Breaking News

Dichpally

ఘన్‌పూర్‌ యువకుల‌ రక్తదానం

డిచ్‌పల్లి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లెడ గ్రామానికి చెందిన ల‌క్ష్మి అనే మహిళకు గర్భసంచి విషయమై నిజామాబాద్‌ నగరంలోని తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆపరేషన్‌ నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో డిచ్‌పల్లి మండలం గన్‌పూర్‌కు చెందిన యువకులు స్పందించారు. పివైఎల్‌ నాయకులు సాయినాథ్‌, ప్రేమ్‌కుమార్‌ ఇద్దరు యువకులు రక్తం అందించి ల‌క్ష్మి ప్రాణాలు కాపాడారు. వీరిని ఆసుపత్రి సిబ్బంది, బాధిత మహిళ బంధువులు అభినందించారు.

Read More »

సంక‌ల్పం అందరిని ముందుకు తీసుకెళుతుంది

డిచ్‌పల్లి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎం.పి. జొగినపల్లి సంతోష్‌ కుమార్‌ సంకల్పించిన ‘‘గ్రీన్‌ చాలెంజ్‌’’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి తెలంగాణ విశ్వవిద్యాయంలో 500 మొక్కలు నాటే ల‌క్ష్యంతో గురువారం ఆర్ట్స్‌ కళాశాల‌ ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎం. పి. జొగినపల్లి సంతోష్‌ కుమార్‌ ‘‘గ్రీన్‌ చాలెంజ్‌ – గ్రీన్‌ ఇండియా’’ కార్యక్రమం దేశంలోనే గొప్ప స్ఫూర్తిని నింపుతుందని, ఈ సంక‌ల్పం ...

Read More »

సైంటిస్టుకి అరుదైన గౌరవం

డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని వృక్షశాస్త్ర అధ్యయన శాఖలోని సైంటిస్టుకి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్‌ తాళ్ళ సాయి కృష్ణా అనే సైంటిస్టుకి డి.ఎస్‌. కొఠారి పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌ వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ విద్యావర్ధిని పర్యవేక్షణలో మొక్కల్లో తామర పురుగు వ‌ల్ల‌ వచ్చే వ్యాధులు, రోగ నిరోధక శక్తి అనే అంశంపై పరిశోధనలు జరపటానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. గతంలో కూడా ఆయనకు సెర్బ్‌ యంగ్‌ ...

Read More »

జూలై 10 వరకు ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ పీజీ కళాశాల‌లోని రెండవ, నాలుగ‌వ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ థియరీ అండ్‌ ప్రాక్టికల్‌ మరియు బ్యాక్‌ లాగ్‌ / ఇంప్రూవ్‌ మెంట్‌ థియరీ అండ్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు గడువు జూలై 10వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 ఆల‌స్య రుసుముతో జూలై 15వ తేదీ వరకు పరీక్షా ఫీజు చెల్లించవచ్చన్నారు. ...

Read More »

30 వరకు పరీక్ష ఫీజు గడువు పెంపు

డిచ్‌పల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాల‌ల‌లోని సిబిసిఎస్ సిల‌బస్ గల‌ రెండవ, నాలుగ‌వ‌, ఆరవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూవ్‌ మెంట్‌ థియరీ, ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల‌ 30వ తేదీ వరకు పెంచబడిరదని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కావున డిగ్రీ కళాశాలల‌ ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించవల‌సిందిగా ...

Read More »

టార్గెట్‌ పూర్తిచేశాము…

డిచ్‌పల్లి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో తెలంగాణకు హరితహారం – 2020 కార్యక్రమాన్ని రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం ఉదయం గెస్ట్‌ హౌస్‌ ఎదుట మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – చెట్లే ప్రగతికి తొలి మెట్లుగా అభివర్ణించారు. టీయూ క్యాంపస్‌లో 2014 నుంచి ఇప్పటి వరకు నిర్విగ్నంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నో ల‌క్షల‌ మొక్కల‌ను నాటామని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి రక్షణ, పోషణ కల్పించామని, అవి ...

Read More »

26 వరకు ఎంఎడ్‌ పరీక్షల‌ ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయం పరిధిలోని అన్ని అనుబంధ ఎం.ఎడ్‌. కళాశాల‌లోని మూడవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ థియరీ, ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల‌ 26వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.200 ఆల‌స్య రుసుముతో ఈ నెల 29వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు జూలై / ఆగస్ట్ నెల‌లో నిర్వహింపబడుతాయని పేర్కొన్నారు. కావున ఎం.ఎడ్‌. కళాశాలల‌ ప్రధానాచార్యులు, విద్యార్థులు ఈ ...

