Breaking News

Cultural

మూఢనమ్మకాలు నమ్మొద్దు

  రెంజల్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్‌ఐ అంబార్య అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని నీలా గ్రామంలో పోలీసు కళాబృందం ద్వారా మూడనమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు మంత్రాలు, చేతబడులు ఉన్నాయంటూ నమ్మరాదని ఒకవైపు సైన్స్‌, కంప్యూటర్‌ యుగంలో దూసుకుపోతున్నా ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో రాఘవేందర్‌, అక్తర్‌, సాయిలు, తదితరులున్నారు.

Read More »

13 గంటల నాట్య ప్రదర్శన

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భరతముని జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యూఅంబేడ్కర్‌ భవన్‌లో సంస్కారభారతి ఆధ్వర్యంలో గురువారం బొమ్మిడి నరేశ్‌కుమార్‌చే 13 గంటల నిరంతర నాట్య ప్రదర్శన కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచి నిర్విరామంగా 13 గంటల పాటు నాట్య ప్రదర్శన జరిగిందని సంస్కారభారతి ఇందూరు ప్రధాన కార్యదర్శి గంట్యాల ప్రసాద్‌ తెలిపారు. కళారంగంలో ఒక రికార్డు అని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం భరతముని జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర ...

Read More »

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ కళాశాలలో డిఇడి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు మంగళవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా కళాశాల సెక్రెటరీ అమీర్‌ మాట్లాడుతూ దేశం అభివృద్ది, దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, ఉపాధ్యాయునితోనే సాద్యమని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. డైరెక్టర్‌ హైమద్‌, ఎస్‌బిహెచ్‌ సీనియర్‌ మేనేజర్‌ కబీర్‌, ప్రిన్సిపాల్‌ ...

Read More »

కామారెడ్డి కళలకు కాణాచి

  కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కళలకు కాణాచి లాంటిదని, ఎందరో నిబద్దత గల కవులకు ఇది నిలయమని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సిరిసిల్లా గఫూర్‌ శిక్షక్‌ అన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షనర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ హితాన్ని కోరే కవిత్వం, సగటు మనిషికి బాసటగా నిలవాలని, కవులు నిబద్దత, నిజాయితీతో రచనలు చేయాలన్నారు. ...

Read More »

పెళ్ళి పీటలెక్కబోతున్న మరో దర్శకుడు!

మంచి కథలతో అద్బుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందించిన దర్శకులు కొందరు ఇప్పుడు తమ లైఫ్ పార్ట్నర్‌ని వెతుక్కునే పనిలో ఉన్నారు. ఇటీవల 24 లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. త్వరలోనే ఈ దర్శకుడి వివాహం జరగనుంది. ఇక తాజాగా మరో టాలెంటెడ్ దర్శకుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ క్రిష్ పెళ్ళి పీటలెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్టు ఫిలింనగర్‌లో ముచ్చటించుకుంటున్నారు. అయితే క్రిష్ చేసుకోబోయే అమ్మాయి హైదరాబాద్‌కు చెందిన రమ్య అని ...

Read More »

అవతరణ వేడుకలకు సర్వం సిద్దం

  బోధన్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎందరో అమరవీరుల త్యాగాల పలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండో సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు బోధన్‌ డివిజన్‌లో అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రాలతోపాటు డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అలాగే బోధన్‌ పట్టణంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ యానంపల్లి ఎల్లయ్య పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోధన్‌ ...

Read More »

అలరించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

  మోర్తాడ్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యదర్శులు గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మోర్తాడ్‌లో గ్రామ ప్రజలకు, యువకులకు తెలియజేసేవిధంగా మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ స్వయంగా క్రికెట్‌ టోర్ని నిర్వహించారు. టోర్నమెంట్‌ ను మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్యలు మండలాధికారులు తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపిడివో శ్రీనివాసులు ప్రారంభించారు. క్రీడాకారులను కరచాలనం చేసుకొని బ్యాటింగ్‌ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ ...

Read More »

జానపద గంగకు రాష్ట్రస్థాయి పురస్కారం

నిజామాబాద్‌ సాంస్కృతికం: ఇందూరుకు చెందిన జానపద గాయని రేలారేలా ఫేం జానపద గంగకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి పురస్కారాన్ని మంగళవారం ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్స వేడుకల్లో భాగంగా ఈ నెల 2న హైదరాబాద్‌లో ఆమెకు ఉత్తమ జానపద గాయకురాలిగా పురస్కారంతో పాటు రూ. 1,1116 నగదు అందజేయనున్నారు. నిజామాబాద్‌ మండలం ముల్లంగి గ్రామానికి చెందిన గంగ జానపద గాయకురాలిగా రాష్ట్రస్థాయితో పాటు దుబాయ్‌, అస్ట్రేలియా, సింగాపూర్‌, మారిషస్‌ తదితర దేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘తెలంగాణ ధూంధాం’ వేదికలపై ...

Read More »

మే 5న యూనివర్సిటీ కళాశాల వార్షికోత్సవం

  డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాల వార్షికోత్సవం మే 5వ తేదీ గురువారం సాయంత్రం నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. వార్షికోత్సవానికి అతితులుగా ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న, జెఎన్‌టియు మొదటి వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.ఎన్‌.రెడ్డి, జాతీయ బాలికల టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ నైనాజైశ్వాల్‌, ఎవరెస్టు అదిరోహించిన మాలావత్‌ పూర్ణలు పాల్గొంటారన్నారు. ముఖ్య అతిథిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విసి పార్థసారధి విచ్చేయనున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన క్రీడా, ...

Read More »

డ్యాన్సు క్లాసులు ప్రారంభం

  కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని స్లైలిష్‌ డ్యాన్సు ఇన్సిట్యూట్‌ ఆద్వర్యంలో సోమవారం డ్యాన్సు తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్సిట్యూట్‌ నిర్వాహకులు మాస్టర్‌ మోహన్‌ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పట్టణంలో డ్యాన్సు ఇన్సిట్యూట్‌ నిర్వహిస్తూ ఎంతో మందికి డ్యాన్సు నేర్పించామన్నారు. ఇక్కడ శిక్షణ పొందినవారు జెమిని, జీ తెలుగు ఛానెళ్లలో ప్రదర్శనలు ఇచ్చారన్నారు. అడ్మిషన్లు పొందాలనుకునేవారు 99122 66292 నెంబరులో సంప్రదించాలని కోరారు.

Read More »