Breaking News

Nizamabad News

పరిశోధనలో నాణ్యత ముఖ్యం

  – ప్రొఫెసర్‌ జోషి డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశోధనలో మరింత నాణ్యత పెరగాల్సిన అవసరముందని ప్రముఖ మేనేజ్‌మెంట్‌ పరిశోధకులు ప్రొఫెసర్‌ జె.వి.జోషి అన్నారు. శుక్రవారం మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో స్టాటిస్టిటికల్‌ టూల్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ అనే అంశంపై ఒకరోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌ ప్రారంభంలో ప్రధాన వక్తగా పాల్గొన్న రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌ డీన్‌ జోషి మాట్లాడుతూ మంచి క్వాలిటీ, ఖచ్చితత్వమైన పరిశోధనలు జరిగినపుడే పరిశోధనలకు గుర్తింపు ఉంటుందన్నారు. పరిశోధకులు ...

Read More »

దర్గా సేవకుడి దారుణ హత్య

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామ శివారులో గడ్డం భూపతిరెడ్డి పంట పొలం వద్ద గల బాబా షాదుల్ల దర్గాలో గురువారం రాత్రి దర్గా సేవకుడు కమ్మరి సంజీవ్‌(45) గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో కొంతకాలంగా దర్గా వద్ద కొనసాగుతున్న వ్యక్తి సహాయకుడు సిరికొండ మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తికూడా దర్గా వద్ద ఉంటారని కాగా గురువారం రాత్రి తన ...

Read More »

ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో తెయూ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ఎన్‌ఎస్‌యూఐ కార్యదర్శి బాత్‌నాత్‌ శంకర్‌ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలని తెవివి రిజిస్ట్రార్‌ లింబాద్రికి అందజేశారు. గత సంవత్సరం ఎల్‌ఎల్‌ఎం కోర్సు అనుమతి లభించినప్పటికి ఇప్పటి వరకు తెలంగాణ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం కోర్సును ప్రవేశపెట్టక పోవడం ద్వారా ఎల్‌ఎల్‌ఎం చేసిన విద్యార్థులు ఎల్‌ఎల్‌ఎం కోర్సు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాగే పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో లింబాద్రిని కోరారు.

Read More »

ఓయూ, పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ జారీ

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యాసంవత్సరానికి 2015-16 వివిధ పీజీ కోర్సులలో అడ్మిషన్‌ పొందేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కామన్‌ నోటిఫికేషన్‌ వెలువడిందని ప్రొఫెసర్‌ కనకయ్య అన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు ఒక సబ్జెక్టు రూ. 400, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300, అదనంగా రాయడానికి ఒక సబ్టెక్టుకు రూ. 200 తెలంగాణ ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చని అన్నారు. క్రెడిట్‌, డెబిట్‌, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేసుకోవచ్చన్నారు. చివరి తేదీ 13.05.2015 అపరాధ ...

Read More »

గ్రామ కార్యదర్శి అనుమతితోనే ఇసుక తరలింపు

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుమతించిన 8 ప్రభుత్వ ఇసుక క్వారీల నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా అనుమతిపొంది ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ తెలిపారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో టిఎస్‌ఎండిపి సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధర్పల్లి మండలం మైలారం, సిరికొండ మండలం పెద్దవాల్గోట్‌, జక్రాన్‌పల్లి మండలం కొలిప్యాక్‌, నవీపేట మండలం నిజాంపూర్‌, భీంగల్‌ మండలం ...

Read More »

పుష్కరఘాట్‌ పనులను పరిశీలించిన తహసీల్దార్‌

  రెంజల్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజట్‌ మండలంలోని కందకుర్తి గ్రామంలో జూలై మాసంలో వచ్చే పుష్కరాలను పురస్కరించుకొని ఏర్పాట్ల పనులను గురువారం తహసీల్దార్‌ వెంకటయ్య పరిశీలించారు. కందకుర్తి గ్రామం నుంచి పుష్కరఘాట్‌కు వెల్లే రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గుత్తేదారుతో మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేనియెడల పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన కాంట్రాక్టర్లతో అన్నారు. కార్యక్రమంలో విఆర్వోలు బాలయ్య, భూమన్న, శ్రీను, గ్రామస్తులు తదితరులున్నారు.

