Breaking News

Banswada

సుభాష్‌రెడ్డి ఆర్థిక సాయం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజక వర్గం నాగిరెడ్డిపేట్‌ మండలం రామక్కపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన గణేష్‌ నిమజ్జనంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌తో బాలయ్య అనే యువకుడు మతి చెందిన విషయం తెలిసిందే. కాగా దాసరి బాలయ్య కుటుంబాన్ని సుభాష్‌రెడ్డి స్వచ్చంద సేవా సమితి ప్రతినిదులు పరామర్శించారు. వారికి ఇద్దరు పిల్లలు బీద కుటుంబం..ఆ ఇద్దరు పిల్లలు కూడా అంగవైకల్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసి కుటుంబానికి సుభాష్‌ రెడ్డి స్వచ్చంద సేవా సమితి ద్వారా రూ. 5 ...

Read More »

స్పీకర్‌ను కలిసిన యూనియన్‌ నాయకులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం అనుసంధాగా ఏర్పాటైన ది నిజామాబాద్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల యూనియన్‌ జిల్లా నాయకులు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని బాన్సువాడ స్వగహంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఉద్యోగుల ప్రమోషన్లు, సహకార వ్యవస్థలో రెండంచెల విధానాలపై వినతిపత్రం సమర్పించారు. రెండంచెల విధానం వల్ల ఇటు రైతులకు అలాగే ఉద్యోగులకు మేలు జరుగుతుందని వారు స్పీకర్‌కు వివరించారు. ఉద్యోగస్తుల వినతిపత్రాన్ని స్వీకరించిన ...

Read More »

సొంతింటి కల నిజం చేస్తాం

బాన్సువాడ, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ శివారులోని తాడ్కోల్‌ గ్రామం వద్ద రూ. 26.50 కోట్లతో అదనంగా నిర్మిస్తున్న 500 రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణానికి శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో దొంగలు, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లు ఇళ్ళు పంచుకుని దోచుకున్నారని, నా ప్రాణం పోయినా, ఎంత ఒత్తిడి వచ్చినా లొంగను, అలా జరగనివ్వనని పేర్కొన్నారు. అర్హులైన, నిజమైన ...

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన స్పీకర్‌

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఎస్‌సి బాలికల కాలేజి హాస్టల్‌ను తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అకస్మీకంగా తనిఖీ చేశారు. ఉదయం అల్పాహారం సమయంలో హాస్టల్‌కు వెళ్లిన స్పీకర్‌ విద్యార్ధినుల కోసం వండిన పదార్ధాలను పరిశీలించారు. మేను ప్రకారం గురువారం వండిన ఉప్మాను పరిశీలించిన స్పీకర్‌ అందులో వాడాల్సిన పప్పు దినుసులు లేకపోవడం, రుచిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంట్లో ఇలాగే వండుతారా, మీ పిల్లలకు ఇలాగే తినిపిస్తారా ...

Read More »

భావితరాల మేలు కోసం మొక్కలు

బాన్సువాడ, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యసభ సభ్యులు జె. సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ చాలంజ్‌ను స్వీకరిస్తూ బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో శనివారం దేశాయిపేట పిఏసిఎస్‌ అధ్యక్షులు, తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి మొక్కటు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ భావితరాల మేలుకోసం మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సమద్ధిగా వర్షాలు కురవాలన్నా, స్వచ్ఛమైన గాలి లభించాలన్నా మొక్కలను నాటాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు అవి ...

Read More »

వర్ని గురుకులం ప్రారంభం

బాన్సువాడ, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్నీ మండలం పాతవర్నీ గ్రామంలో ”మహాత్మ జ్యోతిబా పూలే బి.సీ వెల్ఫేర్‌ బాలికల గురుకుల పాఠశాలను” శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థులతో పోటీ పడే విదంగా నాణ్యమైన విద్యను అందించడమే గురుకుల పాఠశాలల ప్రధాన ఉద్యేశమని, గురుకులాలు పవిత్రమైనవని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల పిల్లలకు మెరుగైన విద్య కోసం తెలంగాణ రాష్ట్ర ...

Read More »

అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసరుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామ పరిదిలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ సోమలింగేశ్వర ఆలయం వద్ద రూ. 27 లక్షలతో నూతనంగా నిర్మాణం చేసిన కళ్యాణమండపం, రూ.10 లక్షలతో ఇతర వసతులు, రూ. 25 లక్షలతో మిషన్‌ భగీరధ పథకం ద్వారా మంచినీటి సౌకర్యాలను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు తెరాస నేతలు, అదికారులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి

బాన్సువాడ, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలో రాజీవ్‌ గాంధీ 75వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోటగిరి ఎంపిటిసి కొట్ట మనోహర్‌ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ చట్టం మరియు మున్సిపాలిటీ చట్టాలు చేసి వాటిల్లో 33 శాతం రిజర్వేషన్‌ మహిళలకు కల్పించడం వల్ల దాదాపు దేశంలోని స్థానిక సంస్థలలో ఉన్న ప్రజాప్రతినిధులుగా మహిళలు ఎన్నుకోబడ్డారన్నారు. ...

