Breaking News

Features

మెగా లోక్అదాల‌త్ కు అనూహ్య‌స్పంద‌న‌

  ఆర్మూర్, డిసెంబ‌ర్ 7 : ఆర్మూర్ యున్సిఫ్ కోర్టులో శ‌నివారం మండ‌ల న్యాయ సేవా సంస్థ ఆద్వ‌ర్యంలో 2వ జాతీయ మెగా లోక్అదాల‌త్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా కోర్టులో పెండింగ్ లోఉన్న కేసుల‌ను రాజీప‌డి ప‌రీష్క‌రించుకునేందుకు క‌క్షీదారులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. కోర్టు ఆవ‌ర‌ణ‌లో జూనియ‌ర్ సివిల్ జ‌డ్జ్ గ‌జ‌వాడ వేణు, అడీష‌న‌ల్ జ‌నియ‌ర్ సివిల్ జ‌డ్జి కె .జ‌య‌రాం రెడ్డీలు వివిద ర‌కాల కేసుల్లోని క‌క్షీదారుల‌కు వివ‌రించి అప్ప‌టిక‌ప్పుడు కేసుల‌ను ప‌రీష్క‌రించారు. ఈ సంద‌ర్బంగా 157 కేసుల‌లోని క‌క్షీదారుల మ‌ద్య రాజీకుదిర్చి ...

Read More »

ఘనంగా అంబేద్కర్ వర్దంతి వేడుకలు

  ఆర్మూర్, డిసెంబర్ 6 రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 58వ వర్గదంతిని పట్టణంలోని దళితులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి దళిత ఐక్య సంఘటన అధ్యక్షుడు గుమ్మడి చంద్రయ్య, టిఏమ్మార్పీఏస్ రాష్ర్ట ఉపాద్యక్షుడు కోక్కెర భూమన్నలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ చేసిన సేవలను వారు కోనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత ...

Read More »

ఎన్ఎస్ యుఐ స‌భ్య‌త్వ న‌మోదు

  ఆర్మూర్, న‌వంబ‌ర్26 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని ప‌లు డిగ్రీ క‌ళాశాల‌లో బుధ‌వారం ఎన్ఎస్ యుఐ మండ‌ల అధ్య‌క్షుడు షాహీద్ ఆద్వ‌ర్యంలో స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్ఎస్ యుఐ లో చేరేందుకు విద్యార్థులు మ‌క్కువ చూపిస్తున్నార‌ని అన్నారు. అందులో బాగంగానే ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. అలాగే విద్య‌ర్థుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికై ఎన్ఎస్ యుఐ ఎప్పుడు ముందుంటుంద‌ని ఆయ‌న తెలిపారు. అనంత‌రం డ‌గ్రీ క‌ళాశాల విద్యార్థుల‌కు స‌భ్య‌త్వం న‌మోదు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్ఎస్ యుఐ ...

Read More »

ప్ర‌జ‌లు సంక్షేమ‌మే తెరాస ద్యేయం

  ఆర్మూర్, న‌వంబ‌ర్25 : ప‌్ర‌జ‌ల సంక్షేమ‌మే తెరాస ప్ర‌భుత్వ ద్యేయ‌మ‌ని ఆర్మూర్ మున్సిప‌ల్ చైర్మ‌న్ స్వాతి సింగ్ బ‌బ్లూ మంగ‌ళ‌వారం అన్నారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ తెరాస ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని అందులో బాగంగానే ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జ‌లు అనేక స‌మ‌స్య‌ల‌తో మున్సిప‌ల్ కార్యాల‌యానికి వ‌స్తూ ఉంటార‌ని, కాని వారికి మున్సిప‌ల్ లో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని భావించి కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఒక హెల్ప్ లైన్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసిన‌ట్లు ఆమె వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు మున్సిప‌ల్ కార్య‌ల‌యంలో ...

Read More »

అర్హులకు సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, నవంబర్‌16: అర్హులు నష్టపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని, ప్రభుత్వానికి భారమైనప్పటికి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసర కల్పించడానికి ఉదేశ్యంతోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫించన్‌ డబ్బులు పెంచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాన్సువాడలో బాన్సువాడ ప్రేస్‌క్లబ్‌ నూతన కార్యవర్గ కమిటి ఏర్సాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక బాలసదన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోకస్‌ లబ్దిదారులను తోలగించాలని ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సర్వేలపై కొన్ని పార్టీలు ప్రజలను తప్పదోవ ...

