ఆర్మూర్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ పరిశ్రమను నాశనం చేసే కాట్పా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీవర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బీ.సూర్య శివాజీ అన్నారు. ఆయన అధ్యక్షతన ఆర్మూర్ రామ్ నగర్లో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో భారీ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ, సహాయ కార్యదర్శి ముత్తన్న, ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు, బీడీ కమిషన్ దారుల సంఘం ...
Read More »టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం
నిజామాబాద్, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ పై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో టీఎస్ఎస్ఐ పాస్ జిల్లా ఇండస్ట్రీస్ ప్రమోషన్ కౌన్సిల్ సమీక్ష సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద మంజూరు చేసిన ఎస్సి పెట్టుబడి సబ్సిడీ కింద మైక్రో యూనిట్స్ ఎస్సీ 12 పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ కింద రవాణా రంగంలో మోటార్ క్యాబ్ ...
Read More »కార్పొరేట్ కంపనీల నుండి రైతాంగాన్ని కాపాడాలి
బోధన్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపనీలకు అప్పజెప్పే చట్టాలను, కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దుచేయాలంటూ సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ కొత్త బస్టాండ్ ముందున్న రిలయన్స్ స్మార్ట్ మహల్ వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి మల్లేష్, సీపీఎం నాయకులు జే.శంకర్ గౌడ్, సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ ...
Read More »ఎదగాలంటే మనసు పెట్టి పనిచేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రభుత్వం సమీకత మత్స్య అభివద్ధి పథకం ద్వారా అందిస్తున్న రివాల్వింగ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఉద్భోదించారు. గురువారం ప్రగతిభవన్‌లో మత్స్యశాఖ ఏర్పాటుచేసిన రివాల్వింగ్ ఫండ్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని రివాల్వింగ్ ఫండ్ 50 లక్షల రూపాయల చెక్కులను 16 సంఘాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ మత్స్య పారిశ్రామిక సంఘాలకు అందిస్తున్న ...
Read More »గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెంపు
హైదరాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెట్రో ధరల సెగతో ఇబ్బంది పడుతున్న జనంపై మరో పిడుగు పడింది. దేశంలో చమురు ధరలు వరుసగా పెంచుతూ వస్తున్న పెట్రో కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచాయి. రాయితీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో రాయితీ ...
Read More »చెన్నై షాపింగ్‌మాల్‌లో కార్మికులకు వేతనాలు ఇప్పించాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెన్నై షాపింగ్ మాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇప్పించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ప్రగతిశీల బట్టల దుకాణ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి, కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ జిల్లా నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రారంభమైన చెన్నై షాపింగ్ మాల్లో సుమారు 400 మందికి పైగా కార్మికులు ఆగస్టు 15 నుండి పని ...
Read More »మీ ప్రవర్తన వల్ల యూనియన్‌కు చెడ్డపేరు వస్తుంది
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో సోమవారం సిరిసిల్ల రోడ్డులో ఆంజనేయ కిరాణం షాప్ తెరుచుకొని సరుకులు అమ్ముతున్నట్టు సమాచారం తెలిసింది. వెంటనే కామారెడ్డి కిరాణా వర్తక సంఘం యూనియన్ అధ్యక్షులతో పాటు సభ్యులు వెళ్ళి షాపు యజమాని వినయ్‌తో మాట్లాడారు. కిరాణ షాప్‌లో అడ్డగోలుగా ధరలు పెంచి అమ్ముతున్నారని ప్రజల ఫిర్యాదు చేశారన్నారు. కావున దుకాణం మూసి ఉంచాలని, మీ లాంటి వారి వల్ల యూనియన్‌కు చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. అలాగే యూనియన్‌లో ఐక్యత ...
