ఆర్మూర్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోనసీమను తలదన్నే విధంగా తెలంగాణలో నాట్లు పడుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్, ఏర్గట్ల, ముప్కాల్ మండలాల్లో పలు అభివద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. వెంకటాపూర్- రామన్నపేట మధ్య రూ. 6.65 కోట్లతో నిర్మించే పెద్ద వాగుపై చెక్ డ్యామ్ పనులకు శంకుస్థాపన, ఏర్గట్ల మండల కేంద్రంలో రూ. 22 లక్షల వ్యయం తో నిర్మించిన రైతు ...
Read More »అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో చపాతీలు, అన్నం పంపిణీ
బాల్కొండ, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనతా గ్యారేజ్ అంబేద్కర్ యూత్ బాల్కొండ మండలం ఆధ్వర్యంలో గురువారం బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్ద గంగారెడ్డి చేతుల మీదుగా ఐదు వందల మంది వలసకూలీలకు చపాతీలు, అన్నం ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనతా గ్యారేజ్ అంబేద్కర్ యూత్ సభ్యులు, బొట్టు వెంకటేష్, తాళ్ల వివేక్ తదితరులు పాల్గొన్నారు.
Read More »బైక్ దొంగల అరెస్టు
ముప్కాల్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 14వ తేదీ ఉదయం ముప్కాల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గ్రామంలోని గాంధీచౌక్ వద్ద మూడు పల్సర్ బైక్‌లపై వెళ్తున్న వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకున్నారు. వీరిలో ప్రశాంత్- అంకాపూర్, సందీప్-భీమ్‌గల్, రాము- మెట్పల్లి, రఘు -మెట్పల్లి, నషీద్-అంకాపూర్, అజయ్-భీమ్‌గల్, చరణ్-భీమ్‌గల్ అని ముప్కాల్ ఎస్ఐ రాజ్‌భరత్‌రెడ్డి తెలిపారు. వీరిని విచారించగా వారి వద్దనుంచి 24 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు. వాహనాలు అంకాపూర్, భీమ్‌గల్, మెట్‌పల్లికి ...
Read More »ప్రమాదం తెచ్చిన మార్పు
– బషీరాబాద్ గ్రామానికి మానవత్వమే రక్షణ కవచం – వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు అందిస్తున్న వైనం – కొత్త సంప్రదాయానికి నాంది పలికిన యువకులు నిజామాబాద్ టౌన్ (స్పెషల్ ఫీచర్ ), జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంచి మనసుల నుంచే మానవత్వం పరిమళిస్తుంది, ఆ పరిమళం చుట్టుపక్కల వారందరికి సువాసనను వెదజల్లుతుంది. ఇది ఓ సినీ కవి చెప్పిన మాట. ఇది నిజామాబాద్ జిల్లాలో కనిపించింది. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామం ఒక కొత్త ఆలోచనకు కార్యరూపం దాల్చింది. ...
Read More »అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డుకోవాలి
నిజామాబాద్ టౌన్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండల కేంద్రంలో ఆర్మూర్‌కు చెందిన రాజన్న, కొందరు గ్రామస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సర్పంచ్ గంగాధర్ కుమ్ముక్కై అక్రమ లేఅవుట్లను ప్రోత్సహిస్తున్నారని బాల్కొండకు చెందిన ఎం.డి.నయీమ్ ఆరోపించారు. సోమవారం ఈ విషయంపై ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాల్కొండ మండల కేంద్రంలో కొందరు వ్యక్తులు కుమ్ముక్కై అక్రమ లేఅవుట్లు వేసి పంచాయతీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని, ఎలాంటి టౌన్‌ప్లానింగ్ నియమాలు పాటించకుండా ...
Read More »వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజామాబాద్ టౌన్, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాల్కొండ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. మండల కేంద్రంతోపాటు కిసాన్ మార్కెట్ యార్డు రెండు కేంద్రాలను ఎంపిపి ఆరుగుల రాధ, పిఏసిఎస్ ఛైర్మన్ తూర్పురమేశ్, మండల తెరాస అధ్యక్షుడు దాసరి వెంకటేశ్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వారన్నారు. ...
