Breaking News

Crime

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

  రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మొండివాగు నుండి ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

Read More »

వృద్దుని మృతి

  నిజామాబాద్‌ టౌన్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ 3వ టౌన్‌ పరిధిలో బాబురావు (70) అనే వృద్దుడు మృతి చెందినట్టు 3వ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. సార్వజనిక్‌ గణేశ్‌ ఆలయం వద్ద భిక్షాటన చేస్తు జీవనం సాగించే బాబురావు సోమవారం ఉదయం ఆలయం వద్ద చనిపోయినట్టు తెలిపారు. ఎవరైనా బందువులుంటే 9440795416 నెంబరుకు లేదా 3వ టౌన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ అన్నారు. శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.

Read More »

డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌

  నిజామాబాద్‌ టౌన్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో గతనెల 10వ తేదీ నుంచి అక్టోబర్‌ 9 వరకు డయల్‌ 100కు 2271 ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శారీరక హింస కింద 62 కేసులు, ప్రమాదం కేసులు 393 కేసులు, ఆస్తి తగాదాలు 36 కేసులు, ఆత్మహత్య, ఆత్మహత్య యత్నాల కింద 58 కేసులు, తప్పుడు కాల్స్‌ కింద 5 కేసులు, ఇతరత్రా కేసులు ...

Read More »

లోక్‌అదాలత్‌లో 114 కేసులకు పరిష్కారం

  కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌లో 114 కేసులకు పరిష్కారం లభించినట్టు పట్టణ సిఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. కోర్టు లోపల ఏళ్ళ తరబడిగా పరిష్కారానికి నోచుకోని కేసులను కోర్టు వెలుపల లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశముందన్నారు. ఈ క్రమంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో కక్షిదారులు కోర్టు వెలుపల తమ కేసులను పరిష్కరించుకున్నట్టు పేర్కొన్నారు. మెగా లోక్‌ అదాలత్‌లో జడ్జిలు, కక్షిదారులు, పోలీసులు ఉన్నారు.

Read More »

మూఢనమ్మకాలు నమ్మొద్దు

  రెంజల్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్‌ఐ అంబార్య అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని నీలా గ్రామంలో పోలీసు కళాబృందం ద్వారా మూడనమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు మంత్రాలు, చేతబడులు ఉన్నాయంటూ నమ్మరాదని ఒకవైపు సైన్స్‌, కంప్యూటర్‌ యుగంలో దూసుకుపోతున్నా ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో రాఘవేందర్‌, అక్తర్‌, సాయిలు, తదితరులున్నారు.

Read More »

భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. శుక్రవారం కమీషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్రయివేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులో 26 కిలోల గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా బస్టాండ్‌ సమీపంలో పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. గంజాయి తరలిస్తున్న డిచ్‌పల్లి మండలానికి చెందిన గువ్వల దేవయ్యను అదుపులోకి తీసుకున్నట్టు ...

Read More »

దుర్వినియోగమైన నిధులపై విచారణ చేపట్టిన డిపివో

  రెంజల్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కందకుర్తి గ్రామ పంచాయతీలో లబ్దిదారుల మరుగుదొడ్ల నిధులు దుర్వినియోగమవడంతో గురువారం డిపివో కృష్ణమూర్తి విచారణ చేపట్టారు. లబ్దిదారుల మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకుండా నిధులను కాజేసిన కాంట్రాక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాన్ని సంసద్‌ యోజన పథకం కింద 2014లో నిజామాబాద్‌ ఎంపి కవిత దత్తత తీసుకున్నారు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన 379 మంది లబ్దిదారులకు మరుగుదొడ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.10 వేల 800 చొప్పున నిధులు మంజూరు ...

Read More »

రైలులో తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

  కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైలులో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని గురువారం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ నుంచి మన్మాడ్‌ వెళ్తున్న రైలులో తనిఖీ చేయగా రేషన్‌ బియ్యం పట్టుబడింది. సుమారు 3 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకొని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు అప్పగించారు. రైలులో సీట్లకింద రేషన్‌ బియ్యం లభించింది. పోలీసులు ఆరాతీయగా దాన్ని తరలిస్తున్న వారు మాత్రం దొరకలేదు. దాడుల్లో రైల్వే పోలీసులు సివిల్‌ సప్లయ్‌ అధికారులు రాజశేఖర్‌, శాంతయ్య ...

Read More »

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

  కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రేమ విఫలమై క్షణికావేశంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం కామారెడ్డిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సైలన్‌బాబా కాలనీలో నివాసముండే చింతల రాజేశం, బాల లక్ష్మిల కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చింతల రచన (21) ఇటీవలే టిటిసి పూర్తిచేసింది. గత కొంతకాలంగా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన తేజతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారింది. ముందు రచన తేజ ప్రేమను నిరాకరించింది. తర్వాత ప్రేమించుకున్నారు. ఇటీవల ...

Read More »

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు దుర్మరణం

  కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ హోంగార్డు దుర్మరణం పాలైన సంఘటన గురువారం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. భిక్కనూరు పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సముద్రాల రామస్వామి విదులు నిర్వహించేందుకు గురువారం బైక్‌పై పోలీసుస్టేషన్‌కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. హోంగార్డు నడుపుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుకవైపు నుంచి లారీ ఢీకొనడంతో హోంగార్డు సంఘటన స్థలంలోనే మృతి చెందగా అతనితోపాటు బైక్‌పై ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్వాపూర్‌ గ్రామ స్టేజివద్ద జాతీయ ...

Read More »