Breaking News

Crime

బైక్‌ దగ్ధం

ఇందూరు, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని హమాల్‌వాడికి చెందిన నల్లూరి శ్రీకాంత్‌ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం (యమహ లిబరో)ను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్దం చేసినట్టు 3వ టౌన్‌ ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు. ఈ మేరకు శ్రీకాంత్‌ రోజువారి లాగే రాత్రి నిదిరించే సమయంలో తన వాహనాన్ని ఆరుబయట ఉంచాడని, దీంతోగుర్తు తెలియని వ్యక్తులు కాల్చేసి ఉంటారని తెలిపారు. శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన అన్నారు. Bike ...

Read More »

ఆర్టీసి బస్సు ఢీ – మృతి చెందిన వృద్ధుడు

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని రైల్వే స్టేషన్‌ఎదుట బుధవారం ఆర్టీసి బస్సు ఢీకొని జానకంపేట గ్రామానికి చెందిన లింబాద్రి (60) అనే వృద్దుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో సమాచారం అందుకున్న 1వ టౌన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవ పంచనామా చేశారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్టు 1వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో తెలిపారు. RTC bus hits an old man limbadri aged ...

Read More »

పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళి… పోలీసుల కాగడాల ర్యాలీ

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రీల్‌ 7: నల్గోండ జిల్లాలో కాల్పుల్లో మరణించిన పోలీసుల అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని మంగళవారం రాత్రి పోలీసులు కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నిజామాబాద్‌ నగరంలోని ఎ.ఆర్‌.హెడ్‌ క్వార్టరర్స్‌ వద్ద ర్యాలీని నిజామాబాద్‌ డిఎస్పీ అనిల్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రజల కోసం విధి నిర్వహణలో పోలీసులు ఎప్పుడు ప్రాణాలు అర్పించేందుకు సిద్దంగా ఉంటారని అన్నారు. అనంరతం ర్యాలీ ఎన్‌.టి.ఆర్‌ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ మీదుగా అమరవీరుల స్థూపం వద్దకు చెరుకున్నారు. ఈ ...

Read More »

పందికొక్కుల్లాగా అక్రమంగా చీకటి దందాలో ఐసిడిఎస్‌ బియ్యం తరలింపు

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెలలు గడవక ముందే పసిపిల్లలకు ఇవ్వాల్సిన ఈ బియ్యాన్ని ఓ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఆహరభద్రత కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకొని కొందరు కాంట్రాక్టర్లు చీకటి దందాలో ఈ బియ్యాన్ని అక్రమంగా చీకటి దందాలో తరలిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులు సోదాలు చేసినా కేసులు నమోదు చేసినా, వారి దందాను మాత్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా దర్జాగా సాగుతున్నాయి. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా వీరికి రాజకీయ ...

Read More »

దొంగ అరెస్టు – బైక్‌ స్వాధీనం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ గ్రామానికి చెందిన తాళ్ల చిన్నయ్య అలియాస్‌ ప్రవీణ్‌ బైక్‌ దొంగతనం కేసులో సోమవారం అరెస్టు చేసినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… బల్కొండ పోచమ్మ గల్లికి చెందిన ప్రవీణ్‌ గతనెల 24వ తేదీన దేగాం గ్రామానికి చెందిన చిన్న ముత్తన్న హీరో గ్లామర్‌ టిఎస్‌ 16 ఇడి 0541 నెంబరు గల వాహనాన్ని దొంగిలించినట్టు తెలిపారు.కాగా బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం ...

Read More »

మనుషుల అక్రమ రవాణాపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షలమందిని లైంగిక వ్యాపారానికి అక్రమంగా తరలిస్తున్నారని, ఇందులో ఆడవారు, మగవారు, చిన్న పిల్లలు ఉన్నారని ”ప్రజ్వల” మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుమారుగా 10 లక్షల మంది చిన్న పిల్లలను వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణా గత 30 సంవత్సరాల ...

Read More »

చీకటి దందాలో విచ్చలవిడిగా డోమెస్టిక్‌ సిలిండర్లు

– చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు ఇందూరు, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచితంగా సిలిండర్లను అందించే దీపం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గతంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గానికి 5 వేల చొప్పున సిలిండర్లను మంజూరు చేసిన విషయం కూడా తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా మొత్తం మీదుగా 9 నియోజకవర్గాలకు కలిపి 45 వేల దీపం సిలిండర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ...

Read More »

చెరువులో పడి గొర్లకాపరి మృతి

రెంజల్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన చిలుకూరి మల్లేశ్‌ (30) అనే వ్యక్తి రోజు మాదిరిగానే ఉదయం గొర్లుకాయడానికి వెళ్లి మంద ఒక్కసారిగా చెరువులోకి వెళ్లడంతో వాటిని బయటికి తెచ్చే ప్రయత్నం చేయగా కాలుజారి చెరువులో పడ్డాడు. దీంతో ఈత రాక అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్‌ఐ చామంతుల టాటాబాబు తెలిపారు. మృతుడి పెదనాన్న పుల్లల సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. మృతుడికి భార్య రాద, ఇద్దరు ...

