Breaking News

Business

శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలు

  రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీనిధి ద్వారా వడ్డిలేని రుణాలను పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య సమావేశాన్ని మండల అధ్యక్షురాలు జమున అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాల్లో మహిళా సంఘాలు అభివృద్ది చెందాలంటే ప్రతినెల సంఘాలతో సమావేశాలు ఏర్పరుచుకోవాలన్నారు. శ్రీనిధి రుణాలు పెండింగులో ఉన్నవాటిని వెంటనే పరిష్కరించుకోవాలని తిరిగి మళ్లీ వడ్డిలేని రుణాలు పొందవచ్చని ఏపిఎం చిన్నయ్య అన్నారు. కార్యక్రమంలో సిసిలు శ్యామల, కృష్ణ, రాములు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Read More »

భూముల క్రయ విక్రయాలు పారదర్శకతతో జరపాలి

  కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూముల కొనుగోలు, విక్రయాల్లో ఎటువంటి అవినీతి, జాప్యం లేకుండా పారదర్శకంగా జరపాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక మండలాన్ని ఎంపిక చేసిందని, ఇందులో భాగంగా సదాశివనగర్‌ మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో పైలట్‌ ప్రాజెక్టుగా సోమవారం ఆయన ధరణి వెబ్‌సైట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం ధరణి ప్రాజెక్టు ప్రారంభించడం ద్వారా రైతుల భూముల వివరాలు, యజమాని ...

Read More »

గడువు తీరితే రోజుకు రూ.200 ఫైన్‌

న్యూఢిల్లీ: జీఎస్టీ కింద తొలి రిటర్న్‌ దాఖలు చేయని వారికి ఫైన్‌ విధించాలన్న జీఎస్టీ కౌన్సిల్‌ సూచనను ప్రభుత్వం జూలై నెలకు రద్దు చేసింది. గడువులోపు రిటర్న్‌ దాఖలు చేయనివారికి రోజుకు రూ.200 చోప్పున రుసుము విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌ సిఫార్సు చేసింది. జూలై నెలకు జీఎస్టీని రద్దు చేసింది. జూలై నెలకు సంబంధించి ఆగస్టు 25 నాటికి దాఖలు చేయాల్సిన జీఎస్టీఆర్‌-3బిలో జాప్యంపై అపరాధ రుసుము మాత్రమే రద్దు చేశాం. చెల్లించాల్సిన పన్ను మొత్తానికి వడ్డీ మాత్రం కొనసాగుతుంది అని ఆర్థిక మంత్రిత్వ ...

Read More »

అమెజాన్‌లో మళ్లీ ఆఫర్ల వాన!

న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా మళ్లీ ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆపిల్ ఐఫోన్లు, వాచ్‌లు, ఐప్యాడ్‌లు, ఐమ్యాక్‌లపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ ఫెస్ట్‌ పేరుతో నేడు ప్రారంభమైన ఈ ఆఫర్ల వాన రేపటి వరకు కురియనుంది. ఫెస్ట్‌లో భాగంగా ఐఫోన్ 7, ఐఫోన్ 6, ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు ప్రకటించింది. ఐఫోన్ 7, 32 జీబీ వేరియంట్‌పై రూ.11,201 డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఎక్స్‌చేంజ్‌పై అయితే రూ.14,920కే అందిస్తున్నట్టు పేర్కొంది. ఐఫోన్ 6, 32 జీబీ వేరియంట్‌పై రూ.3501, ఎక్స్‌చేంజ్‌‌లో ...

Read More »

జిఎస్‌టి వసూళ్లు రూ.42,000 కోట్లు

న్యూఢిల్లీ: జిఎస్‌టి రూపంలో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తమే చేరుతోంది. సోమవారం ఉదయానికి జిఎస్‌టి పోర్టల్‌ ద్వారా 10 లక్షల మంది పన్ను చెల్లిపుదారులు రూ.42,000 కోట్లు చెల్లించారు. ఇదంతా జూలై నెలకు సంబంధించిన జిఎస్‌టి. జూలై నెల జిఎ్‌సటిని వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఈ నెల 25 లోగా చెల్లించాలి. ఈ గడువు ముగిసేనాటికి జిఎ్‌పటి వసూళ్లు మరింత పెరుగుతాయని అధికారవర్గాల అంచనా. సోమవారం ఉదయానికి వసూలైన రూ.42,000 కోట్ల జిఎ్‌సటిలో రూ.15,000 కోట్లు అంతర్రాష్ట్ర సరుకుల బదిలీకి సంబంధించిన ఐజిఎస్‌టి ద్వారా వసూలైంది. ...