Read More »సాగుభూములను వక్ప్ భూములుగా మార్చొద్దు
నిజామాబాద్ టౌన్, మార్చి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని సాగుభూములను వక్ప్ భూములుగా మారిస్తే సహించబోమని బల్కొండ మండల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాల్కొండ మండల కేంద్రంలో ఈ అంశంపై స్థానిక తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసిన అనంతరం రైతు ప్రతినిధులు మాట్లాడారు. గత 40 సంవత్సరాల నుండి తాము సాగు చేస్తున్న భూములను వక్ప్ బోర్డు భూములుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారని, అలా మారిస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారులు తమకు ఎలాంటి సమాచారం ...
Read More »ఘనంగా బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ టౌన్, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గానికి చెందిన తెరాస నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ వి.జి.గౌడ్ కూడా ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం రూరల్ నాయకులు రక్తదానం చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి మాట్లాడుతూ తన పుట్టినరోజు, సిఎం కెసిఆర్ పుట్టినరోజు ఒకేరోజు రావడం ...
Read More »7 గ్రామ పంచాయతి బిల్డింగ్ నిర్మాణాలను నిధులు మంజూరు
బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గానికి మరో 7 గ్రామ పంచాయతి బిల్డింగ్ నిర్మాణాలను నిధులు మంజూరు చేస్తూ జి.ఓ విడుదల చేసిన ప్రభుత్వం…ఒక్కో గ్రామ పంచాయతికి 13 లక్షల చొప్పున నిధుల కేటాయింపు..బాల్కొండ మండలం బోదెపల్లి శ్రీరాంపూర్ మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామాలకు భీంగల్ మండలంలో ముచ్కూర్ మెండోరా బాబాపూర్ గ్రామాలకు మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామానికి నిధులు మంజూరు…ఇప్పటి వరకు నియోజకవర్గంలో 33 గ్రామపంచాయతి బిల్డింగ్ లకు నిధులు మంజూరు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు..మోర్తాడ్ మండలంలో 8 గ్రామ పంచాయతిలు బాల్కొండ మండలంలో 3 ...
Read More »తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ
తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత ...
Read More »ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా సాగుతున్న హరితహారం
బాల్కొండ, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా సాగుతున్న హరితహారం హరితోత్సవమైందని బాల్కొండ ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్‌ఛైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలో హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొక్కలునాటి నీరుపోశారు. నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడంతో నాటిన మొక్కలు సంరక్షించితే భావితరాలకు ఉపయోగంగా ...
Read More »విద్యార్థులకు నోటుపుస్తకాల పంపిణీ
బాల్కొండ, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని బోదెపల్లి గ్రామంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గురువారం పాఠశాల విద్యార్థులకు నోటుపుస్తకాలు అందజేసినట్టు దాత నందకిషోర్ తెలిపారు. అంతేగాకుండా పెన్నులు, పలకలు, టిపిన్ బాక్సులను జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి చేతుల మీదుగా పంపినీ చేసినట్టు తెలిపారు. పంపిణీ చేయడానికి వస్తు సామగ్రిని విరాళంగా అందించిన దాత నందకిషోర్‌ను పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రధానోపాద్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Read More »చెట్లు లేకుంటే మనిషి మనుగడ ప్రశ్నార్థకం
బాల్కొండ, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండలో యువజన సంఘాల ఆద్వర్యంలో గురువారం హరితహారం పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్లే ప్రాణాధారమని, చెట్లు ఉంటేనే మనిషి మనుగడ అని లేకుంటే ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లావణ్య, విద్యాసాగర్, గంగాధర్, కో ఆప్షన్ సభ్యుడు షహీద్, అంబటి నవీన్, కిట్టు, అశోక్, ఎజాజ్, లక్ష్మినారాయణ తదితరులు ...
Read More »పోచంపాడ్‌లో హరితహారం
బాల్కొండ, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో అందరు భాగస్వాములు కావాలని పోచంపాడ్ సర్పంచ్ వాణి, రమేశ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం అంగన్వాడి ఆద్వర్యంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రం వద్ద మొక్కలు నాటి, వాటిని సంరక్షించేలా చూడాలన్నారు. అలాగే అంగన్వాడి పరిధిలోని వీధుల్లో కూడా అందరు మొక్కలు నాటేలా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ శోభారాణి, కార్యకర్తలు జ్యోతి, కమల, ...
