Breaking News

Crime

శిఖం భూమిని కబ్జా దారుల నుండి కాపాడాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 01 సారంగపూర్‌ శివారులో గల సర్వే నెం71, ఖాతా నెంబర్‌ 8591 గల 20 ఎకరాల 13 గుంటల చెరువు శిఖం (సర్కారి) భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరుతూ సిపిఎంఐ అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఇంచార్జి ఎ.వో. గంగాధర్‌, జడ్పి సీఈవో రాజరాంకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో సిపిఎంఐ ప్రధానకార్యదర్శి గోవర్ధన్‌ మాట్లాడుతూ గతంలో సాగునీటి కోసం చెరువు ఉండేదని ఈ భూమిని కబ్జాదారులు అక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. శిఖం భూమి ప్రక్కన ఉన్న భూమిని ...

Read More »

భవన నిర్మాణరంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  నిజామాబాద్‌, డిసెంబర్‌ 01 భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పర్కిరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట భవన నిర్మాణ కార్మికులు అందోళన చేపట్టారు. అనంతరం భవననిర్మాణరంగాల కార్మికసంఘం అధ్యక్షులు కల్లెడిగంగాధర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో కేసిఅర్‌ తెలిపారని అయన ఇచ్చిన హామిలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్‌, ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇంచార్జికి వినతిపత్రం అందజేశారు.

Read More »

ప‌ట్ట‌ప‌గ‌లే గొలుసుదొంగ‌ల హ‌ల్ చ‌ల్

  ఆర్మూర్, న‌వంబ‌ర్ 28 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని జ‌ర్న‌లిస్టు కాలొనీ కి చెందిన న‌ర్సూబాయి శుక్ర‌వారం మ‌ద్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని త‌న కుమారుని దుకాణం నుండి ఇంటికి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా ఆర్ కే ఆసుప‌త్రి వ‌ద్ద గుర్తు తెలియ‌ని ఇద్దరు దుండ‌గులు ఆమెను ఆపి తాము పోలీసుల‌మ‌ని న‌మ్మ‌బ‌లికి మొన్నె ఇక్క‌డ గొలుసు దొంగ‌త‌నం జ‌రిగింద‌ని జాగ్ర‌త్తగా ఉండాల‌ని మెడ‌లో ఉన్న త‌న గొలుసును సంచిలో వేసుకోవాల‌ని సూచించ‌డంతో ఆమె న‌మ్మి మెడ‌లోంచి త‌న న‌గ‌ల‌ను తీసి సంచిలో ...

Read More »

జోరుగా గుడుంబా అమ్మ‌కాలు – మాముళ్ళ మ‌త్తులో ఎక్సైజ్ అదికారులు

 – బ‌హిరంగంగానే విక్ర‌మాలు – క‌ష్ట‌జీవులే ల‌క్ష్యంగా నాటుసారా త‌యారీ – మాముళ్ళ మ‌త్తులో ఎక్సైజ్ అదికారులు – అక్ర‌మార్కుల‌కు స‌హ‌క‌రిస్తున్న కింది స్థాయి సిబ్బంది ఆర్మూర్, న‌వంబ‌ర్27 : ఆర్మూర్ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలో గుడుంబా విక్ర‌యాలు జోరుగా సాగుతున్నాయి. పొద్దంతా చ‌మ‌టోడ్చి మ‌త్తును కోరుకునే కూలీలే ల‌క్ష్యంగా గుడుంబా త‌యారీ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. చీప్ లిక్క‌ర్ ధ‌ర‌క‌న్నా త‌క్కువ ఉండ‌టం, తాగ‌గానే మ‌త్తు త‌ల‌కెక్కుతుండ‌డంతో వాశ‌తుల్య‌మైన గుడుంబా సేవించి రోగాల బారిన పడి అర్ధాంత‌రంగా త‌నువు చాలించి కుటుంబాన్ని వీదిన ...

Read More »

హ‌త్య కేసులోని నిందుతుడి రిమాండ్

ఆర్మూర్, న‌వంబ‌ర్25 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని క‌మ‌ళానెహ్రూ కాలొనీ కి చెందిన వి భిక్ష‌ప‌తి(50)కి, అదే కాలొనీ కి చెందిన ఎస్ కే మాజీద్ ల‌కు మ‌ద్య ఈ నెల 20న‌ ఘ‌ర్ష‌ణ చోటుచేసుకోవ‌డంతో మాజీద్ బిక్ష‌ప‌తి సున్నిత‌మైన స్థ‌లం లో కాలితో బ‌లంగా త‌న్న‌డంతో భిక్ష‌ప‌తికి తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో భిక్ష‌ప‌తి చికిత్స‌పొందుతూ మ‌ర‌నించాడు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు మంగ‌ళ‌వారం మాజీద్ ను అరెష్టు చేసి కోర్టులో హాజ‌రుప‌ర్చ‌నున్న‌ట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ వో ర‌వి కుమార్ తెలిపారు.

