Breaking News

Nizamabad News

దూద్‌గావ్‌ లో ఆహార భద్రత బియ్యం పంపిణీ చేసిన సర్పంచ్‌ జయ దుర్గేశ్‌

  డిచ్‌పల్లి, జనవరి 23, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: డిచ్‌పల్లి మండలం దూద్‌గావ్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పథకం ప్రతీ ఒక్కరికీ ఆరుకిలోల బియ్యంను సర్పంచ్‌ దుర్గేశ్‌ ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మాట్లాడుతూ ఎవరైనా అర్హులైఉండి ఆహార భద్రత కార్డు రాని వారుంటే వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, ఆహార భద్రత పథకం లబ్ది పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్‌ రవిగౌడ్‌, ఈడీసీ పెద్దలు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Read More »

తెయూలో నేడు కలలకు రూపమిద్దాం

డిచ్‌పల్లి, జనవరి 23, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులను ఆధునికి, పోటీ ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేలా తయారు చేయడమే పెయింట్‌ యువర్‌ డ్రీమ్స్‌ కలలకు రూపమిద్దాం కార్యక్రమ లక్షమని తెయూ రిజిస్ట్రార్‌ లింబాద్రి తెలిపారు. శుక్రవారం రిజిస్ట్రార్‌ ఛాంబర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు కేవలం సంపాదకీయ విద్యకే పరిమితం కాకుండా వారిలో అదనపు నైపుణ్యాల పెంపునకు శిక్షణ ఇవ్వడమే కలలకు రూపమిద్దాం అంతిమ ఉద్దేశ్యమని వివరించారు. విద్యార్థులు మానసిక ధైర్యం, ఆత్మ విశ్వాసం, విజయ కాంక్ష ...

Read More »

కళ్యాణి లక్ష్మి పథకం ప్రారంభం

  -నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణి లక్మి పథకాన్ని శుక్రవారం నూతన అంబేద్కర్‌ భవనంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు మంజూరైన నగదు చెక్కులను అందజేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఎంతో హర్షనీయమణి ఆర్హులైనవారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, అర్బన్‌ ఎం.సి.ఎ బిగాల గుప్త, రూరల్‌ ఎం.ఎల్‌.ఎ బాజిరెడ్డి, నగర మేయర్‌ ఆకుల సుజాత, జుక్కల్‌ ఎం.ఎల్‌.ఏ హన్మంత్‌షిండే, పార్లమెంటు సెక్రెటరీ ...

Read More »

చెరువుల పునరుద్దరణకు మరింత వేగం

  -కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ నిజామాబాద్‌, జనవరి 23: జిల్లాలో చెరువుల పునరుద్దరణ పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు, అందుకు సంబంధించి అయా శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహారించి పని చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. శుక్రవారం తన చాంబరులో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 3250 చెరువులు ఉండగా మొదటి దఫాలో 701 చెరువులను ఎంపిక చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మరో 25 చిన్న నీటి పారుదల చెరువుల పనురుద్దరణకు రూ.10.5 కోట్లను మంజూరి చేసామని, ...

Read More »

ఆధునిక వ్యవసాయ యంత్రీకరణ పథకం ప్రారంభం

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణ పథకం క్రింద శుక్రవారం అర్హులైన రైతులకు ఆధునిక వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు. ఇట్టి పథకాన్ని రైతులందరూ సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు ఈ పథకానికై మంజూరు చేయగా 200 కోట్లు తెలంగాణ రైతులకు కావాలని కోరన్నారు. దానిని సి.ఎం కేసీ.ఆర్‌ మంజూరు చేయడం హర్షనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, అర్బన్‌ ఎం.సి.ఎ బిగాల గుప్త, ...

Read More »

హిందూ శక్తి సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

  నిజామాబాద్‌ కల్చరల్‌, జనవరి 23: రేపు జరిగే హిందూ శక్తి సమ్మేళనాన్ని విజయవంతం చెయాలని ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. ఈ సమ్మేళనం నగరంలోని బస్టాండ్‌ ప్రక్కనగల హరిచరణ్‌ మార్వాడి పాఠశాల యందు జిల్లా సాధు దంపతుల ఆద్వర్యంలో జరుగుతుందన్నారు. హిందువులకు ఎటువంటి సమస్యలు ఎదురైన విశ్వహిందూ పరిషత్‌ ముందుంటుంది అన్నారు. అనంతరం గోవుల రక్షణకై నగరంలోని ముఖ్యమైన పలు ప్రాంతాలలో త్రాగునీరు కుండిలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ ...

