Breaking News

Cultural

అలరించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాలు

  మోర్తాడ్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యదర్శులు గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మోర్తాడ్‌లో గ్రామ ప్రజలకు, యువకులకు తెలియజేసేవిధంగా మోర్తాడ్‌ సర్పంచ్‌ దడివె నవీన్‌ స్వయంగా క్రికెట్‌ టోర్ని నిర్వహించారు. టోర్నమెంట్‌ ను మోర్తాడ్‌ జడ్పిటిసి ఎనుగందుల అనిత, ఎంపిపి కల్లడ చిన్నయ్యలు మండలాధికారులు తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపిడివో శ్రీనివాసులు ప్రారంభించారు. క్రీడాకారులను కరచాలనం చేసుకొని బ్యాటింగ్‌ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. ఈ ...

Read More »

జానపద గంగకు రాష్ట్రస్థాయి పురస్కారం

నిజామాబాద్‌ సాంస్కృతికం: ఇందూరుకు చెందిన జానపద గాయని రేలారేలా ఫేం జానపద గంగకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి పురస్కారాన్ని మంగళవారం ప్రకటించింది. తెలంగాణ ఆవిర్భావ ద్వితీయ వార్షికోత్స వేడుకల్లో భాగంగా ఈ నెల 2న హైదరాబాద్‌లో ఆమెకు ఉత్తమ జానపద గాయకురాలిగా పురస్కారంతో పాటు రూ. 1,1116 నగదు అందజేయనున్నారు. నిజామాబాద్‌ మండలం ముల్లంగి గ్రామానికి చెందిన గంగ జానపద గాయకురాలిగా రాష్ట్రస్థాయితో పాటు దుబాయ్‌, అస్ట్రేలియా, సింగాపూర్‌, మారిషస్‌ తదితర దేశాల్లో పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘తెలంగాణ ధూంధాం’ వేదికలపై ...

Read More »

మే 5న యూనివర్సిటీ కళాశాల వార్షికోత్సవం

  డిచ్‌పల్లి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాల వార్షికోత్సవం మే 5వ తేదీ గురువారం సాయంత్రం నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి వెల్లడించారు. వార్షికోత్సవానికి అతితులుగా ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు గోరెటి వెంకన్న, జెఎన్‌టియు మొదటి వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి.ఎన్‌.రెడ్డి, జాతీయ బాలికల టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ నైనాజైశ్వాల్‌, ఎవరెస్టు అదిరోహించిన మాలావత్‌ పూర్ణలు పాల్గొంటారన్నారు. ముఖ్య అతిథిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విసి పార్థసారధి విచ్చేయనున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా నిర్వహించిన క్రీడా, ...

Read More »

డ్యాన్సు క్లాసులు ప్రారంభం

  కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని స్లైలిష్‌ డ్యాన్సు ఇన్సిట్యూట్‌ ఆద్వర్యంలో సోమవారం డ్యాన్సు తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్సిట్యూట్‌ నిర్వాహకులు మాస్టర్‌ మోహన్‌ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా పట్టణంలో డ్యాన్సు ఇన్సిట్యూట్‌ నిర్వహిస్తూ ఎంతో మందికి డ్యాన్సు నేర్పించామన్నారు. ఇక్కడ శిక్షణ పొందినవారు జెమిని, జీ తెలుగు ఛానెళ్లలో ప్రదర్శనలు ఇచ్చారన్నారు. అడ్మిషన్లు పొందాలనుకునేవారు 99122 66292 నెంబరులో సంప్రదించాలని కోరారు.

