Breaking News

Education

వివేకానంద విద్యాపథకం దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని బాహ్మ్రణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ బుధవారం తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. గడువును ఈ నెల 28 నుంచి వచ్చే నెల 18 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

Read More »

విద్యాశాఖా మంత్రిని మ‌ర్యాద పూర్వ‌కంగా కలిసిన టీయూ వీసీ

డిచ్‌ప‌ల్లి, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖా మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి ని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లోని ఆమె చాంబర్ లో కలిసి పుష్పగుచ్చం అంద‌జేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి నాల్గవ రెగ్యూలర్ నూతన ఉపకులపతిగా ఆచార్య డి. రవీందర్ గత శనివారం నియమింపబడిన విషయం విదితమే. ఈ సందర్భంగా వీసీ గురువారం ఉదయం విద్యాశాఖామంత్రి ని మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నూతనంగా నియమితులైన ...

Read More »

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు పొడిగించారు. క‌రోనా నేప‌థ్యంలో ఈ నెల 31 వ‌ర‌కు విద్యార్థుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు టీఎస్‌ ఈ సెట్‌ కన్వీనర్ సీహెచ్‌.వెంకటరమణారెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్ర‌కారం ద‌ర‌ఖాస్తు గ‌డువు ఈనెల 18న ముగిసింది. అయితే రాష్ట్రంలో విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్‌ను నిలువ‌రించ‌డానికి ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే 24 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ...

Read More »

పరిశోధనా రంగంలో యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలుపుతా

డిచ్‌పల్లి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన తెలంగాణ రాష్ట్రంలో పరిశోధనా రంగంలోనే తెలంగాణ యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలుపుతానని నూతన ఉపకుల‌పతి ఆచార్య డి. రవీందర్ వెల్ల‌డిరచారు. సోమవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి ఉపకుల‌పతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేశారు. వారికి రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వీసీ చాంబర్‌లోకి ఆహ్వానించారు. తన వీసీ ఆస్థానంలో కూర్చున్న ఆచార్య డి. రవీందర్ తెలంగాణ విశ్వవిద్యాల‌య ఉపకుల‌పతి బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించి రిజిస్ట్రార్‌ ఉపకుల‌పతి బాధ్యత ...

Read More »

ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌గా ఆచార్య అత్తర్‌ సుల్తానా

డిచ్‌పల్లి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని ఉర్దూ విబాగాధిపతి ఆచార్య అత్తర్‌ సుల్తానా ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌ (పీఠాధిపతి)గా నియమితుల‌య్యారు. ఉపకుల‌పతి, సీనియర్‌ ఐఎఎస్‌ నీతూ కుమారి ప్రసాద్‌ అదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం సాయంత్రం ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌ (పీఠాధిపతి) ఉత్తర్వుల‌ను ఆచార్య అత్తర్‌ సుల్తానాకు అందజేశారు. ఆచార్య అత్తర్‌ సుల్తానా 2008 లో తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో ఉర్దూ విభాగంలో అధ్యాపకురాలిగా నియమితులై విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళికా సంఘ చైర్‌ పర్సన్‌గా ...

Read More »

దరఖాస్తుల‌ ఆహ్వానం

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ నిజామాబాద్‌లో గల‌ రాష్ట్రీయ బాల‌ స్వాస్థ్య కార్యక్రమంలోని సైకాల‌జిస్టు పోస్టుకు, మరియు జిల్లా టీకా అధికారి కార్యాల‌యంలో ఇమ్యునైజేషన్‌ విభాగంలో గ రిఫ్రిజిరేషన్‌ టెక్నిషియన్‌ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల‌ నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల‌ నరేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తుల‌ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాల‌యం నుండి తీసుకోవాల‌ని, పూర్తి ...

Read More »

రేపు పదో తరగతి ఫలితాలు

హైదరాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు శుక్రవారం వెల్ల‌డి కానున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వం టెన్త్‌ పరీక్షల‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం వెలువడనున్న ఫలితాల్లో ఎఫ్‌ఏ-1 మార్కుల‌ ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి ఫలితాల‌ విడుదల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం పచ్చజెండా ఊపారు. అధికారులు పంపిన దస్త్రంపై మంత్రి సంతకం చేసిన విషయం తెలిసిందే.