Read More »

టి.జి.ఓ డైరీ క్యాలండర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: తెలంగాణ గెజిటేడ్‌ అధికారుల డైరీ, క్యాలండర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని నూతన అంబేద్కర్‌ భవనంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా టి.జి.ఓ స్‌ జిల్లా అధ్యక్షుడు బాబురావునాయక్‌ మాట్లాడారు. ఆరోగ్య భద్రత కార్డులు, ఇండ్ల స్థలాలు, ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రప్పించాలని ఆయన కోరారు. ఖాళీలుగా ఉన్న 1లక్ష 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. పి.ఆర్‌.సి సనీస వేతనం రూ. 10 వేలవరకూ పెంచాలని ...

Read More »

భవిష్యత్తుకు భరోసా ఎన్‌పిఎస్‌ ఎమ్మార్వో వెంకటయ్య

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 22: ప్రతి కుటుంబానికి భవిష్యత్తుకు తప్పనిసరిగా భరోసా ఉండాలని, అందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ సర్వీసెస్‌(ఎన్‌పిఎస్‌) భరోసాను ఇస్తుందని మాక్లూర్‌ ఎమ్మార్వో వెంకటయ్య అన్నారు. గురువారం మాక్లూర్‌ మండలం మానిక్‌భండార్‌ చౌరస్తాలో మండల ఎన్‌పిఎస్‌ బ్రాంచ్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మార్వో వెంకటయ్య ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ...

Read More »

స్వైన్‌ఫ్లూ’ బారి నుండి ప్రజలను కాపాడాలి – డా. బాపురెడ్డి

  ప్రజలపై యమపాశంగా మారుతున్న ‘స్వైన్‌ఫ్లూ’ వ్యాధి బారి నుండి ప్రజలను ప్రభుత్వమే కాపాడాలని డాక్టర్‌ బాపురెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడూతూ, ‘స్వైన్‌ఫ్లూ’ వ్యాధి ”హెచ్‌1” అనే వైరస్‌ ద్వారా సోకుతుందని,.ఈ వ్యాధి పందులు,పక్షుల ద్వారా వ్యాపిస్తుందన్నారు. జలుబు, దగ్గు, దమ్ము ఎక్కువగా రావడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ి ‘స్వైన్‌ఫ్లూ’ అవగాహనపై బ్యానర్లను పెట్టించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాధి నివారణకు సంబంధించిన ” టిఎఎమ్‌ఎఫ్‌ఎల్‌యు, రాలెంజా ” అనే ...

Read More »

డైరీ అధికారుల మోసం ఇది

  -పట్టించుకోండి పెద్దసార్లూ… -ఓ బాధితుడి ఆవేదన.. అక్రందన.. నిజామాబాద్‌, జనవరి 20: కలెక్టర్‌ సారూ….. నా పేరు యార్లగడ్డ బాబురావు. మాది మిర్జాపూర్‌ గ్రామం, కోటగిరి మండలం. నిజామాబాద్‌ జిల్లా డైరీ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌ ఉపాధి పేరుతో నన్ను మోసం చేసి రూ.5 లక్షలు నష్టం చేయడమే కాకుండా డైరీని ఏర్పాటు చేయించి మరో రూ.1.05 కోట్లు ఖర్చు చేయించి నష్టం చేయించిన అధికారులపై చర్య తీసుకోవాలని వేడుకుంటున్నాను. ఇది నా పరిస్థితి… సుమారు 26 నెలల క్రింద ఎ.పి. డైరీ ...

Read More »

ప్రైవేట్‌ పాఠశాలలను ప్రభుత్వమే ఆదుకోవాలి

  -ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాదురెడ్డి నిజామాబాద్‌, జనవరి 20: తెలగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి అందించడంతో పాటు గ్రామ గ్రామాన అ్షర అభ్యాసం అందిస్తూ కూటీర పరిశ్రమలుగా ప్రైవేట్‌ పాఠశాలలు పని చేస్తున్నాయని ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌ అన్నారు. మంగళవారం అమృతా గార్డెన్స్‌లో ట్రాస్మా జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సును ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షుడు పాదురెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ అనేది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకుంటున్నదని అన్నారు. రాజకీయ నాయకులు కార్పోరేట్‌ విద్యకు ...

