Breaking News

Bheemghal

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నాం

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ భీమ్‌గల్‌లో పర్యటించి మునిసిపల్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారులు, ఇతర అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రంగా ఎంపిక చేసిన జూనియర్‌ కళాశాలలో పర్యటించి పరిశీలించారు. ఇక్కడ కౌంటింగ్‌ హాల్స్‌ స్ట్రాంగ్‌ రూముల ప్రణాళికను పరిశీలించారు. రిటర్నింగ్‌ అధికారులతో మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌, ఓటర్‌ స్లిప్పులు పంపిణీకి మొదటి ...

Read More »

పోటీలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

ఆర్మూర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలో గల భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాలలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాశాల విద్యార్థులు 50 మంది పోటీలో పాల్గొని వివిధ కళారీతులను గుర్తుచేస్తు రంగు రంగుల ముగ్గులను అలంకరించారు. దేశ రాష్ట్ర, సంస్కతులతో పాటు దేశరక్షణకు నిరంతరం కషి చేస్తున్న సైనికుల త్యాగాలు గుర్తుకు తెచ్చే విదంగా ముగ్గులు వేశారు. వినూత్న రీతిలో ఎక్కడ నిర్వహించని 9 రకాల ఆటలే ...

Read More »

రోడ్డు భద్రతపై అవగాహన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఈనెల 11వ తేదీన భీంగల్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి డి.వి.రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భీమ్‌గల్‌ పట్టణంలో కళాశాల, పాఠశాలల విద్యార్థులచే ర్యాలీ, వాహన చోదకులకు అవగాహన సమావేశం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Read More »

ఎస్సీ వర్గీకరణ సాధనే అమరులకు నిజనివాళి

  భీమ్‌గల్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 1వ తేదీ మాదిగ అమరవీరుల దినం సందర్భంగా భీమ్‌గల్‌ మండలంలోని ఛేంగల్‌ గ్రామంలో సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంఎస్‌ఎఫ్‌ మండల ఇన్‌చార్జి దూమల మహేశ్వర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఛేంగల్‌ గ్రామ అధ్యక్షుడు గుమ్మెర్ల శ్రీధర్‌ అమరవీరుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దత సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో 18 మంది మాదిగ పౌరులు ప్రాణత్యాగంచేశారన్నారు. జాతికోసం వారు చేసిన ...

Read More »

ఉన్నత శిఖరాలకు మొదటి అడుగు 10వ తరగతి

  భీమ్‌గల్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని రానున్న బోర్డ్‌ ఎగ్జామ్స్‌ బాగా రాసి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని బీమ్‌గల్‌కు చెందిన న్యూ ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు తెలిపారు. ఈ మేరకు బుధవరం యూత్‌ ఆధ్వర్యంలో 117 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. భవిష్యత్తు జీవితంలో ఎటువంటి విజయాలు, లక్ష్యాలు సాధించాలన్నా 10వ తరగతి మొదటి మెట్టు అని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ...

Read More »

ప్రయోగ పరీక్ష కేంద్రాల పరిశీలన

  భీమ్‌గల్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీసరస్వతి జూనియర్‌ కళాశాల, భీమ్‌గల్‌లో ప్రయోగ పరీక్ష కేంద్రాన్ని సోమవారం ఇంటర్మీడియట్‌ విద్య జిల్లా శాఖాధికారి దాసరి ఒడ్డెన్న పరిశీలించారు. ప్రయోగశాలల్లో పరికరాలు, విద్యార్థులకు తాగునీరు, విద్యుత్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. పకడ్బందీగా ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, డిఓ యగ్నేశ్‌, ప్రిన్సిపాల్‌ జగదీశ్‌ ఉన్నారు.

Read More »

బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలి

  భీమ్‌గల్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నోట్ల రద్దువల్ల బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తున్న బ్యాంకు అధికారులపై జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని ఏబివిపి నియోజకవర్గ బాగ్‌ కన్వీనర్‌ జక్కుల కార్తీక్‌ అన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. పెద్ద నోట్ల రద్దువల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినా, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సిబ్బంది అవేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. గంటల తరబడి క్యూలో నిలబడిన ప్రజలపై ...

