Breaking News

Basar

వసంత పంచమి, శ్రీ పంచమి

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతాయని హేమాద్రి తెలిపారు. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. ‘మాఘ శుద్ధ ...

Read More »

బాసరలో భారతమాత మహాహారతి

బాసర, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26వ తేదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాసర గోదావరి నదీ తీరంలో భారతమాత మహాహారతి నిర్వహిస్తున్నట్టు వేదభారతి పీఠం నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి హారతి ఉంటుందన్నారు. కార్యక్రమంలో చతుర్ధశభువనహారతులు, భారతమాతహారతి, త్రివర్ణపతాకహారతి, చతుర్వేదహారతి, గోప్రకతిహారతి, మహనీయులహారతి, నక్షత్రహారతి, కుంభహారతి, పుష్పహారతి, నాగహారతి, గుగ్గిలధూపహారతి యివ్వబడుతుందన్నారు. కావున భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని భారతమాత, గంగామాత అనుగ్రహం పొందగలరని పేర్కొన్నారు.

Read More »

26న సూర్యగ్రహణం

బాసర, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26వ తేదీన సూర్యగ్రహణం సందర్భంగా 25వ తేదీ సాయంత్రం 6.15 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారి ఆలయ ద్వారాలు మూసి ఉంచబడతాయని కార్యనిర్వహణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి 26న ఉదయం 11.30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, అమ్మవార్లకు అభిషేకం, హారతి, తీర్థప్రసాద వితరణ, సర్వదర్శనము, ఆర్జిత సేవలు, అక్షరాభ్యాసములు యధావిధిగా ...

Read More »

బాసర సరస్వతి ఆలయంలో మరో ఆపచారం

బాసర, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో మరో ఆపచారం చోటుచేసుకుంది. అమ్మవారి కిరీటంలోని వజ్రం మాయమైంది. అమ్మవారికి రోజువారి పూజాకార్యక్రమాల సమయంలో వజ్రం రాలిపోయి ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అయితే వజ్రం విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. విషయం బయటకు పొక్కడంతో విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అధికారులు గోప్యంగా ఉంచడంపై భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వజ్రం మాయం కావడంపై మండిపడుతున్నారు. అధికారుల తీరును భక్తులు తప్పుబడుతున్నారు.

Read More »

బాసర అమ్మవారి కెంప్‌ గల్లంతుపై విచారణకు ఆదేశించిన మంత్రి

బాసర, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర సరస్వతి అమ్మవారి బంగారు కీరిటంలో కెంపు గల్లంతు వ్యవహారంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భాద్యులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. అమ్మవారి కీరిటంలోని నవరాత్నాల్లోని ఒక కెంపు గల్లంతైనట్లు తమ దష్టికి వచ్చిందని ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు.

Read More »

జైరెడ్డిఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అమరులకు నివాళులు

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర పుణ్యక్షేత్రంలో పవిత్ర గోదావరి నది తీరాన అమర జవానులకు నివాళులు అర్పించి వారి అత్మకు శాంతి చేకూరాలని మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కార్యక్రమంలో వ్యస్థాపక అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి, జాతీయ అధ్యక్షుడు ఎడ్ల ఉప్పల్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పోరెడ్డి శాంతన్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సరసాని సురేందర్‌ రెడ్డి, మహిపాల్‌ రెడ్డి, హోన్నజీపేట్‌ సురేందర్‌ రెడ్డి, రాజారెడ్డి, మహేందర్‌ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Read More »

ఆదుకోండి మహాప్రభో

బాసర, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన షెల్కే నాగనాథ్‌ ఎస్‌సి కులస్తుడు. వ్యవసాయ పనిమనిషిగా గత 6 సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన కుర్మె మల్లు వద్ద పని చేస్తున్నాడు. భార్య సంధ్యా. 15 రోజుల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో 9వ తేదీ శనివారం రాత్రి యజమాని ఆదేశానుసారం రోజులాగే పంట కాపలా కోసం వెళ్లి అడివి పందులు రాకుండా టపకాయలు పేల్చడంతో ప్రమాదవశాత్తు అతని శరీరం మొత్తం ...

