Breaking News

Crime

పేకాట స్థావరంపై దాడి – ఏడుగురి అరెస్టు

  రెంజల్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్‌ఐ రవికుమార్‌ తమ సిబ్బందితో దాడిచేసి ఏడుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వారి వద్దనుంచి 4,150 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. ఆయన వెంట కానిస్టేబుల్లు గంగాధర్‌, వసంత్‌, జలయ్య, ప్రసాద్‌ తదితరులున్నారు.

Read More »

యువకుడి అత్మహత్య

  నిజామాబాద్ అర్బన్ : నగరంలోని చంద్రబాబు కాలనీలో ఓ యువకుడు మంగళవారం ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదో టౌన్ ఎస్సై సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం నాందేడ్‌కు చెందిన హన్మాని మంతోజీ(35) కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు కాలనీలో నివసిస్తున్నాడు. పోలియో కారణంగా మంతోజీ వికలాంగుడు కావడంతో కుటుంబంపై ఆధారపడి జీవించే వాడు. అతడి సోదరికి వివాహం జరిగిన కలతల కారణంగా వారు ఇంటి వద్దనే ఉండడంతో వారితో పాటు తాను కుటుంబానికి భారం అవుతున్నానని బాధపడేవాడని సమాచారం. మధ్యాహ్నం ఇంట్లో ...

Read More »

దొంగకు ఏడు నెలల జైలు శిక్ష

  నందిపేట్ : మండల కేంద్రంలోని పాత పెట్రోల్ బంకు వద్ద ఉన్న శ్రీజ కిరాణా దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డ పడమటి ఎల్లప్పకు ఏడు నెలల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది. నిజామాబాద్‌లోని మిర్చి కంపౌడ్‌కు చెందిన పడమటి ఎల్లప్ప గతేడాది డిసెంబర్ నెలలో శ్రీజ కిరాణా దుకాణం తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి నగదు, వస్తువులు, సెల్‌ఫోన్ అపహరించుకుపోయాడు. ఈ కేసుకు సంబంధించి ఆర్మూర్ న్యాయస్థానంలో మంగళవారం జ్యూడీషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి ఉదయ్‌కుమార్ తీర్పును వెల్లడించారు. ఏడు నెలల సాధారణ ...

Read More »

యువతి అదృశ్యం

  ఆర్మూర్: పట్టణంలోని జిరాయత్‌నగర్‌కు చెందిన అజ్మీసదాఫ్(17) మంగళవారం అదృశ్యమైంది. హైదరాబాద్‌లో అరబిక్‌అలీమ్ కోర్సు చేస్తున్న యువతి ఏప్రిల్ 18న ఇంటికి వచ్చింది. సోమవారం రాత్రి అందరితో కలిసి భోజనాలు చేసి పడుకున్న యువతి మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిందని తండ్రి ఇంతియాజ్‌అలీ ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో కె.సీతారాం తెలిపారు.

Read More »

గుర్తుతెలియని మహిళ మృతి

నిజామాబాద్‌ అర్బన్‌,: జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. రైల్వే ఎస్సై సాయినాథ్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫాంపై అనారోగ్యంతో పడి ఉండడంతో ఆమెను 108లో చికిత్స నిమిత్తం సోమవారం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గుర్తుతెలియని మహిళ వయస్సు సుమారు 24 ఏళ్లు ఉంటుందని, అనారోగ్యం వల్ల మృతి చెంది ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కేసు నమోదు చేసి శవ పరీక్ష నిమిత్తం ...

