Breaking News

biknoor

ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గం ఎన్నిక

బీర్కూర్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గాన్ని పాత్రికేయులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వంగ శ్రీధర్‌ గౌడ్‌ (నమస్తే తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా షేక్‌ మహాబూబ్‌ (నినాదం), కోశాధికారిగా వేణు గోపాల్‌ గౌడ్‌ (సాక్షి), గౌరవ అధ్యక్షులుగా గాండ్ల సంతోష్‌ కుమార్‌ (ఆంధ్రభూమి), ఉపాధ్యక్షులుగా భవాని సింగ్‌ (ఆంధ్రజ్యోతి) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడారు. పాత్రికేయుల‌ హక్కులు, సంక్షేమం కోసం పాటు పడతామని తెలిపారు. అనంతరం పరస్పరం మిఠాయిలు పంపిణీ ...

Read More »

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

భిక్కనూరు అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కాచాపూర్‌ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో గురువారం పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ గాల్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ బైండ్ల సులోచన రాష్ట్ర ప్రభుత్వం అందజేసే స్కూల్‌ యూనిఫామ్‌లను, వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్‌, మండల కో ఆప్షన్‌ మెంబర్‌ ఎస్‌.కె. సుల్తానా, గ్రామ ఉపసర్పంచ్‌ సిద్దా గౌడ్‌, ఎస్‌ఎంసి చైర్మన్‌ భూమయ్య, వార్డు సభ్యులు బాల్‌ నర్స్‌, పాఠశాల ఉపాధ్యాయులు రాధా లక్ష్మి, ...

Read More »

తండ్రిని చంపిన తనయుడు

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్‌ గ్రామంలో గురువారం తండ్రిని కొడుకు నరికి చంపినట్లు భిక్కనూరు ఎస్‌ఐ నవీన్‌ తెలిపారు. గ్రామానికి చెందిన తాటిపల్లి మేల‌య్య (50) ను ఆయన కొడుకు ప్రశాంత్‌ గొడ్డలితో నరికి చంపాడు. తరచూ కుటుంబ సభ్యుల‌తో గొడవ పడేవాడని తిప్పాపూర్‌ గ్రామ విఆర్‌ఓ కమ్మరి రాజేంద్ర ప్రసాద్‌ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు ప్రశాంత్‌ ...

Read More »

యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయండి

బీర్కూర్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని మండల కాంగ్రెస్‌ సభ్యులు, ఆయా గ్రామాల ప్రజలు విజయవంతం చేయాలని బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌ అన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తాలో ఘనంగా వేడుకలు నిర్వహించి జెండా ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు పాల్గొంటారన్నారు. పార్టీ కార్యకర్తలు, యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు విజయవంతం చేయాలని కోరారు.

Read More »

మద్యం సేవించివాహనాలు నడిపినవారికి జరిమానా

  బీర్కూర్‌, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రాత్రి బీర్కూర్‌ గ్రామంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురు వ్యక్తులపై ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి కేసు నమోదు చేశారు. వారిని బుధవారం బాన్సువాడ మున్సిఫ్‌ కోర్టుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ఒక్కొక్కరికి 2200 రూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు. మద్యంసేవించి వాహనాలు నడపవద్దని, మండలంలో ప్రధాన కూడళ్లలో ప్రతినిత్యం వాహనదారులను తనిఖీలు చేస్తామని ఆయన అన్నారు. మద్యంసేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More »

రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

  బీర్కూర్‌, మార్చి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో దామరంచ, అన్నారం, చించొల్లి, కిష్టాపూర్‌, బీర్కూర్‌ గ్రామాల్లో గురువారం కురిసిన వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌తో కలిసి పంట నష్టం జరిగిన ఆయకట్టు ప్రాంతాలను ఆయా గ్రామాల్లో పర్యటించి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు వేసిన పంట రకాలను అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల్లో పంటచేతికందుతున్న సమయంలో ప్రకృతి ...