Read More »

మహిళ ఆత్మహత్య

బాసర, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర పుణ్య క్షేత్రం బాసర లో గురువారం విషాదం చోటుచేసుకుంది. గోదావరి నది వంతెనపై నుంచి గుర్తు తెలియని మహిళ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు నదీతీరంలో శవం తెలియాడుతున్న విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాసర ఎస్‌ఐ మహేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని, గజ ఈతగళ్ళ సహాయంతో శవాన్ని బయటకు తీయించారు. మృతురాలి వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నామని ,బహుశ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ అయి వుంటుందని ...

Read More »

సరస్వతి ఆలయంలో గురుపౌర్ణమి పూజలు

బాసర, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర శ్రీజ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో గురువారం వ్యాసపౌర్ణమి, గురుపౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు స్థాపిత దేవతా హవనములు, అరుణ, చండి హోమములు తదితర పూజలు చేశారు. ఇందులో ఆలయ ప్రత్యేకాధికారి అన్నాడి సుధాకర్‌రెడ్డి, వేద పండితులు నందకిషోర్‌, నవీన్‌శర్మ, దామోదర్‌, రాందాసి, పూజారులు శ్రీపద్‌ దీక్షిత్‌, అనిల్‌కుమార్‌, ప్రణవ్‌ శర్మ, అంకుష్‌ శ్రోతి, మురళి శ్రోతి పాల్గొన్నారు.

Read More »

బాసర అమ్మవారి హుండీ లెక్కింపు

నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ జిల్లా బాసర చదువులతల్లి శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి హుండీ కానుకలను మంగళవారం ఆలయ అధికారుల సమక్షంలో సిబ్బంది లెక్కించారు. 34 రోజుల్లో సమకూరిన మొత్తంలో రూ. 39 లక్షల 61 వేల 235 నగదు, 72 గ్రాముల బంగారం, ఒక కిలో 420 గ్రాముల వెండితోపాటు 17 వివిధ దేశాల కరెన్సీ ఉన్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

Read More »

భైంసా హత్య కేసులో పురోగతి

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో రెండ్రోజుల క్రితం జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం భైంసా డిఎస్‌పి అందె రాములు మీడియాకు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్‌ లోని సహన్‌పూర్‌కు చెందిన మహ్మద్‌ ఇస్తర్‌ బతుకుదెరువుకోసం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో వస్త్ర వ్యాపారం చేస్తు ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు నిర్మల్‌ జిల్లాలో పలు పట్టణాల్లో, మండల కేంద్రాల్లో రిటైల్‌ వ్యాపారం చేస్తున్నాడు. గత మూడురోజులుగా ...

Read More »

బాసరకు పాదయాత్ర

  బీర్కూర్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సరస్వతిదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని బీర్కూర్‌ గ్రామం నుంచి బాసర వరకు సరస్వతి స్వాములు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గురుస్వామి సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున సరస్వతి దేవి దర్శనం కోసం బీర్కూర్‌ గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాదయాత్ర ద్వారా వెళ్తామని అన్నారు. సుమారు 75 కి.మీల పాదయాత్ర అమ్మవారి నామస్మరణ, భజన పాటలతో కొనసాగుతుందని పేర్కొన్నారు. అవసరమగు సదుపాయాలు ...

