నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో గతనెల 10వ తేదీ నుంచి అక్టోబర్ 9 వరకు డయల్ 100కు 2271 ఫోన్ కాల్స్ వచ్చినట్టు నిజామాబాద్ పోలీసు కమీషనర్ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శారీరక హింస కింద 62 కేసులు, ప్రమాదం కేసులు 393 కేసులు, ఆస్తి తగాదాలు 36 కేసులు, ఆత్మహత్య, ఆత్మహత్య యత్నాల కింద 58 కేసులు, తప్పుడు కాల్స్ కింద 5 కేసులు, ఇతరత్రా కేసులు ...
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రెంజల్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని రెంజల్, దండిగుట్ట గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిడివో చంద్రశేఖర్, విండో ఛైర్మన్ మోహినోద్దీన్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైతుల కొరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎపిఎం చిన్నయ్య, మార్కెట్ కమిటీ ఉపాద్యక్షుడు ధనుంజయ్, కార్యదర్శి ...
Read More »బహుజనులు ఐక్యం కావాలి
నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బహుజనులందరు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని జిల్లా బిఎస్పి అద్యక్షుడు భీంరావ్ గైక్వాడ్ అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాల్లో మోసపోతున్నారని, బహుజనులకు రాజ్యాధికారం కోసం బిఎస్పి ఎంతో కృషిచేస్తుందని, రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న బహుజనులు ఐక్యమై బిఎస్పిని బలపరిస్తే రానున్న రోజుల్లో బహుజనులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ...
Read More »స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్‌స్ట్రక్షన్స్ ఆద్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయసేవాధికార సంస్థ, సీనియర్ సివిల్ జడ్జి చంద్రకళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి మానవులు దైనందిన జీవితంలో చాలా ఒత్తిడికి గురవుతున్నారని, దీనికి ముఖ్య కారణం మానవ సంబంధాలు పూర్తిగా తగ్గిపోయాయని, ఎవరి ఆలోచనలు వారిలో అణిచివేస్తున్నారని అన్నారు. ఆలోచనలు ఇతరులతో ...
Read More »ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
నిజామాబాద్ టౌన్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రానున్న శాసనసభ ఎన్నికల్లో తెరాస అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ప్రచార సరళి, కార్యకర్తల నిర్దేశం, సభల నిర్వహణపై మంత్రి పోచారం, ఎంపి కవిత సమావేశమయ్యారు. బూత్‌స్థాయి నుంచి సమన్వయం చేసుకోవాలని, అన్ని స్థాయిల్లో రోజువారి సమీక్ష జరపాలని నిర్ణయించారు. అన్ని వర్గాలకు తెరాస ప్రభుత్వం చేస్తున్న మేలు గురించి ఇంటింటికి చేరవేయాలని దీనికోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు ...
Read More »ప్రభుత్వ చర్యల వల్ల సంక్షోభం దిశగా వ్యవసాయం
నిజామాబాద్ టౌన్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ చర్యల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభ దిశగా పయనిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అర్వింద్ దర్మపురి ఆరోపించారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలైన బాల్కొండ, ఆర్మూర్, మెట్పల్లి, జగిత్యాల తదితర రైతులు వరిపంటకు నాట్లువేసి నీటికోసం ఎదురుచూస్తున్నారని, గత కొంతకాలంగా వర్సాలు కూడా లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ...
Read More »మిషన్ భగీరథపై మంత్రి పోచారం సమీక్ష
నిజామాబాద్ టౌన్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో తన క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, కలెక్టర్లతో మిషన్ భగీరథపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకానికి అత్యంతప్రాధాన్యత నిస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించడమే సిఎం కెసిఆర్ ఆశయమని, దానికనుగుణంగా ఎమ్మెల్యేలు, అదికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ...
Read More »తెరాస ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడతాం
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెరాస పార్టీ అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు ఎండగడతామని సిపిఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరై వెంకట్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన దొరల పాలన కొనసాగుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి కల్లబొల్లి మాటలతో నెట్టుకొస్తున్నారని పేర్కొన్నారు. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూ ...
Read More »అయ్యప్ప సేవా భవనానికి నిధుల మంజూరు
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్పసేవాసమితి కమ్యూనిటి భవనానికి శాసనమండలి విపక్షనేత షబ్బీర్ రెండు విడతలుగా నిధులు మంజూరు చేశారు. నిదుల మంజూరు పత్రాన్ని శనివారం మాజీ మునిసిపల్ ఛైర్మన్ కైలాష్ శ్రీనివాస్‌రావు, అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు చీల ప్రభాకర్‌కు అందజేశారు. షబ్బీర్ అలీ గతంలో మూడు లక్షలు ఇవ్వగా, ఇటీవల 5 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. అయ్యప్పసేవా సంఘం పక్షాన షబ్బీర్ అలీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ...
Read More »తెరాసలో పలువురి చేరిక
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఫరీద్‌పేట గ్రామానికి చెందిన పలువురు వివిధ పార్టీల కార్యకర్తలు శనివారం తెరాసలో చేరారు. వందల సంఖ్యలో పద్మశాలి, ముదిరాజ్ సంఘాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి తెరాసలోకి ఆహ్వానించారు.
Read More »లోక్‌అదాలత్‌లో 114 కేసులకు పరిష్కారం
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 114 కేసులకు పరిష్కారం లభించినట్టు పట్టణ సిఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. కోర్టు లోపల ఏళ్ళ తరబడిగా పరిష్కారానికి నోచుకోని కేసులను కోర్టు వెలుపల లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశముందన్నారు. ఈ క్రమంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో కక్షిదారులు కోర్టు వెలుపల తమ కేసులను పరిష్కరించుకున్నట్టు పేర్కొన్నారు. మెగా లోక్ అదాలత్‌లో జడ్జిలు, కక్షిదారులు, పోలీసులు ఉన్నారు.
