Breaking News

Arts & Music

సకల కళల నిలయం ఖిల్లా రఘునాథ ఆలయం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రఘునాథ ఆలయం సకల కళలకు నిలయమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి గురునాథం అన్నారు. గురువారం స్థానిక ఖిల్లా రఘునాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ఆలయాలు ఎంతో దోహదపడతాయని, దేవాలయాలు పురాతన చరిత్రకు సాక్ష్యాలని, ఖిల్లా రామాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఏకశిల రామ విగ్రహం తాబేలుపై ఉండడం విశేషమని ఆయన అన్నారు. అర్చకులు ...

Read More »

నల్లవాగు మత్తడిలోకి తగ్గని వరద

నిజాంసాగర్‌ రూరల్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్సింగ్‌రావుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోగల నల్లవాగు మత్తడిలోకి నీటి ఉధృతి భారీగా కొనసాగుతుంది. నల్లవాగు ఎగువ భాగంలోగల మెదక్‌ జిల్లాలోని కల్లేర్‌, కంతి మండలాల్లో భారీ వర్షాలకు నీటి ఉదృతి కొనసాగుతుంది. నాలుగు రోజులుగా వర్షాలు కురియడంతో నీటి ప్రవాహం అధికంగా రావడంతో మత్తడి పైనుంచి నీరు పొంగి పొర్లుతుంది. మత్తడి పూర్తిస్థాయిలో నీరు నిండి అదనంగా వస్తున్న నీరు మత్తడిపైనుంచి పొంగి పొర్లి గోదావరిలోకి వెళుతున్నాయి. కుడి, ఎడమ ...

Read More »

అలరించిన యువతరంగం సాంస్కృతిక పోటీలు

  కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన జిల్లా స్తాయి యువతరంగం సాంస్కృతిక పోటీలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతరంగం – 2015 పోటీల్లో విద్యార్థులు జానపద, శాస్త్రీయ, తదితర విభాగాల్లో ప్రదర్శనలు చేశారు. నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. విశేష ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్తాయికి ఎన్నుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మోరియా యూనుస్‌, కామారెడ్డి డిగ్రీ కళాశాల ...

Read More »

పాటతో తెలంగాణ బ్రతుకులకు భద్రత

  – ప్రొఫెసర్‌ తిరుమల్‌ రావు కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో పాట ప్రముఖ పాత్ర పోషించిందని తెలంగాణ సాధించుకున్న నేపథ్యంలో తెలంగాణ బతుకులకు భద్రత కావాలని అది పాట ద్వారా సాధ్యపడుతుందని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు తిరుమల్‌రావు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కర్షక్‌బిఇడి కళాశాలలో శుక్రవారం సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌ రచించిన ‘పాటకు సలాం’ ఆడియో సిడిని తిరుమల్‌రావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సామాజిక గేయాలు ఉన్న పాటకు సలాం సిడి ...

Read More »

29న కవిత్వ కళా శిబిరం – కవిసమ్మేళనం

  కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని కర్షక్‌ బిఇడి కళాశాలలో ఈనెల 29న కవిత్వ కళా శిబిరం – కవిసమ్మేళనం తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు తెరసం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం ఉంటుందన్నారు. తెలుగు కవిత్వం – వస్తు వైవిధ్యంపై డాక్టర్‌ నాళేశ్వరం శంకరం ప్రసంగిస్తారన్నారు. వచన కవిత – విభిన్న రూపాలపై డాక్టర్‌ నారాయణశర్మ, కవిత్వంలో పద్య, గేయ ...

Read More »

సాహితీ సర్జన్ ప్రతాపరెడ్డి

సంగిశెట్టి శ్రీనివాస్ తెంగాణలో అస్తిత్వవాదం వేళ్లూనుకోవడానికి ప్రధాన కారణం పాట. గద్దర్‌, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, అమర్‌, విమ మొదు వందలాది మంది వాగ్గేయకాయి పాట రూపంలో తెంగాణ భావజాల వ్యాప్తి చేసిండ్రు. అయితే ఈ పాటలు కైగట్టడానికి ముడిసరుకుని అందించింది విస్మరణకు, వివక్షకు గురైన విషయాలువెలుగులోకి తేవడంలో చాలా మంది చరిత్రకారులు, పరిశోధకులు కృషి చేసిండ్రు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె.శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు ఉద్యమ సందర్భంలో మెగులోకి తెచ్చిన విషయాలు, ఆంధ్రా కుహనా మేధావులు పత్రికల్లో నిత్యం కక్కే ...