Read More »జాతీయ విపత్తులు ధైర్యంగా ఎదుర్కోవాలి
బాల్కొండ, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ విపత్తు నిర్మూలన సంస్థ ఆద్వర్యంలో సోమవారం విద్యార్థులకు విపత్తులను ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. బాల్కొండ మండలం పోచంపాడ్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భూకంపాలు, వరదలు, రోడ్డు ప్రమాదాలు, తుఫాను తదితర సందర్భాలలో వచ్చే విపత్తులను ఎలా ఎదుర్కోవాలో యంత్రాల ద్వారా మొత్తం 20 అంశాలపై విద్యార్థులకు కళ్ళకు కట్టినట్టు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ పర్వత్లాల్, డిప్యూటి తహసీల్దార్ విజయ్, ...
Read More »ప్రమాదబీమా చెక్కు పంపిణీ
బాల్కొండ, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం బాదిత కుటుంబానికి ప్రమాదబీమా చెక్కు పంపిణీ చేశారు. బాల్కొండ సంఘ సభ్యుడు తోట చిన్న గంగారాం ప్రమాదవశాత్తు గతసంవత్సరం మే నెలలో మృతి చెందాడు. కాగా సహకార సంఘం తరఫున అద్యక్షుడు తూర్పు రమేశ్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల 50 వేల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు వేంపల్లి బాలరాజు, లింగన్న, మల్లయ్య, జక్క సాయన్న, ...
Read More »బాల్కొండ మండలంలో హరితహారం…
బాల్కొండ, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ సందర్బాన్ని పురస్కరించుకొని బాల్కొండ మండలంలోని పోలీసు స్టేషన్లో ఉపసర్పంచ్ లావణ్య, విద్యాసాగర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాల రాజేశ్వర్, సతీష్ మొక్కలు నాటి నీరుపోశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద మిషన్ భగీరథ వైస్‌ఛైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. అలాగే ...
Read More »బాల్కొండ నియోజకవర్గంలో 65వేల ఎకరాలకు సాగు నీరందించాలి
కమ్మర్పల్లి: బాల్కొండ నియోజకవర్గంలో 65వేల ఎకరాలు సాగులోకి వచ్చేలా అంచనాలు సిద్ధం చేయాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బాల్కొండ నియోజకవర్గంలోని ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ 21 పనుల పురోగతి, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం, గుత్ప ఎత్తిపోతల పథకం, నిజాంసాగర్ పాత కెనాల్ మరమ్మతుల గురించి బుధవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్లో గోదావరి బేసిన్ కమిషనర్ మధుసూదన్ రావు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 21 ద్వారా నియోజకవర్గంలోని వేల్పూర్, భీమ్‌గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్ ...
Read More »బాల్కొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే
మోర్తాడ్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిఎం కెసిఆర్ ఆశయాల మేరకు బాల్కొండ నియోజకవర్గాన్ని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదర్శంగా తీర్చుదిద్దుతున్నారని తెరాస రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మోర్తాడ్‌లో బిటి రోడ్డు నిర్మాణ పనులకు బూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మోర్తాడ్‌లోని ప్రధాన రోడ్లు, అన్ని వార్డుల్లో గల రోడ్లను కోటి రూపాయల వ్యయంతో తార్రోడ్లుగా తీర్చిదిద్దుతున్నారని ఆయన అన్నారు. ...
Read More »మక్కా సమీపంలో బాల్కొండ వాసి మృతి
బాల్కొండ : సౌదీలోని పవిత్ర మక్కా దర్శనానికి హజ్ (ఉమ్రా) యాత్రకు వెళ్లి అక్కడ అనారోగ్యంతో బాల్కొండకు చెందిన ఒకరు మృతి చెందారు. బాల్కొండ బస్టాండ్‌కు చెందిన ఓకే సైకిల్ టాక్సీ యాజమాని ఉస్మాన్(62) తన భార్యతో కలిసి మక్కా దర్శనానికి ఐదు రోజుల క్రితం వెళ్లాడు. మక్కాకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో జెద్దాలో తీవ్ర అస్వస్థతతో శనివారం సాయంత్రం మృతి చెందాడు. ఉస్మాన్ 40 ఏళ్లుగా తన వృత్తితో గ్రామస్తులతో ఆప్యాయంగా మెలిగేవాడని సన్నిహితులు తెలిపారు. కాగా మృతదేహాన్ని బాల్కొండకు తెప్పించేందుకు ...
Read More »