Read More »

అలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన

  కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని లిటిల్‌ స్కాలర్స్‌ పాఠశాలలో గురువారం చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశం పురస్కరించుకొని చిన్నారులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. పలు సినీ, జానపద గేయాలతోపాటు భరత నాట్యం లాంటి సంప్రదాయ నృత్యాలతో విశేషంగా అలరించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

సందీప్ బోధన్కర్‌కు జాతీయనృత్య రత్న అవార్డు

  నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్‌కు చెందిన అంతర్జాతీయ నృత్య కళాకారుడు డాక్టర్ సందీప్ బోధన్కర్‌కు మంగళవారం ఓడిషాలోని కటక్‌లో జాతీయ నృత్యరత్న అవార్డును బహూకరించారు. కటక్‌లో వారం రోజుల పాటు శతశహే కటక్ నృత్యోత్సవ్ కార్యక్రమం ప్రారంభమైంది. కట క్ నగర మేయర్ మీనాక్షి బేహరా, జిల్లా కలెక్టర్ నిర్మ ల్ చంద్ర మిశ్రా, ఉత్సవ కమిటీ చైర్మన్ దేబాశిష్ సమంత్రే, ఎమ్మెల్యే రంజన్ బన్వల్, ఎంపీ భర్తుహరి మహతబ్, అనుభబ్ మెహంతి, దీపేష్ మొహపాత్ర, బైస్నాబ చరణ్ పరిడాలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ ...

Read More »

సంప్రదాయ సమీక్ష

మహారాష్టల్రో 1956 నుంచి అమలులో ఉన్న హైందవ దేవాలయ ప్రవేశాధికార శాసనం-హిందూ ప్లేస్ ఆఫ్ వర్‌షిప్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్-లోని నియమావళిని అమలు జరపవలసిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంబాయి హైకోర్టు ఆదేశించడం ధార్మిక సంప్రదాయాల సమీక్షకు మరోప్రాతిపదిక! ఈ నియమావళిని కచ్చితంగా అమలు జరపనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిహెచ్ వాఘేలా, న్యాయమూర్తి ఎమ్‌ఎన్ సోనల్‌లు అధిష్ఠించిన ధర్మాసనానికి శుక్రవారం హామీ ఇవ్వవలసి రావడం విచిత్రమైన పరిణామం! ఈ చట్టం అరవై ఏళ్లుగా అమలు జరుగుతోంది. అలాంటప్పుడు అమలు జరుపుతారా ...

Read More »

పెద్దబోయిడు

రేయికి చంద్రుడు పగటికి సూర్యుడు అధిపతులైతే మా వృత్తి ఆకాశానికి రెండూ పెద్దబోయిడే మా కుల సంద్రానికి విష్ణువు మాకు సంప్రదాయాన్ని నేర్పే గురువు పనేదైనా పొద్దుగాల పొద్దుగాల్నే పలకరించే మాటవుతడు గొడవేదైనా బతుకుల్ని బాగుచేసే పంచాయతి కోర్టుకు జడ్జవుతడు కార్యమేదైన అందరిని కలుపుకొని ఐదుగుర్ని కుండకాడేసి కార్యమెల్లదీసే బాధ్యతవుతడు వాడకట్టుకు బాధొస్తే కన్నీటి మేఘమవుతడు ఆనందమొస్తే సినుకులల్ల తడిసే సిన్నపిల్లోడవుతడు కొత్తాలనో, కొత్త తోపలనో నాన్పేటప్పుడు తోలెమొసలి చేసి పాలారం పంచిపెట్టే పూజారవుతడు ఏడాదికోసారి ఎదలనిండ నిలుపుకొని చేసుకునే మైసమ్మను వాడకు ఏ ...

Read More »

కళాజాత ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతమవుతాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా పేర్కొన్నారు. జిల్లాలోని 78 ఓడిఎప్‌ గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి, వైద్య, ఆరోగ్య, ఐసిడిఎస్‌, విద్య, పంచాయతీరాజ్‌ కార్యక్రమాలను అనుసంధానం చేసి అమలు చేసేందుకు రూపొందించిన ప్రణాళిక పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించే కళాజాత ప్రదర్శనలను కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. కళాకారులు ప్రదర్శించిన కళాజాత కార్యక్రమాలను ...

