Breaking News

Bheemghal

విద్యుత్‌ షాక్‌తో వృద్దుడు మృతి

  భీమ్‌గల్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ గ్రామంలో పనిచేస్తున్న సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన అట్టిమల్లు నడిపి రాజయ్య (55) అనే వ్యక్తి వాటర్‌ ట్యాంకర్‌ నుంచి నీటిని మోటారు ద్వారా ఖాళీ చేస్తుండగా విద్యుత్‌సాక్‌ తగిలి మృతి చెందినట్టు ఎస్‌ఐ సుకేందర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం భీమ్‌గల్‌లోని మేళ్ల శంకర్‌ వాటర్‌ ప్లాంట్‌లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ట్యాంకర్‌ నుంచి నీటిని ఖాళీ చేస్తుండగా మోటారు వైరు తెగి ...

Read More »

ముచ్కూర్‌లో దాహం.. దాహం

భీమ్‌గల్ : మండలంలోని ముచ్కూర్ గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడు గంటి పోయాయి. భూగర్బ జలాలు ఏరోజు కారోజు మరింత పాతాలానికి చేరుకుంటున్నాయి. బోరుబావులు ఎత్తి పోవడం తో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. మండలంలోని ముచ్కూ ర్ గ్రామంలో పరిస్థితి దారుణంగా ఉంది. గ్రామంలో జనాభా కు అనుగుణంగా వేయించిన ఎనిమిది చేతిపంపులు ఉండగా అందులో కేవలం మూడు మాత్రమే పని చేస్తున్నాయి. గ్రా మంలో నాలుగు ...

Read More »

ఆల్ ఇండియా క్యారం పోటీల్లో దీక్షితకు ప్రథమ స్థానం

భీమ్‌గల్ : ఆల్ ఇండియా అండర్ -21 క్యారం పోటీల్లో మండల కేంద్రానికి చెందిన కేసరి దీక్షిత ప్రథమ స్థానం సాధించింది. గత నెల 31 నుంచి గుజరాత్‌లోని వడోదరలో సాగుతున్న ఆల్ ఇండియా క్యారం పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి భీమ్‌గల్‌కు చెందిన కేసరి దీక్షిత వెళ్లింది. శుక్రవారం నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న దీక్షిత ప్రథమ స్థానం సాధించగా కేరళకు చెందిన మరో యువతి ద్వితీయ స్థానంలో నిలిచింది. దీక్షిత మహబూబ్‌నగర్‌లోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తృతీ య సంవత్సరం చదువుతోంది. దీక్షిత ...

Read More »

బాలికపై లైంగిక దాడి

భీమ్‌గల్: మండల కేంద్రానికి చెందిన ఐదేళ్ల బాలికపై లైంగికదాడి జరిగినట్లు భీమ్‌గల్ సీఐ పాలగొల్లు రమణారెడ్డి శుక్రవారం తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ వివరించారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు.. మోర్తాడ్‌లో బాలిక అమ్మమ్మ వద్ద అనాథ యువకుడు రాజు ఉంటున్నాడు. బాలిక కుటుంబీకులతో ఉన్న పరిచయంతో ఈనెల 13న భీమ్‌గల్ వచ్చిన రాజు బాలికకు చాక్లెట్ కొస్తానని చెప్పి బ్రహ్మంగారి గుట్ట వెనుకవైపు తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. గురువారం బాలిక కుటుంబీకుల ఫిర్యాదు ...

Read More »

తాగునీరు లేక అల్లాడుతున్న ప్రజలు

  భీమ్‌గల్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో బోర్లు ఎత్తిపోయి తాగునీరు లేకప్రజలు అల్లాడుతున్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా భూగర్భ జలాలు అడుగంటడంతో ఆయా గ్రామాల్లో బోర్లు పూర్తిగా ఎత్తిపోయాయి. తాగునీరు దొరకక ప్రజలు నానా ఇబ్బందుల పాలవుతున్నారు. లింగాపూర్‌, పురాణిపేట్‌, చేంగల్‌, భీంగల్‌లలో తాగునీటి కొరత ఉండడం వలన నివాస ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దూర ప్రాంతాలకెళ్ళి నీటిని తెచ్చుకోవడం జరుగుతుంది. పాలకులు పట్టింపులేనట్టు వ్యవహరించడంతో ప్రజలకు నీటి కస్టాలు తప్పడం లేదని పలువురు ...

Read More »

బ్యాంకు అధికారులమని చెప్పి ఆన్‌లైన్ మోసం

భీమ్‌గల్ : హలో.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. ఒక్క సారి మీ ఏటీఎం పిన్ నంబర్ చెపుతా రా.. మీ బ్యాంకు ఖాతా వివరాలు సరి చేయాల్సి ఉంది. లేకుంటే మీ ఖాతా బ్లాక్ అవుతుంది.. అని ఫోన్ చేసి ఏటీఎం పిన్ నంబర్ చెప్పిన క్షణాల్లోనే రూ.30 వేలు కాజేసిన సంఘటన శనివారం భీమ్‌గల్‌లో వెలుగు చూ సింది. తన ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫోన్ కు మెసేజ్ రావడంతో తేరుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అంతలోపే ఖాతాలో ఉన్న ...

Read More »

లింబాద్రి గుట్టకు ప్రత్యేక బస్సులను నడిపించాలి

  భీమ్‌గల్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింబాద్రి గుట్టకు ప్రతి శనివారం ప్రత్యేక బస్సులను ఆర్టీసి వారు నడిపించాలని మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతి శనివారం లింబాద్రిగుట్టలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బక్తులు వస్తుంటారని వీటిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసివారు ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతున్నారు. ప్రత్యేకంగా బస్సులు లేకపోవడంతో ఆటోలు, జీపులు, ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి ...

Read More »

హైదరాబాద్‌లో తెరాస నాయకుల ప్రచారం

  భీమ్‌గల్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో గురువారం భీమ్‌గల్‌ తెరాస నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వీరిలో పార్టీ మండల కన్వీనర్‌ దొన్కంటి నర్సయ్య, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు జైరాం శ్రీనివాస్‌ నాయక్‌ తదితరులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఖైరతాబాద్‌లోని స్టూడియో ఎన్‌ అధినేత నార్నె శ్రీనివాస్‌ రావు అమ్మగారిని, జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్యను, నాయనమ్మలను కలిసి కారు గుర్తుకు ఓటువేసి విజయరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి ...

Read More »

గ్రామ పంచాయతీ భవనానికి రూ. 13 లక్షలు మంజూరు

భీమ్‌గల్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మారుమూల గిరిజనగ్రామమైన రహత్‌నగర్‌ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 13 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి స్థానిక జడ్పిటిసి లక్ష్మిశర్మ నాయక్‌, సర్పంచ్‌ చెరుకు వనిత, ఎంపిటిసి వినుకొండ వర్షిణి ధర్మపురి విడిసి ఛైర్మన్‌ భూక్య బాబులాల్‌ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. రహత్‌నగర్‌ గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించి గ్రామ పంచాయతీ భవనాన్ని స్వయంగా పరిశీలించారు. గ్రామ పంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని వెంటనే అధికారులను ...

Read More »

పల్లెలకు బస్సులు లేక ప్రయాణీకుల ఇక్కట్లు

  భీమ్‌గల్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తమ గ్రామాలకు బస్సులు నడపండి సార్‌ అని గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారేపల్లి, రహత్‌నగర్‌, దేవక్కపేట్‌, లింగాపూర్‌, సిద్దపల్లి, కుప్కల్‌, సికింద్రాపూర్‌, గోన్‌గొప్పుల గ్రామలకు భీమ్‌గల్‌ నుంచి మోర్తాడ్‌ మీదుగా వరంగల్‌కు బస్సులు నడిపేటట్లు ఆర్టీసి అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసివారు లాభాలు సంపాదించుకుంటున్నారు కానీ ప్రయాణీకుల బాధలను పట్టించుకోరా అని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఆయా గ్రామాల ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, ...

Read More »

బడిలో చేరిన బాలకార్మికులు

  భీమ్‌గల్‌, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటుక బట్టిలో పనిచేస్తున్న ఆరుగురు బాల కార్మికులను సోమవారం లింగాపూర్‌పిఎస్‌ పాఠశాలలో చేర్పించడం జరిగిందని ఎంఇవో డి.స్వామి అన్నారు. బడిబయటి పిల్లలను బడిలో చేర్పించాలనే కలెక్టర్‌ ఆదేశాల మేరకు బాల కార్మికులుగా ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఈఓపిఆర్‌డి లక్ష్మినర్సింహాచారి, ఏశాలకృష్ణ, ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్‌, సిఆర్‌పిలు బాలరాజు, ఝాన్సీ, ఎస్‌ఎంసి పావన్న, పాఠశాల సిబ్బంది భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Read More »

పేదలకు దుప్పట్ల పంపిణీ

  భీమ్‌గల్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండల కేంద్రంలో జమాతె ఇస్లామి హింద్‌ ఆద్వర్యంలో పేద ముస్లింలు, హిందువులకు మంగళవారం దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హింద్‌ రాష్ట్ర అద్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో జమాతె ఇస్లామి హింద్‌ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ప్రజలందరు సోదర భావంతో మెలగాలని, మతసామరస్యాన్ని కలిగి ఉండాలని ఎస్‌ఐ అన్నారు. కార్యక్రమంలో భీమ్‌గల్‌ అధ్యక్షుడు మహ్మద్‌ ఖాజా, తదితరులు పాల్గొన్నారు.

