మంగళవారం ఈ మేరకు ఓ డిక్రీని కూడా విడుదల చేసింది. 100 మందికి పైగా కార్మికులున్న ఏ సంస్థ అయినా ప్రతిపాదిత తేదీని దాటి 10 రోజుల్లోగా జీతాల చెల్లించకపోతే, ఆ సంస్థకు కొత్తగా వర్క్ పర్మిట్లు ఇచ్చే అవకాశం లేదని ఈ డిక్రీ చెబుతోంది. యూఏఈ మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ ఘోబాష్ ఈ విషయాన్ని ...
Read More »జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం
దేవాలయాల చెంతన ఉండే కోనేరుకు… పురాణ కాలం నుంచి ఎంతో ప్రాశ్యస్త్యం వుంది. వీలైతే ఆ తీర్థంలో స్నానం చేయడం.. లేదంటే ఆ పవిత్ర జలాన్ని తలపై జల్లుకొని పునీతులవుతారు భక్తులు. ఆ పుణ్యతీర్థాన్ని స్పృశించడం వల్ల శరీరం.. మనసు పవిత్రమవుతుందని భక్తులు భావన. అయితే కొన్ని తీర్థాలు మానవ ప్రయత్నంగా కాకుండా.. భగవత్ సంకల్పంతో ఏర్పడతాయి. అలాంటి పరమ పవిత్ర తీర్థమే.. అష్టముఖి కోనేరు. ఇది నిజామాబాద్ జిల్లా జానకంపేటలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ ప్రాంగణం పుణ్యతీర్థంగా విరాజిల్లుతోంది. ఇక్కడ స్వామివారు స్వయంభువు ...
Read More »యాగం నిర్వహిస్తున్న రెండో వ్యక్తిని నేనే
హైదరాబాద్, డిసెంబర్ 18: దేశం లో అయుత చండీయాగాన్ని ఇంతవరకు ఒక్కసారే నిర్వహించారని, అదీ శృంగేరి పీఠం సారథ్యంలో జరిగిందని, ఆ తర్వాత నిర్వహిస్తున్నది తాను మాత్రమేనని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. కాకతీయుల కాలంలో యా గం నిర్వహించినట్లు చెబుతున్నప్పటికీ, తగిన ఆధారాలు ఏమీ లేవని, అందువల్ల ఈ యాగం నిర్వహిస్తున్న రెండవ వ్యక్తిని తానేనని ఆయన చెప్పారు. తనకు తెలిసినంతవరకు ఇది సత్యమని ఆయన అన్నారు. సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించబోయే అయుత చండీయాగం వివరాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ...
Read More »చోళ రాజుల కాలం నాటి ఆనయానికి ఆదరణ కరువు
రెంజల్,(బోధన్) : రెంజల్ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో చోళరాజులు నిర్మించిన అతిపురాతనమైన శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆదరణ కరువై శిధిలావస్థకు చేరుకున్నది. గ్రామస్థులు పలుమార్లు దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండి పోయింది. ఈ ఆలయానికి ఘన చరిత్ర కలిగి ఉంది. పూర్వం చోళ రాజులు గోదావరీ పరీ వాహక ప్రాంతమైన తాడ్‌బిలోలి గ్రామానికి వచ్చి ఈ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని, నిర్మాణానికి పూనుకొన్నారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గర్భగుడి, ఆంజనేయస్వామి గుడితో పాటు ...
Read More »సాహితీ సర్జన్ ప్రతాపరెడ్డి
సంగిశెట్టి శ్రీనివాస్ తెంగాణలో అస్తిత్వవాదం వేళ్లూనుకోవడానికి ప్రధాన కారణం పాట. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, అమర్, విమ మొదు వందలాది మంది వాగ్గేయకాయి పాట రూపంలో తెంగాణ భావజాల వ్యాప్తి చేసిండ్రు. అయితే ఈ పాటలు కైగట్టడానికి ముడిసరుకుని అందించింది విస్మరణకు, వివక్షకు గురైన విషయాలువెలుగులోకి తేవడంలో చాలా మంది చరిత్రకారులు, పరిశోధకులు కృషి చేసిండ్రు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె.శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఉద్యమ సందర్భంలో మెగులోకి తెచ్చిన విషయాలు, ఆంధ్రా కుహనా మేధావులు పత్రికల్లో నిత్యం కక్కే ...
Read More »దుబాయ్ లో 22న జనవరి 2016 సంప్రదాయం వారిచే శ్రీ వేంకటేశ్వర కళ్యాణం
దుబాయ్ లో జనవరి 22, 2016న సంప్రదాయం సంస్థవారిచే శ్రీ వేంకటేశ్వర కళ్యాణం – జె.యస్.యస్ ప్రైవేటు స్కూల్, సఫా పార్క్ వేదికగా జరగబోతుంది. ఈ కార్యక్రమములో స్వామివారి కల్యాణంలో గాని, వాలంటీర్స్ గా కాని పాల్గొనదలచిన వారు ఈ https://goo.gl/SORQ7t లింక్ క్లిక్ చేసి నమోదు చేసుకొవచ్చు. ఈ కార్యక్రమం ఉచితం అని, ఎటువంటి ఫీజులు లేవని కావున స్వామివారి సేవ లో పాల్గొని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరినారు. నిర్వాహకులను సంప్రదించవలసిన వివరాలు: Mana Sampradayam Dubai ...
