Breaking News

Birkoor

సామాజిక దూరం ఎక్కడా…?

బీర్కూర్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ వ్యాప్తంగా ఈనెల‌ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ప్రకటించినా కొన్ని చోట్ల అధికారుల‌ నిర్లక్ష్యంతో ప్రజలు వార సంతలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖాల‌కు ఎలాంటి మాస్కులు ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా వర్ని, నసురుల్లాబాద్‌ ప్రధాన రహదారిపై వార సంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళితే… వారాంతపు సంతల‌ను ప్రభుత్వం నిషేదించినప్పటికి బుధవారం నసురుల్లాబాద్‌ మండల‌ కేంద్రంలో వారంతపు సంత మధ్యాహ్నం నుంచి ...

Read More »

రైతు సమన్వయ సమితి సమావేశం

బీర్కూర్‌, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ సహకార సంఘంలో రైతు సమన్వయ సమితి మండల‌ అధ్యక్షుడు ద్రోణవల్లి అశోక్‌ ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు మొత్తం వేసిన వరి నాట్లు 3283 ఎకరాలు, వరి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి పంపేవిధంగా చూడాల‌న్నారు. కార్యక్రమంలో బీర్కూర్‌ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అవారి గంగారాం, మండల‌ వ్యవసాయ అధికారి కమల‌, ఏఇవో శ్రావణ్‌ కుమార్‌, సొసైటీ కార్యదర్శి మల్దొడ్డి ...

Read More »

నీటి సమస్య తీరింది

బీర్కూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల‌ కేంద్రంలోని పోచారం కాల‌నీకి నీటి కష్టాలు తొల‌గిపోయాయి. బుధవారం సింగిల్‌ ఫేస్‌ మోటర్‌ వేసి కాల‌నీ వాసుల‌కు సర్పంచ్‌ కుమారి ఆవారి స్వప్న గంగారం, ఉపసర్పంచ్‌ షాహినా బేగరు నీటి కొరతను తీర్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాల‌నీలో వేసవికాలం దృష్ట్యా నీటి సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. కాల‌నీవాసుల‌ నీటి సమస్య తీర్చిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు మన్నన్‌ శంకర్‌ ...

Read More »

పంట రుణాలు ఇప్పిస్తాం

బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బీర్కూర్‌ గ్రామంలోని గ్రామ చావిడిలో రెవెన్యూ సిబ్బంది నుండి బీర్కూర్‌ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రావణ్‌ కుమార్‌ వివరాలు సేకరించారు. ప్రస్తుత రబీ సీజన్‌కు గాను పంట రుణాల‌ను పొందని రైతుల‌ను, 10 జూన్‌ 2019 వ తేదీ తరువాత తెలంగాణా ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త పట్టేదారు పాసుపుస్తకాలు రైతు వివరాలు సర్వే నెంబర్లు వాటి క్రింద గల‌ విస్తీర్ణము వివరాలు గ్రామ పహాని, రెవెన్యూశాఖ దగ్గర గ ల ...

Read More »

ఐఐటీ నీట్‌ క్యాంప్‌కు ఎంపికైన విద్యార్థులు

బీర్కూర్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల‌ పాఠశాల‌ విద్యార్థులు 18 మంది రాష్ట్ర స్థాయి ఐఐటీ నీట్‌ కాంప్‌కు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల‌ కృషి, విద్యార్థుల‌ పట్టుదల వ‌ల్ల ఇంతటి ఫలితం దక్కినట్టు పాఠశాల‌ ప్రిన్సిపాల్‌ వసంత్‌ రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులు త్వరలోనే భువనగిరి జిల్లా ఆనంతారంలో ప్రారంభించబడే పాఠశాల‌లో చేరుతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల‌ను ప్రధానోపాధ్యాయుడు వసంత్‌ రెడ్డి, ఏటిపి రఘునాథ్‌ అభినందించారు. 8వ, 9వ తరగతి ...

Read More »

బీర్కూర్‌లో జాతీయ బాలికా దినోత్సవం

బీర్కూర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే బాలుర పాఠశాల బీర్కూర్‌ లో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వసంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టిందంటే తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని పూర్వం భావించే వారన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్నారని, బ్రూణహత్యలకు పాల్పడుతున్నారని, పుట్టిన కొన్ని నిమిషాలకే ఆడపిల్లలను చంపేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్‌ గర్ల్స్‌ డెవలప్మెంట్‌ మిషన్‌ పేరుతో గతంలో ఆడపిల్లలపై ...

