Breaking News

Armoor

గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా తెలంగాణ

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నుండి 35 రోజులపాటు కొనసాగే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం శనివారం సుర్బీర్యాల్‌ గ్రామంలో ఆర్మూర్‌ మండల ఎంపీపీ ప్రారంభించారు. శనివారం 258 పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేశారు. సోమవారం ఇదే కార్యక్రమం సుర్బీర్యాల్‌ గ్రామంలో కొనసాగుతుందన్నారు. పాడి రైతులు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి గ్రామంలో ఏ ఒక్క పశువుకు కూడా టీకా వేయకుండా ఉండకుండా పశువైద్య సిబ్బంది ఒక్కో గ్రామానికి రెండు రోజులు ఉదయం ...

Read More »

ఉత్తమ ఉద్యోగులకు సన్మానం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం వేల్పూరు గ్రామ పంచాయతీలో బిల్‌ కలెక్టర్‌గా ఉద్యోగ విరమణ చేసిన భోగ గణేష్‌ను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ తీగల రాధ మోహన్‌ అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. గణతంత్ర వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులుగా అవార్డ్‌ అందుకున్న డి.యల్‌.పి.ఓ పి.వి శ్రీనివాస్‌, యస్‌.ఐ. శ్రీధర్‌ గౌడ్‌ , యం.అర్‌.ఓ ఆఫీస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ శరత్‌, యస్‌.బి.ఐ బ్యాంక్‌ మెనేజర్‌ రాజు, ఉపాధి హామీ కంప్యూటర్‌ ఆపరేటర్‌ రామ గౌడ్‌, ట్రాన్స్‌కో లైన్‌ మెన్‌ ...

Read More »

వేతన సవరణ కోసం ఉద్యోగుల సమ్మె

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో గత రెండు రోజులుగా వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు డిమాండ్‌ చేస్తున్నాయి. తమ జీతాలను 20 శాతం పెంచాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా పబ్లిక్‌ సెక్టార్‌ యూనియన్‌ బ్యాంకులు కోరుతున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో నిరసనకు దిగుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి రెండురోజుల పాటు తమ స్ట్రైక్‌ కొనసాగనుందని స్పష్టంచేశారు. రెండురోజులపాటు స్ట్రైక్‌ చేస్తున్నామని యూనైటెడ్‌ ...

Read More »

మర్యాదగా బతకమన్నందుకు మేనత్తను చంపేశాడు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సక్రమంగా పనిచేసుకొని, ఎలాంటి చెడు తిరుగుళ్లు తిరగకు, మర్యాదగా బ్రతకమని మందలించించినందుకు వరుసకు మేనత్త అయిన లక్ష్మి (43) ను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపేసిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలోని ఆదర్శ నగర్‌లో లక్ష్మి (43) కూలి పని చేస్తూ నివాసం ఉండేది. లక్ష్మికి వరుసకు మేనల్లుడు దంతేవడా సాయిలు (20) ...

Read More »

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణి

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని అన్ని గ్రామాల లబ్దిదారులకు గురువారం ఆర్మూర్‌ ఎమ్మల్యే జీవన్‌ రెడ్డి క్యాంపు ఆఫీస్‌లో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ చెక్కులను అందజేశారు. 304 మంది లబ్ది దారులకు ఒక్కొక్కరికి 1 లక్ష 1 వంద 16 రూపాయల చొప్పున పంపిణి చేశారు. ఇందులో బిసి – 245 మందికి – 2,43,55,188 రూపాయలు, మైనారిటీ 59 మందికి – 58,81,844 రూపాయలు, మొత్తం 304 మందికి – 3 కోట్ల ...

Read More »

ఆర్మూర్‌లో కార్డన్‌ సెర్చ్‌

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం రాజారామ్‌ నగర్‌ కాలనీ, యోగేష్వర్‌ కాలనీలలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఉదయము 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు నిర్వహించిన నిర్బంధ తనిఖీల్లో ఎలాంటి కాగితాలు లేకుండా అనుమనాస్పదంగా ఉన్న ద్విచక్ర వాహనలు 73, ఆటోలు 02, కార్లు 02, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికీ సంబందించిన దవపత్రాలు చూపించి తీసుకోవాలని సీపీ సూచించారు. కార్డెన్‌ సెర్చ్‌ కు నిజామాబాద్‌ పోలీస్‌ ...