Read More »

దుమ్ములేపిన విద్యార్థుల చిందులు

  కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో బుధవారం నిర్వహించిన ఆర్యభట్ట జూనియర్‌ కళాశాల వార్షికోత్సవంలో విద్యార్తులు చిందులు వేస్తూ దుమ్ములేపారు. విద్యార్థినిలు, విద్యార్థులు పలు సినీ, జానపద, ప్రయివేటు గేయాలపై కేరింతలతో నృత్యాలు చేశారు. సోలో, గ్రూప్‌ పర్‌ఫార్మెన్స్‌లతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. తోటి విద్యార్థులు కేరింతల నడుమ ఉత్సాహంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్తులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా సాందీపని కళాశాల వార్షికోత్సవం

  కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సాందీపని కళాశాల 15వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సుందర్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇస్టపడి చదివితే అద్భుతాలు సృస్టిస్తారని పేర్కొన్నారు. ప్రణాళిక బద్దంగా, దిశా నిర్దేశం చేసుకొని విద్యార్తులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టెక్నాలజిని వినియోగించుకొని చదువులో ముందుకు సాగాలన్నారు. ప్రధానవక్తగా హాజరైన బ్రహ్మశ్రీ మాడగుల నాగఫణిశర్మ, జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ...

Read More »

కస్తూర్బా పాఠశాలలో వీడ్కోలు సమావేశం

  బీర్కూర్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్కూర్‌ గ్రామంలోగల కస్తూర్బా పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి వారికి వీడ్కోలు పార్టీని ఏర్పాటు చేశారు. తమ పాఠశాలలో ఒకరితో ఒకరికి ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మరికొన్నిరోజుల్లో ఉపాధ్యాయులను విడిపోవడం బాధగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యేకాధికారిణి గీత మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు ...

Read More »

దవాఖాన

రాత్రి పదకొండు గంటలకు ఇంద్రన్న నుంచి ఫోన్ అచ్చింది. రాత్రికాంగనె గూట్ల పిట్టలోలె ఇంట్ల జేరుతరు. అటు దిక్కునుంచి ఇంద్రన్న అన్నడు పరాష్కమాడినట్టు. పెద్ద మల్లారెడ్డి నుంచి మా వూరోల్లు సర్కారు దవాఖానకు వచ్చిండ్రట. ఏదో ఆపతి ముచ్చట. ఇంటికి రా! పోదాం. ఇంద్రన్న ఫోన్ల జెప్పిండు. ఇంద్రసేనారెడ్డి కామారెడ్డిల సీనియర్ పత్రికా విలేఖరి. తెలంగాణ గ్రామాలలో ఉండే మాండలికంలనే మాట్లాడుతాడు. ఇంద్రన్న నేను కలిసి కామారెడ్డి సర్కారు దవాఖానకు పోయినం. కాంపౌండ్ లోపల బండ్లు ఇష్టమొచ్చినట్టు పార్క్ చేసిండ్రు. కొన్ని బండ్లయితే దవాఖాన ...

Read More »

అక్షర టెక్నో స్కూల్లో సంక్రాంతి సంబరాలు

  కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టనంలోని అక్షర పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను విద్యార్థులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో బొమ్మరిల్లు, బొమ్మల కొలువులు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులతో వేడుకలు జరిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి ముగ్గులు వేసి గాలిపటాలు ఎగురవేసి ఆడి పాడారు. విద్యార్థులకు రేగు పండ్లు పోసి పండగ సంప్రదాయాన్ని, విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఛైర్మన్‌ అశోక్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Read More »

న్యూ ఇయర్‌వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలి

  ఆర్మూర్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ యువత న్యూ ఇయర్‌ వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని సిఐ సీతారాం బుదవారం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికే డిసెంబరు 31న రాత్రి సమయంలో న్యూఇయర్‌ వేడుకలకు సంబంధించి మద్యం సేవించి వాహనాలు నడపడం, గుంపులు గుంపులు తిరిగినా, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ వివరించారు. మోటార్‌ సైకిల్‌పై రాత్రిళ్లు త్రిపుల్‌ రైడింగ్‌, ర్యాలీలు నిషేదించినట్టు ఆయన చెప్పారు. ...

