Breaking News

Editorial

బ్యాంకుల విలీనం

భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది పక్కనబెట్టి, దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో కొత్త అధ్యాయానికి ఎన్‌డీఏ ప్రభుత్వం తెరతీసింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులనూ, కొసరుగా భారతీయ మహిళ బ్యాంకును విలీనం చేసేందుకు మోదీ ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ నిర్ణయం వల్ల ఎస్‌బీఐ 37లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో భారీ బ్యాంకుగా ఆవిర్భవించేందుకు అవకాశం ఏర్పడింది. అనుబంధ బ్యాంకులను మాతృసంస్థ ఎస్‌బీఐతో విలీనం చేయాలన్న ప్రతిపాదన పాతదే. యూపీఏ హయాంలోనైనా, ఎన్‌డీఏ హయాంలోనైనా ఈ ...

Read More »

స్నేహ వారధి!

అమెరికాలో మూడురోజుల పర్యటన ఆరంభానికి ముందు భారతప్రధాని తన ఐదుదేశాల యాత్రలో ఇప్పటికే మూడింటిని పూర్తిచేశారు. ఈ పర్యటనలో ఒబామాతో భేటీ ఎంత ప్రధానమైనదో, ఆఖరు నిముషంలో వచ్చి చేరిన స్విట్జర్లాండ్‌, మెక్సికోలతో వ్యవహారం కూడా అంతే ప్రధానమైనది. స్విట్జర్లాండ్‌ వ్యాపారవేత్తలను భారత్ లో పెట్టుబడులకు ఆహ్వానించడం, నల్లధనం, పన్ను ఎగవేతలు ఇత్యాది అంశాలపై సమష్టి పోరాటానికి సంకల్పించడం వంటివి అటుంచితే, ఏ లక్ష్యంతో ప్రధాని ఈ దేశంలో కాలుమోపారో అది ఇప్పటికే నెరవేరింది. ‘న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూప్‌’(ఎనఎ్‌సజీ)లో భారత సభ్యత్వానికి తాను మద్దతు ...

Read More »

పొరుగు దేశాలతో రాదారి బంధం

భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి ద్వారా ఆగ్నేయాసియాతో పాటు మనదేశంలోని వెనకబడిన ఈశాన్య ప్రాంత ముఖచిత్రం మారిపోనుంది. ఈ రహదారి ఫలితంగా మౌలిక వసతులు పెరిగి చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కలగనుంది. మూడు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ రహదారి మణిపూర్‌లోని మోరె నుంచి మియన్మార్‌లోని టము, మాండలే నగరం మీదుగా థాయ్‌లాండ్‌లోని మాయోసోట్‌ జిల్లా టాక్‌ వరకు విస్తరించేలా ప్రణాళిక రచించారు. దీనిపై వాహనాల ప్రయాణానికి అవసరమైన త్రైపాక్షిక మోటారు వాహనాల ఒప్పందం ...

Read More »

పరచుకున్నపడగనీడ

కరవు ధాటికి ఆర్థిక వ్యవస్థ కుదేలు రెం డేళ్ల అనావృష్టి, ఈ ఏడాది కోరలు సాచిన కరవు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు ధ్వంసమైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే మూడింట ఒక వంతు గ్రామాలు దుర్భిక్షంతో అల్లాడుతున్నాయి. దేశ జనాభాలో నాలుగోవంతు మీద దీని దుష్ప్రభావం పడింది. దేశంలోని ఇంకా అనేక ప్రాంతాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా వాటిని కరవుపీడిత ప్రాంతాలని ప్రకటించలేదు. వాటినీ పరిగణనలోకి తీసుకున్నట్లయితే, ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థ రుతుపవనాల మీద ...

Read More »

విద్రోహానికి వెసులుబాటు..