Read More »లోన్లు రికవరీ చేయడం కూడా అంతే ముఖ్యం
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కలెక్టరేట్ ప్రగతి భవన్లో బాంకర్లతో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్రికల్చర్ లోన్లు, కోవిడ్ లోన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలోన్ల పై మాట్లాడారు. అగ్రికల్చర్ లోన్ల శాతం తక్కువగా ఉన్నదని, దీనిని పెంచి రైతులకు సకాలంలో ఉపయోగపడేలా చూడాలన్నారు. అదే విధంగా కోవిడ్ లోన్‌తో పాటు మరి కొన్ని ప్రభుత్వ లోన్లు కొన్ని బ్యాంకులు ఇవ్వడం లేదని, లేదా అతి తక్కువగా ఇస్తున్నారని బ్యాంకుల వారీగా సమీక్షించారు. ...
Read More »సామాన్యులపై అసాధారణ భారం
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం దేశవ్యాప్త ఆందోళనను చేపట్టింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి, మాజీ మండలి అధ్యక్షుడు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు జిల్లా డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు నియోజకవర్గ ఇంచార్జ్‌లు జుక్కల్ సౌదాగర్ గంగారాం, బాన్సువాడ కాసుల బాలరాజ్, ఎల్లారెడ్డి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పెంచిన పెట్రో ధరలను వెనక్కితీసుకోవాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. ...
Read More »రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్
హైదరాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. రూ.36.36 కోట్ల కమిషన్ విడుదల చేసింది. ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించిన కమిషన్ ఇది. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసల చొప్పున కమిషన్ చెల్లించింది సర్కార్. ఏప్రిల్ నెలలో 3.18 లక్షలు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. కమిషన్ ఇవాళ ...
Read More »వీటి ప్రభావం సామాన్యులపై పడుతుంది
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కామారెడ్డిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. గురువారం కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ చౌరస్తా వద్ద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికంగా పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించాలని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, ఎంసిపిఐయు, ఆర్ఎస్పి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి, ఎస్. వెంకట్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్ ...
Read More »సమస్య ఏదైనా పరిష్కారమయ్యేలా చూస్తా
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎన్డిసిసి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్లతో పిఏసిఎస్ కంప్యూటరీకరణ మరియు లావాదేవీలపై, బ్యాంక్ లోన్ రికవరీ పై మరియు బ్యాంక్ సమస్యలపై, కోవిడ్-19 పై, సమీక్ష సమావేశం నిర్వహించారు. మొదట కోవిడ్-19 గురించి తగిన జాగ్రత్తలు, బ్యాంకుకి వచ్చే కస్టమర్లు లోనికి వచ్చే ముందు మాస్కు ధరించేలా చూసి, చేతులను ...
Read More »అనుమతి లేకుండా పుస్తకాలు విక్రయించొద్దు
కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఆసక్తి కలిగిన బుక్ షాపు యజమానులు నిర్దేశిత ప్రయివేటు పబ్లిషర్స్‌కు 2020-21 విద్యాసంవత్సరానికి జిల్లాలోని ప్రయివేటు పాఠశాలలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు ప్రింటింగ్, సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, సంచాలకులు, జాతీయ పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ హైదరాబాద్ వారు అనుమతినిచ్చారు. కాబట్టి నిర్దేశిత పబ్లిషర్స్ నుండి పాఠ్యపుస్తకాలు పొంది కామారెడ్డి జిల్లాలో విక్రయించటానికి బుక్‌షాపు యజమానులు తమ పేర్లు ఉపవిద్యాశాఖాధికారి కామరెడ్డి కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఒక ...
Read More »మత్స్యకారులకు క్రెడిట్ కార్డులు
నిజామాబాద్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మత్స్యకారులు పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంకు నుండి రుణ సౌకర్యం పొందడానికి ఆసక్తి గలవారు జిల్లా బ్యాంకులను సంప్రదించి లైసెన్సుదారులు దరఖాస్తు చేసుకోవాలని ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్, జిల్లా మత్స్య శాఖ అధికారి యం.రాజారాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజర్వాయర్ వలలు, తెప్పలు కొనుగోలు చేసుకోవడానికి రూ.30 వేలు, మత్స్యకార సంఘాల సభ్యులకు వ్యాపారం చేసుకోవడానికి రూ.25 వేలు, ఆర్.ఏ.ఎస్ (రి సర్క్యులేటరీ ఆక్వాక్చర్ సిస్టమ్) పథకం క్రింద ...