Read More »

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

పట్టుకోబోయిన గూర్ఖాను నెట్టేసిన దొంగలు పోలీసుల రాకతో పరారు బాల్కొండ: బాల్కొండలో మంగళవారం తెల్లవారు జామున రెండున్నర గంటల ప్రాంతంలో నలుగురు దొంగల ముఠా ఇండియా 1 ఏటీఎంలో చోరీకి విఫల యత్నం చేశారు. దొంగలను పట్టుకో బోయిన గూర్ఖాను దొంగలు నెట్టేశారు. అంతలోనే పోలీసులు రావడంతో దొంగలు తలో దిక్కుగా పరారయ్యారు. పోలీసులకు దొంగలు పట్టుబడే వారే కాని తృటిలో తప్పించుకున్నారు. వారి ఆచూకీ చుట్టు పక్కల గాలించినా లభించలేదు. నలుగురు దొంగల ముఠా ఏటీఎంలోని డబ్బులను దొంగిలించడానికి గడ్డపారలాంటి ఆయుధంతో యంత్రాన్ని ...

Read More »

వడదెబ్బతో వ్యక్తి మృతి

  మోర్తాడ్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రమైన మోర్తాడ్‌ జాతీయ రహదారి పక్కనే మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందాడని మోర్తాడ్‌ ఎస్‌ఐ అశోక్‌రెడ్డి అన్నారు. వ్యక్తి తలపై టవల్‌ చుట్టుకొని రోడ్డుపక్కన వస్తుండగా తూలిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకొని భీమ్‌గల్‌ సిఐ రమణారెడ్డికి సమాచారం అందించారు. సిఐ అక్కడికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టామన్నారు.

Read More »

కేరళలో మరో నిర్భయ ఘటన

కేరళలో మరో నిర్భయ ఘటన జరిగింది. ఢిల్లీలో నిర్భయపై మాదిరిగానే అత్యంత దారుణంగా ఎర్నాకుళం లో విద్యార్థిపై దుండగులు అత్యాచారం జరిపారు. 30 ఏళ్ల దళిత లా విద్యార్థిని పై మృగాల మాదిరిగా తెగబడ్డారు. అత్యాచారం చేయటమే కాకుండా అత్యంత దారుణంగా ఆమె హతమార్చారు. బాధితురాలి కడుపులోని అవయవాలు బయటకు వచ్చేలా దారుణానికి ఒడిగట్టారు. ఎర్నాకులం జిల్లా పెరంబదూర్‌ లోని బాధితురాలి ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. బాధితురాలి గొంతు నులిమినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆమె ఒంటిపై 30 కి పైగా తీవ్ర గాయాలున్నాయి. ...

Read More »

వికటించిన విందు భోజనం

కోటగిరి: విందు భోజనం వికటించింది. దాదాపుగా 80 మంది అస్వస్థతకు గురయ్యారు. కోటగిరి మండలం సులేమన్‌నగర్‌ గ్రామంలో సోమవారం పాషా, సాధక్‌ ఇళ్ల వద్ద వారి కుమార్తెల వివాహం జరగడంతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందు భోజనం ఆరగించిన పలువురు గ్రామస్థులు సాయంత్రం వాంతులు, విరేచనాలతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యారు. ఒక్క బోధన్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోనే 40 మందికి పైగా బాధితులు చేరారు. మరో 40 మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ బోధన్‌ ...

Read More »

కళ్యాణలక్ష్మిలోనూ అక్రమాలే!…

ఆర్మూర్‌ పట్టణంలో షాదీ ముబారక్‌ పథకంలో అక్రమాలు జరిగిన వ్యవహారం మరువక ముందే నిజామాబాద్‌ మండలంలో అక్రమాల ‘చిట్టా’బయటపడింది. కళ్యాణలక్ష్మి పథకాన్ని అడ్డదారిలో అనర్హులు లబ్ది పొందినట్లుగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు ఏసీబీ అధికారులు కూడా దృష్టి సారించారు. మొత్తం 150 మంది లబ్ధిపొందగా ఇందులో 90కిపైగా అనర్హులు ఉన్నట్లుగా తేలింది. తాజాగా నిజామాబాద్‌ గ్రామీణ ఠాణాలో ఇద్దరిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదవడం విశేషం. కళ్యాణలక్ష్మి పథకాన్ని తొలుత ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పరిమితం చేశారు. ఈ ...

Read More »