Breaking News

Nizamabad News

పిల్లల్లో నైపుణ్యం పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లల్లో నైపుణ్యం పెంచడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైందని జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల సంక్షేమాధికారిణి స్రవంతి అన్నారు. శనివారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలు ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండాలని దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి పిల్లలకు ...

Read More »

స్వతంత్ర అభ్యర్థిగా ధన్‌పాల్‌ నామినేషన్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త స్వతంత్ర అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యాస్‌భవన్‌లో తన అనుచరులతో, ఆయా సంఘాలతో సమావేశం నిర్వహించిన అనంతరం దన్‌పాల్‌ స్వతంత్రుడిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో తాను నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీచేస్తున్నానని, తనను గెలిపిస్తే నిస్వార్థంగా ప్రజా సేవచేస్తానని, గత 30 సంవత్సరాలుగా ...

Read More »

నామినేషన్‌ దాఖలు చేసిన బోధన్‌ తెరాస అభ్యర్థి షకీల్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోదన్‌ తెరాస అభ్యర్థి షకీల్‌ అహ్మద్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్‌ ఎంపి కవిత పాల్గొన్నారు. భారీ ఊరేగింపుతో ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు 2 కి.మీ.ల మేర వేలాది మంది పార్టీ కార్యకర్తలు, షకీల్‌ అభిమానులు ర్యాలీగా సాగుతూ బతుకమ్మలు, డప్పు చప్పుల్ళు, సన్నాయి వాయిద్యాలు, తెలంగాణ ఉద్యమ పాటలు, కార్యకర్తల చిందులతో పట్టణ ప్రధాన దారులు కిక్కిరిసి పోయాయి. కార్యక్రమంలో తెరాస ...

Read More »

7వ రోజున 33 నామినేషన్లు

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఏడవరోజు జిల్లా వ్యాప్తంగా 33 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో 11, బోధన్‌ నియోజకవర్గంలో 12, బాన్సువాడ నియోజకవర్గంలో 14, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 17, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 18, బాల్కొండ నియోజకవర్గంలో 19 నామినేషన్లు శనివారం వరకు దాఖలైనట్టు పేర్కొన్నారు.

Read More »

స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్టు నామినేషన్‌

నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి చెందిన జర్నలిస్టు కె.వి.లక్ష్మారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అవగాహన కేవలం విలేకరులకు మాత్రమే ఉంటుందని, నిరంతరం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే విలేకరులకు ప్రజా సమస్యలపై పూర్తి స్పష్టత ఉంటుందని ఆయన అన్నారు. అదే కోణంలో నిజామాబాద్‌ ప్రజలకు సేవచేయడానికి ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేశానని, విలేకరులు చేసిన విధంగా ప్రజాసేవ మరెవరు చేయరని ఆయన పేర్కొన్నారు. ...

Read More »

ఉపకార వేతనాల దరఖాస్తు తేదీ పొడిగింపు

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రయివేటు డిగ్రీ, పిజి, బిఇడి ఇతర అన్ని కళాశాలల్లో బిసి, ఈబిసి విద్యార్థులకు పోస్టుమెట్రిక్‌ ఉపకార వేతనాల దరఖాస్తు తేదిని పొడిగించినట్టు జిల్లా వెనకబడిన తరగతుల అధికారి తెలిపారు. డిసెంబరు 31 వరకు దరఖాస్తు తేదీని పొడిగించినట్టు చెప్పారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను బిసి, ఈబిసి విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ష్ట్ర్‌్‌జూ://్‌వశ్రీaఅస్త్రaఅaవజూaరర.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read More »

గురువారం ఒక నామినేషన్‌ దాఖలు

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి గురువారం ఒక నామినేషన్‌ దాఖలైనట్టు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అబ్యర్తిగా మహ్మద్‌ ఫజలూర్‌ రహమాన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. జుక్కల్‌, కామారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని పేర్కొన్నారు.

Read More »

ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై అధికారులకు అవగాహన ఉండాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవిఎం, వీవీప్యాట్‌ యంత్రాలపై ప్రొసిడింగ్‌ అధికారుల విధులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ తెలిపారు. గురువారం కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జూనియర్‌ కళాశాలలో ప్రొసీడింగ్‌, అసిస్టెంట్‌ ప్రొసైడింగ్‌ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమీషన్‌ సూచనల మేరకు 50 మందికి ఒక బ్యాచ్‌ చొప్పున శిక్షణ ఇస్తామని చెప్పారు. ఎన్నికల నిర్వహనలో ప్రొసీడింగ్‌ అధికారుల బాధ్యత కీలకమని, శిక్షణను ...

Read More »

తెరాస ద్వారానే ప్రగతి సాద్యం

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణలో ప్రగతి కుంటుపడిందని తెరాసను తిరిగి అధికారంలోకి తెస్తేనే ప్రగతి సాధ్యపడుతుందని కామారెడ్డి తెరాస అభ్యర్తి గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం ఆయన రెడ్డిపేటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రాపాలకులు తెలంగాణను పట్టించుకోకుండా నాశనం చేశారని విమర్శించారు. అందుకోసమే తెరాస ముఖ్యమంత్రి కెసిఆర్‌ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకెళుతున్నామని, తెరాసకు తిరిగి ఓటువేసి అభివృద్దికి పట్టం ...

Read More »

బిజెపిని గెలిపిస్తే మూడునెలల్లో తాగునీటి సమస్య పరిష్కారం

  కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ప్రజలు తాగునీటి ఎద్దడి సమస్య ప్రస్తావిస్తున్నారని తనను గెలిపిస్తే మూడునెలల్లో తాగునీటి సమస్య పరిస్కరిస్తామని కామరెడ్డి బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఆయన గడప గడపకు బిజెపి ప్రచారంలో భాగంగా పాత రాజంపేట్‌, నర్సన్నపల్లి, క్యాసంపల్లి, తాండా, రాఘవపూర్‌, ఉగ్రవాయి గ్రామాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడితోపాటు రోడ్లు, ...

Read More »