దేశవ్యతిరేక విచ్ఛిన్న వాదులపై మన ప్రభుత్వం జరుపుతున్న పోరాటం కథ మళ్లీ మొదటికి వచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో దేశ విద్రోహ కలాపాలకు నాయకత్వం వహిస్తున్న హురియత్ ముఠాలవారు ఏ దేశపు ప్రతినిధులతోనైనా చర్చలు జరపడంపై ఎలాంటి నిషేధం లేదని కేంద్ర ప్రభుత్వం, స్పష్టం చేయడం కథ మొదటికి వచ్చిందనడానికి సాక్ష్యం. ఏది ఏమైనా సరే పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రక్రియను కొనసాగించాలన్న మన ప్రభుత్వ విధానం మళ్లీ మొదలైపోయిదనడానకి ఈ స్పష్టీరణ నిదర్శనం. విదేశీయ వ్యవహారాల సహాయమంత్రి విజయకుమార్ సింగ్ రాజ్యసభకు లిఖిత ...

Read More »

అవినీతి భవనం కూలేనా?

అవినీతికి ఆకాశమెత్తు ప్రతీక అయిన అంతస్థుల ఆదర్శ భవనాన్ని కూలగొట్టాలని కేంద్ర ప్రభుత్వానికి బొంబాయి హైకోర్టు ఉత్తరువులు జారీ చేయడం సందర్భోచిత పరిణామం. రక్షణ రంగాన్ని అగస్టా వెస్ట్‌లాండ్ గగన శకటాల అవినీతి కుదుపుతున్న సమయం లో ముంబయి ఉన్నత న్యాయస్థానం శుక్రవారం చెప్పిన తీర్పు సరికొత్త ప్రకంపనం..ఆదర్శ భవన సముదాయం రక్షణ రంగంలో పెరిగిన మరో అవినీతి పుట్ట! 2010లో ఈ పుట్ట పగిలినప్పటినుంచి అనేక మంది ప్రముఖ రాజకీయవేత్తలు మహారాష్ట్ర అధికారులు ఉన్నత సైనిక అధికారులు అనేకమంది గొప్ప అలజడికి గురి ...

Read More »

జల వెలుగులు కరువు

  మూడేళ్లుగా ఆశించిన వర్షాలు కురవక పోవడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు ప్రధాన కాల్వకు అనుబంధంగా హెడ్ స్లూయీస్ వద్ద నిర్మించిన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన లేక వెలవెలబోతోంది.ప్రాజెక్ట్‌లో నీరుంటే ప్రధాన కాల్వ ద్వారా నీరు వదిలితే విద్యుదుత్పత్తి జరిగేది. నీరు లేనందున ఎలాంటి ఉత్పత్తికి నోచుకోకుండా పోయింది. నైజాం కాలంలో నిర్మాణం.. 1954లో రూ.2.27 కోట్ల వ్యయంతో నైజాం ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసి విద్యుదుత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో ...

Read More »

చైనాను దెబ్బకు దెబ్బ తీసిన భారత్

ఐక్యరాజ్యసమితిలో జరిగిన అవమానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడికి కీలక సూత్రధారి జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను తీవ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదనను చైనా తన వీటో పవర్‌తో అడ్డుకుంది. అంతేకాకుండా అతడు నిషేదం ఎదుర్కొనేంతటి తీవ్రవాది కాదంటూ చైనా తన పనిని వెనకేసుకు వచ్చింది. పైగా ఇలాంటి ప్రతిపాదనలు చేసేటప్పుడు సరైన కారణాలు చూపాలంటూ భారత్‌ను దెప్పిపొడిచింది. అజార్ తన దేశంలో హాయిగా విహరించేందుకు, తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు కావల్సినంత స్వేచ్ఛను పాకిస్తాన్ అందిస్తోంది. ...

Read More »

కృపాల్ సింగ్ బలిదానం వ్యర్థం కారాదు

కృపాల్‌సింగ్ పేరు విన్నారా? అతనిని 1992లో వాఘా వద్ద సరిహద్దులు దాటుతుండగా చూశాను అని పాకిస్తాన్ చెబుతున్నది. గత పాతిక సంవత్సరాలుగా ఇతడు కోట్ లక్‌పాట్ జైలులో (పంజాబ్ ప్రావెన్స్) మగ్గుతున్నాడు. 2016, ఏప్రిల్ 13న అతడిని లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ మరణించినట్లు ప్రకటించారు. గూఢచారి అంటూ పాక్ ప్రభుత్వం అతనిపై నేరారోపణ చేసింది.కృపాల్ సింగ్‌కు ఒక సోదరి ఉంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అఫ్జల్ గురును ఉరితీయవద్దు-అది జుడీషియల్ మర్డర్ అంటూ గొంతు చించుకొని పూనకం వచ్చినట్టు ఊగిన కన్హయ్యకుమార్, ...

Read More »

ధర్మ సంస్థాపనే రామావతార పరమార్థం (నేడు ఒంటిమిట్టలో కల్యాణం)

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకునే రోజు ఇది. భద్రాచలంలో శ్రీరామనవమి, అంటే రాముడి పుట్టిన రోజు జరిగిందది. చైత్ర మాసం-శుక్లపక్ష్యం- నవమి తిథి నాడు పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం- కర్నాటక లగ్నంలో, చంద్రుడిని కూడి న బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం జరిగింది. వివాహం జరిగింది నవమినాడు కాదు. యథావాల్మీకమైన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారు రాసినదాన్ని బట్టి చూస్తే, సౌమ్య నామసంవత్సరం, మాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగ రక్షణకు తీసుకెళ్తాడు. 27వ ...

Read More »

మహాకూటమికి నితీశ్ గ్రీన్ సిగ్నల్

పలువురు ఊహిస్తున్నది చివరకు జరగనే జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ 2019 ఎన్నికలకోసం జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నించనున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. భాజపా తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించడం తమ ఉద్దేశమని, అందుకోసం కాంగ్రెస్,వామపక్షాలతో సహా వీలైనన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. చివరకు ఎంత పెద్ద కూటమి తయారవుతుందో, వారి లక్ష్యం నెరవేరుతుందో లేదో ఈ దశలో ఎవరైనా తమకు తోచిన ఉహాగానాలు చేయగలరు తప్ప, నిర్థారణగా చెప్పగలగడం అసాధ్యమైన పని. వచ్చే సాధారణ ...

Read More »

అమెరికాతో జట్టు…

మన దేశానికీ అమెరికాకూ మధ్య రక్షణ సదుపాయాల సహకారపు ఒప్పందం-లాజిస్టిక్స్ సపోర్ట్ అగ్రిమెంట్ కుదరడం అనివార్యమైన దౌత్య పరిణామం. 2014 మే 26న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం పాలనా బాధ్యతలను స్వీకరించినప్పటినుంచి దేశ రక్షణకు పెరుగుతున్న ప్రాధాన్యం ఈ అపూర్వ పరిణామానికి ప్రాతిపదిక! చైనా వారి యుద్ధ నౌకలు మనదేశానికి చుట్టూ ఉన్న బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్ ఓడరేవులలో తిష్ఠ వేసి ఉండడం మన దేశ భద్రతకు ముంచుకొస్తున్న ప్రమాదం. ఈ దురాక్రమణ వహ్నిని నిరోధించడానికి ...

Read More »

పలికించిన వాడు రామభద్రుడు

వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనింగించిన వాడు ఆంధ్ర వాల్మీకి-కవిసార్వభౌమ వావికొలను సుబ్బారావు (వాసుదాసు). ఒంటిమిట్ట కోదండ రామస్వామికి సరీగ్గా 108 ఏళ్ల క్రితం అంటే 1908, అక్టోబర్ 9,10,11 తేదీల్లో ఈ దేవాలయంలో అంకితమిచ్చారు. నాటి కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. శ్రీమదాంద్ర వాల్మీకీ రామాయణం తెలుగునేల నలు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో ఐదారు దశాబ్దాల క్రితమే సంతరించుకుంది. ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలతో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి ...