Read More »చిరు వ్యాపారులకు పదివేలు
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో నివసిస్తూ సంచార చిరు వ్యాపారం అనగా రోడ్డుపై కూర్చుని మరియు తిరుగుతూ పండ్లు, కూరగాయలు, రొయ్యలు, ఎండు చేపలు, పాలు పోయడం, రోడ్డుపై మాంసం విక్రయించడం, రోడ్డుపై వాహనాలు రిపేర్ చేయడం మరియు రోడ్డు పై తిరుగుతూ మరియు కుర్చుని ఏదైనా చిరు వ్యాపారం చేసేవారు ఉంటే వారికి ప్రభుత్వం రూ. 10 వేలు బ్యాంక్‌లోన్ ఇప్పిస్తున్నారు. కావున కామారెడ్డి మున్సిపల్ ఆఫీసులోని మెప్మా కార్యాలయంలో సంబంధిత అధికారి ...
Read More »ఎల్లారెడ్డిలో దుకాణాలు తెరిచి ఉంచే సమయమిదే…
ఎల్లారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్-19 కరోనా వైరస్ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఎల్లారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు కరోనా వైరస్ భారిన పడకుండా ముందస్తు చర్యలో భాగంగా పలు నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎల్లారెడ్డి మునిసిపల్ కమీషనర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం ఎల్లారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని అన్ని రకాల వ్యాపార సముదాయాలు హోటళ్లు, వైన్స్ దుకాణములు, చిన్న చిన్న వ్యాపార సంస్థలు, చిన్న చిన్న ...
Read More »ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు దుకాణాలు తెరిచి ఉంచాలి…
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చాంబర్ ఆఫ్ కామర్స్ ఆద్వర్యంలో మంగళవారం ఉదయం అన్ని వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశము నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరి సమిష్టి నిర్ణయం మేరకు బుధవారం నుండి అన్ని వ్యాపార సంస్థలను ఉదయం 9 గంటలనుండి తెరచి సాయంత్రం 4 గంటలకు స్వచ్చందంగా అందరూ మూసివేయాలని తీర్మానించారు. కాబట్టి పట్టణంలోని అన్ని వర్తక వాణిజ్య సంస్థలు ఇట్టి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రకటించిన ...
Read More »వ్యాయామం ద్వారా ఆరోగ్యం
నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా సూచించారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వినాయక్ నగర్లో యమహా షోరూం పైన ఫిట్ 24జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు తమ దైనందిన జీవితంలో బిజీగా మారిపోయారని తద్వారా ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. రోజువారీ జీవన విధానంలో ...
Read More »సవారె ఎలక్ట్రికల్ ఆటో విడుదల
నిజామాబాద్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సవారె ఎలక్ట్రికల్ ఆటోను శుక్రవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మార్కెట్లో విడుదల చేశారు. నగరంలోని వినాయక్‌నగర్‌లోని మైక్రో మోబిలిటి సొల్యుషన్స్ ఆధ్వర్యంలో ఆటోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సమకూరడంతోపాటు పర్యావరణానికి ఇలాంటి ఆటోల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లదన్నారు. పుల్చార్జింగ్ చేసిన తర్వాత వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుందని, ముఖ్యంగా పర్యావరణ సమతుల్యానికి ఇలాంటి ఆటోలు ఎంతో దోహదపడతాయని ...
Read More »శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలు
రెంజల్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలను పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య సమావేశాన్ని మండల అధ్యక్షురాలు జమున అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాల్లో మహిళా సంఘాలు అభివృద్ది చెందాలంటే ప్రతినెల సంఘాలతో సమావేశాలు ఏర్పరుచుకోవాలన్నారు. శ్రీనిధి రుణాలు పెండింగులో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించుకోవాలని తిరిగి మళ్లీ వడ్డిలేని రుణాలు పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. కార్యక్రమంలో సిసిలు శ్యామల, కృష్ణ, రాములు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Read More »