Read More »

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

  బీర్కూర్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అధికారులు, ప్రజాప్రతినిదులు, పాఠశాలల విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. మండలాల్లోని ఆయా గ్రామాల్లో పాఠశాల విద్యార్థులచే గ్రామ ప్రధాన వీధుల గుండా జాతీయ సమైక్యతా నినాదాలతో ర్యాలీలు చేపట్టారు. అనంతరం ఆయా పాఠశాలల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. బీర్కూర్‌ తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కృష్ణానాయక్‌, నసురుల్లాబాద్‌ తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ డేవిద్‌, బీర్కూర్‌ ఠాణాలో ఏఎస్‌ఐ మజీద్‌ఖాన్‌, నసురుల్లాబాద్‌ ...

Read More »

భూములను పరిశీలించిన ఆర్డీవో

భిక్కనూరు: భిక్కనూరు మండలం జంగంపల్లిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ‘ఈనాడు’ మీనిలో మంగళవారం ‘అసైన్డ్‌ భూములపై అక్రమార్కుల కన్ను’అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై కామారెడ్డి ఆర్డీవో నగశ్‌ స్పందించారు. జంగంపల్లి శివారులోని పలు భూములను మంగళవారం ఆయన పరిశీలించారు. 208 సర్వే నెంబరులోని కబ్జాదారులకు వెంటనే నోటీసుల జారీ చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌ అంజయ్యను ఆదేశించారు. అలాగే జంగంపల్లి శివారులోని మొత్తం ప్రభుత్వ భూమిని ఎవరెవరికి అసైన్డ్‌ కింద కేటాయించారు, ప్రస్తుతం ఆ భూముల్లో ఎవరుంటున్నారు తదితర వివరాలన్నింటితో సాయంత్రంలోపు ...

Read More »

భిక్కనూరులో ఈదురుగాలుల బీభత్సం

భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలో ఈదురుగాలులు ఆదివారం బీభత్సం సృష్టించాయి. స్వల్ప జల్లులతో బలమైన గాలులు వీయడంతో విద్యుత్తు స్తంభాలు, దాబా హోటళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల చెట్లు కుప్పకులాయి. దాబా నిర్వాహకులకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వినియోగదారుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read More »

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

రాజంపేట (భిక్కనూరు), : మండలంలోని రాజంపేట గ్రామంలో కడుపు నొప్పి భరించలేక ఆదివారం ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకార.. గ్రామానికి చెందిన పాశం ప్రశాంత్‌ (19) కామారెడ్డిలో ఇటీవలే ఇంటర్‌ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. గతేడాది నుంచి అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడేవాడు. ఆసుపత్రికి వెళ్లడానికి నిరాకరించేవాడు. తల్లిదండ్రులు హన్మంతు-వినోద ఆలయాల్లో మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్లిన సమయంలో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు ఎస్సై రాంబాబు సంఘటన స్థలాన్ని సందర్శించి ...

Read More »

ఏప్రిల్‌ 2 నుంచి పించన్ల పంపిణీ

బీర్కూర్‌, మార్చి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆసరా పథకం పింఛన్లు ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నట్టు మండల అభివృద్ది అదికారి భరత్‌కుమార్‌ తెలిపారు. వృద్దాప్య, వితంతు, వికలాంగ, బీడీ, చేనేత, గీత కార్మికులకు ఆధార్‌ కార్డు కలిగినవారికి ఏప్రిల్‌ 2 నుంచి 5వ తేదీ వరకు బీడీకార్మికులకు 6 వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పోస్టాఫీసులో అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఆధార్‌ కార్డు నెంబరు ...

Read More »

పెళ్లికొడుకు హెలికాప్టర్‌లో వచ్చెన్‌..!

