Breaking News

Armoor

అనర్హులకు అంత్యోదయ

దారిద్య్ర రేఖకు దిగువన కుటుంబాలకు పట్టెడన్నం పెట్టి ఆదుకునేందుకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులను రూపొందించింది. భర్తను కోల్పోయిన వితంతువులకు, వికలాంగులకు, భయంకరమైన వ్యాధుల బారిన పడిన అభాగ్యులకు, ఇళ్లు లేని పేద కుటుంబాల వద్ద ఉండాల్సిన కార్డులు స్థితిమంతుల చేతుల్లోకి వెళ్లాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా అంత్యోదయ అన్నయోజనకార్డులు కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడంలో మండలస్థాయి అధికారులు నిబంధనలకు తిలోదకాల్చి, వారికి కావాల్సిన వారికి కార్డులను అప్పగించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాలకు నెలకు 35 కిలోల ...

Read More »

కామారెడ్డి, ఆర్మూర్‌ మునిసిపాలిటీల తాగునీటి పనులు సమీక్షించిన జిల్లా కలెక్టర్‌

  నిజామాబాద్‌ రూరల్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్టి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే పథకంలో ఏర్పడిన లోటుపాట్లను ఈనెల 25 లోపు సరిచేయాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. శనివారం తన చాంబరులో ప్రజా ఆరోగ్యశాఖ ఇఇ శ్రీనివాస్‌, కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ పఠాభి, ఆర్మూర్‌ మునిసిపల్‌ కమీషనర్‌ సివిఎన్‌.రాజు, మెగా ఇంజనీరింగ్‌ ఇన్‌ప్రాస్టక్చర్‌ కంపెనీ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ యువరాజులతో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని వాడలకు నీటిని సరఫరా ...

Read More »

లిఫ్టు ఇరిగేషన్‌లకు నిధులు మంజూరుచేయాలని ఎమ్మెల్యే వినతి

  ఆర్మూర్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని 12 లిప్టు ఇరిగేషన్‌ పనులకు సంబంధించి నిదులు మంజూరు చేయాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు వినతి పత్రం అందజేశారు. అంనతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్మూర్‌ నియోజకవర్గాన్ని అభివృద్దిలో అగ్రస్థానంలో నిలబెడతామని ఆయన చెప్పారు. స్వరాష్ట్రం సిద్దించిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం ఆశించిన స్థాయికంటే ఎక్కువగా ప్రజల మన్ననలు పొంది పనులు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నాయకులు ...

Read More »

గ్రూప్‌-2 పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన టిఎస్‌ పిఎస్‌సి సభ్యులు

  ఆర్మూర్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఆమోదించి ఇదివరకే పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీచేసింది. అందులో భాగంగా అబ్యర్థులు శ్రమించి చదువుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ద్వారా పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో పరీక్షలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్వహించడానికి అటు ప్రభుత్వం, టిఎస్‌పిఎస్‌సి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే బుదవారం పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ సభ్యుడు వివేక్‌ ఆర్మూర్‌లో నిర్వహించే ...

Read More »

నేటి నుంచి ఒంటిపూట

ఆర్మూర్ : ఎండలు మండిపోతున్నాయి. పగలు అడుగు బయట పెట్టడానికి అప్పుడే జనం జంకుతున్నారు. జిల్లాలో ఎండ 40 డిగ్రీలకు చేరింది. ఇం తటి వేడి ఇంత ముందుగా ఎన్నడూ లేదు. జనం విలవిల్లాడి పోతున్నారు. పిల్లల పరిస్థితి చెప్పనక్కర లేదు. ప్రస్తుతం విద్యార్థుల కు పరీక్షలు జరుగుతున్నాయి. పదో తరగతి విద్యార్థులకు జరగాల్సి ఉంది. ఈ సమయం లో ఎండ వేడిమి నుంచి ఉపసమనం ఇచ్చేందుకు ప్రభుత్వం పాఠశాలల సమయాన్ని మార్చింది. రెండు పూటలకు బదులుగా ఒ క్కపూటనే పాఠశాలలు నడుపాలనే ఆదేశాల ...

Read More »

వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ ప్రారంభించిన మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌

ఆర్మూర్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో నీటి ఎద్దడి నివారించేందుకు రాంనగర్‌-అరుంధతినగర్‌ దారిలో వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ను సోమవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లు ప్రారంభించారు. అనంతరం విద్యావనరుల కేంద్రంలో ఎంఇవో ఆధ్వర్యంలో పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ముందస్తు తరగతులు ప్రారంభం చేస్తున్నందున పాఠ్యపుస్తకాలు అందజేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సడక్‌ వినోద్‌, జి.వి.నర్సింహారెడ్డి, ద్యాగ ఉదయ్‌, రమేశ్‌, నర్సయ్య, కో ఆప్షన్‌ మెంబర్‌ మాలిక్‌బాబు, జో శ్రీనివాస్‌, అజీమ్‌, రహమాన్‌, వినోద్‌ ...

Read More »

ఘనంగా చౌడమ్మ ఆలయ వార్షికోత్సవం

ఆర్మూర్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామంలోగల చౌడేశ్వరి మాత ఆలయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా ప్రారంభించారు. మామిడిపల్లి గ్రామంలో దేవంగ కుల సంఘం ఆద్వర్యంలో చౌడమ్మమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఆర్మూర్‌ నియోజకవర్గ తెరాస వ్యవహారాల ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి, మామిడిపల్లి సర్పంచ్‌ రవిగౌడ్‌, ఎంపిపి పోతునరసయ్యలు ప్రారంభించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మోత్కురి లింగాగౌడ్‌, జడ్పిటిసి సాందన్న, కో ఆప్షన్‌ సభ్యుడు పోల మధుకర్‌, ...

Read More »

చదువుతోనే బంగారు భవిష్యత్తు

ఆర్మూర్ రూరల్ : విద్యార్థులకు ఓర్పు, సహనం ఎంతో అవసరమని, సహనంతో కష్టపడి చదివి తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ అన్నారు. చదువుతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. మండలంలోని చేపూర్ గ్రామంలోని క్షత్రీయ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తృతీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ… విద్యార్థులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశాన్ని ప్రేమించి సాంకేతిక వైభవాన్ని చాటాలన్నారు. అనంతరం విద్యార్థులు ...

Read More »

ఉల్లి లొల్లికి కళ్లెం

ఆర్మూర్ : రెండేళ్లుగా పేద, మధ్యతరగతి ప్రజలకు కన్నీరు పెట్టించిన ఉల్లిగడ్డ ధరను రాష్ట్ర ప్రభుత్వం  అదుపులోకి తెస్తోంది. అడ్డగోలుగా నిల్వలు చేసి వినియోగదారులను దోచుకున్న వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. ఉరుకులు పరుగులు పెట్టి లొల్లి పెట్టిన ఉల్లి ధరకు ప్రభుత్వం కళ్లెం వేసింది. అడ్డగోలుగా నిల్వలు, ఇష్టారీతిగా ధరలను పెంచి మా ర్కెట్‌ను ఆగమాగం చేయకుండా కట్టుదిట్టమైన చర్యలకు ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. నిల్వలను, ధరలను నియంత్రించేందుకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లోనే నియంత్రణ చట్ట తేవాలని ...

Read More »

యువకుడి ఆత్మహత్య

న్యాల్‌కల్‌(ఇందూరుగ్రామీణం): నిజామాబాద్‌ మండలం న్యాల్‌కల్‌ గ్రామానికి చెందిన పెద్దపల్లి సాయికుమార్‌(28) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్‌ ఏఎస్సై నరసింహ కథనం ప్రకారం.. న్యాల్‌కల్‌కు చెందిన సాయికుమార్‌ గతంలో రెండు మార్లు దుబాయ్‌ వెళ్లి తిరిగొచ్చాడు. ప్రస్తుతం మంగి రాములు మహారాజ్‌ వద్ద ఆశ్రయం పొందుతున్నాడు. అయితే సాయికుమార్‌ న్యాల్‌కల్‌లోని తన తల్లిదండ్రులతో మాట్లాడేవాడు కాదని, అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి తన నానమ్మను చేసివెళ్లేవాడని తెలిపారు. ఈ క్రమంలో శనివారం గ్రామానికి వచ్చి వెళ్లిన సాయికుమార్‌ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య ...

Read More »

తండాలకు మహర్దశ

(ఆర్మూర్) :ఆదరణకు నోచుకోని తండాల దశ మారనుంది. అనేక ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్న తండాల స్థితిగతులు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. గ్రామాలకు దూరంగా నివాసం ఉన్న గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. గ్రామాలకు దూరంగా ఉండడంతో కనీసం సౌకర్యాలు లేని పరిస్థితి తండాల్లో నెలకొంది. స్వరాష్ట్రంలో గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగ నిండనున్నాయి. గ్రామాలకు దూరంగా ఉండడంతో కనీసం సౌకర్యాలు లేని పరిస్థితి తండాల్లో నెలకొంది. స్వరాష్ట్రంలో గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతానని ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ...

Read More »

అమెరికాలో లయన్స్ సమావేశానికి సుందర్

  ఆర్మూర్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఈనెల 12న లయన్స్‌క్లబ్, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా నిర్వహిస్తున్న 38వ వార్షికోత్సవ సమావేశంలో పాల్గొనడానికి ఆర్మూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు, శ్రీభాషిత గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ పోలపల్లి సుందర్‌కు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడమే కాకుండా, గ్రామీణ విద్య అవకాశాలు, అభివృద్ధి అనే అంశాలపైన సుందర్ ఈ వేదికగా మాట్లాడనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ అరుదైన అవకాశం పోలపల్లి సుందర్ ఒక్కరికే దక్కడం విశేషం. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు లేక, ...

Read More »

ఇస్సాపల్లిలో యువతి…

ఆర్మూర్ : మండలంలోని ఇస్సాపల్లి గ్రామానికి చెందిన కంచం మాధవి మూడు రోజులుగా కనిపించడం లేదని ఆమె తండ్రి బాలయ్య మంగళవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సీతారాం తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన బాలయ్య సుమారు 15 ఏళ్ల క్రితం ఇస్సాపల్లికి వచ్చి స్థిర పడ్డారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా పెద్ద కూతురు సొంత గ్రామం ఇంటివద్ద ఇటీవలే డెలివరీ అయ్యింది. భార్య కూడా కూతురు కోసం స్వగ్రామానికి వెళ్లింది. చిన్న కూతురు ...

Read More »

గల్ఫ్‌ బాధితుల ఆశాకిరణం

బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అనుకోని పరిస్థితిలో అక్కడ కేసులలో ఇరుక్కొని ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతూ భార్యాపిల్లలకు, తల్లిదండ్రులకు దూరమై కృంగిపోతున్న వారికి ఆమె ఒక ఆశాకిరణంలా కనిపిస్తారు. తెలుగువారు జైళ్లొ ఉన్నారని తెలిస్తే చాలు అక్కడికి వెళ్ళి వారిని కలిసి వివరాలు తెలుసుకొని కోర్టులో వాదించి వారిని జైలు నుంచి విడిపిస్తారు. ఎంతో మందికి జైలు జీవితం నుంచి ఆమె విముక్తి కల్పించారు. మరణశిక్ష పడిన వారిని సైతం విడిపించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. మానవత్వం మూర్తీభవించిన ఆ మహిళా ...

Read More »

మట్టి దొంగలు..

-తరలిపోతున్న నల్లమట్టి -లక్షన్నర క్యూబిక్ మీటర్ల మేర మాయం -సిండికేట్‌గా మారిన మాఫియా -ఎస్సారెస్పీ అధికారుల కనుసన్నల్లోనే దందా.. ఆర్మూర్: ఎండిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక గొల్లు మంటుంటే మట్టి మాఫియా నల్ల మట్టి తరలిస్తూ కోట్లకు పడగలెత్తుతోంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా కీర్తి గడించిన శ్రీరాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయి డెడ్ స్టోరేజీకి చేరింది. గడిచిన రెండేళ్లుగా చుక్క నీరివ్వని ప్రాజెక్టు మట్టి మాఫియాకు వరప్రదాయినిగా మారింది. ప్రాజెక్టు చివరి భాగంలో భారీగా నల్లమట్టిని మాఫియా తోడేస్తోంది. ఎస్సారెస్పీ గర్భాన్ని ...

Read More »

ఎక్కడ ఏ మొక్కలు ఎన్ని కావాలో వివరాలు ఇవ్వండి

నిజామాబాద్‌, మార్చి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలంలో ప్రారంభం కానున్న తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ఏ శాఖకు, ఏ గ్రామానికి, ఏ సంస్థకు ఎన్ని మొక్కలు కావాలో ప్రాంతాల వారిగా జాబితా ఇవ్వాలని, తద్వారా ఆయా ప్రాంతాలకనుగుణంగా దగ్గరలో ఉన్న 405 నర్సరీల్లో మొక్కలు పెంచడానికి వీలవుతుందని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా అన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్షించారు. నీటి లభ్యతకు అనుగునంగా నర్సరీలను ఏర్పాటు చేయాలని, జియాలజిస్టులతో పరిశీలన చేయించి నర్సరీలకు నీటి వసతికి ఓపెన్‌బావులు, బోరుబావులు ...

Read More »

అంగన్‌వాడీల వేతనాలు పెంచాలి

ఇందూరు కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాలు పెంచడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. మంగళవారం ఈ మేరకు జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం ఆవరణలో అంగన్‌వాడీ కార్యకర్తలు సమావేశమై అక్కడి నుంచి ర్యాలీగా రైల్వే స్టేషన్‌ మీదుగా ఎన్టీఆర్‌ చౌరస్తాకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు మాట్లాడుతూ.. గతనెల 15న చలో దిల్లీ కార్యక్రమం సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి ...

Read More »

3న పసుపు పంట సాంకేతిక సాగుపై అవగాహన

ఇందూరు: రాష్ట్ర స్థాయిలో పసుపు పంట సరికొత్త సాంకేతిక సాగుపై ఆదిలాబాద్‌ జిల్లాలోని తాంసీ మండలం ధన్నోరా గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్‌ జిల్లా ఉద్యానశాఖ అధికారాణి సునందా రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమానికి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఖమ్మం జిల్లాల నుంచి 2500 మంది రైతులు వస్తున్నారని తెలిపారు. నూతన వంగడాలు, యాంత్రీకరణ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. జిల్లా రైతులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం ...

Read More »

తొలగిన పూడిక 46 శాతమే

సదాశివనగర్‌ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ పథకం పనులను 2015 మార్చి 12న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ పాత చెరువులో ప్రారంభించారు.ఈ చెరువులో 100 శాతం పూడికమట్టిని తొలగించి పూర్వ వైభవం తీసుకొస్తామని స్వయనా ముఖ్యమంత్రి చెప్పినా ఆచరణలో మాత్రం 46 శాతం పూడిక మట్టి తొలగింది.మొదటి విడత పనులను 2016 మార్చి 31 లోపు పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ఇంకా 54 శాతం పూడికమట్టిని తొలగించాల్సిన అవసరం ఉందని ...

Read More »

బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు

  ఆర్మూర్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మొదలయ్యే ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్దం చేసినట్టు ఆర్మూర్‌ విద్యాధికారులు, సిఎస్‌, ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్‌ కె.చంద్రశేఖర్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు విద్యార్థులు సరైన సమయంలో కేంద్రాలకు చేరుకోవాలని, అదేవిధంగా పరీక్ష హాలుకు వచ్చేటపుడు ప్యాడు, పెన్నులు మాత్రమేవెంట తెచ్చుకోవాలని, సాంకేతిక పరికరాలు తీసుకురావద్దని చెప్పారు. శ్రద్దతో చదివి పరీక్షలు రాయాలని సూచించారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడవద్దని సూచించారు. పట్టణంలో మొత్తం 6 కేంద్రాల్లో ...

Read More »