Breaking News

Nizamabad News

ప్రజలు అభివృద్దికే పట్టం కడతారు

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగున్నరేల్ల పాటు ప్రజలకు సంక్షేమ పాలన అందించిన తెరాసకే తిరిగి పట్టం కడతారని కామారెడ్డి తెరాస అభ్యర్థి గంప గోవర్దన్‌ అన్నారు. ఎన్నికల అనంతరం శనివారం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల అనంతరం అన్ని ఛానెళ్లు, పత్రికలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌లో ఇదేవిషయం స్పష్టమైందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కెసిఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. మహాకూటమి ...

Read More »

బాన్సువాడలో పోచారం ఓటమి ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముందస్తు ఎన్నికల పేరిట ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన పతనాన్ని తానే కోరుకున్నారని బాన్సువాడలో మంత్రి పోచారంతోపాటు చాలా మంది ఓటమి పాలు కానున్నారని కామారెడ్డి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ జోస్యం చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో షబ్బీర్‌ అలీ సమీక్షా సమావేశం జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల వైపే ప్రజలు మొగ్గుచూపారని, ...

Read More »

ప్రజా వ్యతిరేక సునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా వ్యతిరేకసునామిలో తెరాస కొట్టుకుపోవడం ఖాయమని కామారెడ్డి కాంగ్రెస్‌ అసెంబ్లీ అభ్యర్థి మహ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తొందరపాటు నిర్ణయంతో కెసిఆర్‌ ముందస్తు ఎన్నికల పేరిట రాష్ట్రంపై ఎన్నికల ఖర్చు భారాన్ని రుద్దారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 6న అసెంబ్లీ రద్దుచేసి అదేరోజు అభ్యర్థులను ప్రకటించడం వెనక ఆయన కోట్లాది రూపాయల పార్టీ ఫండ్‌ సమకూర్చుకున్న విషయం స్పష్టమవుతుందన్నారు. 18 ...

Read More »

ఓటరు జాబితా పరిశీలన

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో శనివారం ఓటరు జాబితా పరిశీలన (స్క్రూటిని) కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాల స్ట్రాంగ్‌రూంలకు సీల్‌ వేశారు. నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకుడు అభిషేక్‌ కృష్ణ, బ్రిజ్‌రాజ్‌ రాయ్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రె, రిటర్నింగ్‌ అదికారులు దేవేందర్‌రెడ్డి, రాజేంద్రకుమార్‌, రాజేశ్వర్‌, ఎన్నికల ...

Read More »

కౌంటింగ్‌ రోజు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్‌ సిబ్బంది అప్రమత్తంగా, ఏకాగ్రతతో పనిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం జనహిత భవనంలో కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కౌంటింగ్‌ రోజు ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. ఉదయం 6 గంటలకే కౌంటింగ్‌ సిబ్బంది హాజరుకావాలని ఆదేశించారు. మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్‌, 1 రిటర్నింగ్‌ అధికారిని ఏర్పాటు ...

Read More »

కామరెడ్డి జిల్లాలో 83.05 శాతం పోలింగ్‌

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన పోలింగ్‌లో 83.05 శాతం పోలింగ్‌ నమోదైనట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. శనివారం స్థానిక ఏఎంసి గోదాములో కామరెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు ముగిసిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్న ఓటర్లకు, సహకరించిన మీడియా, ఎన్నికల సిబ్బంది, పోలీసులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు నియోజకవర్గాలు కలిపి 5 లక్షల 78 వేల మంది ఓటర్లు ...

Read More »

పోలింగ్‌కు తరలివచ్చిన దివ్యాంగులు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు దివ్యాంగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎన్నికల అధికారులు దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సదుపాయంతోపాటు వీల్‌చైర్‌లు, ర్యాంపులు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో మునుపెన్నడూ లేనివిధంగా దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగుల పట్ల ఎన్నికల ఏర్పాట్లను అందరు అభినందించారు.

Read More »

ఘనంగా అయ్యప్ప పడిపూజ

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయ్యప్ప భక్తులు అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. మాలధారులు పడిపూజలో అయ్యప్ప నామస్మరణ చేస్తు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో బక్తులు లీనమయ్యారు.

Read More »

ఆకట్టుకున్న మాడల్‌ పోలింగ్‌ స్టేషన్లు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్లను ఆకర్షించేందుకు ఓట్ల శాతం పెరిగేందుకు రూపొందించిన మాడల్‌ పోలింగ్‌ స్టేషన్లు ఆకట్టుకున్నాయి. కామరెడ్డి మునిసిపాలిటి కార్యాలయం, ఎల్లారెడ్డి జడ్పిహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాలలో, బిచ్కుంద జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన మాడల్‌ పోలింగ్‌ కేంద్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితోపాటు కామరెడ్డిలోని లింగాపూర్‌లో దివ్యాంగుల మాడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. ఓటింగ్‌ అనంతరం ఓటర్లు పోలింగ్‌ స్టేషన్ల బయట సెల్ఫీలు దిగుతూ తాము ఓటు వేశాము, మీరు ఓటు వేయండని సోషల్‌ ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ శుక్రవారం జరిగిన ఎన్నికల్లో సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ, తెరాస అభ్యర్తి గంప గోవర్ధన్‌, బిజెపి అభ్యర్తి కాటిపల్లి వెంకటరమణారెడ్డి వారి వారి పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితోపాటు ఇతర పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు సైతం వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More »