Breaking News

Agriculture

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి జిల్లా స్థాయిలో వ్యవసాయ, ఉద్యానశాఖ అదికారులు సంయుక్తంగా కృషి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శనివారం కలెక్టర్‌ చాంబరులో వ్యవసాయ, ఉద్యానశాఖల మార్కెటింగ్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇరుశాఖల ఆద్వర్యంలో వివిధ రకాల నేలలు, పంటల వివరాలు, సాగుతో రూపొందించిన సమాచారాన్ని సర్వేచేసి రాష్ట్రానికి పంపించాలని ఆదేశించారు. పంటలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని నేల పరీక్షను ప్రింట్‌ చేయాలని ...

Read More »

నసురుల్లాబాద్‌ మండలంలో మంత్రి ప్రచారం

బాన్సువాడ, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు తలెత్తుకొని తిరిగేలా తెరాస ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని బాన్సువాడ తెరాస అబ్యర్తి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం నసురుల్లాబాద్‌ మండలంలోని నసురుల్లాబాద్‌, మైలారం, లింగంపల్లి తాండా, ఫకీర్‌ నాయక్‌ తండా, బొప్పాస్‌పల్లి, బీర్కూర్‌, తిమ్మాపూర్‌ తాండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రైతుల క్షేమం కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టిందని, దీంతోపాటు రైతులకు రైతుబీమా పథకం కల్పించిందని వెల్లడించారు. పేదల ...

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

  రెంజల్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, దండిగుట్ట గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిడివో చంద్రశేఖర్‌, విండో ఛైర్మన్‌ మోహినోద్దీన్‌ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు దళారులను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. రైతుల కొరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎపిఎం చిన్నయ్య, మార్కెట్‌ కమిటీ ఉపాద్యక్షుడు ధనుంజయ్‌, కార్యదర్శి ...

Read More »

మిషన్‌ భగీరథపై మంత్రి పోచారం సమీక్ష

  నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో తన క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు, కలెక్టర్లతో మిషన్‌ భగీరథపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకానికి అత్యంతప్రాధాన్యత నిస్తుందని, రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్చమైన తాగునీరు అందించడమే సిఎం కెసిఆర్‌ ఆశయమని, దానికనుగుణంగా ఎమ్మెల్యేలు, అదికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ...

Read More »

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

  రెంజల్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బోర్గాం గ్రామంలో పశువులకు పశువైద్యాధికారి విఠల్‌ ఆధ్వర్యంలో గురువారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 250 పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణ టీకాలు వేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌ శశిరేఖ, గోపాలమిత్ర సభ్యులు యశ్వంత్‌, ప్రశాంత్‌ ఉన్నారు.

Read More »

ధరణి పనులు వేగిరం చేయాలి

  రెంజల్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో ధరణి వెబ్‌సైట్‌లో రైతుబంధు పథకానికి సంబంధించిన వివరాలు పూర్తిగా సత్వరమే రికార్డు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి కోరారు. తహసీల్‌ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ పనుల తీరు అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పాసుపుస్తకాలు అందని రైతులు వెంటనే అందించాలని కొన్ని రికార్డులను సరిచేయాలని కోరారు. ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నామని ...

Read More »

రైతులు హుందాగా వ్యవసాయం చేసుకోవడానికే రైతుబంధు

  నిజామాబాద్‌ టౌన్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు వ్యవసాయాన్ని హుందాగా చేసుకోవడానికే రైతుబందు పథకం ప్రవేశపెట్టినట్టు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. శనివారం జక్రాన్‌పల్లి మండలం పుప్పాలపల్లి, ఇందల్వాయి మండలంలో వెంగల్‌ పహాడ్‌ రైతుబంధు కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. పెట్టుబడి సాయం అందిస్తున్న రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, వ్యవసాయ అవసరాల కోసం వచ్చిన డబ్బు ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకోవాలని కలెక్టర్‌ సూచించారు. వ్యవసాయం బలోపేతం ...

Read More »

మూడోరోజు రైతులకు చెక్కుల పంపిణీ

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని జంగంపల్లి, తలమడ్ల, నర్సన్నపల్లి, క్యాసంపల్లి గ్రామాల్లో శనివారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్దన్‌ రైతుబంధు పథకం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులను బలోపేతం చేయడంలో భాగంగా రైతుబంధు పథకం సిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎకరానికి సంవత్సరానికి 8 వేల పెట్టుబడిలో భాగంగా ముందుగా నాలుగు వేల రూపాయలను అందిస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే ఎక్కడాలేనివిధంగా రైతులను ఆదుకోవడానికి కెసిఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. ...