Read More »

డంపింగ్‌ యార్డు నిర్మాణానికి భూమిపూజ

నసురుల్లాబాద్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండలం మైలారం గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణ పనులకు సర్పంచ్‌ యశోద మహేందర్‌ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, కామారెడ్డి జిల్లా కో ఆప్షన్‌ సభ్యుడు మజీద్‌, జెడ్‌పిటిసి జన్ను బాయ్‌, ప్రతాప్‌, ఎంపీటీసీ ప్రభాకర్‌ రెడ్డి, ఎంపిఓ రాము, స్పెషల్‌ ఆఫీసర్‌ సుజాత, దూళి గంగారాం, చంద్ర గౌడ్‌, తిరుపతి, జనపల్లి గంగారాం, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Read More »

మహిళల రక్షణ కొరకు ప్రతిజ్ఞ

బీర్కూర్‌, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మహాత్మా జ్యోతిబా పులే బాలుర పాఠశాలలో మహిళల రక్షణ కొరకు సురక్షిత కామారెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే మహిళల రక్షణ కొరకు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వసంత్‌ రెడ్డి, సహాయ ప్రిన్సిపాల్‌ రఘునాథ్‌, ఉపాధ్యాయులు శివకుమార్‌, సాయిలు, శ్రీహరి, సరిత, శ్రావణి, మహేష్‌, పవన్‌ పాల్గొన్నారు.

Read More »

ప్రత్యక్ష అనుభవం ద్వారా పాఠ్యబోధన

బీర్కూర్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా జ్యోతి బా పులే (బాలుర) పాఠశాల బీర్కూర్‌లో మంగళవారం విద్యార్థులకు వ్యవసాయ సాగు విధానం, మొక్కల ఉత్పత్తి అనే అంశాన్ని స్వయంగా పొలంలోకి తీసుకెళ్ళి ప్రత్యక్ష అనుభవం కలిగించినట్లు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శివకుమార్‌ పాఠాన్ని బోధించాడు. అలాగే నారు పీకడం నాటువేయడం విద్యార్థులకు చూపించాడు. ఉపాధ్యాయుడి సూచనమేరకు విద్యార్థులు నారు పీకడం, నాట్లు స్వయంగా వేశారు. రైతే దేశానికి వెన్ను ముక్క అని ఆయన విద్యార్థులకు మరొకసారి తెలియజేశారు. ఈ విషయాన్ని ...

Read More »

సబ్‌ రిజిస్టార్‌గా పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్‌

బీర్కూర్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంపియుపిఎస్‌ తిమ్మాపూర్‌ పాఠశాల ఉపాధ్యాయుడు అశోక్‌ సబ్‌ రిజిస్టార్‌గా నియమితులైన సందర్భంగా పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీర్కూర్‌ మండల ఎంపిపి రఘు, మండల విద్యాధికారి నాగేశ్వర రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి, బీర్కూర్‌ మండల పిఆర్‌టియు యూనియన్‌ ప్రతినిదులు రవీంద్ర జెట్టి, నర్సింలు, గ్రామ పెద్దలు అప్పారావు, మురళి, సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఎస్‌ఎంసి చైర్మన్‌ రవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ

బీర్కూర్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని జ్యోతి రావు బాపూలే పాఠశాలలో రిలైన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎలాంటి మందులు లేకుండా ఎరువులపై పండించే కురాగాయల కొరకు మార్కింగ్‌ చేసి విత్తనాలు అందించారు. అలాగే రిలైన్స్‌ ఫౌండేషన్‌ సిఆర్‌పి సజన మాట్లాడుతూ కూరగాయలు కాపాడటానికి చుట్టూ కంచే రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వసంత్‌ రెడ్డి, పిఇటి దేవిదాస్‌, పాఠశాల సిబ్బంది పవన్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Read More »

బిజెపి మండల అధ్యక్షునిగా హనుమాండ్లు యాదవ్‌

బీర్కూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్సపల్లి సాయిరెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి నాయుడు ప్రకాష్‌, చిదిర సాయిలు ఆధ్వర్యంలో నస్రుల్లాబాద్‌ మండల అధ్యక్షుడు చందూరి హనుమాండ్లు యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా హనుమాండ్లు యాదవ్‌ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని మండలంలో పార్టీ బలోపేతానికి అన్ని విధాల కషి చేస్తానని, బాధ్యతను అప్పచెప్పిన పార్టీకి రుణపడి ఉంటానని ...