Read More »

గుర్తు తెలియని మహిళ శవం లభ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని తహసీల్‌ కార్యాలయం సమీపంలో శనివారం గుర్తు తెలియని మహిళా శవాన్ని కనుగొన్నట్టు పట్టణ ఎస్‌ఐ సంతోష్‌ తెలిపారు. మృతురాలికి 40 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచుతామని, ఎవరైనా సంబంధీకులు వస్తే అందజేస్తామన్నారు.

Read More »

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుని మృతి

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి పోలీసుస్టేషన్‌ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన మోహన్‌ (35) మృతి చెందినట్టు ఎస్‌ఐ ముజుబూర్‌ రహమాన్‌ తెలిపారు. మృతుడు మోహన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. మోహన్‌ ద్విచక్రవాహనంపై వెళుతుండగా జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో మోహన్‌ అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ...

Read More »

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవికుమార్‌ అనే యువకుడు గత నెల 27వ తేదీన ఆర్మూర్‌ మండలం ఆలూరు గ్రామంలో లోబిపి కారణంగా కిందపడినట్టు, దీంతో అతన్ని స్థానికలు హైదరాబాద్‌లోని గాంధీఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడచికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు ఆర్మూర్‌ సిఐ రవికుమార్‌ తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.

Read More »

తాగుబోతుల తాటతీయుండ్రి సార్లూ…!

  నిజామాబాద్‌, మార్చి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో ఓ మందు దుకాణం ముందుగా మేము మందుతాగిన మత్తులో ఏం చేసినా ఏ ఒక్కరు మమ్మల్ని ఎవరేం చేయరు. ఎందుకో ఎరికేనా గా మందు దుకాణంకు పర్మిట్‌రూం లేదు. మేం రోడ్లమీదనే మందు తాగుతం, ఇగ రోడ్డుమీదపోయే ఆడోళ్లను, పోరగాళ్లను ఇష్టమొచ్చినట్టు చిడాయిస్తం. అయినా మమ్మల్ని ఎవరేం చేయరు. ఎందుకో ఎరుకన గా మందు దుకాణం యజమాని మందు దుకాణానికి మేం పోకపోతే గిరాకేగాదు. ఇగ ఆయన గిరాకీ ...

Read More »

సంఘాల పేరిట ప్రజలను మభ్యపెడితే కఠిన చర్యలు తప్పవు

  – జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత కొన్నేళ్ళుగా ఇందూరు రైతాంగ సమాఖ్య, విద్యుత్‌ పోరాట కమిటీ, స్త్రీశక్తి బీడీ వర్కర్స్‌ యూనియన్‌ అనే పిడిఎస్‌యు విజృంభనకవరు సంఘాల పరుతో రైతులను, మహిళలను, విద్యార్థులను, యువతీ యువకులను తమ వైపునకు తిప్పుకుంటూ సానుభూతి లేకుండా వారిచేత చట్టవ్యతిరేక పనులు చేయిస్తు వారి చేతులకు మట్టి అంటుకోకుండా కొందరు నాయకులు వారిచేత ఆయుధాలను సరఫరా చేయిస్తున్న విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వచ్చింది. ఈ ...

Read More »

ఎంతటివారికైనా శిక్షతప్పదు

  -మమ్మల్ని నమ్మండి, మీకు న్యాయం చేకూరుస్తాం నిజామాబాద్‌, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మా పోలీసులను నమ్మండి, తప్పుచేసినవారు ఎంతటివారైనా శిక్షతప్పదని 3వ టౌన్‌ ఎస్‌హెచ్‌వో శ్రీహరి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే… నగరంలోని స్థానిక హమాల్‌వాడికి చెందిన బల్ల వినయ్‌ (26) అనే వ్యక్తి మార్చి 21వ తేదీ శనివారం రాత్రి 10 గంటల సమయంలో స్తానిక మైసమ్మ మందిరంలో నిద్రిస్తుండగా తనను నిద్రనుంచి లేపి అదేవీధికి చెందిన చక్రధర్‌ అనే వ్యక్తి తనను ...

Read More »

ఆహారభద్రత కార్డు @ 1000/-

  రూ. పది ఇస్తే ఫాం, రూ. వెయ్యి ఇస్తే ఆహారభద్రత కార్డు నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని సాక్షాత్తు తహసీల్‌ కార్యాలయ ప్రాంగణంలో రూపాయలు పది ఇస్తే ఆహారభద్రత కార్డు ఫారం నింపి, అనంతరం రూపాయలు వెయ్యి ఇస్తే ఆహారభద్రత కార్డు ఇప్పిస్తామని బయట కూర్చున్న దళారులు ప్రజలను మభ్యపెడుతూ వారి అవసరాలను సొమ్ము చేసుకుంటున్న సంఘటన తహసీల్‌ కార్యాలయం వద్ద వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై నగరం నలుమూలల నుంచి వచ్చే ప్రజలు, నిరక్షరాస్యులను ...