భిక్కనూరు మండలం రాజంపేట గ్రామానికి చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తె వివాహానికి ఏకంగా హెలికాప్టర్‌ సేవలను ఉపయోగించుకుంటున్నారు. గ్రామానికి చెందిన ముత్యపు మురళి-సంధ్యల కుమార్తె జలజ వివాహం గుల్బర్గాకు చెందిన రోహిత్‌తో ఆదివారం కామారెడ్డి సత్యా గార్డెన్‌లో జరుగునుంది. ఈ సందర్భంగా పెళ్లికొడుకును శనివారం గుల్బర్గా నుంచి కామారెడ్డికి హెలికాప్టర్‌లో తీసుకువచ్చారు. వివాహం జరుగుతున్న సమయంలో కల్యాణ మండపం పైనుంచి హెలికాప్టర్‌ ద్వారా పూలు చల్లడానికి ఏర్పాట్లు చేశారు. అంతే కాదండీ.. వివాహం తర్వాత వధువరూలిద్దరినీ అదే హెలికాప్టర్‌లో గుల్బర్గాకు తీసుకెళ్లనున్నారు. హెలికాప్టర్‌ ...

Read More »

సౌదీలో భిక్కనూరు వాసి..

భిక్కనూరు : నాలుగైదు నెలల క్రితం సౌదీలో మృతిచెందిన భిక్కనూరు నివాసి మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన బత్తు రాంచంద్రం (44) బతుకుదెరువు కోసం సౌదీకి కొన్ని నెలల క్రితం వెళ్లాడు. కొద్ది రోజులుగా ఫోన్ చేయకపోవడంతో కుటుంబీకులు వాకబు చేయకగా రాంచంద్రం మృతి చెందాడని సౌదీలో ఉన్న బంధువుల ద్వారా తెలిసిందన్నారు. మృతదేహం మంగళవారం ఇంటికి చేరుకోగానే కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడికి పెళ్లికి ఎదిగిన కూతురు ఉండడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా ...

Read More »

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

భిక్కనూరు : కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి ఎస్సై రాంబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్క రామవ్వకు ఇటీవల డ్వాక్రా సంఘంలో వచ్చిన డబ్బుల విషయమై భర్త గంగయ్య తో గొడవ జరిగింది. దీంతో రామవ్వ భిక్కనూరు గ్రామంలో ఉంటున్న ఆమె అక్క దగ్గరకు వెళ్లిపోయింది. గంగయ్య పెద్దమల్లారెడ్డిలోనే నివాసం ఉంటున్న తల్లి వద్దకు వెళ్లాడు. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో కుమారుడు బాల్‌రాజ్ (20) మనస్తాపం చెందాడు. దీంతో ...

Read More »

మందుల ఫ్యాక్టరీ మాకొద్దు

భిక్కనూరు : మండలంలోని అంతంపల్లి గ్రా మ శివారులో సర్వే నంబర్ 168లో ఉన్న ఐదు ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఆక్టెన్ కెమికల్ ఫ్యాక్టరీని నిర్మించవద్దని గ్రామస్తులు సో మవారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట అరగంట పాటు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పర్యావరణ అనుమతుల కోసం ఈనె ల 10న గ్రామశివారులో అడిషినల్ జేసీ ఆ ధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామస్తులు ఈ మందుల ఫ్యాక్టరీ మాకోద్దని సభను రద్దు చేశామన్నారు. అయినా గ్రామస్తులందరిని కాదని గ్రామ సర్పంచి, ...

Read More »

వీఆర్వోలు స్థానికంగా ఉండాలి: జేసీ

భిక్కనూరు,: వీఆర్వోలు వారికి కేటాయించిన గ్రామాల్లో నివాసముండాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భిక్కనూరు తహసీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం పది గంటలకు కార్యాలయాలకు చేరుకున్న ఆయన ఇటీవల ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించారు. సిబ్బంది సమయపాలన గమనించారు. ఉద్యోగులు అందరు సమయానికి విధులకు హాజరు కావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా కార్యాలయాల్లో దస్త్రాలను సరిచూశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించడానికి వీఆర్వోలందరిని స్థానికంగా నివాసముండాలని ఇప్పటికే ఆదేశాలు ...

