Breaking News

Nizamabad News

వెబ్‌కాస్టింగ్‌ కేంద్రం నుంచి ఎన్నికల పర్యవేక్షణ

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన ఎన్నికల తీరును జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల వెబ్‌కాస్టింగ్‌ కంట్రోల్‌ రూం నుంచి అధికారులు పరిశీలించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి సాదారన పరిశీలకులు అభిషేక్‌ కృష్ణ, పోలీసు పరిశీలకులు సుఖ్‌వీర్‌ సింగ్‌, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, కో ఆర్డినేటర్‌ బల్విందర్‌ సింగ్‌, జిల్లా ఎస్‌పి శ్వేత, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేశ్‌ గోత్రెతోపాటు నోడల్‌ అధికారులు ఎన్నికల తీరును పరిశీలించారు. ...

Read More »

పోలింగ్‌ ప్రశాంతం

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో శుక్రవారం జరిగిన పోలింగ్‌ చెదురు మదురు సంఘటనలు మినహా సజావుగా సాగింది. ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలీసుల భద్రత మద్య ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయానికి జుక్కల్‌ 70.58 శాతం, ఎల్లారెడ్డి 80.50 శాతం, కామారెడ్డి 68.09 శాతం మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 73.05 శాతం పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ సరళిపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు ...

Read More »

అర్బన్‌ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఓట్ల గల్లంతు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయి. ఒక్క అర్బన్‌ నియోజకవర్గంలో 25 వేల మందికి ఓటరు జాబితాలో పేరు రాలేదు. దీంతో ఓటర్లందరు నిజామాబాద్‌ అర్బన్‌ రిటర్నింగ్‌ అధికారి, మునిసిపల్‌ కమీషనర్‌ జాన్సన్‌ను కలిసి నిలదీశారు. పూర్వాపరాలు పరిశీలించి సంబంధిత అధికారులను పిలిచి ఓటు రానివారి ఆధార్‌కార్డుతో పరిశీలించి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ ...

Read More »

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన సిపి కార్తికేయ

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ కమీషనరేట్‌ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను విస్తృతంగా పరిశీలించారు. విదుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసులతో పాటు మహారాష్ట్ర, పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కమీషనర్‌ పేర్కొన్నారు. ఆర్మూర్‌, బోదన్‌, నిజామాబాద్‌ డివిజన్‌లో పోలీసులు తమ విధులు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. మొత్తం మీద ...

Read More »

పోలింగ్‌ కేంద్రంలో తుదిశ్వాస

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం బీబీపేట్‌ తాండాకు చెందిన గుగులోత్‌ దేశయ్యనాయక్‌ (65) పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు వేసి తుదిశ్వాస విడిచారు. ఓటు వేయడానికి వచ్చిన దేశయ్యనాయక్‌ ఈవిఎం మిషన్‌ వద్దకు చేరుకొని ఓటు వేశారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

Read More »

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన శాసనసభ ఎన్నికలు చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. ఎన్నికల ఓటింగ్‌పై ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం చైతన్యం కలిగించినా ప్రజల నుంచి అంతగా స్పందన రాలేదని చెప్పాలి. గతంతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. నిజామాబాద్‌ అర్బన్‌తోపాటు రూరల్‌ నియోజకవర్గాల్లో, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ...

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో నిజామాబాద్‌ ఎంపి కవిత తన భర్త అనిల్‌రావుతో నవీపేట్‌ మండలం పోతంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌, అర్బన్‌ తెరాస అభ్యర్తి బిగాల గణేశ్‌ గుప్త దంపతులు, వీరితోపాటు అర్బన్‌ బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మి నారాయణ కుటుంబీకులు, రూరల్‌ తెరాస అభ్యర్తి బాజిరెడ్డి గోవర్ధన్‌ కుటుంబ సభ్యులు, ఆర్మూర్‌ ...

Read More »

పోలింగ్‌ ఏర్పాట్లు సర్వం పూర్తి

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ రోజు ఓటు వేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అదికారి సత్యనారాయణ తెలిపారు. పోలింగ్‌ ఏర్పాట్లలో భాగంగా గురువారం కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను ఆయన సందర్శించి పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్‌కు సంబందించి 740 పోలింగ్‌ కేంద్రాల్లో 5 లక్షల 78 వేల 050 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి ...

Read More »

దివ్యాంగుల కొరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు

రెంజల్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దివ్యాంగుల వికలాంగులకు ఎన్నికల సందర్భంగా ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఎపిఎం చిన్నయ్య తెలిపారు. గురువారం మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న 172 మంది దివ్యాంగులకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. వీరికి ఇంటి వద్ద నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు తీసుకెళ్ళే విధంగా సౌకర్యాన్ని డిఆర్‌డిఓ వారి ఆద్వర్యంలో ఏర్పాటు ...

Read More »

మహాత్ముని అడుగుజాడల్లో పయనించినపుడే నిజమైన నివాళులు

రెంజల్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల నాయకుడు ప్రపంచంలోనే అత్యున్నమైన రాజ్యాంగాన్ని ప్రసాదించిన నాయకుడు భారత రత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో పయనించినపుడే మహాత్మునికి నిజమైన నివాళులు అర్పించినట్లని దళితరత్న అవార్డు గ్రహీత జక్కుల సంతోష్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో అంబేడ్కర్‌ 62వ వర్ధంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ వేడుకలు దళితులు సంతోషంతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్‌ మాట్లాడుతూ సమాజంలో మనిషిని మనిషిగా గుర్తించి చీకటి ...

Read More »