Read More »

27 వరకు పరీక్ష ఫీజు గడువు పెంపు

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయం పరిధిలో అన్ని అనుబంధ బి.ఎడ్‌. కళాశాల‌లోని రెండవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌, మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ / ఇంఫ్రూ మెంట్స్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల‌ 27 వ తేదీ వరకు ఉందని పరీక్షల‌ నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.200 ఆల‌స్య రుసుముతో ఈ నెల‌ 30 వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. పరీక్షలు జూలై నెల‌లో నిర్వహింపబడుతాయన్నారు. కావున ...

Read More »

పరిశోధక విద్యార్థికి ‘కనెక్ట్ చాన్స్ ల‌ర్‌ పురస్కారం

డిచ్‌పల్లి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాయంలోని ఉర్దూ విభాగానికి చెందిన పిహెచ్‌. డి. విద్యార్థి మహ్మద్‌ ముస్తఫా అర్ఫత్‌ ‘కనెక్ట్‌ చాన్సల‌ర్‌’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ చేతుల‌ మీదుగా ఉర్దూ భాషకు గాను ‘కోవిద్‌ – 19 మూలం, పరివ్యాప్తి, నిర్దారణ పరీక్షలు, చికిత్సా విధానం’ అనే అంశంపై రచించిన వ్యాస రచన పోటీలో తృతీయ బహుమతిని అందుకున్నారు. హైదారాబాద్‌ రాజ్‌భవన్‌లో జూన్‌ 2 వ తేదీన జరిగిన తెలంగాణ రాష్ట్ర ...

Read More »

కరోనా బాధితుల‌ను ఆదుకోవాలి

డిచ్‌పల్లి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు సవరించడానికి వ్యతిరేకంగా బుధవారం ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో డిచ్‌పల్లి తహసీల్‌ కార్యాల‌యం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్‌ మాట్లాడుతూ ఆనాడు 8 గంటల‌ పని దినాల‌ కోసం కార్మికులు చీకాగోలో ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారు, కానీ నేడు కేంద్ర ప్రభుత్వం తిరిగి 12 గంటల‌ పని చేయాల‌ని చెబుతుందన్నారు. ప్రధాని మోదీ కార్మికుల‌కు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఉన్న ఉపాధిని తొల‌గించాల‌ని చూస్తున్నారన్నారు. కరోన లాక్ ...

Read More »

రైతుల‌కు ఉచితంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలి

డిచ్‌పల్లి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాకు డౌన్‌ నేపథ్యంలో రైతుల‌ను వ్యవసాయ కూలీల‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల‌ని ఏఐకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వేల్పూర్‌ భూమన్న అన్నారు. ఈ మేరకు శనివారం అఖిల‌ భారత రైతు కూలీ సంఘం డిచ్‌పల్లి మండల‌ కమిటి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు మెమోరండం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ రెండు నెలల‌ లాక్‌ డౌన్‌ సమయంలో అన్ని వర్గాల‌ ప్రజలు ఇంటికే పరిమితమైనా రైతులు, రైతుకూలీలు అన్ని రకాల‌ పంటలు పండిరచి ప్రజల‌కు తిండి గింజలు, దేశానికి ...

Read More »

ఆర్‌జి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆహార పొట్లాల‌ పంపిణీ

డిచ్‌పల్లి, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి 44 డిచ్‌పల్లి మీదుగా స్వస్థలాల‌కు వెళ్తున్న వల‌స కార్మికుల‌కు ఆర్‌జి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఫౌండేషన్‌ కుటుంబ సభ్యులు పదార్థాలు స్వయంగా తయారుచేసి పంచిపెట్టారు. సుమారు 50 మందికి ఆలు బిర్యాని, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఫౌండేషన్‌ సభ్యులు, రేలా రే రేలా గంగా, ఆమె భర్త సుదర్శన్‌ ఎక్కడికి వెళ్తున్నారని వల‌స కార్మికుల‌ను ప్రశ్నించగా ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, బీహార్‌, మహారాష్ట్ర, ...

Read More »

అయ్యప్పస్వామి భక్త సమాజం తరఫున అన్నదానం

డిచ్‌పల్లి, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ ప్రభావం వ\న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కాగా యాచకులు, బాటసారులు ఎలాంటి వసతి లేక, పనిలేక అతలా కుతలం అవుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల‌ 28న డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామ యువత స్పందించి అప్పటినుండి ఇప్పటి వరకు నిత్యం అన్నదానం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం అయ్యప్ప స్వామి భక్త సమాజం తుఫ్రాన్‌ మండలం ఘన్పూర్‌ వారి సహకారంతో అన్నదాన ...