Read More »

మరోసారి పోలీసు అధికారుల బదిలీలు తప్పవు … ఇంచార్జి డిఐజి వై.గంగాధర్‌

నిజామాబాద్‌, నవంబరు 24, జిల్లాలో పెరుకుపోతున్న కేసులను వెంటనే పరిష్కారించాలని, పోలీసు స్టేషన్లలో బాధితులకు అందుబాటులో ఉంటు వెంటనే సమస్యలను పరిష్కారించాలని జిల్లా పోలీసులను నిజామాబాద్‌ రెంజ్‌ ఇంచార్జి డిఐజి వై.గంగాధర్‌ ఆదేశించారు. ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గంగాధర్‌ మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ మేరకు పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో క్రైం రిపోర్ట్‌పై రివ్యూ చేసారు. డివిజన్‌ల వారిగా క్రైం రిపోర్ట్‌, కేసుల వివరాలు, పరిష్కారాలపై ఆరా తీసారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులు ...

Read More »

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఆర్మూర్‌, నవంబరు 24, ఆర్మూర్‌ పట్టణంలోని కమళ నెహూ కాలోనికి చెందిన వి. భిక్షపతి (50) ఆదివారం నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆర్మూర్‌ సి.ఐ.రవికుమార్‌ తెలిపారు. సి.ఐ తెనిపిన వివరాల ప్రకారం ఆర్మూర్‌లోని కమళ నెహ్రూ కాలనీకి చెందిన వి. భిక్షపతి (50), అదే కాలనీకి చెందిన ఎస్‌.కె మాజీద్‌ల మధ్య ఈ నెల 20 వతేదీన వారిఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఎస్‌.కె మాజీద్‌, భిక్షపతి సున్నితమైన స్థలంలో కాలితో బలంగా తన్నడంతో భిక్షపతి తీవ్రగాయాలపాలు ...

Read More »

శ్రీవెంకటసాయి టైర్‌ రీట్రేడింగ్‌లో దొంగలించిన వారిపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌ నవంబర్‌22 నగర శివారులో ముబారక్‌నగర్‌లో గల ఎం.రాజగంగారెడ్డి చెందిన శ్రీవెంకటసాయి టైర్‌ రేట్రేడింగ్‌ ప్యాక్టరిలో శుక్రవారం దొంగలు పడి వస్తువులను దొంగలిచ్చారని దొంగలిచ్చిన వారిపై పోలీసుధికారులు చర్యలు తీసుకోవాలని యాజమాని ఎం.రాజగంగారెడ్డి అరోపించారు.శనివారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ తమ దుకాణంలో ఉదయం శుక్రవారం 7:30 నుండి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తమకు సమాచారం ఇవ్వకుండా తమ షాప్‌ వద్దనుండి మిషనరి, రమామెటీరియల్‌,బుకేలతో సహ వస్తువులను నగదు డబ్బులను నగరానికి చెందిన జి.శ్రావన్‌కుమార్‌రెడ్డి,తండ్రి,లక్ష్మారెడ్డి మరియు లక్ష్మారెడ్డి,రాజరెడ్డిలు ...

Read More »

7గురు పేకాట రాయుల్ల అరెస్ట్

ఆర్మూర్, న‌వంబ‌ర్22 : ఆర్మూర్ మండ‌లం పెర్కిట్ గ్రామంలోని గ‌డి వ‌ద్ద శుక్ర‌వారం పేకాట ఆడుతున్న 7గురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ఓ ర‌వి కుమార్ తెలిపారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పేకాట స్థావ‌రం పై దాడి చేసి పేకాట‌రాయుళ్ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వీరి వ‌ద్ద నుండి రూ. 50 వేయిల 560ల‌ను, పేకముక్క‌ల‌ను స్వాదీనం చేసుకున్న‌ట్లు ఎస్ హెచ్ఓ పేర్కొన్నారు. ఇంకా ఎక్క‌డైనా పేకాట‌, మ‌ట్కా ఆడుతున్నారన్న స‌మాచారం ఉంటే ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్ ...

Read More »

ఐదుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్

  ఆర్మూర్, న‌వంబ‌ర్ 20: ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని కెనాల్ క‌ట్ట ప్రాంతాన‌కి చెందిన ఐదుగురు పేకాట రాయుళ్ళ‌ను ప‌ట్ట‌ణంలో పేకాట ఆడుతున్నార‌న్న‌ విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం వారి పై దాడి చసి వారి వ‌ద్ద నుండి రూ. 750ల‌ను,పేక ముక్క‌ల‌ను సీజ్ చేసి వారిని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించిన‌ట్లు ఆర్మూర్ ఎస్సై బోస్ కిర‌ణ్ తెలి్ఆరు. ఇంకా ఎక్క‌డైనా జూదం, మ‌ట్కా లాంటి ఆట‌లు అడుతున్నార‌న్న స‌మాచారం ఉంటే ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్ లో తెల‌పాల‌ని లేదా 100 నంబ‌రుకు ...