Read More »

22,23,24 తేదీల్లో ఏఐకెఎంఎస్‌ తొలి మహాసభలు

  భీమ్‌గల్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దామని ఏఐకెఎంఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి కె.రాజేశ్వర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని నందిగల్లిలోని పార్టీ కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించారు. నక్సల్‌బరి, శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రైతాంగ సమస్యలు, ఉద్యమాలే ఎజెండా రాష్ట్ర తొలి మహాసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 22,23,24 తేదీల్లో ఆర్మూర్‌లో జరిగే ఏఐకెఎంఎస్‌ సభలకు అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు ...

Read More »

భీమ్‌గల్‌ విద్యార్థికి కాంస్య పతకం

  భీమ్‌గల్‌, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని లిటిల్‌ ఫ్లవర్‌ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని బి.సంపద నవంబర్‌ 28వ తేదీ నుంచి 30 వరకు మెదక్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్తాయి అండర్‌-14 (ఎస్‌జిఎఫ్‌) కబడ్డి క్రీడల్లో ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించడంతో మంగళవారం పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థినిని అభినందించడం జరిగింది. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్‌ షఫీక్‌, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్‌ నాయర్‌, నిజాముద్దీన్‌, వ్యాయామ ఉపాధ్యాయులు పరంజ్యోతి, కుమార్‌, వెంకటేశ్‌, రాజమణి, తదితరులు ...

Read More »

వికలాంగ విద్యార్థులకు పండ్ల పంపిణీ

  భీమ్‌గల్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని శుభోదయం వికలాంగుల పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా న్యూ ఫ్రెండ్స్‌ యూత్‌ ఆధ్వర్యంలో వికలాంగ విద్యార్తులకు ఐకెపి సిసిలు, గణేష్‌, సుమన్‌, అధ్యక్షులు రావుట్ల అరవింద్‌ల చేతుల మీదుగా పండ్లు పంపినీ చేశారు. కార్యక్రమంలో యూత్‌ ఉపాధ్యక్షులు రామవత్‌ శ్రీకాంత్‌, సభ్యులురాగి భార్గవచారి, ముత్యం, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైభవంగా శ్రీవారి రథోత్సవం

  భీమ్‌గల్‌, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నింబాచలం లింబాద్రిగుట్టపై శ్రీలక్ష్మి నర్సింహస్వామి వారి రథోత్సవం బుధవారం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రమైన లింబాద్రి గుట్టకు పక్క గ్రామాలు, జిల్లా నలుమూలల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవాన్ని కన్నులారా వీక్షించి పునీతులయ్యారు. గుట్టంత స్వామివారి నామస్మరణతో మారుమోగింది. అర్చకుల వేదమంత్రాల నడుమ రథం ముందుకు సాగుతుంటే భక్తులు లాగుతూ, మంగళహారతులు సమర్పిస్తూ, టెంకాయలు ...

Read More »

పల్లికొండ గ్రామంలో పొలంబడి

  భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమగల్‌ మండలంలోని పల్లికొండ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటలో పొలం బడి కార్యక్రమాన్ని మండల వ్యవసాయాధికారి సాయిరాం రాజు ఆద్వర్యంలో శనివారం నిర్వహించారు. విత్తనశుద్ది చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. అలాగే మొక్కజొన్న పంటలో వచ్చే కుంటు కుళ్ళు తెగులుని అరికట్టేందుకు 3జి గుళికలను వాడాలని ఆయన సూచించారు. సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్టు, పశువుల ఎరువులు తదితర ఎరువుల వాడకం వల్ల భూసారం పెరగడమే ...

Read More »

ప్రైవేటు వాహన యజమానుల అన్నదానం

  భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీమ్‌గల్‌ మండల కేంద్రంలో టాక్సీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పండపం వద్ద గురువారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. పాతగెస్ట్‌ హౌజ్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ వినాయకుని వద్ద డిటివో జశ్వంత్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని, కారు నడిపేవారు సీట్‌ బెల్టు తప్పకుండా ధరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌, ...

Read More »

విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణ

  భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ విత్తనోత్పత్తి పథకంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని భీమ్‌గల్‌ సహాయవ్యవసాయ సంచాలకులు శంకర్‌రావు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబానగర్‌ గ్రామంలోని రైతులకు మూల విత్తనం గురించి వివరించారు. రైతులు ఈ విత్తనాన్ని వాడుకుని ఆర్థికంగా దిగుబడులు సాధించాలని కోరారు. రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్‌ ప్రసాద్‌, ఎఇవో సాయిరాం, రైతులు పాల్గొన్నారు.

Read More »