Read More »

బాటసారుల‌కు పండ్లు పంపిణీ చేసిన ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు

డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మీదుగా జాతీయ రహదారిపై మధ్యప్రదేశ్‌ వెళ్తున్న 40 మంది వల‌స కూలీల‌కు తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో రిజిస్ట్రార్‌ ఆచార్య నసీమ చేతుల‌ మీదుగా పండ్లు, మాస్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందజేశారు. అదేవిధంగా వర్సిటీ సమీపంలోని దేవపల్లి క్యాంప్‌కు చెందిన పేదల‌కు ఒక్కొక్కరికి 5 కిలోల‌ చొప్పున బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చేస్తున్న సేవా కార్యక్రమాల‌ను కో ఆర్డినేటర్‌ ప్రవీణాబాయి అభినందించారు.

Read More »

ఘన్‌పూర్‌లో ఘనంగా మేడే

డిచ్‌పల్లి, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం 134వ మేడే దినోత్సవం సందర్భంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌ గ్రామ పంచాయతీ, నడిపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఎర్రజెండాలు ఎగురవేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు సాయినాథ్‌ మాట్లాడుతూ అమెరికాలో చికాగో ప్రాంతంలో కార్మికులు అందరూ కలిసి 12 గంటల‌ పని చేయమని, 8 గంటల‌ పని కల్పించాల‌ని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో వారి రక్తంతో ...

Read More »

కరోనా బాధితుల‌కు అన్నదానం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధించినందున ఎంతో మంది వల‌స కార్మికులు, నిరుపేదలు అన్నానికి అల‌మటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎన్నోళ్ల అంజలి మంగళవారం అన్నదానం చేశారు. మొత్తం 70 మందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కుచి కిషన్‌ పంతులు, పివైఎల్‌ డివిజన్‌ అధ్యక్షుడు సాయినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

డిచ్‌పల్లిలో యాచకుల‌కు అన్నదానం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాకుడౌన్‌ విధించిన సందర్భంలో సరైన తిండి దొరకక భిక్షగాళ్లు అల్లాడిపోతున్నారు. రోడ్లపైన జనసంచారం లేకపోవడంతో భిక్షం వేసే వారు కరువయ్యారు. హోటళ్ళు, ఇతరత్రా దుకాణాలు మూసి ఉండడంతో భిక్షాటన చేయలేకపోతున్నారు. విషయం గమనించిన డిచ్‌పల్లికి చెందిన రవి, సౌజన్య దంపతులు గురువారం అన్నదానం చేశారు. ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన యువత గత 16 రోజుల‌ నుంచి అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు 80 మంది పేదవారికి అన్నం పొట్లాలు అందజేస్తున్నారు. ...

Read More »

ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల సహాయ చర్యలు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ను అదుపుచేయడానికి నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది, పారిశుద్య కార్మికులు, అధికారులు, బ్యాంకు సిబ్బందికి తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సానిటైజర్‌, మాస్కులు, గ్లౌజులు, అరటిపండ్లు అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డాక్టర్‌ ప్రవీణాబాయి ఆదేశాల‌ మేరకు బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే చాలా దూరం నుంచి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న వల‌స కూలీల‌కు ఆహారం, పండ్లు అందజేశారు. పారిశుద్య కార్మికురాలిని శాలువాతో సన్మానించారు. ...

Read More »

ఎలాగైనా ఇంటికి చేరాలి…

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాగైనా ఇంటికి చేరాల‌ని బీహార్ వల‌స కూలీలు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిపై నడక ప్రయాణం సాగిస్తున్నారు. డిచ్‌పల్లి నుంచి నడుచుకుంటూ వెళుతున్న వారికి అండగా మేమున్నామని చేయూతను అందిస్తున్నారు ఘనపూర్‌ యువత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి జాతీయ రహదారిపై వెళ్తున్న వారికి, ఊర్లో ఉన్న యాచకుల‌కు, పారిశుద్ధ్య సిబ్బందికి, మిషన్‌ భగీరథ పైపు తెచ్చిన లారీ డ్రైవర్లకు ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తూ మానవతా దృక్పథాన్ని ...

Read More »

తెవివి సెల‌వుల‌ పొడిగింపు

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే తెలంగాణ విశ్వవిద్యాయ పరిధిలో గత నెల‌ మార్చి 15 నుంచి కొనసాగుతున్న సెల‌వుల‌ను ఈ నెల‌ 30 వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల‌ 12 న విడుదల‌ చేసిన జీ ఓ నెంబర్‌ ఎం ఎస్‌ 57 ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే విద్యార్థుల‌ ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని నష్ట పోకుండా ...

Read More »