Read More »

మ‌ట్కా ఏజెంట్ అరెస్ట్

ఆర్మూర్, న‌వంబ‌ర్19 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని రాంన‌గ‌ర్ కు చెందిన ఓదుల మోహ‌న్ అనే మ‌ట్కా ఏజెంట్ ను బుద‌వారం అరెస్ట్ చేసి ఆయ‌న వ‌ద్ద నుండి రూ.555ల‌ను, మ‌ట్కా చాట్ ను సీజ్ చేసి ఏపి గేమింగ్ యాక్ట్ ప్ర‌కారం కేసు న‌మోదు చేసి కోర్ట‌కు త‌ర‌లించిన‌ట్లు ఆర్మూర్ ఎస్సై బోస్ కిర‌ణ్ తెలిపారు. ఇంకా ఎక్క‌డైనా జూదం, మ‌ట్కా లాంటి ఆట‌లు అడుతున్నార‌న్న స‌మాచారం ఉంటే ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయాల‌ని లేదా 100 నంబ‌రుకు ...

Read More »

మానవత్వం మరచిపోయిన కసాయి(కన్న)తల్లి చెత్త కుండిలొ మగ శిశువు.

నిజామాబాద్‌ నవంబర్‌ 16; మానవత్వం మరచిపోయిన కసాయి(కన్న)తల్లి పేగుబంధాన్ని తెంచుకొని పుట్టిన శిశువును అనాధను చేసిన సంఘటన అందరిని కలచి వేసింది. నగరంలొని అంబేద్కర్‌ కాలనీలొ గల ఆటోస్టాండ్‌ దగ్గరి చెత్తకుండిలొ ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలొ ఎవరొ అప్పుడే పుట్టిన మగ శిశువును పారవెసి పోయారు. స్తానికులు పోలీసులకు ఫోన్‌ చేయడంతొ వారు వచ్చి ఆ శిశువును వైద్య పరీక్షలనిమిత్తం ఆసుపత్రికి తీసుకెల్లారు.

Read More »

పాఠశాలలో అసాంఘీక కార్యక్రమాలు అరికట్టాలని ఆర్డీఓకు పిర్యాదు

బోధన్‌, నవంబర్‌15: బోధన్‌ పట్టణంలోని 23వార్డులోని ప్రాథమిక పాఠశాలలో రాత్రివేళలో అసాంఘిక కార్యక్రమాలకు కొంతమంది పాల్పడుతున్నరని శనివారం కాలనీకి చెందిన బిజెపీ నాయకులు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. పాఠశాల ఆవరణలో కొంతమంది వ్యక్తులు రాత్రివేెళలో మధ్యం సేవించడం, జూద్యం ఆడడం వంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కాలనీవాసులు, పాఠశాల ఉపాద్యాయులు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వాపోయారు. దీంతో పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో 23వ వార్డు బిజెపీ అధ్యక్షుడు ...

Read More »

నక్సల్స్‌ బ్యానర్‌ రగడ…. పోలీసుల ఆరా…. జనశక్తి నక్సల్స్‌ ఉన్నట్టా… లేనట్టా

వివాదం అవుతున్న ఎర్గట్లలో నక్సల్స్‌ బ్యానర్‌ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 15. జిల్లాలో నక్సల్స్‌ ప్రభావంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎర్గట్లలో బ్యానర్ల వెలువడంతో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈనెల 30న చండ్రపుల్లారెడ్డి సంస్మరణ సభను విజయవంతం చేయాలని సిపిఐ(ఎం.ఎల్‌) జనశక్తి పార్టీ బ్యానర్లు మోర్తాడ్‌ మండలం ఎర్గట్లలో రెండు రోజుల క్రితం వెలిసాయి. దీంతో ఈ వ్యవహారం జిల్లా అంతంట చర్చనీయాశంగా మారింది. నెల రోజుల క్రితం దోమకొండ ప్రాంతంలోనూ పోస్టర్లు వెలిసాయి. కానీ వీటిని ఎవరు బయటకు తెచ్చారు అనేది ప్రశ్నార్థకంగా ...