Read More »

కామారెడ్డి బంద్‌ విజయవంతం

  కామారెడ్డి, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామారెడ్డి పట్టణ బంద్‌కు సోమవారం వ్యాపారస్తులు ఇచ్చిన పిలుపు విజయవంతమైంది. మునిసిపల్‌ లో పనిచేస్తున్నఓ కార్మికుడు వ్యాపారస్తునిపై దాడిచేయడాన్ని నిరసిస్తూ వ్యాపారస్తులు సోమవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాపారస్తులు స్వచ్చందంగా దుకాణాలు మూసి బంద్‌ పాటించారు. పట్టణంలోని సుభాష్‌రోడ్డు, గంజ్‌, స్టేషన్‌రోడ్‌తో పాటు వివిధ ప్రాంతాల్లోని దుకాణాలను మూసి ఉంచారు. వ్యాపారస్తులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్టీవో కార్యాలయానికి తరలివెళ్లారు. అనంతరం ఆర్టీవోకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు ...

Read More »

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య యత్నం

  నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని స్థానిక హమాల్‌వాడికి చెందిన బల్ల వినయ్‌ (26) అనే వ్యక్తి శనివారం రాత్రి 10 గంటల సమయంలో స్తానిక మైసమ్మ మందిరంలో నిద్రిస్తుండగా తనను నిద్రనుంచి లేపి అదేవీధికి చెందిన చక్రధర్‌ అనే వ్యక్తి తనను అక్కడ నిద్రించకూడదని పక్కనేగల కుళాయి పైపుతో దారుణంగా కొట్టాడని బాధితుడు నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌తో విన్నవించుకున్నాడు. వినయ్‌ కథనం ప్రకారం… చక్రధర్‌ తనను కుళాయిపైపుతో దారుణంగా కొట్టడంతో తన గోడును విన్నవించడానికి వెంటనే ...

Read More »

4 వంటగ్యాస్‌ సిలిండర్ల సీజ్‌

నిజామాబాద్‌, మార్చి 18 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో బుధవారం మునిసిపల్‌ కమీషనర్‌ పర్యటిస్తుండగా తనదృష్టికి వచ్చిన గోల్‌హనుమాన్‌ వద్దగల నర్సింహ టిఫిన్‌సెంటర్‌లో 4 వంటగ్యాస్‌ సిలిండర్లు ఉండడంత వెంటనే తాను స్పందించి సంబంధిత సివిల్‌ అసిస్టెంట్‌ గ్రేన్‌ పర్సేజ్‌ ఆఫీసర్‌ సప్లయర్స్‌ శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకొని సిలిండర్లతోపాటు టిఫిన్‌సెంటర్‌ను సీజ్‌ చేశారు. అట్టి వంటగ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకొని నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి జాయింట్‌ కలెక్టర్‌కు అప్పగించనున్నట్టు సమాచారం ఇచ్చారు. ఈ విషయమై జాయింట్‌ ...

Read More »

ఆస్తి కోసం రక్తసంబంధీకులను బెదిరిస్తున్న అధికారపార్టీ జడ్పిటిసి

నిజామాబాద్‌, మార్చి 16   నిజామాబాద్‌ న్యూస్‌ : తన సొంత అన్న ఆస్తి కోసం వారి అన్న భార్య, కూతుళ్ళను అధికార వ్యామోహంలో పడి రక్తసంబంధాలు మరిచిపోయి బెదిరిస్తున్నాడు ఓ రాజకీయ ప్రబుద్ధుడు. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ మండలంలోగల చేపూర్‌ గ్రామానికి చెందిన జడ్పిటిసి సాందన్న అధికార వ్యామోహంతో తనను ఎవరేమి చేయలేరని రాజకీయ అండదండలతో తన సొంత అన్న అయిన సారంగి నడిపి సాయన్న భార్య, పిల్లలను బెదిరిస్తున్నాడని సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సారంగి నడిపి సాయన్న భార్య ...

Read More »

నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటివారికైనా కఠిన చర్యలు తప్పవు

– నిజామాబాద్‌ మునిసిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వర్లు నిజామాబాద్‌, మార్చి 16 నిజామాబాద్‌ న్యూస్‌ : సోమవారం ఉదయం 6.30 గంటలకు 22వ డివిజన్‌లో మునిసిపల్‌ కమీషనర్‌ వెంకటేశ్వర్లు తన బృందంతో కలిసి విస్తృతంగా పర్యటించారు. అడుగడుగునా సమస్యలను కళ్ళారా చూశారు. మురికి కాల్వల అపరిశుభ్రతపై అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా అభివృద్దికి మాత్రం ఆమడ దూరంలో ఉన్న పరిస్తితులను చూసి అవాక్కయ్యారు. 22వ డివిజన్‌లోని పరిస్థితులను, సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా స్థానికులు కమీషనర్‌ వద్దకు వచ్చి సమస్యలపై తమ ...

Read More »