Read More »తగ్గిన బంగారం దిగుమతులు
ఈ సంవత్సరం అక్టోబర్‌లో బంగారం దిగుమతి విలువ 170 కోట్ల డాలర్లకు పడిపోయింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 420 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది 59.5 శాతం తక్కువ. దీంతో వాణిజ్య లోటు అక్టోబర్‌లో 976 కోట్ల డాలర్లకు తగ్గింది. దీంతో కరెంట్ ఖాతా లోటు (క్యాట్) సైతం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గడం ఇందుకు దోహదం చేసింది. ముడి చమురు, ఎలక్ర్టానిక్స్ తర్వాత మన దేశ దిగుమతల ఖాతాలో బంగారానిదే పెద్ద వాటా.
Read More »రామేశ్వర్పల్లిలో ఐకమత్యంగా వినాయక ఉత్సవాలు
– ఐకమత్యంగా వినాయక ఉత్సవాలు – అన్ని రంగాల్లో ఐక్యతను చాటుతామంటున్న గ్రామ సర్పంచ్ పెద్ది శ్యామల కామారెడ్డి , సెప్టెంబర్ 17 (నిజామాబాదు న్యూస్ ప్రత్యేకం) నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి గ్రామం మరొక్క సారి ఆదర్శ గ్రామమని నిరూపించుకుంది. వినాయక చవితి సందర్భంగా గ్రామస్తుందరు కలిసి ఐక్యంగా ఒకే గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రామేశ్వర్పల్లిని ఆదర్శ గ్రామంగా మార్చే ప్రయత్నంలో గ్రామస్తుందరు ఐక్యంగా నిర్ణయాు తీసుకుంటున్నామని తెలిపారు. గతంలో ప్రయివేటు ...
Read More »గురువును గౌరవించిన వ్యక్తే సమాజానికి అవసరం
-మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్ కల్చరల్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజానికి వెలుగునిచ్చేది ఉపాధ్యాయుడేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 21 మందిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాద్యాయ వృత్తికి పవిత్రత ఉందని, గురువు ద్వారానే గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఉపాధ్యాయులపై నమ్మకంతోనే పిల్లలను తమ తల్లిదండ్రులు పాఠశాలల్లో చేర్పిస్తారని అన్నారు. విద్య అనేది తరగని ...
Read More »సమస్యలు సత్వరమే పరిష్కరించేదిశగా కృషి చేయాలి
హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణమూర్తి నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందు ధర్మంలో వివాహానికి సముచిత స్థానం ఉందని, భార్యభర్తల మధ్య నెలకొన్న చిన్న చిన్న సమస్యలు పెద్దగా మారి విడాకులకు దారి తీసిన సందర్బంలో ఇరువర్గాల న్యాయవాదులు పరస్పరం చర్చలు జరుపుకొని జంటను ఒకటి చేసే ప్రయత్నం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి అన్నారు. శనివారం నగరంలోని స్థానిక బస్వాగార్డెన్‌లో ఏర్పాటు చేసిన న్యాయవాది పరిషత్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ...
Read More »ఆటో, బైక్ ఢీ -పలువురికి గాయాలు
నవీపేట, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట మండలంలోని అమ్దాపూర్ గ్రామ శివారు వద్ద ఎదురెదురుగా వస్తున్న ఆటో, బైక్ ఢీకొని శనివారం మధ్యాహ్నం పలువురికి గాయాలయ్యాయి. ఆటో ధూపల్లి గ్రామం నుంచి కమలాపూర్వైపు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
Read More »7న మండలానికి ఎంపి కవిత రాక
నవీపేట, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట మండలంలోని పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్నట్టు తెరాస మండల అధ్యక్షులు నర్సింగ్‌రావు తెలిపారు.
Read More »ఆచార్య కనకయ్యకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
డిచ్పల్లి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు అధ్యయనశాఖ అధ్యక్షులు, ఆర్ట్స్ డీన్,ప్రిన్సిపాల్ ఆచార్య కనకయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులో సత్కరించింది. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి ఈసంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్నవారిలో ఆచార్య కనకయ్య మాత్రమే ఉన్నారు. వారికి ఈ అవార్డు దక్కడం పట్ల తెవివి ఆచార్యులు, విసి, రిజిస్ట్రార్ హర్షం వ్యక్తంచేశారు. ఆచార్య కనకయ్య కరీంనగర్ జిల్లా వీణవంకగ్రామంలో జన్మించారు. అక్కడే స్కూలు చదువు తర్వాత జమ్మికుంటలో డిగ్రీ వరకు చదువుకున్నారు. పిజి, ఎంఫిల్, ...
Read More »షాక్ సర్క్యూట్‌తో మెకానిక్ దుకాణం దగ్దం
బీర్కూర్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోగల కామప్ప చౌరస్తాలోగల శ్రీదేవి ఆటోమోబైల్ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి షాక్ సర్క్యూట్ వల్ల దగ్దమైంది. విఆర్వో పరమేశ్ సంఘటన స్తలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఆస్తినష్టం విలువ 3 లక్షల 40 వేలుగా దృవీకరించారు. కాగా తెలంగాణ గ్రామీణ బ్యాంకు అయిన ఆంద్రా బ్యాంకు ద్వారా రుణం పొంది దుకాణం నిర్వహిస్తున్నట్టు యజమాని రమేశ్ తెలిపాడు. అగ్ని ప్రమాదంలో బైక్, విడి సామగ్రి పూర్తిగా కాలిపోయాయి.
Read More »