Read More »

కామారెడ్డిలో ఎయిర్‌టెల్‌ 4జి

  కామారెడ్డి, మే 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే వేగవంతమైన నెట్‌వర్క్‌ కలిగి ఉండి కోట్లాది మంది వినియోగదారులు కలిగిఉన్న ఎయిర్‌టెల్‌ సంస్థ వినియోగదారులకు మరింత సులభంగా డాటా కాల్స్‌ను అందజేసేందుకుగాను 4జి సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగానే బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైదరాబాద్‌, మెదక్‌ జోనల్‌ బిజినెస్‌ మాన్‌ విక్రం చంద్‌ ఎయిర్‌టెల్‌ 4జి సేవలను కేక్‌ కట్‌చేసి ప్రారంభించారు. వినియోగదారులకు అతిచౌకగా కాల్స్‌తోపాటు డైలీ 1 జిబి డేటాను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. 349 ...

Read More »

ఆధార్‌లేకుంటే ఖాతాల నిలిపివేత

ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వ హెచ్చరిక ఏప్రిల్‌ 30 వరకు గడువు న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) బహుపరాక్‌.. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేశారా? లేకుంటే ఏప్రిల్‌ 30లోపు మీ బ్యాంకుకు నో యువర్‌ కస్టమర్‌ (కెవైసి) వివరాలతోపాటు ఆధార్‌ నెంబర్‌ను కూడా అందజేయండి. లేని పక్షంలో ఆ ఖాతాను బ్యాంకు అధికారులు స్తంభింపజేస్తారు. ఈ నిబంధన బీమా పాలసీలు, షేర్ల ఖాతాలకు కూడా వర్తిస్తుంది. 2014 జూలై నుంచి ఆగస్టు 2015 వరకు తెరిచిన అన్ని ఖాతాలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆదాయం ...

Read More »

కీలక దశలో జిఎస్‌టి

పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదమే తరువాయి జూలై ఒకటి నుంచి అమలు! కీలకమైన నాలుగు జిఎస్‌టి బిల్లులను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పరోక్ష పన్నులకు సంబంధించి గత స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా చెబుతున్న జిఎస్‌టి పార్లమెంట్‌ ముంగిటకు రావడంతో అమలు ప్రక్రియ తుదిదశకు చేరిందని చెప్పవచ్చు.   న్యూఢిల్లీ: అవరోధాలన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లులు పార్లమెంట్‌ను చేరాయి. జూలై ఒకటి నుంచే జిఎస్‌టి అమలు చేయాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రస్తుత ...

Read More »

ఆన్‌లైన్‌లో నయా వ్యాపార అవకాశాలు

ఇపుడంతా ఆన్‌లైన్‌ మయయే. ఇంట్లో/స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. కాలు బయట పెట్టకుండానే కావలసిన వస్తు, సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో మీకూ ఏదైనా ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేయాలని ఉందా? అయితే ఈ ఐడియాలపై ఒక్కసారి దృష్టి పెట్టండి. ఆహార వ్యాపారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్‌ ఆహార వ్యాపారం క్రమంగా ఊపందుకుంటోంది. ఉద్యోగాలు చేసే చాలా మందికి ఇంట్లో వండుకునే తీరిక ఉండడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కోరిన టైమ్‌కి పసందైన వంటకాలు ...

Read More »

జన్‌ధన్ భారం వల్లనే..పెనాల్టీలకు ఎస్‌బిఐ సమర్థన

ముంబై : ఖాతాల్లో కనీస నెలవారి నిల్వలు లేకుంటే భారీ ఎత్తున జరిమానాలు విధిస్తామని ప్రకటించిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బిఐ… ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ఏమాత్రం చలించలేదు. పైగా తన చర్యను గట్టిగా సమర్థించుకుంది. ప్రభుత్వం పురమాయింపుపై లక్షల సంఖ్యలో తాము పేదల కోసం జన్‌ధన్‌ ఖాతాలను తెరవాల్సి వచ్చిందని, ఈ ఖర్చులన్నీ భరించాలంటే, ఇతర ఖాతాదారులు తమ ఖాతాల్లో తాము సూచించిన విధం గా కనీస నిల్వలను ఉంచాల్సిందేనని ఎస్‌బిఐ పేర్కొంది. లేదంటే జరిమానా వసూలు చేస్తామని ...