Read More »

ఆంధ్రాబ్యాంకులో పిల్లలకు కొత్త ఖాతాలు

నిజామాబాద్‌, నవంబరు 15, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల కోసం మాత్రమే కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరచేందుకు కొత్త పథకం అమలులోకి తీసుకువచ్చింది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పథకాన్ని అమలు చేస్తున్నట్లు బ్యాంకు జోనల్‌ మేనేజర్‌ మల్లిఖార్జున్‌ తెలిపారు. ఆంధ్రాబ్యాంకు లిటిల్‌ స్టార్స్‌, ఆంధ్రాబ్యాంకు టిన్స్‌లనే రెండు పద్దతుల ద్వారా ఖాతాలను తెరుస్తామని, పిల్లల తల్లిదండ్రులు సంబందిత ఏరియా బ్యాంకులో సంప్రదించాలని సూచించారు. ఈ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు.

Read More »

అంగన్‌వాడి పోస్టులకు ఫైరవీలు షూర్‌…. 493 పోస్టులు ఖాళీలు

ఎమ్మేల్యేల చేతికి పగ్గాలు కుప్పలు తెప్పలుగా ధరఖాస్తులు నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 15, జిల్లాలో అంగన్‌వాడిల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ కావడంతో ఫైరవీలకు జోరుగా తెర లేసింది. ఈ నియమాకాలలో ప్రథానంగా స్థానిక ఎమ్మేల్యేల చేతిలో ఉండటంతో స్థానిక అదికారి పార్టీ నాయకులు ఇప్పటి నుంచి ముమ్మరంగా ఫైరవీలకు సిద్దం అవుతున్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈనెల 13న జిల్లాలో అంగన్‌వాడిలలో ఖాళీగా ఉన్న 493 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 36 అంగన్‌వాడి ...

Read More »

రైల్వే స్టేషన్లో ప్రైవేట్‌ బహుళ సముదాయాలు….నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎంపిక

కసరత్తు ప్రారంభించిన ఆర్‌ఎల్‌డిఎ నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 14, నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌కు మహార్థశ రానుందా…. మోడల్‌ రేల్వే స్టేషన్లగా మారుస్తామన్న యుపిఏ ప్రభుత్వం ఇంటి ముఖం పట్టింది. మోడల్‌ సంగతి ఏలా ఉన్న స్టేషన్‌ మాత్రం ఎప్పటిలాగే అవస్థలతో డల్‌గా ఉంది. ఇప్పుడు ఎన్‌డిఎ ప్రభుత్వంలో రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే స్థలాల్లో బహుళ సముదాయాలను నిర్మించేందుకు పైవ్రేట్‌ భాగస్వామ్యన్ని కోరుతంది. ఇందుకు మోడల్‌గా నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేసింది. నిజామాబాద్‌ నగరానికి నడి బోడ్డున ఉన్న రైల్వే ...

Read More »

వృద్దశ్రమంలో దుప్పట్ల పంపిణి

బోధన్‌, నవంబర్‌11, బోధన్‌ మండలం జాడిజమాల్‌పూర్‌లోని వృద్దశ్రమంలో మంగళవారం లయన్స్‌ క్లన ఆఫ్‌ బోధన్‌ సేవ ఆధ్వర్యంలో 15మంది వృద్దులకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు, ఆశ్రమ నిర్వహకులు లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులకు అభినందించారు. ఈ కార్యమ్రంలో రీజనల్‌ కార్యదర్శి శ్రీనివాసచారి, క్లబ్‌ అధ్యక్షకార్యదర్శులు నవీద్‌నూరాని, యం. రవీకుమార్‌, కోశాధికారి రమేష్‌గౌడ్‌, ప్రతినిధులు శ్యాంసుందర్‌, గంగాప్రసాద్‌, గ్రామ పెద్దలు సుందర్‌రాజ్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

నిస్సహాయ స్థితిలో వున్న వారికి ఆసరా -పించన్ల పంపిణీలో ఎమ్మెల్యే షిండే

మద్నూర్‌, నవంబర్‌ 9 : సమాజంలో నిస్సహాయ స్థితిలో వున్న వారికి ఆపన్న హస్తం అందించేదే ఆసరా పథకం అని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. ఆదివారం ఆయన మద్నూర్‌, బిచ్కుంద మండలాల్లో ఆసరా పథకం కింద పించన్లను పంపిణీ చేశారు. కార్మికులు, కల్లుగీత, చేనేత కార్మికులతో పాటు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం ఆసరా పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీని కింద వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల చొప్పున పించన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి ...