Read More »

భీమ్‌గల్‌లో వివేకానంద జయంతి

  భీమ్‌గల్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బస్టాండ్‌లో యువజన సంఘాల సమితి, న్యూఫ్రెండ్స్‌ యూత్‌ యువజన సంఘం సంయుక్తంగా గురువారం స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ యువత వివేకుని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారతీయ ధర్మశాస్త్రాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వివేకానంద అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, యువజన సంఘం అధ్యక్షుడు రావుట్ల అరవింద్‌, నవీన్‌, కంకణాల ...

Read More »

బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించాలి

  భీమ్‌గల్‌, అక్టోబరు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాబాపూర్‌ గ్రామ సంఘం పరిధిలో బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు నెలనెల చెల్లించి వడ్డిలేని రుణం పొందాలని ఐకెపి, టి సెర్ప్‌ అధికారి బి.శ్రీనివాస్‌, బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ సతీష్‌రెడ్డి, సర్పంచ్‌ పాతెరు అప్సర్‌ సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సంఘం సభ్యులు, ఐకెపి, ఎస్‌బిహెచ్‌ అధికారులు బాబాపూర్‌ బాబాపూర్‌ గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించాలని తద్వారా ప్రభుత్వం ఇచ్చే స్త్రీనిది రుణాలు, బ్యాంకు రుణాలు వడ్డి ...

Read More »

నలంద డిగ్రీ కాలేజ్‌లో బతుకమ్మ సంబరాలు

  భీమ్‌గల్‌, అక్టోబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌లోని నలంద డిగ్రీ కళాశాలలో బుదవారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. అందంగా పేర్చిన రంగు రంగులతో కూడిన బతుకమ్మలను కళాశాల ఆవరణలో ఉంచి బతుకమ్మలు ఆడారు. అనంతరం చేతబూని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఎంతోఅభినందనీయమన్నారు. వేడుకల్లో అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సురేఖ, అధ్యాపకులు జ్యోతి, కె.గోదావరి, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఎంసెట్‌-2 కుంభకోణం గోడప్రతుల ఆవిష్కరణ

భీమ్‌గల్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో ఏబివిపి ఆధ్వర్యంలో గురువారం ఎంసెట్‌-2 కుంభకోణం, దోషులెవరు… శిక్షెవరికి అనే గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు, ఎంసెట్‌-2 విద్యార్థుల జీవితాల మనోభావాలు దెబ్బతీసిన నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సిబిఐ ద్వారా విచారణ జరిపించి వెంటనే అసలు సూత్రధారులను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Read More »

భీమ్‌గల్‌లో ఏబివిపి బంద్‌ విజయవంతం

  భీమ్‌గల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌లో ఏబివిపి తలపెట్టిన బంద్‌ మంగళవారం విజయవంతమైందని జక్కుల కార్తీక్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లుతెరిచి విద్యార్థులకు కనీస వసతులు కల్పించి, వారి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అఖిల్‌, అజయ్‌బాబు, ప్రదీప్‌ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

Read More »

ప్రభుత్వ వసతి గృహాన్ని సద్వినియోగం చేసుకోండి

  భీమ్‌గల్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని బిసి వసతి గృహంలో 44 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏబివిపి నియోజకవర్గ కన్వీనర్‌ జక్కుల కార్తీక్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడారు. వసతి గృహ వార్డెన్‌ లక్ష్మణ్‌ను సంప్రదించగా 100 సీట్లకుగాను ప్రస్తుతం 56 మంది విద్యార్తులు ఉంటున్నారని మిగతా 44 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారని అన్నారు. ఖాళీగా ఉన్న సీట్లు బిసి, ఎస్‌సి విద్యార్థులు ...

Read More »

మండలంలో హరితహారం

  భీమ్‌గల్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బడాభీమ్‌గల్‌లో మంగళవారం హరితహారం కార్యక్రమాన్ని ప్రత్యేకాధికారి శృతి నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలన్నారు. కార్యక్రమంలో విఆర్వో లింగం, మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని గోన్‌గుప్పుల గ్రామం గ్రామ పంచాయతీలో మంగళవారం పీఆర్‌ఏఈ రాజేశ్వర్‌, గ్రామ సర్పంచ్‌ కొమ్ము నరేశ్‌ హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఏ కృష్ణవేణి, స్వామినాయక్‌, ఎఫ్‌ఏ స్వప్న, విఆర్‌ఏ ప్రతిభజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Read More »