Read More »

ఉచిత కంటి వైద్య శిబిరం

బీర్కూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నసురుల్లాబాద్‌ మండలంలోని హజీపూర్‌ గ్రామ పంచాయితీలో లయన్స్‌ కంటి ఆసుపత్రి బాన్సువాడ వారి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎంపీపీ పి.విట్ఠల్‌, సర్పంచ్‌ అరిగే చంటి కంటి శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌లు విట్ఠల్‌, సాయగౌడ్‌, మాజి జడ్పీటీసీ కిషన్‌ నాయక్‌, సెక్రటరీ రజిత, కాశిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

విధుల్లోకి రెవెన్యూ ఉద్యోగులు

బీర్కూర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం రోజుల క్రితం జరిగిన విజయారెడ్డి హత్యకు మద్దతుగా సమ్మె చేసిన రెవెన్యూ ఉద్యోగులు బుధవారం నుండి విధులకు హాజరయ్యారు. దీంతో నసురుల్లాబాద్‌ తహసీల్‌ కార్యాలయం విద్యార్థులు, రైతులతో కిటకిటలాడింది. వారం రోజులుగా రెవెన్యూ సిబ్బంది కొరకు ఎదురు చూస్తున్న వారు బుధవారం ఊపిరి తీసుకున్నారు. కులం, ఆదాయం వంటి దరఖాస్తులను బుధవారం పూర్తిచేశారు. దీంతో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తమ దరఖాస్తులు తీసుకువచ్చి అధికారులకు ఇవ్వడంలో నిమగ్నమయ్యారు.

Read More »

ఏకరూప దుస్తుల పంపిణీ

బీర్కూర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మైలారం, దుర్కి గ్రామాలలో బుధవారం విద్యార్థులకు ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యశోదా మహేందర్‌ మాట్లాడుతూ మైలారం గ్రామంలో 102 మంది విద్యార్థులకు రెండు జతల బట్టలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా దుర్కి పాఠశాలలోని విద్యార్థులకు సర్పంచ్‌ దుర్గం శ్యామల, ఎంపిటిసి కుమ్మరి నారాయణ దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు మహేందర్‌, గంగారాం, ఉపసర్పంచ్‌ ఖాదీర్‌, పాఠశాల కమిటీ అధ్యక్షులు ...

Read More »

క్రీడా దుస్తుల పంపిణీ

బీర్కూర్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం నెమ్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ సూర అంజయ్య క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఆయనతోపాటు గ్రామానికి చెందిన యమున సైతం పాఠశాలలోని 24 మందికి క్రీడా దుస్తులు అందించారు. ఈ సందర్బంగా హెచ్‌ఎం వెంకటరమణ మాట్లాడుతూ రిటైర్డ్‌ హెచ్‌ఎం సూర అంజయ్య విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేందర్‌, కనకాద్రి, కిషన్‌ లాల్‌, ఉమాకాంత్‌, సంజీవులు, అతిక్‌ పాల్గొన్నారు.

Read More »

బీర్కూర్‌లో రాష్ట్రీయ ఎక్తా దివస్‌

బీర్కూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బీర్కూర్‌ గ్రామపంచాయతీలో జాతీయ ఐక్యత దినోత్సవం రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ భారత ప్రభుత్వం వారిచే నిజామాబాద్‌ ఫీల్డ్‌ పబ్లిసిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు గారిచే కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు, ప్రజలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్‌వాడి టీచర్లు, సూపర్‌ వైజర్‌, పోషన్‌ ...

Read More »

హెల్త్‌ కిట్‌ల పంపిణీ

బీర్కూర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జడ్‌పిహెచ్‌ఎస్‌ నెమలి పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన హెల్త్‌ కిట్‌లను 7వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థినిలకు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్‌.వెంకటరమణ, గ్రామ సర్పంచ్‌ పందిరి గంగామని భూమేశ్‌ చేతుల మీదుగా హెల్త్‌ కిట్‌లను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాంరెడ్డి, ఉపాధ్యాయులు వినోద, రమణ పాల్గొన్నారు.

Read More »

చెత్త బుట్టల కోసం లక్ష విరాళం

బీర్కూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని బరంగెడిగి గ్రామంలో మాజీ జెడ్పిటిసి ద్రోణ పల్లి సతీష్‌ ఆదివారం చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అశోక్‌ తన సొంత డబ్బు లక్ష రూపాయలు వెచ్చించి బరంగెడిగి గ్రామానికి ఎనిమిది వందల చెత్తబుట్టలు తెప్పించారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధించి స్వచ్ఛత గ్రామం వైపు అడుగులు వేయాలన్నారు. ప్రతి ...

Read More »

అమ్మవారికి పల్లకీసేవ

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో హన్మాన్‌ మందిరంవద్ద శ్రీ యువజన దుర్గాభవాని మండలి వారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం దుర్గామాత మండపం నుండి వీధుల గుండా దుర్గామాత పల్లకీ సేవ ఏర్పాటు చేశారు. గురుస్వామి సాయగౌడ్‌, పంతులు నందు శర్మ ఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ యువజన దుర్గ భవానీ యువకులు, భవానీ స్వాములు, మాత స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »