Breaking News

Editorial

తెలుగు లోగిళ్లు. విజయోస్తు!

భారతీయ సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ప్రతి పండుగ వెనకా స్పష్టమైన ఆలోచన ఉంది; వివేచన ఉంది. ఓపిగ్గా పరిశీలిస్తే- పండుగల వెనక జాతి చరిత్ర మూలాలు కనిపిస్తాయి. ‘ప్రతి గేహంబున శాంతిసౌఖ్యముల దీపశ్రేణి వెల్గించి, శాశ్వతమున్, సత్యము, సుందరమ్మయిన విశ్వప్రేమ’ను నెలకొల్పాలన్న విశ్వజనీన భావన – మన పెద్దల వివేకంలోంచి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ‘మనది మనుష్య జాతి అనుమాట ఒకానొకడి ఆత్మలో అనుక్షణమును మారుమ్రోగుటయెచాలు- సమాజ పురోభివృద్ధికిన్’ అన్న అపురూపమైన ఆలోచన పండుగల నాటి ఆచార వ్యవహారాల్లోంచి తొంగిచూస్తూ ఉంటుంది. ‘కత్తిపోటు ఎవరిమీద పడినా, ...

Read More »

బాసట లేని బాసర!

తెలంగాణలోని ఏకైక అంతర్జాతీయ సమాచార సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ట్రిపుల్ ఐటీ) కొరతల కొలిమిలో కునారిల్లుతోంది. 2008లో అవతరించింది మొదలు బాసర ఐఐఐటీ నానావిధ సమస్యలకు నెలవైనట్లు వరసగా వార్తాకథనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్ళి సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అజయ్ జైన్ రూపొందించిన అధ్యయన నివేదిక- అక్కడి భోజనం ఘోరమని, బోధనం అధ్వానమని స్పష్టీకరిస్తోంది. ఆయన నివేదికాంశాలు ‘ప్రతిష్ఠాత్మక’ ట్రిపుల్ ఐటీ దయనీయ దీనావస్థను కళ్లకు కడుతున్నాయి. గతంలోనూ బాసర ఐఐఐటీ గతి రీతులపై ఎన్నో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కుళ్ళిపోయిన ...

Read More »

తెలంగాణ జర్నలిస్టు ఉద్యమంలో నవశకం

ఆరు దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర దశాబ్దాల కొట్లాట.. 1500లకు మిక్కిలి బలిదానాలు.. ఊరూవాడా ఒక్కటై ఢిల్లీ పాలకులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి జర్నలిస్టులు నవశకానికి నాంది పలికారు. సీమాంధ్ర ఆధిపత్య మీడియా సంస్థల్లో తీవ్ర నిర్బంధంలోనూ పనిచేస్తూ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకమైన కలం వీరులు స్వీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు జర్నలిస్టుల జాతర వేదికగా సన్నద్ధమయ్యారు. తెలంగాణ ఆకాంక్షను పల్లెపల్లెకు చేర్చిన జర్నలిస్టులు నవ తెలంగాణ నిర్మాణంతో పాటు తమ హక్కుల సాధన కోసం కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు. జర్నలిస్టుల ...

Read More »

నవ తెలంగాణకు నాంది!

చూపుడు వేలిమీద సిరాచుక్క రేపు తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబోతున్న కీలక తరుణమిది. యథాపూర్వం ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక సమరం సాగుతున్నా- ఫలితాలు వెలువడ్డ పక్షంరోజులకు తెలంగాణ అస్తిత్వ కాంక్షలు సాకారం కానుండటంతో, ఈ ఎన్నికల ప్రాధాన్యం ఎనలేనిది. దశాబ్దాల ‘ప్రత్యేక’ ఉద్యమాల ఫలశ్రుతిగా, భారతావనిలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ రెండో తేదీన ఆవిర్భవించబోతోంది. ఆ ఆనందానికి, నవతెలంగాణ తొట్టతొలి సారథ్యం కోసం పోటీలు పడుతున్న భిన్న పార్టీల భావోద్వేగాలు జతపడి పక్షంరోజుల ఎన్నికల ప్రచారం ‘ధూం ధాం’గా సాగిపోయింది. 17లోక్‌సభ, 119అసెంబ్లీ ...

Read More »

నేరచరితులపై అందరిదీ మెతకవైఖరే!

రాజకీయాల్లో నేరచరితలకు స్థానం లేకుండా చేయాలని అన్నిరాజకీయ పార్టీలు ప్రకటనల మీద ప్రకట నలు గుప్పిస్తున్నా ఉపన్యాసాలు ఇస్తున్నా అవి ఆచ రణకు వచ్చేసరికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నేరచరితు లకు టిక్కెట్టు ఇవ్వరాదని స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, మేధావులు ఏనాటి నుండో డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఇందుకు రాజకీయపార్టీలు కూడా పైకి వత్తాసు పలుకుతూనే ఉన్నాయి. కానీ అన్ని పార్టీలు నేరచరితులను పెంచి పోషిస్తు న్నాయేమోననిపిస్తున్నది. ఆర్థికవనరులతో పాటు అంగబలం ఉంటేతప్ప విజయలక్ష్మిని దక్కించుకోలేమనే ఆలోచనలతో ఈ నేరచరితులకు స్థానం కల్పిస్తున్నారని చెప్పొచ్చు. ఈసారి ...

Read More »

నిజామాబాద్‌ జిల్లా పాలనా ప్రాదేశిక వ్యవస్థీకరణ – అభివృద్ధి పరంపర

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి: నిజామాబాద్‌ జిల్లా 1952 రాష్ట్ర పునర్వవ్యస్థీకరణలో పలు మార్పులకు లోనైంది. అప్పటి వరకు నాందేడ్‌, నిర్మల్‌, దెగ్లూర్‌, బైంసా ప్రాంతాలను నిజామాబాద్‌ నుంచి తొలగించి మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విలీనం చేశారు. అప్పట్లో 7 తాలూకాలుగా నిజామాబాద్‌, బాన్సువాడ, బోధన్‌, ఆర్మూర్‌, మద్నూర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి కేంద్రాలతో ఏర్పాటు అయింది. 1979లో తాలూకాల పునర్వవ్యస్థీకరణలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాకు మరో రెండు తాలూకాలుగా దోమకొండ, భీంగల్‌ ఏర్పాటయ్యాయి. 1956లో పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటై జిల్లాలో నిజామాబాద్‌, ...

Read More »