Read More »

గ్రామాభివృద్ది కమిటీ వేధింపుల నుండి రక్షించండి

  నిజామాబాద్‌ రూరల్‌, జనవరి 20: డిచ్‌పల్లి మండలం నల్లవెల్లి గ్రామాభివృద్ది కమిటీ బాటలోనే మిగతా గ్రామాల్లోని పెత్తందార్లు గ్రామ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని సిపిఎం నేత పెద్ది వెంకట్రాములు అన్నారు. నల్లవెల్లి గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ కిరణా దుకాణాలలో అమ్మకాలపై నిబంధనాలు విధించారని అన్నారు. ఈమేరకు గ్రామ అభివృద్ది కమిటీ తీరుపై జిల్లా కలెక్టర్‌కు సిపిఎం నాయకులు ఫిర్యాదు చేసారు. గ్రామంలో కిరాణ దుకాణంపై వేలంపాట పెట్టి, గ్రామభీవృద్ది కమిటీల ఆదేశాలను అమలుచేయని గ్రామప్రజలపై రూ.10 వేలు జరిమానా దౌర్జన్యంగా వసూలు ...

Read More »

స్వచ్ఛభారత్‌తో ఆరోగ్య సూత్రలు

  -బిజెపి నేత డాక్టర్‌ బాపురెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 20: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంతో గ్రామీణ ప్రజలు ఐదు స్వచ్ఛమైన ఆర్యోగ్య సూత్రలు పాటించాలన్నారు. మంగళవారం ఆమ్రాద్‌ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా డాక్టర్‌ బాపురెడ్డి పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన ఆరోగ్యం కావాలంటే గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, బాలలికలు, రక్తహీనతను రూపుమాపేందుకు సరైన ఆహరం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కత్తికల్లు, కల్తిపాల సరఫరాలను నిషేదించాలన్నారు. గ్రామీణ పరిసర ప్రాంతాల్లో పారిశుద్యన్ని నెలకోల్పోన్నారు. గ్రామంలో ...

Read More »

25న జాతీయ ఓటర్ల దినోత్సవం

  -ఓటర్‌ జాబితాలో చేరండి; డిఆర్‌వో మనోహార్‌ నిజామాబాద్‌, జనవరి 17; జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకోని ఈనెల 25న ప్రతి ఒక్కరు యువత ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి(డిఆర్‌వో) మనోహార్‌ అన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. అ సందర్భంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు ఈనెల 18న నియోజకవర్గ స్థాయిలో క్విజ్‌, ఏలోకేషన్‌, పెయింటింగ్‌ పోటీలను నిర్వహించాలని, ఇక్కడ గెలుపొందిన వారికి ఈనెల 23న జిల్లా స్థాయిలో పోటీలను ...

Read More »

18న పెన్షన్‌ ఆదాలత్‌

  -కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 17; నిజామాబాద్‌ నగరంలోని అన్ని ప్రాంతాల్లో 18న ఆదివారం పెన్షన్‌ ఆదాలత్‌ను నిర్వహించనున్నట్లు, ఇందుకు స్థానిక అధికారులంతా హజరు కావాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ప్రగతిభవన్‌లో బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 18న నగరంలోని 49 డివిజన్లలో ఒక్క 24వ డివిజన్‌ను మినహాంచి ప్రతి ఒక్క డివిజన్‌లో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు పెన్షన్‌ ధరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. అలాగే ప్రతి లబ్దిదారుడు తప్పకుండా తమ ...

Read More »

అర్హులందరికి పెన్షన్లు

  -కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 17; నిజామాబాద్‌ నగరంలోని అర్హులైన వారందరికి పెన్షన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అన్నారు. బుధవారం నగరంలోని 24వ డివిజన్‌లో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్‌ సుజాతతో కలిసి పర్యటించారు. పెన్షన్లు మంజూరి కాని వారంత ధరఖాస్తు చేసుకోవాలని, వయసు, ఇతర దృవీకరణ పత్రాలను అందించాలని, వాటి ప్రకరం సర్వే చేసి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. తమ ధృవీకరణ పత్రాల్లో వయసు తక్కువగా ఉంటే పెన్షన్‌ రాదని, దీనిని ప్రతి ఒక్కరు దృష్టిలో ...