Read More »

కళా నైపుణ్యాలు వెలికితీసేందుకే యువజనోత్సవాలు

  కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో మారుమూలన ఉన్న యువ కళాకారుల నైపుణ్యాలను వెలికితీసేందుకే యువజన ఉత్సవ పోటీలు నిర్వహిస్తున్నట్టు కర్షక్‌ బిఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ రషీద్‌ అన్నారు. పట్టణంలోని కర్సక్‌ బిఇడి కళాశాలలో మంగళవారం జిల్లా యువజన సంక్షేమశాఖ ఆద్వర్యంలో డివిజన్‌ స్థాయి యువజన ఉత్సవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రషీద్‌ మాట్లాడుతూ సాంస్కృతిక అంశాలతో ఉత్సాహవంతులైన కళాకారులను ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. వివిధ అంశాల్లో పోటీల్లో గెలుపొందినవారు జిల్లా స్తాయికి ఎంపికవుతారని ...

Read More »

జానపద గాయకుడు పాటమ్మ భిక్షపతి ఇక లేరు

పాటవిడిచి ఉండలేనంటూనే శాశ్వతంగా లోకాన్ని విడిచివెళ్లారు  తెలంగాణ ప్రజాగాయకుడు భిక్షపతి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భిక్షపతి నిన్నరాత్రి చనిపోయారు. తెలంగాణ ఉద్యమంలో రచయిత, గాయకుడిగా గుర్తింపు  పొందిన బిక్షపతి సొంతంగా రాసి, ఆలపించిన  పాడిన.. నిన్ను విడిచి ఉండలేనమ్మా పాట బాగా పాపులరయింది. విప్లవ ప్రజాఉద్యమాల్లోనూ భిక్షపతి పాల్గొన్నారు. గద్దర్, జయరాజ్ లతో కలిసి అనేక ప్రోగ్రామ్స్ ప్రదర్శనలిచ్చారు బిక్షపతి.  

Read More »

కనుమరుగవుతున్న కులవృత్తులు

  – రెడిమేడ్‌తో రోడ్డున పడుతున్న కళాకారులు – కులవృత్తులపై యంత్రాల దాడి – ఉపాధి కోసం ఊర్లు ఖాళీ – ప్రభుత్వ ఆదరణ కరవు – చేతిలో పనిలేక చిదిగిపోతున్న బతుకులు రెంజల్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులవృత్తులకు, కళాకారులకు ప్రసిద్ధిగాంచిన మనదేశంలో నేడు కులవృత్తులు కళాకారులు కరువై కనుమరుగైపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కులవృత్తులు మూలనపడ్డాయి. చేతిలో పనిలేక చిదిగిపోతున్న బతుకులు ఉపాధి కోసం కొందరు వలసబాట పడుతుండగా మరికొందరు స్థానికంగానే దినసరి కూలీలుగా ...

Read More »

కలకత్తా శిల్పి ఘర్‌ ఆధ్వర్యంలో మట్టి గణపతుల తయారీ

  కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలకత్తా శిల్పి ఘర్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో మట్టి గణపతులను రూపొందించి కలకత్తా కళాకారులు అందరిని ఆకర్షిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలకత్తాకు చెందిన కళాకారులు ఎలాంటి రసాయన పదార్థాలు, పిఓపి, రంగులు వినియోగించకుండా కలకత్తా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన మట్టితో భారీ గణేశ్‌ విగ్రహాలు రూపొందిస్తున్నారు. పీరూ భాయ్‌ అనే వ్యక్తి కలకత్తా శిల్పి ఘర్‌ నిర్వహిస్తున్నారు. విగ్రహాల తయారీలో నైపుణ్యం పొందిన కళాకారులు కేవలం మట్టితో వివిధ ఆకారాల్లో ...

Read More »