Read More »

మన పట్టణము మన వార్డు మన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని 25 వార్డులో మన పట్టణం మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్‌ ఆశన్న గారి జీవన్‌ రెడ్డి ప్రారంభించారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో సమస్యలను పరిష్కరించే విధంగా కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని, పట్టణంలోని 36 వార్డుల్లో కార్యక్రమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్మూర్‌ను ...

Read More »

పదవి బాధ్యత స్వీకరణ మోహోత్సవం

ఆర్మూర్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపాలిటీలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత, వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్నుల పదవి బాధ్యత స్వీకార కార్యక్రమం గురువారం ఆర్మూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్మూర్‌ పట్టణ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గెలిపించిన వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. ఆర్మూర్‌ పట్టణంలోని 36 వార్డుల అభివ ద్ధి ప్రణాళిక ...

Read More »

కెటిఆర్‌ను కలిసిన భీమ్‌గల్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ లోని తెరాస కార్యాలయమైన తెలంగాణ భవన్‌ లో మంగళవారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో భీంగల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ మల్లెల రాజశ్రీ, వైస్‌ ఛైర్మన్‌ బాలభగత్‌తో పాటు కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

సాగులో సేంద్రీయ పద్దతి పాటించాలి

ఆర్మూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెల్పూర్‌ మండలంలోని పడగల్‌, పోచంపల్లి గ్రామాల్లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ తరుపున సేంద్రియ ఎరువుల వ్యవసాయం చేస్తున్న ఇద్దరు రైతులకు ప్రదర్శన క్షేత్రం కింద 60 కిలోల వర్మి కంపోస్ట్‌, 500 మిల్లీ లీటర్ల వేప నూనెను మండల వ్యవసాయ అధికారి ప్రకాశ్‌ గౌడ్‌ ప్రోత్సాహంగా అందజేశారు. ప్రస్తుతం నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దష్ట్యా ప్రతి రైతు కనీసం తనను తాను తినేటటువంటి ఆహార పదార్థాలకైనా సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో సాగు ...

Read More »

కౌంటింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన సిపి కార్తికేయ

ఆర్మూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లోని సాదారణ ఎన్నికలకు సంబందించి శనివారం జరగబోయే ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు కార్తికేయ పరిశీలించారు. శుక్రవారం ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరగబోయే లెక్కింపు ఏర్పాట్లను అయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ శైలజ, ఆర్డిఓ శ్రీనివాసులు, సీఐ రాఘవేందర్‌, ఎస్‌ఐ విజయ్‌ ఉన్నారు.

Read More »

ప్రొఫెసర్‌ కాసీం అరెస్టును ఖండించండి

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌, విప్లవ రచయితల సంఘం కార్యదర్శి కాసింని అరెస్టు చేయడాన్ని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్‌) ఖండిస్తున్నదని రాష్ట్ర నాయకులు సుమన్‌ అన్నారు. శనివారం కుమార్‌ నారాయణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అవినీతి పాలనను విధానాలను ఎవరు ప్రశ్నించినా రాసిన ఆ ప్రశ్నించే గొంతుకలను జైల్లో నిర్బంధించే ఫాసిస్టు ...

Read More »

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి పిప్రి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. కళాశాలలో ఆర్మూర్‌ మున్సిపల్‌ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున సంబంధిత అధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. స్ట్రాంగ్‌ రూముల్లో కౌంటింగ్‌ హాల్లో ఏ విధంగా ఏర్పాటు చేయాలో సూచనలు జారీ చేశారు. కౌంటింగ్‌ కేంద్రాలకు వచ్చే ఏజెంట్లకు, కౌంటింగ్‌ సిబ్బందికి వేరువేరుగా ...

Read More »

భీమ్‌గల్‌లో ఈరవత్రి అనిల్‌ ఎన్నికల ప్రచారం

భీమ్‌గల్‌, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణంలో గురువారం బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భీంగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 2వ డివిజన్‌ అభ్యర్థి నరసయ్య, 10 వ డివిజన్‌ అభ్యర్థి లత నరసయ్య, 5 వ డివిజన్‌ అభ్యర్థి బొదిరే స్వామి, 6వ డివిజన్‌ అభ్యర్థి సుధాకర్‌ల తరఫున అనిల్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.

