Breaking News

Crime

ప్రభుత్వ గుర్తింపులేని బ్లూమింగ్‌బడ్స్‌ను మూసివేయాలి

  నిజామాబాద్‌ టౌన్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా సుభాష్‌నగర్‌లో పాఠశాల స్థాపించి ఇష్టానుసారంగా పీజులు వసూలు చేస్తు తల్లిదండ్రులను మోసం చేస్తున్న బ్లూమింగ్‌బడ్స్‌ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని మూసివేయాలని పిడిఎస్‌యు నగర అధ్యక్షుడు రాము డిమాండ్‌ చేశారు. గురువారం మండల విద్యాశాఖాధికారికి వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు.   విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖాధికారులు పలుమార్లు పత్రికాముఖంగా ప్రభుత్వ అనుమతి లేకుండా పాఠశాలలు నడపవద్దని ...

Read More »

ప్రేమించి మోసంచేసిన యువకుడి అరెస్టు

  నందిపేట రూరల్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని లక్కంపల్లికి చెందిన గంగాలత, తల్వేద గ్రామానికి చెందిన గంగాధర్‌ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తనను పెళ్ళిచేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని మనస్తాపానికి గురైన గంగాలత సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కుటుంబీకులు ఆగ్రహంతో ప్రియుడి ఇంటిముందు గోతితవ్వి శవాన్ని ఇక్కడే ఉంచుతామని గొడవ చేయడంతో ప్రియుడు గంగాధర్‌ ఇంటికి తాళం వేసి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న నందిపేట ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ అక్కడికి చేరుకొని గంగాధర్‌ను ...

Read More »

మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

  రెంజల్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నా ఆబ్కారీ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. మద్యం మాఫియాను పెంచిపోషిస్తున్న ఆబ్కారీ అధికారులు ఇకనైనా నిద్రమత్తు వీడి గ్రామాలలోని బెల్ట్‌ షాపులపై దాడులు జరిపి వాటిని నియంత్రించాలని మండల ప్రజలు వాపోతున్నారు. గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్నా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారని మద్యం వ్యాపారులు సిండికేటుగా మారి మందు బాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఒక్కో క్వాటర్‌ ...

Read More »

తాడ్‌బిలోలిలో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

రెంజల్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో బుధవారం రాత్రి గూండ్ల లింగం (40) అనే వ్యక్తి ఇంట్లో వున్న దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం భార్యాభర్తలు లింగం, పద్మల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని వివరించారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరేసుకున్నాడని చెప్పారు. పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు ...

Read More »

అశోక్‌నగర్‌ కాలనీలో చోరికి యత్నం

  కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని అశోక్‌నగర్‌ కాలనీలో గుర్తు తెలియని ముగ్గురు మహిళలు చోరీకి యత్నించారు. ఇంటికి వేసిన తాళాన్ని గుర్తించి పగులగొట్టి బీరువాలోని వస్తువులను చిందరవందర చేశారు. బాధితుడు కండక్టర్‌ జానకిరాం కుటుంబీకులు తాళం పగిలి ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిసి కెమెరాల్లో మహిళలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Read More »

అమిత్‌షాపై దాడి అమానుషం

  నిజామాబాద్‌ టౌన్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులు టక్కర్‌ హన్మంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అమిత్‌షా కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కొండదిగి అలిపిరి చేరే సరికి ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు అతని కాన్వాయ్‌పై కర్రలు, రాళ్ళు రువ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఏవైనా సమస్యలుంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలిగాని ఇలా భౌతిక దాడికి పాల్పడడం సరికాదని, ఈ ...

Read More »

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన భర్త పెద్ద బాల్‌రాజ్‌పై దాడిచేసిన చిన్నబాల్‌రాజ్‌పై చర్యలు తీసుకోవాలని పెద్దబాల్‌రాజ్‌ భార్య సుశీల జిల్లా కలెక్టర్‌ను కోరారు. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుకు వినతి పత్రం అందజేసి ఆమె విలేకరులతో మాట్లాడారు. తమకు మాక్లూర్‌ మండలం అడవిమామిడిపల్లి గ్రామంలో భూమి, ప్లాట్‌ ఉందని, స్థలంలో చిన్నబాల్‌రాజ్‌ అతని భార్య విజయలక్ష్మి కబ్జాచేశారని, ఈ విషయంపై తన భర్త పెద్ద బాల్‌రాజ్‌ సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు కోరగా ...

Read More »

ఎస్‌ఆర్‌ఎస్‌పి భూముల్లో కబ్జా అడ్డుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంల బాద్గుణ గ్రామ శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పి భూముల్లో కొందరు ఆక్రమించుకొని సాగుచేస్తున్నారని దీనివల్ల గొర్రెలు, గేదెల పెంపకం దారులమైన తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, బాద్గుణ సర్వసమాజ్‌ కమిటీ అధ్యక్షుడు భోజన్న సోమవారం జిల్లా కలెక్టర్‌ ను ప్రజావాణిలో కోరారు. బాద్గుణ గ్రామ శివారులో కొందరు పెత్తందారులు ఎస్‌ఆర్‌ఎస్‌పి భూముల్లో అక్రమంగా సాగుచేయడమే గాకుండా పెద్ద ఎత్తున గుంతలు తోడారని, దీనివల్ల తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనికి ...

Read More »

పలువురికి కౌన్సిలింగ్‌ నిర్వహించిన పోలీసులు

  నిజామాబాద్‌ టౌన్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అదనపు డిసిపిలు ఆకుల రాంరెడ్డి, శ్రీధర్‌రెడ్డిలు సోమవారం పలువురు యువతకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరిగింది. పేకాట, మద్యంసేవించి వాహనాలు నడుపుతూ దొరికినవారు, క్రికెట్‌ బెట్టింగ్‌లో దొరికిన వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత పెడదోవ పట్టకూడదని, బెట్టింగ్‌ల వల్ల జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని, ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోతారని, తద్వారా ఇతర నేరాలకు పాల్పడినవారవుతారని స్పష్టం ...

Read More »

ప్రజావాణిలో 56 పిర్యాదులు

  కామారెడ్డి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 56 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. రెవెన్యూ-35, డిఆర్‌డిఎ-2, ఆరోగ్యం-2, డిపివో 3, మత్స్యశాఖ-3, రవాణాశాఖకు సంబందించిన 3 ఫిర్యాదులు అందాయన్నారు. పిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సంబందిత శాఖాధికారులకు వాటిని పంపారు. వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.

Read More »