Read More »

దూస్‌గాం తండాలో జగదాంబ సేవాలాల్‌ మహారాజ్‌ ఉత్సవాలు

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలంలోని దూస్‌గాం నకల్‌గుట్ట నడిమి తాండాలో గురువారం నాడు జగదాంబ సేవాలాల్‌ మహారాజ్‌ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, తనయుడు బాజిరెడ్డి జగన్‌, గ్రామపెద్దల పూజా కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యే తండావాసులకు కమ్యూనిటి హాల్‌ నిర్మించేందుకు రూ. 4 లక్షల నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తామన్నారు. తండాలో మంచినీటి ఎద్దడి ఉందని తెలుసుకుని వెంటనే ఆయన బోరుబావి, మోటరు అనుమతి ఇస్తానని ...

Read More »

నాక్‌ పర్యటన సందర్భంగా విభాగాల్లో రిజిస్ట్రార్‌ తనిఖీలు

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీని త్వరలో నాక్‌ బృందం సందర్శిస్తున్న సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎకనామిక్స్‌, బయోటెక్నాలజి, పార్మాసిటికల్‌ కెమిస్ట్రీల విభాగాలను గురువారం తనిఖీ చేశారు. న్యాక్‌ నివేదిక కొరకు అవసరమైన అన్ని రకాల రికార్డులను సిద్దంగా ఉంచుకోవాలన్నారు. న్యాక్‌ బృందం అడిగే సమాచారాన్ని సిద్దంగా ఉంచుకోవాలని వివిధ విభాగాధిపతులకు రిజిస్ట్రార్‌ ఆదేశించారు.

Read More »

షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం… ఘన సన్మానం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనమండలి విపక్షనేతగా ఎన్నికైన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగిడిన మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి కామారెడ్డి నియోజకవర్గ నాయకులు ఘనస్వాగతం పలికారు. జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ వద్ద షబ్బీర్‌ అలీకి పూలదండలు వేసి ఆహ్వానం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడినుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. బస్వాపూర్‌ నుంచి కామారెడ్డి వరకు ర్యాలీ కొనసాగింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ జరిపారు. అనంతరం ...

Read More »

కేసీఆర్‌ ప్రజలపక్షమా… పెట్టుబడి దారీ పక్షమా…

  – సెక్యురిటీ వదిలి జనంలోకి వెళ్దాం పదా… – మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముక్యమంత్రి కేసీఆర్‌ ప్రజలపక్షమో.. పెట్టుబడిదారుల పక్షమో తేల్చి చెప్పాలని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ సూటిగా ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశప్రధాని నరేంద్రమోడి అవలంబిస్తున్నప్రజా వ్యతిరేక విధానాలు, భూసేకరణ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలు ...

Read More »

బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం సాయిబాబా రోజు కావడంతో పట్టణంలోని జంబిహానుమాన్‌, రాజారాం నగర్‌లోని సాయిబాబా ఆలయాల వద్ద భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు, హారతి, పల్లకిసేవ చేశారు. అనంతరం ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

రాత్రుళ్ళు సైతం నీటి సరఫరా

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలో నీటి సమస్య తీవ్రతరమైంది. బోర్లలో నీరులేక తాగడానికి గుక్కెడు మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన పాలకవర్గం నాలుగు రోజులు గడుస్తున్నా ట్యాంకర్‌ పంపకపోవడంతో నీటికోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి 12 గంటలకు నీటి సరఫరా చేయడంతో నిద్రలేక ప్రజలు నీరు పట్టుకున్నారు. పాలకవర్గం సరైన సమయంలో నీటి సరపరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Read More »

కొనసాగుతున్న సభ్యత్వ నమోదు

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతుందని బిజెవైఎం పట్టణ అధ్యక్షులు నరేందర్‌ తెలిపారు. గురువారం ఆయన ఆద్వర్యంలో పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా నూతనంగా 200 మందికి సభ్యత్వం చేయించి రసీదులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోడి పాలనలో ప్రజలు భారతీయజనతా పార్టీవైపు చూస్తున్నారని, అందులో భాగంగానే సభ్యత్వ నమోదు ఆశించిన స్థాయికంటే ఎక్కువగా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

ఛలో మెట్‌పల్లి గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25న తలపెట్టిన ఛలో మెట్‌పల్లి బహిరంగ సభ గోడప్రతులను గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. భారతీయ విద్యార్థి మోర్చా, భారత్‌ ముక్తిమోర్చాల ఆధ్వర్యంలో ఛలో మెట్‌పల్లి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రతినిదులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాధికారం కోసం బహుజనులంతా ఏకమవ్వాల్సిన అవసరముందన్నారు. వెనకబడిన కులాల వారందరిని ఐక్యం చేసేందుకు వారిని చైతన్యపరిచేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి బాఫూలే విగ్రహ ఆవిష్కరణ, బహిరంగ సభ ఉంటుందన్నారు. దీనికి ...