Read More »మూఢనమ్మకాలు నమ్మొద్దు
రెంజల్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్ఐ అంబార్య అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని నీలా గ్రామంలో పోలీసు కళాబృందం ద్వారా మూడనమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు మంత్రాలు, చేతబడులు ఉన్నాయంటూ నమ్మరాదని ఒకవైపు సైన్స్, కంప్యూటర్ యుగంలో దూసుకుపోతున్నా ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో రాఘవేందర్, అక్తర్, సాయిలు, తదితరులున్నారు.
Read More »సురేశ్ ఆర్థికశాస్త్ర పరిశోధన జిల్లాకే గర్వకారణం
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ చేనేత కార్మికుల సమస్యలు – పరిష్కారాలు అనే అంశంపై పత్రసమర్పణకు గాను ఇటీవల నిర్వహించిన తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్డి పట్టాను ఆర్తికశాస్త్రంలో శివరాం సురేశ్‌గౌడ్ పొందారు. సురేశ్‌గౌడ్ ఆర్థికశాస్త్ర పరిశోధన జిల్లాకే గర్వకారణమని వక్తలు పేర్కొన్నారు. సురేశ్‌గౌడ్‌ను శుక్రవారం మంజీర డిగ్రీ, పిజి కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు మంజీర డిగ్రీ కళాశాల డైరెక్టర్ సురేశ్‌గౌడ్ పిహెచ్డి పొందడం జిల్లాకే గర్వకారణమన్నారు. యుజిసి గుర్తింపు పొందిన ...
Read More »ఛలో హైదరాబాద్ గోడప్రతుల ఆవిష్కరణ
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఛలో హైదరాబాద్ శంఖారావం గోడప్రతులను శుక్రవారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో జూలై 15న ఛలో హైదరాబాద్ శంఖారావం పేరిట కార్యక్రమం తలపెట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులందరిని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తదితర డిమాండ్లు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు సిద్దిరాములు, రాజనర్సు, రవి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read More »గ్రామ పంచాయతీ జేఏసి సమ్మె నోటీసు అందజేత
కామరెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసి తలపెట్టిన సమ్మె నోటీసును శుక్రవారం డిపివో రాములుకు అందజేశారు. జూలై 23 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ జూలై 9న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసినా స్పందన కరువైందన్నారు. 23 నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించినట్టు తెలిపారు. అన్ని ...
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామరెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి నియోజకవర్గంలోని లబ్దిదారులకు విడుదలైన సిఎం సహాయనిధి చెక్కులను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. 9 మందికి విడుదలైన 8.50 లక్షల రూపాయల చెక్కులను ఆయన లబ్దిదారులకు అందించారు.
Read More »బోరుమోటారు ప్రారంభం
కామరెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డు ఇందిరానగర్ కాలనీలో శుక్రవారం బోరుమోటారు తవ్వకం పనులను మునిసిపల్ ఛైర్మన్ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. వార్డులో నెలకొన్ననీటి ఎద్దడి దృష్ట్యా మునిసిపల్ నిధుల నుంచి కొత్త బోరు వేయించినట్టు తెలిపారు. బోరు తవ్వడంతో పుష్కలంగా నీరు లభించిందని, వార్డు వాసులు ఆనందం వ్యక్తం చేశారు. మంచినీటి ఎద్దడి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ యాదమ్మ, నాయకులు ప్రసాద్, తదితరులు ...
Read More »అమిత్‌షాకు ఘన స్వాగతం
కామరెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర పర్యటనకు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం వచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కమిటీ ఛైర్మన్ డాక్టర్ మురళీధర్‌గౌడ్ బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి అమిత్‌షాకు స్వాగతం పలికారు. పార్టీని రాష్ట్రంలో పటిష్ట పరిచేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్‌షా రాష్ట్ర పర్యటన చేస్తున్నట్టు తెలిపారు. ఆయనతోపాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ముఖ్య నాయకులు ఉన్నారు.
Read More »ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
కామరెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఐటి డైరెక్టర్ శుక్లా, సీనియర్ డిప్యూటి ఎలక్షన్ కమీషనర్ సందీప్ సక్సెనా వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియపై శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రజత్‌కుమార్‌తో పాటు ఉన్నతాదికారులు మాట్లాడారు. ఎలక్షన్ ప్రక్రియ సులభతరం చేయడానికి ఇఆర్వో నెట్‌ను 1వ వర్షన్ నుంచి 2.0కి మార్చినట్టు అధికారులు ...
Read More »వసతి గృహాల్లో వందశాతం హరితహారం నిర్వహించాలి
కామరెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అన్ని వసతి గృహాల్లో వందశాతం హరితహారం విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. జనహిత భవనంలో శుక్రవారం ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వసతి గృహ సంక్షేమాధికారులతో హరితహారం వసతి గృహ నిర్వహణపై సమీక్షించారు. అన్ని వసతి గృహాల్లోని ప్రతి విద్యార్థి చేత మొక్కలు నాటించాలని చెప్పారు. వాటి సంరక్షణ బాధ్యతలను సదరు విద్యార్థులకే అప్పగించాలన్నారు. విద్యార్థుల చేత గ్రీన్ బ్రిగేడ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని ...
Read More »