Read More »

నంబర్‌ 1 ముకేశే…

 సంపద విలువ 1.74 లక్షల కోట్లు.. 132 మంది దగ్గర రూ.26.26 లక్షల కోట్ల ఆస్తులు న్యూఢిల్లీ :ఒక పక్క కోట్లాది మంది దరిద్ర నారాయణులు. మరోపక్క కుబేరులను తలదన్నే శ్రీమంతులు. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న విచిత్ర పరిస్థితి ఇది. ఇప్పటికిపుడు లెక్కిస్తే మన దేశంలోనూ వంద కోట్ల డాల ర్లు (సుమారు రూ.6,700 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులన్న 132 మంది బిలియనీర్ల సంపద విలువ 39,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.26,26,499 కోట్లు) వరకు ఉంటుందని తాజాగా వెలువడిన ‘హురున్‌ ...

Read More »

హోండా కొత్త యాక్టివా 4జి

ధర రూ.50,730  న్యూఢిల్లీ : సరికొత్త లుక్‌, కలర్లు, ఫీచర్లు, మరింత భద్రతా సదుపాయాలతో కూడిన సరికొత్త యాక్టివా 4జి (నాలుగోతరం) స్కూటర్‌ను హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 110సిసి ఇంజన్‌ కలిగిన ఈ ఆటోమెటిక్‌ స్కూటర్‌ బిఎస్‌4, ఎహెచ్‌ఒ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని కంపెనీ తెలిపింది. దీని ధర 50,730 రూపాయలు (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ). దేశీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో 110 సిసి ఆటోమెటిక్‌ స్కూటర్ల మార్కెట్‌ శరవేగంగా వృద్ధి చెందుతోందని, ఈ మార్కెట్లో తమ ...

Read More »

సమ్మెతో బ్యాంకింగ్‌ సేవలకు విఘాతం

ఎటిఎంలు ఖాళీ.. నిలిచిపోయిన  రూ.22 వేల కోట్ల చెక్‌ క్లియరెన్సులు  న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు ఎటిఎంల్లో నగదు లేకపోవటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన ఒక రోజు సమ్మె పూర్తిగా విజయవంతమైందని, దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఒక్క బ్యాంక్‌ అధికారికంగా కార్యకలాపాలు సాగించలేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (ఎఐబిఈ) ప్రకటించింది. సమ్మె కారణంగా మంగళవారం బ్యాంకులు పనిచేయవని ప్రకటించటంతో ప్రజలు ...

Read More »

నోకియా 3310 మళ్లీ వస్తోంది..

ధర రూ.3,500 వచ్చే త్రైమాసికంలో విడుదల రెండో త్రైమాసికంలో మూడు స్మార్ట్‌ఫోన్లు బార్సిలోనా: కొన్నేళ్ల క్రితం ప్రపంచ మార్కెట్‌ను ఊపేసిన నోకియా 3310 ఫీచర్‌ ఫోన్‌ మళ్లీ రాబోతోంది. కొత్త రూపం, ఫీచర్లతో వచ్చే త్రైమాసికంలో దీన్ని హెచ్‌ఎండి గ్లోబల్‌ విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ధర సుమారు 3,500 రూపాయలు ఉండనుంది. పదేళ్ల కాలానికి నోకియాతో బ్రాండ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్న హెచ్‌ఎండి గ్లోబల్‌.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన నోకియా 6, నోకియా 5, నోకియా ...

Read More »

భారత్‌కు విదేశీ పాలు!

దేశీ ఉత్పత్తి పెరగకుంటే నాలుగేళ్లలో దిగుమతులపైనే ఆధారం పశుగ్రాసం కరువవడంతో తగ్గుతున్న పాల ఉత్పత్తి ఉదయాన్నే పిల్లలకు పాలు, పెద్ద వాళ్లకు చాయ్‌… భోజనంలో నెయ్యి, పెరుగు, తాగడానికి మజ్జిగ.. ఇలా పాలు, పాల పదార్థాల వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. ఇదేస్థాయిలో పాల ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. డిమాండ్‌కు తగిన స్థాయిలో పాల ఉత్పత్తి లేకుంటే రానున్న కాలంలో విదేశీ పాలను దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుందని ప్రభుత్వ గణాంకాల స్పష్టం చేస్తున్నాయి. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న భారత్ సమీప ...