Read More »

టిఎస్‌పిఎస్‌సి సభ్యులు వీరే…

హైదరాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల‌ను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నియమించారు. సిఎం కెసిఆర్‌ ప్రతిపాదన మేరకు గవర్నర్‌ ఆమోదించారు. చైర్మన్‌గా డా. బి. జనార్ధన్‌ రెడ్డి (ఐఎఎస్‌) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు) సభ్యులుగా రమావత్‌ ధన్‌ సింగ్‌ (బిటెక్‌ సివిల్‌, రిటైర్డ్‌ ఈఎన్సీ), ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ, ప్రొ.హెడ్‌ డిపార్డ్మెంట్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ సిబిఐటి), కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ., ఎమ్మె ...

Read More »

టిఎస్‌పిఎస్‌సి సభ్యురాలిగా సుమిత్ర ఆనంద్‌

కామారెడ్డి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌పిఎస్‌సి తెలంగాణ స్టేట్‌ సభ్యురాలిగా సుమిత్ర ఆనంద్‌ చిన్నమల్లారెడ్డి (ఉపాధ్యాయురాలు) ని రాష్ట ముఖ్య మంత్రి కేసిఆర్‌ నియమించడం జరిగింది. పిఆర్‌టియు తెలంగాణ కామారెడ్డి ఆధ్వర్యములో బుధవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమములో జిల్లా అధ్యక్షుడు మనోహర్‌ రావు, ప్రధాన కార్య దర్శి ల‌క్ష్మీ రాజం, కామారెడ్డి మండలం అధ్యక్షుడు అశోక్‌, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్ తుల‌ రవీందర్‌ పాల్గొన్నారు.

Read More »

నళినికి డాక్టరేట్‌ ప్రదానం

డిచ్‌పల్లి, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగపు పరిశోధకులు జి. నళినికి పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడింది. బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో ప్రొఫెసర్‌ కైసర్‌ మహ్మద్‌ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి జి. నళిని ‘‘ది పాటర్న్‌ ఆఫ్‌ ఎంప్లాయీ ఎంగేజ్‌ మెంట్‌ ఇన్‌ ప్రైవేట్‌ సెక్టార్‌ బ్యాంక్స్‌ – ఎ సెలెక్ట్‌ స్టడీ’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. ఓపెన్‌ వైవా వోస్‌ (వర్చువల్‌) ...

Read More »

పొన్నాల బాల‌య్యకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని హిందీ విభాగపు పరిశోధకులు మరియు ప్రముఖ కవి, రచయిత పొన్నాల బాల‌య్యకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని హిందీ విభాగపు అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి. ప్రవీణా బాయి పర్యవేక్షణలో ‘‘హిందీ – తెలుగు దళిత కవిత్వంలో శిల్పం, అభివ్యక్తీకరణ (2005-2015)’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన గావించి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి సమర్పించారు. అంతర్జాల‌ (వర్చువల్‌) వేదికగా ఏర్పాటు ...

Read More »

మే 5 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లోని బి.ఎడ్‌. కోర్సుల‌కు చెందిన మూడవ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ థియరీ పరీక్షలు జనవరి, 2021 లో జరిగిన విషయం తెలిసిందే. అందుకు గాను బి.ఎడ్‌. పరీక్షల‌ సమాధాన పత్రాల‌కు మే 5 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహింపబడుతుందని వర్సీటి అధికారులు వెల్ల‌డించారు. రీ వాల్యూయేషన్‌ పేపర్‌ ఒక్కింటికి రూ. 500, రీ కౌంటింగ్‌ పేపర్‌ ఒక్కింటికి రూ. 300, దరఖాస్తు ఫారానికి ...

Read More »

బడుల‌కు వేసవి సెల‌వులు ఇవ్వాలి….

కామారెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో రోజు, రోజుకు కరోణ విజృంబిస్తున్న తరుణంలో పదవ తరగతి పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కాని ఉపాద్యాయుల‌పై నిర్లక్ష్యానికి సాక్షిగా అనేక మంది ఉపాద్యాయులు కరోణా బారినపడి మరణించారని, కొంత మంది హోమ్‌ఐసోలేషన్‌లో ఉన్నారని కామారెడ్డి జిల్లాతపస్‌ జిల్లా అద్యక్షుడు ఫుల్‌గం రాఘవరెడ్డి అన్నారు. ఉపాద్యాయుల‌ ప్రాణాల‌తో చెల‌గాటం ఆడకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల‌ల‌కు సెల‌వులు ప్రకటించాల‌ని తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ ...

Read More »

28 వరకు డిగ్రీ రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని అన్ని అనుబంధ కళాశాల‌లోని డిగ్రీ కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ మరియు రెండవ, నాల్గ‌వ సెమిస్టర్‌ రెగ్యూల‌ర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు జనవరి, 2021 లో జరిగిన విషయం తెలిసిందే. అందుకు గాను డిగ్రీ పరీక్షల‌ సమాధాన పత్రాల‌కు ఈ నెల‌ 28 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహింపబడుతుందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. రీ వాల్యూయేషన్‌ పేపర్‌ ఒక్కింటికి 500 ...