Read More »

ఎసిబి వలకు చిక్కిన పంచాయితీ కార్యదర్శి

బాల్కొండ, నవంబర్‌ 12 : గ్రామ ఉపసర్పంచ్‌ వద్ద 5 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన పంచాయితీ కార్యదర్శి ఉదంతం బుధవారం బాల్కొండ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద జరిగింది. వివరాలు ఇలా వున్నాయి. ఎసిబి డిఎస్పీ సంజీవరావు నేతృత్వంలో బాల్కొండ మండలం శ్రీరాంపూర్‌ గ్రామ ఉపసర్పంచ్‌ అలకొండ శ్రీనివాస్‌ నుంచి చిట్టాపూర్‌ గ్రామ పంచాయితీ కార్యదర్శి రమేశ్‌ 5 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 5 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ...

Read More »

ఇంటర్మీడియట్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం -ఒకరి మృతి -మరొకరి పరిస్థితి విషమం

  కామారెడ్డి, నవంబర్‌ 11 : కామారెడ్డి పట్టణంలో మంగళవారం ఇద్దరు ఇంటర్మీడియట్‌ విద్యార్థినిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా వుంది. కామారెడ్డి పట్టణ సిఐ క్రిష్ణ తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. మాచారెడ్డి మండలానికి చెందిన మానస (18) మంగళవారం ఉదయం పురుగుల మందు సేవించగా ఆసుపత్రికి తరలించారు. స్థానిక బతుకమ్మకుంట కాలనీలో సమీప బంధువుల వద్ద వుంటుంది. దీంతో మానసను హుటాహుటిన ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స చేయడానికి నిరాకరించడంతో ప్రభుత్వ ...

Read More »

కలకలం రెపిన నకిలీ కరెన్సి

నిజామాబాద్‌, నవరబర్‌ 11; నగరంలోని నాగారం కెనాల్‌లొ నకిలీ కరెన్సి కలకలం రేపింది. వివరాలలోకి వెలితె నగర శివారులోని నాగారం దగ్గర గల నిజాంసాగర్‌ కెనాల్‌లొ ఈరోజు ఉదయం 11 గంటల సమయంలొ ఎవరొ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ కరెన్సి నోట్లని ఒక సంచిలొ తీసుకువచ్చి కెనాల్‌ నీటిలొ పారవెసి పారిపోయాడు. అది చూసిన స్తానికులు అవి నిజమైన నోట్లని భావించి వాటికొసం ఎగబడ్డారు. దీనితొ అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఆయి బ్రిడ్జిపైన రాకపోకలకు అంతరాయం ఎర్పడింది. వెంటనె 5 టౌన్‌ పొలీసులు ...

Read More »

కామారెడ్డిలో వృద్ధురాలు హత్య

కామారెడ్డి, నవంబర్‌ 10 : కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఆదివారం రాత్రి వృద్ధురాలు హత్యకు గురైంది. కాలనీలోని ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ తువాలుతో మెడకు చుట్టి హతమార్చారు. సోమవారం ఉదయం కుటుంబీకులు వృద్ధురాలు మృతి చెందినట్లుగా గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా కామారెడ్డి పట్టణ సిఐ క్రిష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Read More »

వారంతే……..అవినీతిటైపు

  బాన్సువాడ, నవంబర్‌07, (పండరీనాథ్‌): అక్రమ వ్యాపారాలను అరికట్టడంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారు. బోధన్‌ ప్రాంతంలో నిషేదిత మత్తు పదార్థాల నియోగం, అనుమతిలేని మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసార తయారి అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఉన్న వీటిని అరికట్టడంతో చిత్తశుద్ది చూపడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నా ప్రత్కేక బృందాలు దాడులు చేస్తున్నాపుడే అక్రమాల గుట్టురట్టవుతోంది. స్థానికి అధాకారులు తమకేమి పట్టనట్లు ఉండడం అనుమానాలకు తావిస్తొంది. క(ళ్ళు)ల్లు మూసుకుంటున్న అధికారులు బోధన్‌ డివిజన్‌లో కల్తీకల్లు వ్యాపారం ...

Read More »

అపరిచితులకు సిమ్‌కార్డులు విక్రయించవద్దు -కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌

కామారెడ్డి, నవంబర్‌ 6 : అపరిచితులు, అనుమానిత వ్యక్తులకు సిమ్‌కార్డులు విక్రయించవద్దని కామారెడ్డి డిఎస్పీ భాస్కర్‌ అన్నారు. నెట్‌కేఫ్‌, మొబైల్‌షాపు, సిడిపాయింట్‌ యజమానులు, నిర్వాహకులకు కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్‌ ఆవరణలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులకు సిమ్‌కార్డులు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒక హత్య కేసులో నిందితుని వద్ద వృద్ధురాలి పేరిట గల సిమ్‌కార్డు దొరికిందన్నారు. ఇలాంటి ఘటనల వల్ల మొబైల్‌షాపు నిర్వాహకులు కేసుల్లో ఇరుక్కుంటారన్నారు. అదే విధంగా చిన్న పిల్లలను ...

Read More »