Read More »

24న గోదావరి నదీతీరంలో వేద వైజయంతి ఉత్సవాలు

  బాసర, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెలరోజులుగా బాసర గోదావరి నదీ తీరంలో వేదభారతి పీఠం ఆద్వర్యంలో గంగాహారతి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డిసెంబరు 24న సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వేద వైజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. వేదపారాయణం, హోమం, పూజా, వేద గంగాహారతి రిషి కన్నెలచే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Read More »

బాసర సరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు

  బాసర, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ జ్ఞానసరస్వతి దేవి దేవస్థానం బాసర అమ్మవారి 40 రోజుల హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ అధికారులు లెక్కించి వివరాలు వెల్లడించారు. 40 రోజుల ఆదాయం రూ. 43 లక్షల 671, విదేశీ కరెన్సీలు 20, మిశ్రమ బంగారం 107 గ్రాముల 400 మి. గ్రాములు, అదేవిధంగా వెండి 2 కిలోల 370 గ్రాములు వచ్చినట్టు కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఆదిలాబాద్‌ ఇన్స్‌పెక్టర్‌ రాజమౌళి, ...

Read More »

బాసర ఆలయంలో హుండీ లెక్కింపు

  బాసర, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆలయ హుండీ లెక్కించారు. 40 రోజుల హుండీ ఆదాయం 41 లక్షల 64 వేల 990 రూపాయలు వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అలాగే మిశ్రమ బంగారం 60 గ్రాముల 710 మిల్లీ గ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 300 గ్రాములు, విదేశీ కరెన్సీ48 డాలర్లు, చెల్లని పాత 1000 రూపాయల నోట్లు 15, పాత 500 నోట్లు 84 వచ్చినట్టు పేర్కొన్నారు.

Read More »

అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు…

  బాసర, డిసెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి వచ్చిన 28 రోజుల ఆదాయాన్ని బుధవారం ఆలయంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఇవో వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. లెక్కింపులో నగదు రూ. 27 లక్షల 34 వేల 408, బంగారం 35 గ్రా. 500 మి. గ్రాములు, వెండి 2 కిలోల 96 గ్రాముల 400 మి. గ్రాములు, విదేశీ కరెన్సీ 64 ఆదాయం సమకూరినట్టు పేర్కొన్నారు.

Read More »

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న రాధాకృష్ణ మహరాజ్‌

  బాసర, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ స్వామిజీ రాదాకృష్ణ మహారాజ్‌ శనివారం బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజస్థాన్‌ నుంచి తన శిష్యబృందంతో విచ్చేసిన స్వామిజీ స్థానిక మంగిరాములు మహారాజ్‌ ఆశ్రమం పక్కన మరో ఆశ్రమం ఏర్పాటు చేశారు. రాజస్తాన్‌లో సుమారు 2 లక్షల గోవుల సంరక్షణ చేస్తున్నామని, బాసరలో కూడా గోవులను పెంచే యోచనలో ఉన్నట్టు తెలిపారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గోదావరి నది ప్రవాహం, ఇక్కడి స్వచ్చమైన వాతావరణం ...

Read More »

అమ్మవారిని దర్శించుకున్న మేడారం ఏసి అశోక్‌

  బాసర, అక్టోబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో ఏఇవోగా బాధ్యతలు నిర్వహించిన అశోక్‌ ప్రస్తుతం మేడారం ఏసిగా విదులు నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం బాసర ఆలయ ఇవో వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ఆయన విచ్చేసి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారి తీర్థ, ప్రసాదాలు, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఇవో వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ సాయిలు, ఇతర అధికారులున్నారు.

Read More »

బాసరలో హరితహారం

  బాసర, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర గోదావరి నది ఒడ్డున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆయన సతీమణితో కలిసి ఆదివారం హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరుపోశారు. మొక్కలు ఉంటేక్షేమమని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముదోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సర్పంచ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

  బాసర, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాసర గోదావరి నదిలో గురువారం ఓ వ్యక్తి శవాన్ని గుర్తించారు. బాసర గ్రామానికి చెందిన ఉద్గెర సాయిలు (24) గా గుర్తించారు. అప్పుడప్పుడు కుటుంబ కలహాలు జరిగేవని ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్‌ఐ మనోహర్‌ తెలిపారు.

Read More »