Breaking News

Crime

జేసి ఇంట్లో చోరీకి యత్నం

  కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌ కాలనీలో జిల్లా సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య అద్దెకు ఉంటున్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఎటువంటి వస్తువులు లభించకపోవడంతో అక్కడినుంచి పారిపోయారు. సోమవారం ఇంటికి వచ్చిన జేసి పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చోరీ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

మాచారెడ్డి గ్రామ విఆర్వోపై సస్పెన్షన్‌ వేటు

  కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి గ్రామ రెవెన్యూ అధికారి పరమేశ్వర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, ప్రజలను, అధికారులను తప్పుదోవ పట్టించడం, డబ్బులు వసూలు చేయడంపై అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీఓ విచారణ చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ మేరకు విచారణ చేసి పరమేశ్వర్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశామన్నారు. సస్పెన్షన్‌ కాలంలో అతను హెడ్‌క్వాటర్‌ దాటి వెళ్లకూడదని ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు.

Read More »

అనిశాకు చిక్కిన ఆర్మూర్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌

  నందిపేట, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ డివిజనల్‌ ఆర్డీవో పల్లె శ్రీనివాస్‌ను మంగళవారం అవినీతి నిరోధక శాఖ అదికారులు ఆర్మూర్‌లోని ఆయన నివాసంలో వాటర్‌ ప్లాంట్‌ యజమాని వద్ద నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మంజీర వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నాడని నవంబర్‌ 20న సీజ్‌ చేసిన వాటర్‌ ప్లాంట్‌ను తిరిగి కొనసాగించడానికి రూ. 40 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో వాటర్‌ప్లాంట్‌ యజమాని రాజ్‌కుమార్‌ అనిశా అధికారులను సంప్రదించగా ...

Read More »

బాలింత మృతి

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రెంజల్‌ మండలం నీలా గ్రామానికి చెందిన కొమ్మల జ్యోతి అనే బాలింత మృతి చెందింది. రెండ్రోజుల క్రితం ప్రసవం కొరకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి రాగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. శనివారం బాలింత పరిస్థితి విషమించడంతో వైద్యులు ప్రయివేటు ఆసుపత్రికి రిఫర్‌ చేసే సమయంలో మృతి చెందింది. ఈ ఘటనపై బాధిత బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి సంఘీభావంగా సిపిఐ ...

Read More »

దీక్షాస్వామిపై చేయిచేసుకున్న హెడ్‌కానిస్టేబుల్‌

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయడానికి వెళ్లిన దీక్షాస్వామి బాలకృష్ణపై హెడ్‌కానిస్టేబుల్‌ అజ్మత్‌ చేయిచేసుకున్న సంఘటన గురువారం జరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో అయ్యప్పదీక్షా స్వాములు పోలీసు స్టేషన్‌కు చేరుకొని అజ్మత్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తు స్టేషన్‌ ముందు బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాన్సువాడ డిఎస్‌పి నర్సింగ్‌రావు స్వాములను సముదాయించి అజ్మత్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో శాంతించారు.

Read More »

ఇసుక మాఫియా చేతిలో విఆర్‌ఏ దారుణ హత్య

  కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం పిట్లం మండలం కాందాపూర్‌ కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్నాడని ఓ విఆర్‌ఏను దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాలోని పిట్లం ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలు చాలా ఏళ్ళుగా సాగుతున్నాయి. విషయం తెలుసుకొని కాకివాగుకు వెళ్లిన విఆర్‌ఏ సాయిలు ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేయగా రెచ్చిపోయిన ఇసుక మాఫియా అడ్డొచ్చిన విఆర్‌ఏ సాయిలును అమానుషంగా ...

Read More »

ఎక్సైజ్‌ సిబ్బందికి రాష్ట్రస్థాయి పురస్కారాలు

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎక్సైజ్‌ ఎన్‌పోర్సు మెంట్‌ డైరెక్టర్‌ అకుల్‌ సబర్వాల్‌ చేతుల మీదుగా నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సిబ్బంది పురస్కారాలు అందుకున్నారు. వీరిలో మహ్మద్‌ సాదిక్‌ అలీ- ఏసి ఎన్‌ఫోర్సు మెంట్‌ నిజామాబాద్‌, జే. మధుబాబు-ఏసి ఎన్‌ ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌, పటేల్‌ బానోత్‌ – ఎస్‌హెచ్‌వో మోర్తాడ్‌, నాగరాజు – ఎస్‌హెచ్‌వో కామారెడ్డి, కె.ధర్మేందర్‌-ఏసి ఎన్‌ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌, ఆర్‌.కవిత- టాస్క్‌పోర్సు నిజామాబాద్‌, కె.అవినాశ్‌-ఎస్‌హెచ్‌వో ఎల్లారెడ్డి. ...

Read More »

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష

సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష పడింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ‘టెంపర్‌’ సినిమాకు స్టోరీకి చెల్లని చెక్కు ఇచ్చారని రచయిత వక్కంతం వంశీ ఫిర్యాదు చేశాడు. దీనిపై శుక్రవారం(నవంబర్-24) ఎర్రమంజిల్‌ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. గణేష్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల ...

Read More »

అంగట్లో అత్యాచార వీడియోల విక్రయం…

లక్నో : ఓ యువకుడు అమ్మాయిపై అత్యాచారం చేస్తుండగా…ఆ దృశ్యాలను మరో యువకుడు చిత్రీకరించిన వీడియోలను కొందరు వ్యాపారులు అంగట్లో ‘లోకల్ ఫిలిం’పేరిట యథేచ్చగా విక్రయిస్తున్నారు. యువకులు, విద్యార్థుల్లో రేప్ వీడియోలకు డిమాండు పెరగడంతో కొందరు వ్యాపారులు గుట్టుగా వీటిని లోకల్ ఫిలిమ్స్ పేరిట పెన్ డ్రైవ్‌లలో వేసి విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలోని ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయిస్తున్న నాకా హిందోళ మార్కెట్ లో రేప్ వీడియోల విక్రయం జోరుగా సాగుతోంది. తెలతెలవారక ముందే నాకా హిందోళ మార్కెట్ లో సగం తెరచి ఉంచిన ...

Read More »

హైద్రాబాదు లో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు జిల్లా యువకులు మృతి.

  నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ హైద్రాబాద రిపోర్టర్ : పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధి సుచిత్ర సర్కిల్ రోడ్డు ప్రమాదం…3 ముగ్గురు యువకులు మృతి…. మృతులు మామిడిపల్లికి చెందిన అనిల్ గౌడ్, jankampet అమన్, ఆర్మూర్ అంగూర్ రతన్ (19) మృతులు : అనీల్ కుమార్ ,,(22)… రతన్ (22) అమన్ రాజ్ (22) యువకులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు.. ఆల్వాల్ నుండి బోయినపల్లి వెలుతుండగా వారి వాహనం పల్సర్ బైక్ న నెం TS 10 EK 2927 డివైడర్ ...

Read More »