14న విద్యాసంస్థల బంద్‌ విజయవంతం చేయండి

  భీమ్‌గల్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందున అందుకు నిరసనగా ఈనెల 14న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు పిడిఎస్‌యు భీమ్‌గల్‌ ఏరియా ప్రధాన కార్యదర్శి స్టాలిన్‌ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. విద్యాసంస్థల బంద్‌ గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైకరి వల్ల విద్యావిధానం వ్యాపారంగా మారిందన్నారు. సామాన్య ప్రజల పిల్లలకు అందుబాటులో లేకుండా పోయిందని, విద్యా పరిరక్షణకు పోరాటమే శరణ్యమని ...

Read More »

ఘనంగా ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం

  భీమ్‌గల్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ భీమ్‌గల్‌ శాఖ ఆధ్వర్యంలో 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ లక్ష్మణ్‌ పాల్గొని ఎస్సీ, బిసి వసతి గృహంలో మొక్కలు నాటి నీరుపోశారు. జిల్లా కో కన్వీనర్‌ రాకేశ్‌ మాట్లాడుతూ ఏబివిపి 1949 జూలై 19వ తేదీన ఢిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ లో 10 మంది విద్యార్థులతో ప్రారంభమై దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగిందని వివరించారు. ఏబివిపి విద్యారంగ సమస్యలపై ...

Read More »

మెండోరా గ్రామ పంచాయతీలో హరితహారం

  భీమ్‌గల్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండలం మెండోరా గ్రామ పంచాయతీలో శుక్రవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సర్పంచ్‌ కమల దీప్సన్‌, ఎంపిటిసి అరె లావణ్య, రవిందర్‌ మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటె కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి కనీసం ఒక్క మొక్కనైనా నాటాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ గాజరి లింబాద్రి, వార్డు మెంబరు పొన్నం శ్రీనివాస్‌, కల్లడ రవి, బర్ల రమేశ్‌, ...

Read More »

హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

  భీమ్‌గల్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిఎస్‌పి ఆకుల రాంరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పాత బస్టాండ్‌ ఆవరణలో జరిగిన హరితహారం కార్యక్రమంలో భీమ్‌గల్‌ సిఐ రమణారెడ్డి, ఎస్‌ఐ సురేందర్‌రెడ్డి, గోదావరి ఇతర అధికారులతో కలిసి మొక్కలునాటారు. ఈసందర్భంగా డిఎస్‌పి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో ఇంటింటికి మొక్కలు నాటాలన్నారు. అంతేగాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రజలు స్వచ్చందంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్టు ...

Read More »

తాగునీటి సమస్య పరిష్కరిస్తాం

  నిజాంసాగర్‌ రూరల్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు బంజేపల్లి గ్రామ సర్పంచ్‌ బేగరి రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని సుల్తాన్‌నగర్‌గ్రామంలో సర్పంచ్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు మహ్మద్‌ హైమద్‌ హుస్సేన్‌ కలిసి వ్యవసాయ బోరుబావిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంజీరవాగు ఓపెన్‌వాల్‌ ద్వారా పైప్‌లైన్‌తో వాటర్‌ ట్యాంకులో నింపి సరఫరా చేసేవారు. మంజీర వాగు నీరు పూర్తిగా అడుగంటడంతో ...

Read More »

కరువు పరిస్థితులకు ప్రజలే కారణం

భీమ్‌గల్ : కరువు పరిస్థితులకు ప్రజలే కారణమని కలెక్టర్ యోగితారాణా అన్నారు. మంగళవా రం భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో పౌ రహక్కులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఇష్టారాజ్యంగా అడవులను నరికివేయడం, జల వనరులను సంరక్షించకపోవడమే ఇందుకు కారణమని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చూసైనా ప్రజలు కళ్లు తెరవాలని తెలిపారు. గ్రామానికి మరుగుదొడ్లు మం జూరు చేసినా నిర్మించుకునేందుకు ప్రజలు ముం దుకు రాకపోవడం దారుణమన్నారు. గ్రామ పం చాయతీలో రూ.32లక్షల నిధులు ఉన్నాయని, వాటితో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి ...

Read More »