Read More »

శరవేగంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం

బాన్సువాడ, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఎస్‌సి కాలనీలో నూతనంగా నిర్మించిన 40 రెండు పడక గదుల ఇళ్లను శనివారం రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించి, లబ్ధిదారుల ఇళ్ళలో పాలు పొంగించి గహప్రవేశం చేయించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం సాగుతోందని, ఇళ్ళు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల నెరవేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని స్పీకర్‌ అన్నారు. వంద ...

Read More »

రక్తనిది కేంద్రభవనాన్ని ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో రక్తనిది కేంద్ర భవనాన్ని తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Read More »

గ్రంథాలయం ప్రారంభం

బాన్సువాడ, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశాయిపేట్‌ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర యువనాయకులు దేశాయిపేట్‌ పిఏసిఎస్‌ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింతగా అభివద్ధి చేసుకుందామని బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టిందని, ప్రతీ గ్రామంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలో యువకుల, విద్యార్థుల, పోటీ పరీక్షల నిమిత్తం గ్రంధాలయాన్ని ప్రారంభించారు. గ్రామంలో ...

Read More »

తెలంగాణకు హరితహారం

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించనున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి మహిళ హాస్టళ్ల స్థలాన్ని తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం హరితహారంలో బాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. తెలంగాణకు హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మారుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, నాయకులు ఉన్నారు.

Read More »

ఇంటింటికి కాంగ్రెస్‌

బాన్సువాడ, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఆదేశానుసారం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి కాంగ్రెస్‌, వాడ వాడ కాంగ్రెస్‌ జెండా కార్యక్రమం నిర్వహించనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో శనివారం నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని రాజీవ్‌ గాంధీ చౌరస్తా వద్ద జెండా ఎగురవేసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కాసుల బాలరాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ స్థాయికి అభివద్ధి చెందినా, సౌకర్యాలు మాత్రం ...

Read More »

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

బాన్సువాడ, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్‌ మండలం నమ్లి గ్రామంలో గురువారం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోటి 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను సభాపతి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాలలో అటల్‌ తింకరి ల్యాబును ప్రారంభించారు. నమ్లి పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని వెల్లడించారు. గ్రామస్తుల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే ...

Read More »

మంత్రిని పరామర్శించిన శాసనసభాపతి

బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. మంత్రి మాతృమూర్తి తారకమ్మ ఇటీవల స్వర్గస్తులయ్యారు. దీంతో బుధవారం ఆనయ మంత్రి ఇంటికి వెళ్ళి పరామర్శించి తారకమ్మ చిత్రపటం ముందు శ్రద్దాంజలి ఘటించారు.

Read More »

పింఛన్లు పంపిణీ

బాన్సువాడ, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పింఛన్లు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 బాన్సువాడ పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు.

Read More »

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

బాన్సువాడ, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం ప్రకారం … రుద్రూర్‌ అంగడి బజార్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్న దండు శ్రీను (30) ఇంట్లో ఉరివేసుకుని మతి చెందినట్టు తెలిపారు. తరచు దంపతుల మధ్య గొడవల మూలంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. మృతునికి భార్య సావిత్రి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సురేష్‌ ...

Read More »

బోనమెత్తిన స్పీకర్‌

బాన్సువాడ, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో నూతనంగా నిర్మించిన కనకదుర్గ ఆలయంలో బోనాల ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయం ఇటీవలే నిర్మించి ప్రారంభించారు. కాగా ఆదివారం కాలనీవాసులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో బోనాల పండగ నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బోనమెత్తి అమ్మవారికి సమర్పించారు. మహిళలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ పూజారి భాస్కర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Read More »

6న చెక్కుల పంపిణీ

బాన్సువాడ, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాన్సువాడ ఎంపిడివో కార్యాలయంలో బాన్సువాడ, బీర్కూర్‌కు సంబంధించిన లబ్దిదారులకు షాదీముబారక్‌, కళ్యాణలక్ష్మి చెక్కులను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్టు వారు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి లబ్దిదారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.

Read More »

మొక్కలు నాటిన స్పీకర్‌

బాన్సువాడ, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పచ్చదనం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. హరితహారంలో భాగంగా శుక్రవారం ఆయన బాన్సువాడ మండలంలోని బోర్లం గురుకుల పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ ఖాళీ స్థలాల్లో చెట్ల పెంపకం చేపట్టాలని సూచించారు. చేల్ల గట్లపై అరుదైన మొక్కలు నాటడం వల్ల భవిష్యత్తులో రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని సూచించారు. పచ్చదనం వల్ల సకాలంలో ...

Read More »