Breaking News

Armoor

అభివృద్దికి ఓటు వేయండి

  ఆర్మూర్‌ సభలో ఆపద్దర్మ సిఎం కెసిఆర్‌ నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్దిని చూసి ఓటు వేసి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రజల్ని కోరారు. గురువారం ఆర్మూర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అధికారం కోసం మాయమాటలు చెప్పే పార్టీలను నమ్మి తెలంగాణ ప్రజలు ఆగం కావద్దని, గతంలో ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో కాంగ్రెస్‌, టిడిపిలు తెలంగాణ పట్ల ...

Read More »

ఎన్నికల ప్రచారంలో ఆకుల లలిత బిజి బిజి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆకుల లలిత సోమవారం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పెర్కిట్‌ ఎంపిటిసి పద్మజ మోహన్‌ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం వారితో కలిసి గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఎంపిటిసి నాగమణి, సాయారెడ్డి, ఎంపిటిసి సాయన్న తదితరులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నందిపేట గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆర్మూర్‌ ...

Read More »

ప్రమాదం తెచ్చిన మార్పు

– బషీరాబాద్‌ గ్రామానికి మానవత్వమే రక్షణ కవచం – వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందిస్తున్న వైనం – కొత్త సంప్రదాయానికి నాంది పలికిన యువకులు నిజామాబాద్‌ టౌన్‌ (స్పెషల్ ఫీచర్ ), జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంచి మనసుల నుంచే మానవత్వం పరిమళిస్తుంది, ఆ పరిమళం చుట్టుపక్కల వారందరికి సువాసనను వెదజల్లుతుంది. ఇది ఓ సినీ కవి చెప్పిన మాట. ఇది నిజామాబాద్‌ జిల్లాలో కనిపించింది. కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్‌ గ్రామం ఒక కొత్త ఆలోచనకు కార్యరూపం దాల్చింది. ...

Read More »

రోడ్డెక్కిన రైతన్న

  – ఆర్మూర్‌లో ఉద్రిక్తత నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న, పసుపు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తు రైతు జేఏసి ఆధ్వర్యంలో ఆర్మూర్‌ తహసీల్‌ కార్యాలయం వద్ద రైతులు గురువారం ఆమరణ దీక్షకు పూనుకున్నారు. దీక్షనుద్దేశించి రైతు జేఏసి నేత ప్రభాకర్‌ మాట్లాడుతూ నిజామబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 110 గ్రామాల్లో ఎర్రజొన్న ప్రధాన పంటగా ఉందని, దాదాపు 50 వేల ఎకరాల్లో పంట ...

Read More »

తెరాస పార్టీలో చేరిన గోసంగి సభ్యులు, విడిసి సభ్యులు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని చేపూర్‌ గ్రామనికి చెందిన గోసంగి సంఘం సభ్యులు తెరాసలో చేరారు. వీరిని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గోసంగి సంఘం సభ్యులు కమ్యూనిటి హాల్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రూ. 5 లక్షల నిధులు కేటాయించారు. సత్తయ్య, మల్లేశ్‌, నర్సింగ్‌, దేవరాజు, గంగాధర్‌, లక్ష్మి, భారతి, సుజాత, ఆర్మూర్‌ జడ్పిటిసి సాందన్న ఉన్నారు. ...

Read More »

ఆలూరులో పన్నుల వసూలు

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామ పంచాయతీలో పన్నుల వసూలు గురించి గురువారం ప్రత్యేక బృందం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. బృందంలో ఎంపిడివో లింగయ్య మౌర్య, ఈఓపిఆర్‌డి దామోదర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ సూరత్‌రెడ్డి, కార్యదర్శులు గుర్రపు శ్రీనివాస్‌, గంగమోహన్‌, సుధాకర్‌రెడ్డి, ప్రవీణ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, కారోబార్లు సంతోష్‌, క్రాంతి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ పన్ను బకాయిలు వసూలు చేస్తున్నారు.

Read More »

వేములపల్లి కిరణ్‌ 27వ వర్ధంతి

  ఆర్మూర్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పివైఎల్‌ జిల్లా తొలి కన్వీనర్‌ వేముల కిరణ్‌కుమార్‌ 27వ వర్ధంతి సందర్భంగా పివైఎల్‌ ఆధ్వర్యంలో కుమార్‌ నారాయణ భవన్‌లో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పివైఎల జిల్లా అధ్యక్షుడు కిషన్‌ మాట్లాడుతూ కామ్రేడ్‌ కిరణ్‌కుమార్‌ జిల్లాలో పల్లెపల్లెలో యువజన సంఘాన్ని విస్తరింపజేయడానికి కృషిచేశారని, యువత పెడదోవ పట్టకుండా వారిని సమీకరించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేలా యువతను చైతన్యం చేశారని గుర్తుచేశారు. కిరణ్‌ మరణం ...

Read More »

కాంగ్రెస్ కి మరో ఝలక్

ఈరోజు తెలంగాణా రాష్ట్ర సమితి(TRS) పార్టీ లో ఉస్మాన్ అలీ(తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ & మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్) మరియు హాబీబుద్దిన్ (జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ &కో ఆప్షన్) చేరారు,వీరిని నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు మరియు ఆర్మూర్ శాసన సభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారు వీరిని పార్టీ కండువా కప్పి సహణంగా పార్టీ లోకి ఆహ్వానించరూ వీరి వెంట TRS సీనియర్ నాయకులు సంజయ్ సింగ్ బబ్లూ,మరియు సాజిద్ అలీ గారు పాల్గొన్నారు ...

Read More »

అనిశాకు చిక్కిన ఆర్మూర్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌

  నందిపేట, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజనల్‌ ఆర్డీవో పల్లె శ్రీనివాస్‌ను మంగళవారం అవినీతి నిరోధక శాఖ అదికారులు ఆర్మూర్‌లోని ఆయన నివాసంలో వాటర్‌ ప్లాంట్‌ యజమాని వద్ద నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మంజీర వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నాడని నవంబర్‌ 20న సీజ్‌ చేసిన వాటర్‌ ప్లాంట్‌ను తిరిగి కొనసాగించడానికి రూ. 40 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో వాటర్‌ప్లాంట్‌ యజమాని రాజ్‌కుమార్‌ అనిశా అధికారులను సంప్రదించగా ...

Read More »

రజక ఉద్యోగులకు సన్మానం

  ఆర్మూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో మామిడిపల్లిలో రజక ఉద్యోగులు ఎల్లయ్య, మల్లేశ్‌, మేకల సాయిలు, కిషన్‌, సంతోష్‌, ఓరుగంటి బాలులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మానస గణేశ్‌ మాట్లాడుతూ 2013లో రజక ఐక్యవేదిక ఏర్పాటైన నుంచి ఉద్యోగులు వారి మేదస్సును, డబ్బును, సమయాన్ని ఇచ్చి జాతి అభివృద్దిలో కీలక పాత్రపోషిస్తున్నారని అన్నారు. అటువంటి వీరు అభినందనీయులని తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తు, పేద ...

Read More »