Read More »

అనుభూతి కాదు..ఇది జీవనరీతి

దేశద్రోహులతో భరతమాత వరాల బిడ్డలు సహజీవనం చేయవలసిన దుస్థితి దాపురించి ఉండడం వర్తమాన వాస్తవం. ఈ వాస్తవం జమ్మూకశ్మీర్ ‘వసం త’ రాజధాని శ్రీనగర్‌లోని జాతీయ సాంకేతిక ఉన్నత విద్యాలయం- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నిట్- ప్రాంగణంలో మరోసారి ప్రస్ఫుటించింది. ఈ మహావిద్యాలయ ప్రాంగణంలో ముప్పయిశాతం స్థానిక కశ్మీరీ విద్యార్థులు ఇతర ప్రాంతాలవారు. మార్చి 31న భారత జట్టువారు క్రికెట్ ఆటల పోటీలో ఓడిపోయారు. వెస్ట్ ఇండీస్ జట్టు గెలిచింది. నిట్ ప్రాంగణంలోని కశ్మీరీ విద్యార్థులలో అత్యధికులు ఈ భారత పరాజయాన్ని ఉత్సవంగా జరిపి ...

Read More »

ఐరోపా ద్వంద్వనీతి

భారత, ఐరోపా సమాఖ్యల పదమూడవ వాణిజ్య శిఖర సమావేశం విఫలం కావడం ఆశ్చర్యకరం కాదు. ఇరవైతొమ్మిది దేశాల ఈ సమాఖ్య-ఐరోపా యూనియన్-తో మన వాణిజ్య సంబంధాలు, దౌత్య సంబంధాలు అంటీ ముట్టని రీతిలో సాగుతుండడం, ఏళ్ల తరబడి ఆవిష్కృతమవుతున్న అంతర్జాతీయ దృశ్యం. అందువల్ల సమాఖ్యతో మన ప్రభుత్వం కుదుర్చుకోదలచిన, విస్తృత వాణిజ్య పారిశ్రామిక భాగస్వామ్య వ్యవహారాల ఒప్పందం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో గురువారం జరిగిన సమావేశంలో కొలిక్కి రాకపోవడంలో వింత లేదు. ఈ విస్తృత వాణిజ్య, పారిశ్రామిక భాగస్వామ్య వ్యవహారాల ఒప్పందం-బ్రాడ్ బేస్డ్ ...

Read More »

సంప్రదాయ సమీక్ష

మహారాష్టల్రో 1956 నుంచి అమలులో ఉన్న హైందవ దేవాలయ ప్రవేశాధికార శాసనం-హిందూ ప్లేస్ ఆఫ్ వర్‌షిప్ ఎంట్రీ ఆథరైజేషన్ యాక్ట్-లోని నియమావళిని అమలు జరపవలసిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బొంబాయి హైకోర్టు ఆదేశించడం ధార్మిక సంప్రదాయాల సమీక్షకు మరోప్రాతిపదిక! ఈ నియమావళిని కచ్చితంగా అమలు జరపనున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిహెచ్ వాఘేలా, న్యాయమూర్తి ఎమ్‌ఎన్ సోనల్‌లు అధిష్ఠించిన ధర్మాసనానికి శుక్రవారం హామీ ఇవ్వవలసి రావడం విచిత్రమైన పరిణామం! ఈ చట్టం అరవై ఏళ్లుగా అమలు జరుగుతోంది. అలాంటప్పుడు అమలు జరుపుతారా ...