Read More »

ఫ్రీ ఆఫర్‌పై రిలయన్స్ జియో కోర్టుకేం చెప్పిందంటే…

న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న డేటా ఆఫర్లు పూర్తిగా చట్టబద్దమైనవని రిలయన్స్ జియో ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తమకు పూర్తి స్పష్టత నిచ్చిందని వెల్లడించింది. ట్రాయ్ టారిఫ్ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను రిలయన్స్ జియో యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. టారిఫ్ నిబంధనలను అతిక్రమిస్తున్న జియోను నియంత్రించడంలో ట్రాయ్ విఫలమైందని కూడా వొడాఫోన్ తన పిటిషన్‌లో పేర్కొంది. కాగా ఈ పిటిషన్‌పై గురువారం ...

Read More »

హైదరాబాద్‌లో వైమానిక నైపుణ్యాభివృద్ధి కేంద్రం

ఏరో ఇండియా-2017 సదస్సులో ఎంఒయులు  ఏరోస్పేస్‌ రంగంలో అంతర్జాతీయ కంపెనీలతో తెలంగాణ జతకట్టనుంది. ఈ మేరకు బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా-2017 సదస్సులో భాగంగా పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సదస్సుకు తెలంగాణ తరఫున పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌, ఐటి సెక్రటరీ జయేష్‌ రంజన్‌ రెండు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇందులో ఒక ఒప్పందం ప్రకారం ఏరోస్పేస్‌ రంగంలో తెలంగాణ యువతకు నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు ఎయిర్‌బస్‌ కంపెనీతో కలిసి హైదరాబాద్‌లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. బేగంపేట విమానాశ్రయంలో ...

Read More »

ఇన్ఫీలో మరింత బిగిసిన చిక్కుముడి

సిక్కా వేతన పెంపు సబబే, వాటాదారులకే నేను జవాబుదారీ కంపెనీ చైర్మన్‌ శేషసాయి ధిక్కార స్వరం.. తప్పుకునేది లేదని ప్రకటన ముంబై: ఇన్ఫోసిస్‌ బోర్డుపై కంపెనీ సహ వ్యవస్థాపకులు విమర్శనాస్ర్తాలు సంధిస్తున్న నేపథ్యంలో కంపెనీ చైర్మన్‌ శేషసాయి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కంపెనీలో పాలనాపరమైన వ్యవహారాలకు బాధ్యత వహించి తప్పుకోవాలంటూ కొందరు చేస్తున్న ప్రకటనలకు స్పందిస్తూ తనను వాటాదారులందూ కలిసి ఎన్నుకున్నారని, వారిలో నమ్మకం ఉన్నంత కాలం తనను ఎవరూ కదపలేరని తేల్చి చెప్పారు. దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతూ నైతిక ...

Read More »

బంగారం రూ.400 డౌన్‌

మూడు వారాల కనిష్ఠ స్థాయి బులియన్‌ మార్కెట్‌ మరోసారి మూడు వారాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. అంతర్జాతీయ విపణి నుంచి అందిన బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా ఆభరణాల వర్తకుల నుంచి డిమాండు తగ్గడంతో శుక్రవారం ఒక్క రోజులోనే పది గ్రాముల బంగారం దేశ రాజధానిలో 400 రూపాయల మేరకు పడిపోయి 29,500 స్థాయికి వచ్చింది. ఇది మూడు వారాల కనిష్ఠ స్థాయి. జనవరి 16 తర్వాత బంగారం ఇంత కనిష్ఠ స్థాయికి రావడం ఇదే ప్రథమం. మొత్తం మీద న్యూఢిల్లీలో మేలిమి బంగారం ...

Read More »

హెచ్‌1-బి వీసాలపై ఆంక్షలొద్దు..

ట్రంప్‌ను కోరిన స్టార్టప్స్‌ వాషింగ్టన్‌: అమెరికా జారీ చేసే హెచ్‌1-బి వీసాలపై ఆంక్షల పట్ల అక్కడి టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి ఆంక్షల వల్ల నష్టమే తప్ప లాభం జరగబోదన్న అభిప్రాయాన్ని కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. హెచ్‌1-బి వీసాలపై ఎలాంటి కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయవద్దని 100కు పైగా స్టార్టప్‌ కంపెనీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి ఆదేశాల వల్ల స్టార్టప్‌ కమ్యూనిటీపైనేకాకుండా అమెరికా పోటీతత్వంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని సూచించాయి. జాతి సంరక్షణ, ...

Read More »