Breaking News

Bodhan

ఆశీర్వదించండి – అభివృద్ది చేసి చూపిస్తా

రెంజల్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు ఆశీర్వదించి ఆదరిస్తే అభివృద్ది చేసి చూపిస్తానని తెరాస బోదన్‌ ఎమ్మెల్యే అభ్యర్తి షకీల్‌ అన్నారు. రెంజల్‌ మండలంలోని కందకుర్తి, నీలా వీరన్నగుట్ట, కళ్యాపూర్‌, కూనేపల్లి, బాగేపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంలో తెరాస పార్టీ ఎప్పుడు ముందుంటుందని ప్రజలు ఆశీర్వదించి తిరిగి తెరాసని గెలిపిస్తే మరింత అభివృద్ది చేసి చూపిస్తామన్నారు. తెరాస పార్టీ నాలుగున్నరేళ్లలో అన్ని విధాలుగా ...

Read More »

బోధన్‌ బిజెపి అభ్యర్థిగా అల్జాపూర్‌ శ్రీనివాస్‌

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ బోధన్‌ నియోజకవర్గ అభ్యర్థిగా రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్‌ శ్రీనివాస్‌ను అధిష్టానం ప్రకటించింది. అల్జాపూర్‌ శ్రీనివాస్‌ ఈ మేరకు హర్షం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గంలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపిస్తామని అన్నారు.

Read More »

అవిశ్వాస తీర్మాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కౌన్సిలర్లు

  నిజామాబాద్‌ టౌన్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ ఆనంపల్లి ఎల్లయ్యపై అవిశ్వాస తీర్మానాన్ని మజ్లిస్‌ కౌన్సిలర్లు వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం ఈ అంశంపై నిజామాబాద్‌ ఎంపి కవిత, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసి సమక్షంలో చర్చలు జరిగాయి. ఎంపి కవిత జోక్యంతో మజ్లిస్‌ కౌన్సిలర్లు శాంతించారు. బోధన్‌ ఎమ్మెల్యే, తెరాస కౌన్సిలర్‌లతో ప్రత్యేకంగా సమావేశమై ఎల్లయ్యపై ఇచ్చిన అవిశ్వాస నోటీసును ఉపసంహరించుకునేలా కృషి చేశారు. మొత్తానికి ఎంపి కవిత జోక్యంతో బోధన్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌పై ...

Read More »

అఖిలపక్ష నాయకుల అరెస్టు

నిజామాబాద్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బోధన్‌ పర్యటన దృష్టిలో ఉంచుకొని బోధన్‌లో పలువురు అఖిలపక్ష నాయకులను, వామపక్ష నాయకులను, జేఏసి నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వందరోజుల్లో నిజాం చక్కర కర్మాగారాన్ని పునరుద్దరిస్తామని హామీ ఇచ్చి ఇపుడు ప్రయివేటు వ్యక్తులకు ఫ్యాక్టరీని అప్పగించి వారి వంత ...

Read More »

54వ రోజుకుచేరిన నిరాహర దీక్షలు

  నిజామాబాద్‌ టౌన్‌, మార్చి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ చక్కర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలనే అంశంతో గత 53 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష ఆదివారంతో 54వ రోజుకు చేరింది. ఆదివారం దీక్షలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి స్తానిక ప్రజలకు వితరణ చేశారు. కార్యక్రమానికి నిజామాబాద్‌ జిల్లా జేఏసి నాయకులు, సిపిఐ ఎంఎల్‌ ప్రతినిధులు హాజరై మాట్లాడారు. తెరాస ప్రభుత్వం బోధన్‌ చక్కర కర్మాగారాన్ని అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చి ఇపుడు ఈ ...