Read More »

రైతుబంధు పథకం ద్వారా రైతులకు లబ్ది

  నిజామాబాద్‌ టౌన్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబంధు పథకం ద్వారా రైతులకు మరింత లబ్ది చేకూరుతుందని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోగల మాణిక్‌భవన్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై డిఎస్‌ మాట్లాడారు. రైతుబంధు ద్వారా రైతులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని, పంట పెట్టుబడికి సాయం అందించే ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అప్పులు చేయకుండా స్వతాహాగా పంటపై ...

Read More »

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ అన్నారు. శుక్రవారం మాచారెడ్డి మండలంలోని గన్‌పూర్‌, పోతారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే సిఎం కెసిఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఎకరానికి సంవత్సరానికి రూ. 8 వేల పెట్టుబడి అందించడంలో భాగంగానే ప్రస్తుతం 4 వేల రూపాయలు ఈ సీజన్‌కు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెరాస ...

Read More »

వాకర్స్‌కు వైద్య పరీక్షలు

  నిజామాబాద్‌ టౌన్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని వినాయక్‌నగర్‌ అమరవీరుల స్థూపం పార్కులో శుక్రవారం ఉదయం వాకర్స్‌కు మ్యాక్స్‌ క్యూర్‌ నిహారిక ఆసుపత్రి ఆద్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి బిపి, షుగర్‌ పరీక్షలు నిర్వహించి పలు ఆరోగ్య సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది వాకర్స్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఆసుపత్రి మేనేజర్‌ సురేశ్‌బాబు తెలిపారు. వాకర్స్‌కు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నామని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో మాక్స్‌ క్యూర్‌ నిహారిక ...

Read More »

రైతుబందు పథకం బందోబస్తు సమీక్షించిన సిపి

  నిజామాబాద్‌ టౌన్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలోని ఆర్మూర్‌, బోదన్‌, నిజామాబాద్‌ డివిజన్‌ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతుబందు పథకం బందోబస్తును నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ శుక్రవారం పర్యవేక్షించారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని జలాల్‌పూర్‌ గ్రామంలో, నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలో, అర్సపల్లి, ఖలీల్‌వాడి ప్రాంతాల్లో బందోబస్తు పర్యవేక్షించారు. అదేవిధంగా రైతులు బ్యాంకుల్లో చెక్కులను జమచేస్తున్నందున అక్కడ కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు కమీషనర్‌ వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది ...

Read More »

రైతుబంధు పథకం చరిత్రాత్మక ఘట్టం

  నిజామాబాద్‌ టౌన్‌, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుబంధు పథకం దేశంలోనే ఒక చారిత్రక ఘట్టమని నిజామాబాద్‌ రూరల్‌ఎమ్మెల్యేబాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రైతుబంధు చెక్కులు, పట్టా పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. నిజామాబాద్‌ మండలంలోని జలాల్‌పూర్‌ గ్రామం, డిచ్‌పల్లి మండలం దూస్‌గాం, జక్రాన్‌పల్లి మండలం నారాయణపేట, సిరికొండ మండలంలో పొత్నూర్‌ గ్రామాల్లో ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా పంటలకు పెట్టుబడి ...

Read More »

బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో రైతు పరిస్థితి దారుణం

బీర్కూర్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు 25 శాతం రాలిన ధాన్యం గింజలు, విత్తు నాటిన నుండి అనేక సమస్యలతో రైతు సతమతం, సొసైటీల ద్వారా అందించి నాసిరకం కోణార్‌ విత్తనాలతో మొలకెత్తక ఇబ్బందులకు గురయ్యారు. దోమపోటుతో రైతు ఆరుసార్లు స్ప్రే చేసినా అదుపుకాని దోమపోటు, కోత సమయంలో ఈదురుగాలులతో ధాన్యం రాలిపోవడంతో రైతు దిగాలు చెందుతున్నారు. రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వరి కోత యంత్రాల యజమానులు ధరను అమాంతం పెంచుతున్నారనిరైతులు ...

Read More »

ఎండుతున్న పంట… రైతు కడుపు మంట

బాన్సువాడ, మార్చి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఆయకట్టు కింద లేని వరిపంటల పరిస్థితి దయనీయంగా మారింది. బోరుబావుల నుండి నీటి చుక్కలు రాకపోవడంతో వాటిపై ఆధారపడి వేసుకున్న పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నీళ్ళు లేక పంటలు రాక రైతుల కడుపు మండిపోతుంది. బోర్లు ఎత్తిపోవడంతో రైతులు సాగునీటిని అందించే పరిస్థితి లేక పంట కోసేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం జలాల్‌పూర్‌, లక్ష్మాపూర్‌, శంకోరా, రాజపేట శివారు ప్రాంతాల్లో వరిపంట దాదాపుగా ఎండిపోయింది. ఆ ప్రాంత రైతులు తీవ్ర ...

Read More »

ఉద్యమాల భూమిలో…మల్బరీ

  ఉన్నత చదువున్నా, ఉద్యోగం రాక పోవడంతో నేల తల్లిని నమ్ముకున్నాడీ ప్రేమ్‌ కుమార్‌ .  తనకున్న రెండెకరాల ఎర్రమట్టి నేలలో సాగు చేయాలనుకున్నాడు. బీడు భూమిని సాగు భూమిగా మార్చాడు కానీ , తన పొలానికి పక్కనే అటవీ శాఖ యూకలిప్టస్‌ తోటలను పెంచుతోంది. ఆ చెట్లు భూగర్బ జలాలను విపరీతంగా పీలుస్తాయి. అందువల్ల ఆ ప్రాంతంలో మిగతా పంటలు పంటలకు నీరు అందదు. ఇలాంటి ప్రమాదాల మధ్య అర ఎకరాలో గత ఏడాది పందిర్లు వేసి బీర,సొర,దొండ పండించాడు. అతి కష్టం ...

Read More »

రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి మండలం అడ్లూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ గోడౌన్‌ను ప్రారంభించారు. అనంతరం మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలో 16 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్యభవనాన్ని ప్రారంభించారు. కోటి 80 లక్షలతో చేపట్టిన ఆరేపల్లి రోడ్డుపై హైలెవల్‌ వంతెనకు శంకుస్థాపన చేశారు. కోటి 50 లక్షలతో 2500 ...

Read More »

ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత మంత్రి హ‌రీశ్ స‌మావేశ‌o

నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గంలో ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను మంజూరు చేసి, నిధుల‌ను కూడా మంజూరు చేయాల‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత ఇరిగేష‌న్‌, మార్కెటింగ్ శాఖ‌ల మంత్రి హ‌రీశ్ రావును కోరారు. ఈ మేర‌కు నియోజ‌క వ‌ర్గాల వారీగా ప్ర‌తిపాద‌న‌ల‌ను మంత్రికి అంద‌జేశారు. శ‌నివారం హైద‌రాబాద్ జ‌ల‌సౌధ‌లో ఎంపి క‌విత మంత్రి హ‌రీశ్ రావుతో స‌మావేశ‌మ‌యి సాగునీటి ప్రాజెక్టులు, కొత్త‌గా ఆయ‌క‌ట్టు పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు ప్ర‌స్తుత ఆయ‌క‌ట్టుకు సాగునీటి స్థిరీక‌ర‌ణ‌పై చ‌ర్చించారు. నియోజ‌క వ‌ర్గాల వారీగా స‌మ‌ర్పించిన ప్ర‌తిపాద‌న‌లు.. బోధన్ నియోజ‌క ...

Read More »

పసుపు రైతులకు రైతుబంధు పథకం వర్తింపు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు రైతులకు రైతుబంధు పథకం వర్తింప చేస్తున్నట్టు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. శనివారం ఎంపి కవిత బృందంతో సమావేశమైన మంత్రి ఎంపి విజ్ఞప్తి మేరకు రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్‌ సౌకర్యాలు, ఇతర అంశాలపై మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమీక్షించామని, పసుపు పంట చేతికొచ్చే సమయానికి ధర పడిపోతున్న నేపథ్యంలో ఎంపి కవిత ...

Read More »

లేబర్‌ కార్యాలయంలో సిబ్బందికోసం మంత్రికి వినతి

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లేబర్‌ కార్యాలయంలో సిబ్బందిని నియమించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం కార్మికులు వినతి పత్రం సమర్పించారు. ఏఐసిటియు అనుబంధ ఐక్య బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ జిల్లా విభజన తర్వాత కార్మికుల సమస్యలు మరింత ఎక్కువయ్యాయన్నారు. కార్మికశాఖలో సిబ్బంది లేకపోవడం ...

Read More »