Read More »

చెరువును సందర్శించిన ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్‌

కాచాపూర్‌ (భిక్కనూరు), న్యూస్‌టుడే: భిక్కనూరు మండలం కాచాపూర్‌ చెరువును బుధవారం ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్‌ ప్రొఫెసర్‌ రత్నాకర్‌ సందర్శించారు. గతంలో ఈ చెరవు మరమ్మతులకు ప్రపంచ బ్యాంకు రూ.75 లక్షలు మంజూరు చేసింది. విడుదల చేసిన నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు. కట్ట బలోపేతం చేయడమే కాకుండా కాలువలు, తూముల నిర్మించినట్లు అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం ద్వారా చేపట్టిన పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ మురళి, ఈఈ మధుకర్‌రెడ్డి, ...

Read More »

ఆర్టీసీ ప్రయాణికులపై రూ.5 భారం

భిక్కనూరు, న్యూస్‌టుడే: భిక్కనూరు వద్ద టోల్‌ ప్లాజా ఏర్పాటు కావడంతో ఆర్టీసీ ప్రయాణికులపై రూ.5 అదనపు భారం పడినట్లయింది. మంగళవారం నుంచి ప్రయాణికులపై ఆర్టీసీవారు టోల్‌ పేరిట రూ.5 వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు కామారెడ్డి నుంచి భిక్కనూరు వెళ్లడానికి ఆర్డీనరీ బస్సుల్లో రూ.12 ఛార్జి వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.17కు పెంచారు. టోల్‌ ప్లాజా మీదుగా బస్సుల రాకపోకలకు రూ.320 వసూలు చేస్తుండటంతో ఆర్టీసీవారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి భిక్కనూరు లేక మెదక్‌ జిల్లాకు వెళ్లి రావడానికి ప్రయాణికులపై రూ.10 అదనపు భారం ...

Read More »

దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య పోరాటం

భిక్కనూరు, న్యూస్‌టుడే: హెచ్‌సీయూలో 15 రోజులుగా చోటుచేసుకున్న ఘటనలు దేశభక్తులకు, దేశద్రోహులకు మధ్య జరుగుతున్న పోరాటమని ఏబీవీపీ విభాగ్‌ సంఘటన కార్యదర్శి మొగులప్ప అన్నారు. మంగళవారం భిక్కనూరులోని తెవివి దక్షిణ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిని చాలా మంది దళితులకు, దళితేతరులకు మధ్య జరుగుతున్న సంఘర్షణగా భావిస్తున్నారన్నారు. హెచ్‌సీయూలో పరిశోధన విద్యార్థి రోహిత్‌ ఉగ్రవాది యాకుబ్‌ మెమన్‌ ఉరికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడంతోపాటు ఒక్క మెమన్‌ను ఉరి తీస్తే ఇంటికొక్క మెమన్‌ పుట్టుకొస్తాడని ప్లకార్డులు ప్రదర్శించాడన్నారు. ఈ ప్రదర్శనను ...

Read More »

భిక్కనూరు టోల్‌ప్లాజా ప్రారంభం

భిక్కనూరు, న్యూస్‌టుడే: భిక్కనూరు టోల్‌ప్లాజా సోమవారం ప్రారంభమైంది. గత నెల 6న ప్రారంభమైన టోల్‌ప్లాజా నిర్మాణం కేవలం 24 రోజుల్లో పూర్తిచేశారు. ప్రతీ 60 కి.మీ.లకు ఒక టోల్‌ప్లాజా ఉండాలనే నిబంధనతో నూతనంగా భిక్కనూరు శివారులో దీనిని ఏర్పాటు చేశారు. వాహన చోదకుల నుంచి అధికారికంగా టోల్‌ వసూల్‌ చేస్తున్నారు. మెదక్‌ జిల్లా తుఫ్రాన్‌ ప్లాజా వద్ద వాహనాల రాకపోకల ధరలు తగ్గించి ఇక్కడ నుంచి వసూల్‌ చేస్తున్నారు. అయినా వాహనచోదకులపై అదనపు భారం పడుతుంది. ఇంతకు ముందు హైదరాబాద్‌ వెళ్లివచ్చే కారు/జీబు/వ్యాన్‌/ లైట్‌మోటర్‌ ...

Read More »