Read More »

ప్రచారం కోసం కాంగ్రెస్ తప్పటడుగులు

తెలంగాణ నీటి పథకాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ఇచ్చిన ప్రజంటెషన్‌ను కాంగ్రెస్ వారు బహిష్కరించడాన్ని చూసినప్పుడు, తెలంగాణలో కొన్ని రోజులుగా ఈ పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ గురించి విస్తృతంగా జరుగతున్న చర్చలో, కాంగ్రెస్ వైఖరికి సంబంధించిన ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తున్నది. మనకు తెలుస్తున్నదానిని బట్టి నగరాల నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉంది. తాము ఎందుకు బహిష్కరించారో కాంగ్రెస్ శాసనసభాపక్షం వారు కొన్ని కారణాలు చెప్పారు. కాని వాటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆమోదించగల విధంగా లేదు. బహిష్కరించడం టిడిపి ...

Read More »

ఆర్ష సంస్కృతిపై అన్నివైపులా దాడులు

1835, ఫిబ్రవరి 3న ఒక బ్రిటీషు ఆఫీసర్, లండన్‌కు ఒక జాబు రాశాడు. ”మనం ఎంత కష్టపడ్డా మన సంస్కృతిని ఈ జాతిలో నాటడం కష్టం. అందుకు అర్ష సంస్కృతి అడ్డం వస్తున్నది. అందుకని ఈ జాతివారికి ఇంగ్లీషు మీద ప్రేమ, ఆర్ష సంస్కృతి మీద ద్వేషం వ్యాపింపజేయాలి.” అదీ లేఖ సారాశం. ఆ తరువాత రాజమండ్రి వుడ్ వర్డ్ డిస్పాచ్ ప్రకారం ఆంగ్లవిద్యా ప్రణాళిక రూపొందింది. ఎఫ్.ఎ, బి.ఎ, ఎం.ఎ. విధానం అమల్లోకి వచ్చింది. సంస్కృతం చదువుకున్న వారిని అవమానకరంగా చూడటం మొదలు ...

Read More »

ప్రజలకు నిజంగా ‘అచ్చే దినే’నా..!

అచ్చెదిన్‌.ఇది ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ నినాదం. అచ్చెదిన్‌ అంటే మంచి రోజులు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల మోడీ ప్రధాన మంత్రిగా ఉండటం వల్ల ప్రజలకు మంచిరోజులే అని అచ్చెదిన్‌ నినాదంతో ప్రజలను నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. నిజానికి ఈ నినాదానికి వాస్తవంలో జరుగు తున్నదానికి ఎక్కడ పొంతన లేదు. మోడీ అధికారం చేపట్టినత ర్వాత నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెట్రోల్‌ ఉత్పత్తుల ధర తగ్గి నప్పటికీ తగ్గిన ధర ఫలితాన్ని ...

Read More »

వ్యర్థం అనర్థం సృష్టించకుండా…

వాతావరణ కాలుష్యాన్ని ప్రజ్వరిల్లజేస్తున్న భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నియంత్రణ, పునర్వినియోగాల్ని లక్షిస్తూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి విపుల నిబంధనావళి తాజాగా వెలుగుచూసింది. మూడు నెలల క్రితం ఆ మేరకు ముసాయిదా రూపొందించి, మెరుగుదల కోసం సూచనలను సలహాలను ఆహ్వానించిన కేంద్రప్రభుత్వం- వ్యర్థాలను సాధ్యమైనంతవరకు ఉపయుక్తంగా మలచుకోవాలన్న స్ఫూర్తికి సరికొత్త విధివిధానాల్లో పెద్దపీట వేసింది. ఇకమీదట ప్రతి నిర్మాణదారూ కట్టుబడి, కూల్చివేతల్లో వచ్చే వ్యర్థాలను వేటికవిగా వర్గీకరించి విధిగా సేకరణ కేంద్రాలకు పంపించాల్సి ఉంటుంది. అలా పోగుపడే వ్యర్థాల క్రోడీకరణ, నిర్ణీత అవసరాల నిమిత్తం ...

Read More »