Read More »

50 రోజులకు నిజాంషుగర్స్‌ దీక్షలు

బోధన్‌: నిజాం చక్కెర మిల్లుల పునరుద్ధరణ, సర్కారు నిర్వహణ డిమాండ్‌తో బోధన్‌లో ప్రారంభించిన రిలే దీక్షలు 50 రోజుల మైలురాయి చేరాయి. వారాంతపు సెలవు, పండగలు ఇతర వేడుకలు ఏవీ ఉన్నా ఆందోళన బాట వీడడంలేదు. రక్షణ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న దీక్షలకు సకల జనుల మద్దతు లభిస్తోంది. ప్రతిపక్ష పార్టీలన్నీ సంఘీభావం తెలుపుతున్నాయి. బుధవారం అంబేడ్కర్‌ చౌరస్తాలో 50వ రోజు దీక్షలను రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవులు ప్రారంభించారు. ఈ ప్రాంత అభివృద్ధి, రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర వర్గాల మెరుగైన జీవనం ...

Read More »

సింగూరు జలాలను నిజాంసాగర్‌కు మళ్ళించండి

  – తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం బోధన్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముందస్తు కురిసిన వర్షాల వల్ల నిజామాబాద్‌ జిల్లాలో రైతులు ఎక్కువశాతం వరినాట్లు వేశారుకానీ వర్షాలు ముఖం చాటేయడంతో రైతాంగం పంటలను చూసి భయభ్రాంతులకు గురవుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు షేక్‌బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా రైతాంగానికి గుండెకాయలాంటి నిజాంసాగర్‌ను నమ్ముకున్న రైతులు నిజాంసాగర్‌ ద్వారా వచ్చే నీటి కొరకు ఎదురుచూస్తున్నారని, నిజాంసాగర్‌ ఆయకట్టు వరిపొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ...

Read More »

సింగూరు నీటిని వదిలి పంటలు కాపాడాలి

  బోధన్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ అయిన సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టిఎంసిల నీటిని విడుదల చేయాలని, ఎండుతున్న పంటలను కాపాడాలని బోధన్‌ ఎంపిపి అద్యక్షుడు గంగాశంకర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి అల్లె రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో పట్టణంలోని అనీల్‌ టాకీస్‌ చౌరస్తా వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వేసుకున్న పంటలకు నీరు లేక వ్యవసాయసాగు ...

Read More »

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ

తెలంగాణ జాగృతి పదవ వార్షికోత్సవ ప్రతినిధుల సభ నల్లగొండలో జరుగనుంది. ఆగస్టు 5, 6 తేదీలలో జరగబోయే ఈ ప్రతినిధుల సభకు రాష్ట్రం నుండి దేశం నుండి 2 వేల మంది ప్రతినిధులు హాజరవనున్నారు. ఈ సమావేశాల్లో జాగృతి పదేళ్ల ప్రస్థానం యొక్క సింహావలోకనం తో పాటు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆగస్టు 5 వ తేదీన నల్లగొండలో తెలంగాణ జాగృతి స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ ను అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తారు. అనంతరం రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో గత ...

Read More »

బోధన్ ఆర్డీవోగా సుధాకర్‌రెడ్డి

బోధన్: బోధన్ ఆర్డీవోగా 23 నెలలపాటు సేవలను అందించిన జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆదిలాబాద్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఇక్కడికి బదిలీపై వస్తున్నారు. బదిలీలకు సంబంధించిన ఆదేశాలను ఇద్దరు ఆర్డీవోలు అందుకున్నారు. ఫోన్‌ద్వారా సమాచారం అందుకున్న ఆదిలాబాద్ ఆర్డీవో బోధన్‌లో జాయిన్ అయ్యేందుకు సోమవారం ఉదయం వస్తున్నారు. సోమవారం శ్యామ్‌ప్రసాద్‌లాల్ రిలీల్ అయ్యి ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు. శ్యామ్‌ప్రసాద్‌లాల్ రెండేళ్ల పాటు బోధన్ ఆర్డీవోగా సేవలను అందించి ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ప్రశంసలను అందుకున్నారు. ...

Read More »