Read More »

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ని ప్రైవేట్‌ స్కూల్‌ పీఈటీలు ఎంఈఓ పింజ రాజా గంగారం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రైవేట్‌ స్కూల్‌ పిఈటి ప్రెసిడెంట్‌గా సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌ పీఈటీ అనిల్‌ కుమార్‌ను ఎన్నుకున్నారు. అలాగే సెక్రెటరీగా ఎర్రం సురేష్‌, పిఈటి విజయ్‌ హై స్కూల్‌ను ఎన్నుకున్నారు. అలాగే వైస్‌ ప్రెసిడెంట్‌గా బాజాం రాజేశ్వర్‌, పిఈటి జెడ్‌పిహెచ్‌ఎస్‌ మామిడిపల్లిని జాయింట్‌ సెక్రటరీగా, బ్రిజేష్‌ రాజ్‌ పిఈటి క్షత్రియ కాలేజ్‌ను ఎన్నుకున్నారు. ట్రెజరర్‌గా కిరణ్‌ ...

Read More »

రాంపూర్‌లో పల్లె ప్రగతి

ఆర్మూర్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సమావేశానికి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డిఆర్‌డివో రమేష్‌ రాథోడ్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ శ్రీ రాములు పాల్గొన్నారు. గ్రామంలో జరిగిన పనుల గురించి తెలుసుకున్నారు. గ్రామంలో పచ్చదనం, పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త సేకరణ, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించు కోవాలని సూచించారు. గ్రామాభివద్ధికి విరాళం అందజేసిన దాతలను సన్మానించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న ...

Read More »

భీమ్‌గల్‌లో సిఐటియు ధర్నా

ఆర్మూర్‌, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సార్వత్రిక సమ్మెలో భాగంగా బుదవారం సీఐటీయూ ఆధ్వర్యంలో భీంగల్‌ పట్టణంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్‌, అంగన్‌వాడి యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు దేవగంగ, నాయకులు యమునా, జ్యోతి, ప్రమీల, భాగ్యలక్ష్మి, మున్సిపల్‌ నాయకులు గంగుబాయి, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read More »

జాతీయ గ్రీన్‌ కోర్‌ ఆద్వర్యంలో మొక్కలు నాటారు

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా వేల్పుర్‌ మండలంలో మంగళవారం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జాతీయ గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప తహశీల్దార్‌ రాజశేఖర్‌, పాఠశాల ఉపాధ్యాయులు, అటవీ శాఖ అధికారులు, పూర్వ విద్యార్థులు గిన్నిస్‌ బుక్‌ అవార్డు గ్రహీత యం.యస్‌ ఆచార్య, గంగాధర్‌ గౌడ్‌, రిటైర్డ్‌ టీచర్‌ మార్కండేయ సార్‌, తహశీల్దారు సతీష్‌ రెడ్డి, ప్రత్యేక అధికారి బి.రాజశేఖర్‌, యం.పి.పి బీమా జమున, రాజేందర్‌, యం.పి.టీ.సి మొండి మహేష్‌, ...

Read More »

అమెరికా యుద్దోన్మాద చర్యలను ఖండించాలి

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇరాన్‌పై అమెరికా యుద్దోన్మాద చర్యను ఖండిస్తూ న్యూడెమోక్రసీ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు దేవారాం, సీపీఎం కార్యదర్శి వెంకటేష్‌ మాట్లాడారు. ఇరాన్‌ సైనిక అధికారి సులేమాని పై డ్రోన్‌ ల దాడితో హతమార్చి మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వుతోందని, తద్వారా ప్రపంచ దేశాలను ముఖ్యంగా పేద, అభివద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి ...

Read More »

సార్వత్రిక సమ్మె జయప్రదంచేయాలని బైక్‌ ర్యాలీ

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న, సిఐటియు జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ఏఐటియుసి అధ్యక్షుడు ఆరేపల్లి సాయిలు, ఏఐకెఎంఎస్‌ దేవారాం, బీడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు సూర్యశివాజీ తదితర కార్మిక, విధ్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read More »