Read More »

అలరించిన యువతరంగం సాంస్కృతిక పోటీలు

  కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆద్వర్యంలో నిర్వహించిన జిల్లా స్తాయి యువతరంగం సాంస్కృతిక పోటీలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యువతరంగం – 2015 పోటీల్లో విద్యార్థులు జానపద, శాస్త్రీయ, తదితర విభాగాల్లో ప్రదర్శనలు చేశారు. నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. విశేష ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్తాయికి ఎన్నుకోవడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మోరియా యూనుస్‌, కామారెడ్డి డిగ్రీ కళాశాల ...

Read More »

దుబాయ్ లో 22న జనవరి 2016 సంప్రదాయం వారిచే శ్రీ వేంకటేశ్వర కళ్యాణం

దుబాయ్ లో జనవరి 22, 2016న సంప్రదాయం సంస్థవారిచే శ్రీ వేంకటేశ్వర కళ్యాణం – జె.యస్.యస్ ప్రైవేటు స్కూల్, సఫా పార్క్ వేదికగా జరగబోతుంది. ఈ కార్యక్రమములో స్వామివారి కల్యాణంలో గాని, వాలంటీర్స్ గా కాని పాల్గొనదలచిన వారు ఈ https://goo.gl/SORQ7t లింక్ క్లిక్ చేసి నమోదు చేసుకొవచ్చు. ఈ కార్యక్రమం ఉచితం అని, ఎటువంటి ఫీజులు లేవని కావున స్వామివారి సేవ లో పాల్గొని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరినారు. నిర్వాహకులను సంప్రదించవలసిన వివరాలు: Mana Sampradayam Dubai ...

Read More »

అలరించిన విద్యార్థుల నృత్యాలు

  కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని మంజీరా డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన బిజెడ్‌సి విద్యార్తుల స్వాగత కార్యక్రమంలో విద్యార్తులు చేసిన నృత్యాలు దుమ్మురేపాయి. సినీ గేయాలపై విద్యార్థినిలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ మాట్లాడుతూ కళాశాల స్థాపించినప్పటినుంచి నేటివరకు మోస్టు డిమాండ్‌ కోర్సుగా బిజెడ్‌సి ఉందన్నారు. అత్యాధునిక ల్యాబ్‌, ప్రొజెక్టర్‌ల ద్వారా ఆధునిక పద్దతుల్లో నిష్ణాతులైన అధ్యాప బృందం ద్వారా బోధిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ సురేశ్‌గౌడ్‌, అధ్యాపకులు ...

Read More »

టూటా ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

  డిచ్‌పల్లి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు తెయు కళాశాల సెమినార్‌ హాల్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజిస్ట్రార్‌ ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల మేళవింపు అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం సోదరభావం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం ప్రధాన అంశాలని ఆయన పేర్కొన్నారు. దీపావళి పండగ వెలుగుల పండగ అని మన జీవితాల్లోంచి చీకట్లు పారద్రోలడానికి అందరం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ...

Read More »

మంజీరా కళాశాలలో స్వాగత హంగామా

  కామారెడ్డి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని మంజీర డిగ్రీ కళాశాలలో సైన్స్‌ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. విద్యార్తినిలు గోపికమ్మ చాలునులేమ్మా… నేనొక్కడినే అంటూ స్టెప్పులు వేసి అలరించారు. విద్యార్థులు పలు గేయాలపై నృత్యాలు చేసి, నాటకాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మంజీరా విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ వారికి వారే పోటీపడుతున్నారని ప్రశంసించారు. తమ విద్యార్తులు ఎన్నో విజయాలు, ఉద్యోగాలను సాధించారని ...

Read More »