Read More »

ముగ్గుల పోటీలు

  -విజేతలకు బహుమతుల ప్రదానం నిజామాబాద్‌ కల్బరల్‌, జనవరి 14; నిజామాబాద్‌ నగరంలోని శ్రీలక్ష్మి వినాయకనగర్‌లో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ మేరకు ముగ్గుల పోటీల్లో 30 మంది పాల్గొన్నారు. వీరిలో విజేతలను ఎంపిక చేసారు. మొదటి బహుమతి ముత్యాల లిఖిత, రెండో బహుమతి మాదురి, మూడో బహుమతి సుజాత, శ్వేత, నిలిమాలకు కాలనీ అధ్యక్షుడు నారాయణ చేతుల మీదుగా అందజేసారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌, భాస్కర్‌, రాజన్న, నాయకులు అంబర్‌సింగ్‌, ...

Read More »

అర్థరాత్రి తాళం వేసిన ఇంటికి నిప్పు

-బంగారం, నగదు దోపిడీ -నగరంలో కలకలం నిజామాబాద్‌ క్రైం, జనవరి 14; నిజామాబాద్‌ నగరంలోని న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో బంగారం, నగదు దోచుకొని ఏకంగా ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన నిజామాబాద్‌ నగరంలో కలకలం రేపింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కంఠేశ్వర్‌ న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో మాక్లూర్‌కు చెందిన చింతల లత(43) పండిత్‌ ఇంట్లో ఆరు సంవత్సరాలుగా ...

Read More »

భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో పంతంగుల పంపిణి

బోధ‌న్‌, జ‌న‌వ‌రి14:  బోధ‌న్ మండ‌లం భ‌వానిపేట్ గ్రామంలో బుధ‌వారం భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో బోగి పండుగా సంద‌ర్భంగా  గ్రామంలోని పిల్ల‌ల‌కు పంతంగులు పంపిణి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భ‌వానీ ల‌య‌న్స్ క్ల‌బ్ ప్రోగ్రామ్ చైర్మెన్ వెంక‌గౌడ్‌, క్ల‌బ్ అధ్య‌క్షులు క్రిష్ణ‌ప్ర‌సాద్‌, కోశాధికారి  మ‌ల్లేశ్వ‌ర‌రావు, ల‌య‌న్స్ క్ల‌బ్ స‌భ్యులు కృష్ణ‌కాంత్‌, కె.సాయిలు, పావులూరి వెంక‌టేశ్వ‌రావు, పి.శ్రీ‌నివాస్‌, ప్ర‌సాద్‌, పాల్గోన్నారు.

Read More »

అపూర్వ అనాథ‌శ్ర‌మ పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు, పండుగ సామాగ్రి పంపిణి

పోటోరైట‌ప్‌101: అపూర్వ ఆనాథ‌శ్ర‌మ పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు, సామాగ్రిని పంపిణి చేస్తున్నా దృశ్యం బోధ‌న్‌, జ‌న‌వ‌రి 14:  బోధ‌న్ ప‌ట్ట‌ణ శివారులోని అనాథ‌శ్రామ పిల్ల‌ల‌కు బోధ‌న్ పాత ప‌ట్ట‌ణానికి చెందిన ఆర్‌, చిన్న గంగాధ‌ర్ బుధ‌వారం ఆశ్ర‌మంలోని చిన్నారుల‌కు తోమ్మిది నెల‌ల‌కు స‌రిప‌డు బియ్యం, బ‌ట్ట‌లు, ప‌ప్పులు, చ‌క్కేర‌, స్వీటు్ల‌, సంక్రాంతి పండుగ‌ పిండి వంట‌లు పంపిణి చేశారు. చిన్నారులు సంక్రాంతి పండుగాను ఆనందోత్స‌వాల‌ను జ‌రుపుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆశ్ర‌మ వ్య‌వ‌స్థాప‌కులు అశోక్‌కుమార్ రోడే, సంతోష్‌, స‌న్నాప‌టేల్‌, ఆశ్ర‌మ సిబ్బంది పాల్గోన్నారు.

Read More »