Read More »

20 న పి.జి.స్పాట్‌ అడ్మిషన్లు

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల‌లో ఈ నెల‌ 20 న పి.జి. సీట్ల భర్తీ కోసం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ ఎం.చంద్రకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.కాం., ఎం.ఎ. తెలుగు, ఎం.ఎ. ఎకనమిక్స్‌, ఎం.ఎస్‌.డబ్ల్యు కోర్సులో మిగిలిపోయిన సీట్లకు ప్రవేశాలు ఉంటాయని, ఉస్మానియా విశ్వవిద్యాల‌యం నిర్వహించిన పి.జి.సెట్‌ రాసినవారితో పాటు రాయనివారు కూడా అర్హులేనన్నారు. అర్హత గల‌ విద్యార్థులు ఈ నెల‌ 20 న ఉదయం తమ ఒరిజినల్‌, ...

Read More »

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు కలిసి క్షేత్రస్థాయిలో సేకరించి వెంటనే పంపాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ విద్యా శాఖ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం ఆయన విద్యాశాఖ ఎంఇఓల‌తో, మున్సిపల్‌ కమీషనర్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారుల‌తో సమావేశమై ప్రభుత్వం ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి 2 వేల‌ రూపాయల‌ ఆర్థిక సహాయం, 25 కిలోల‌ బియ్యం సరఫరా చేయనున్న నేపథ్యంలో సంబంధిత ప్రయివేటు ...

Read More »

ఘనంగా ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆవిర్భావ వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ నగరం కాంగ్రెస్‌ భవన్‌లో ఎన్‌.ఎస్‌. యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 51 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్‌ పార్టీ రూరల్‌ ఇంఛార్జి భూపతి రెడ్డి హాజరై ఎన్‌.ఎస్‌.యూ.ఐ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం సమస్యల‌పై పోరాడే తత్వం మరియు నాయకత్వ ల‌క్షణాన్ని పెంపొందించి ...

Read More »

జాగ్రఫీలో డాక్టరేట్‌ పొందిన నారాయణ

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని సౌత్‌ క్యాంపస్‌లో జియో-ఇన్‌ ఫర్మాటిక్స్‌ విభాగం అకడమిక్‌ కన్సల్టెంట్‌ ఎస్‌.నారాయణకు ఉస్మానియా విశ్వవిద్యాల‌యం జాగ్రఫీ సబ్జెక్ట్‌ లో పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాల‌యంలోని జాగ్రఫీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గా పని చేసిన విశ్రాంతాచార్యులు డా. కె. నారాయణ పర్యవేక్షణలో ‘‘అర్బన్‌ స్ప్రాల్‌ అనాసిస్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ టౌన్‌ త్రూ జిఐఎస్‌ అండ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నిక్స్‌’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన ...

Read More »

పరిశోధనల‌తోనే సాహిత్య వికాసం

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశోధనల‌తోనే మేలైన సాహిత్య వికాసం జరుగుతుందని ప్రముఖ జానపద పరిశోధకులు, జానపద సాహిత్య ల‌బ్ద ప్రతిష్టులు, ప్రావీణ్యులు, మైసూర్‌ విశ్వవిద్యాల‌యంలో విశ్రాంతాచార్యులు ఆచార్య ఆర్వీయస్‌ సుందరం పేర్కొన్నారు. మైసూర్‌ విశ్వవిద్యాల‌యంలో తెలుగు విభాగంలో ‘‘ఆంధ్రుల‌ జానపద విజ్ఞానం’’ అనే అంశంపై పరిశోధించి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. ఆ గ్రంథం అన్ని తెలుగు విభాగాల‌లో జానపద సాహిత్య పాఠ్య గ్రంథంగా ప్రసిద్ధి పొందింది. జానపద పరిశోధకుల‌కు మొట్ట మొదటి రిఫరెన్స్‌ గ్రంథంగా, ఉపయుక్త గ్రంథంగా ...

Read More »

సంగీతకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఆర్‌. సంగీతకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని తెలుగు అధ్యయనశాఖ అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. కె. లావణ్య పర్యవేక్షణలో ‘‘అదిలాబాద్‌ జిల్లా గిరిజనుల‌ సంస్కృతి – మౌఖిక సాహిత్యం’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన గావించి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించి తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి సమర్పించారు. బుధవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల‌ సమావేశ మందిరంలో ఏర్పాటు ...

Read More »