Read More »

ప్రతిపక్షనేత స్వాగతానికి భారీ సన్నాహాలు

  కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ ప్రతిపక్షనేతగా ఎన్నికై తొలిసారిగా జిల్లాకు వస్తున్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీని సన్మానించేందుకు కాంగ్రెస్‌ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. షబ్బీర్‌ అలీ గురువారం కామారెడ్డికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దు గ్రామమైన బస్వాపూర్‌ నుంచి షబ్బీర్‌అలీకి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్వాపూర్‌లో జెండా ఆవిష్కరణ చేయించి అనంతరం అక్కడినుంచి కామారెడ్డి వరకు భారీ బైక్‌ ర్యాలీ చేపట్టనున్నారు. పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో షబ్బీర్‌అలీకి పార్టీ, వివిధ సంఘాల ...

Read More »

బంగారు తెలంగాణ సాధనలో…

  ముందంజలో జాగృతి.. – తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ లక్ష్మినారాయణ కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ సాధనలో తెలంగాణ జాగృతి ముందుండి పోరాడుతుందని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ లక్ష్మినారాయణ అన్నారు. కామారెడ్డిలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలంగాణ సాదనలో ముందుండి పోరాడారని అన్నారు. అసెంబ్లీలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం 48 గంటలు నిరాహార దీక్షచేసి దేశంలో ఎక్కడాలేనివిధంగా అసెంబ్లీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ...

Read More »

విశ్వకర్మ భగవాన్‌ను సందర్శించుకున్న విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు

  భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలంలోని వివ్వకర్మ గుట్టను విశ్వబ్రాహ్మన జిల్లా అధ్యక్షులు నరహరి, సెక్రెటరీ రామ్మోహన్‌ చారీలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. వారితోపాటు విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు సొక్కుల మోహన్‌, సెక్రెటరీ ఆనంద్‌, క్యాషియర్‌ సుంకం నర్సయ్య, విఠలయ్య, నాగయ్య, నాగుల వినోద్‌కుమార్‌, ముత్తన్న, హన్మాండ్లు తదితరులున్నారు. Nizamabad District President Narahari Visited Vishwakarma Temple Bheemgal.

Read More »

ప్రమాదకరంగా మారుతున్న బడాభీమ్‌గల్‌ రోడ్డు

  భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలంలోని భీమ్‌గల్‌ నుండి బడాభీమ్‌గల్‌ వెళ్లే రోడ్డు ఇరువైపులా గుంతలుగా తయారై సంవత్సరాలు గడిచినా సంబంధిత పాలకులకు అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రం నుంచి వెళ్లే రోడ్డు ఇలా ఉంటే పల్లెల్లో రోడ్లు ఎలా ఉంటాయో ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఒక నిదర్శనమేనని వాహనదారులు అంటున్నారు. భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని బెజ్జోరా, బడాభీమ్‌గల్‌ వెళ్లే రోడ్లు ఇలా గుంతలతో దర్శనమిస్తున్నాయి. ...

Read More »

నేడు విశ్వకర్మ భగవాన్‌ దర్శనానికి రానున్న జిల్లా అధ్యక్షులు

  భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని విశ్వకర్మగుట్ట, విశ్వకర్మ భగవాన్‌ దర్శనానికి విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు నరహరి, సెక్రెటరీ రామ్మోహన్‌చారిలు నేడు మంగళవారం రానున్నట్టు విశ్వకర్మ భగవాన్‌ ఆలయ కమిటీ అధ్యక్షులు సోక్కుల మోహన్‌ విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సమస్త విశ్వబ్రాహ్మణులు భారీగా భీమ్‌గల్‌ లోని విశ్వకర్మ గుట్టకు ఉదయం 8 గంటలకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మండల అధ్యక్షులు సుదర్శన్‌చారి, నాగయ్య, సుంకం నర్సయ్య, విఠల్‌, ...

Read More »

బిజెపి గూటికి ప్రముఖవైద్యులు డాక్టర్‌ మధుశేఖర్‌

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణమే గాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు వైద్యరంగంలో సేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధుశేఖర్‌ ఆదివారం తన అనుచరులతోకలిసి హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆద్వర్యంలో బిజెపిలో చేరినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని వెల్లడించారు.

Read More »