Breaking News

Crime

బాల నేరస్తుల భవిష్యత్తు మనందరి బాధ్యత

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల నేరస్తుల భవిష్యత్తు మన అందరి బాధ్యత అని నిజామాబాద్‌ అదనపు డిసిపి (అడ్మిన్‌) రాంరెడ్డి అన్నారు. శనివారం పోలీసు కమీషనర్‌ కార్యాలయంలో జరిగిన బాల నేరస్తుల చట్టం 2015 నూతన విధి విధానాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాంరెడ్డి మాట్లాడారు. నేరాలకు సంబందించి బాల నేరస్తులు పట్టుబడినపుడు వారితో సున్నితంగా వ్యవహరించాలని, పిల్లలకు మానసిక పరిపక్వత ఉండదని, వారిపట్ల జాగ్రత్తగా వ్యవహరించి బంగారు ...

Read More »

గుర్తు తెలియని వాహనం డీ కొని సంఘటన స్థలంలొనే యూవకుడు మృతి

కామారెడ్డి జిల్లా… నిజాంసాగర్ మండలం లోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం డీ కొని సంఘటన స్థలం లొనే ఎల్లారెడ్డి మండలానికి చెందిన సతీష్ (23) అనే యూవకుడు మృతి.. మృతి చెందిన సతీష్ నారాయణఖేడ్ వైపు నుండి ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డి కి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం…  

Read More »

భారీ మొత్తంలో క్లోరోహైడ్రేట్‌ స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌ ఎక్స్‌రోడ్డు వద్ద ఎక్సైజ్‌ ఎన్‌పోర్సుమెంట్‌ బృందం సోమవారం జరిపిన రూట్‌ వాచ్‌లో భారీ మొత్తంలో కల్తీకల్లుకు వినియోగించే 180 కిలోల క్లోరోహైడ్రేట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ డిప్యూటి కమీషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ తెలిపారు. సోమవారం ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుంకెట్‌కు చెందిన గంధం శ్రీనివాస్‌ గౌడ్‌ అలియాస్‌ సుంకెట్‌ శ్రీను తన ఇండికా వెస్తా కారులో క్లోరోహైడ్రేట్‌ తరలిస్తుండగా ...

Read More »

కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేటర్‌ షకీల్‌పై చర్యలు తీసుకొని తమ భూమి కబ్జానుంచి రక్షించాలని నిజామాబాద్‌ నగరానికి చెందిన ఏ.ఆనంద్‌కుమార్‌, అతని సోదరులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బాధితుడు ఆనంద్‌ మట్లాడుతూ తమకు మాలపల్లి ప్రాంతంలో వారసత్వంగా లభించిన భూమి (సర్వే నెంబరు 2481, 2482, 2484)ని స్థానిక కార్పొరేటర్‌ కబ్జాచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, ఇది గమనించి హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు కూడా తమకు అనుకూలంగా స్టే ఆర్డర్‌ ఇచ్చిందని, ...

Read More »

ప్రజావాణిలో 44 పిర్యాదులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహిత భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 44 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఇందులో పంచాయతీరాజ్‌ 5, మునిసిపల్‌ 5, రెవెన్యూ 14, డిఆర్‌డిఎ 4, వ్యవసాయ శాఖ 4,. మత్స్యశాఖ 3 సంబంధించి ఫిర్యాదులు అందాయన్నారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

Read More »

డయల్‌ యువర్‌ సిపిలో 12 పిర్యాదులు

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమానికి 12 పిర్యాదులు అందాయి. బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్‌ల నుంచి 12 ఫిర్యాదులు అందినట్టు కమీషనర్‌ తెలిపారు. ఇట్టి ఫిర్యాదులను ఆయా పోలీసు స్టేషన్‌ల అదికారులకు పంపి బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.

Read More »

రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

  కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి రైల్వేస్టేషన్‌లో శనివారం ఆర్‌పిఎఫ్‌ ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు ఆకస్మిక తనికీ చేశారు. ప్లాట్‌ఫారాలను స్టేషన్‌ పరిసరాలను తనిఖీ చేశారు. రైళ్ళ రాకపోకల వివరాలను ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. అంతకుముందు రైల్వే ఔట్‌ పోస్టు పోలీస్‌ స్టేషన్‌లో తనిఖీలు చేశారు. ప్రయాణీకుల వద్దకెళ్ళి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పదుల బ్యాగులను పరిశీలించారు. ఆయన వెంట రైల్వే సిబ్బంది గన్‌ నాయక్‌, వెంకటరాం ...

Read More »

అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి

  కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండలం సంగమేశ్వర్‌ గ్రామంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని గ్రామస్తులు గురువారం జాయింట్‌ కలెక్టర్‌ సత్తయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగమేశ్వర్‌ గ్రామంలో హనుమాన్‌ ఆలయం పక్కన గ్రామ పంచాయతీ అనుమతి పొందకుండా క్రిస్టియన్‌ ట్రస్టు భవనం పేరిట అక్రమ నిర్మాణం చేపట్టారన్నారు. దీనికి సంబంధించి నిర్మాణం నిలుపుదలకోసం గ్రామ పంచాయతీ నుంచి నోటీసులు జారీచేసినా అక్రమంగా ట్రస్టు భవన నిర్మాణం చేపడుతున్నారన్నారు. ...

Read More »

కాల్‌సెంటర్‌ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌ ప్రాంతంలో ఎస్‌కెఎస్‌ అనే కాల్‌సెంటర్‌ సంస్థను స్థాపించి నిరుద్యోగుల వద్దనుంచి ఒక్కొక్కరినుంచి రూ. 20 నుంచి 30 వేల వరకు వసూలు చేసిన సంస్థ నిర్వాహకులను 4వ టౌన్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో కాల్‌సెంటర్‌ సంస్థను ప్రారంభించి నిరుద్యోగ యువత నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు 4వ టౌన్‌ పోలీసులు సంస్థ నిర్వాహకులను ...

Read More »

ఎండు గంజాయి స్వాధీనం

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రావు తెలిపారు. బుధవారం ఎక్సైజ్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణఖేడ్‌ నుంచి గంజాయి తీసుకొచ్చి కామారెడ్డి జిల్లా కేంద్రంగా ముంబయికి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్సు బృందం పట్టుకొని ఇద్దరు వ్యక్తుల నుంచి 20 కిలోల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జుక్కల్‌ మండలం పోచారం గ్రామానికి చెందిన ...

Read More »