Read More »

మళ్లీ ఆవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు …. ఎన్నికల హమికి తూట్లు

నియమాకాలకు రంగం సిద్దం ఎన్నికల హమికి తూట్లు నిజామాబాద్ నవంబరు 9, ఎన్నికల్లో  నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామికి తూట్లు పొడుస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే ఆవుట్‌ సోర్సింగ్‌ నియమాకాలు ఉండవని, ప్రభుత్వమే అన్ని రకాల నియమాకాలను చేపడుతుందని హామి ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాడిన ఆరు మాసాలు కావస్తున్న ఉద్యోగాల సంగతి ఏలా ఉన్న జిల్లాల వారిగా మళ్లీ ఆవుట్‌ పోర్పింగ్‌ నియమాకాలకు పచ్చ జండా ఊపారు. ఏకంగా ఒక నిజామాబాద్‌ జిల్లాలోనే 850కి పైగా పోస్టులు ఆవుట్‌ సోర్సింగ్‌ ...

Read More »

పత్రికలు నామాటను వక్రీకరిచాయి మంత్రి పోచారం

మాట తప్పిన మంత్రి నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 8, తన వ్యాఖ్యలను పత్రికలు వక్రీకరిచాయని, నేను ఎప్పుడు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆసరా పెన్షన్ల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై నేనేప్పుడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, కొందరు నా వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేసారన్నారు. తప్పుడు చేసినోడి కాదు తప్పు.. అది చూసినోడిదే తప్పు అన్నట్లుగా పోచారం చేసిన వ్యాఖ్యలు మిడియా వక్రికరించిందని తప్పించుకున్నారు. ఇదేలా ...

Read More »

వారంతే……..అవినీతిటైపు

  బాన్సువాడ, నవంబర్‌07, (పండరీనాథ్‌): అక్రమ వ్యాపారాలను అరికట్టడంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారు. బోధన్‌ ప్రాంతంలో నిషేదిత మత్తు పదార్థాల నియోగం, అనుమతిలేని మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసార తయారి అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఉన్న వీటిని అరికట్టడంతో చిత్తశుద్ది చూపడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నా ప్రత్కేక బృందాలు దాడులు చేస్తున్నాపుడే అక్రమాల గుట్టురట్టవుతోంది. స్థానికి అధాకారులు తమకేమి పట్టనట్లు ఉండడం అనుమానాలకు తావిస్తొంది. క(ళ్ళు)ల్లు మూసుకుంటున్న అధికారులు బోధన్‌ డివిజన్‌లో కల్తీకల్లు వ్యాపారం ...

Read More »

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా.. జిల్లాకు మొండి చేయి ఎన్నికల హామీలు గల్లంతే

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా..  జిల్లాకు మొండి చేయి  ఎన్నికల హామీలు గల్లంతే నిజామాబాద్‌  నవంబరు 5:  తెలంగాణ రాష్ట్ర తొలి పద్ధు నిజామాబాద్‌ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కాని అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పది నెలలకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 637.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.48,648.47 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989.49 కోట్లు, ఆర్థిక లోటు ...

Read More »

కామారెడ్డిలో చోర్‌ బజార్‌

అడ్డికి పావుసేర్‌ ధరకే సెల్‌ ఫోన్‌ కామారెడ్డి, నవంబర్‌  4: వేలల్లో ధర పలికే సెల్‌ఫోన్‌ వందల్లో దొరుకుతుందంటే నమ్ముతారా? ఇది ముమ్మాటికి నిజం. అయితే అలా తక్కువ ధరకు సెల్‌ఫోన్‌ అమ్మకాలు కామారెడ్డిలోని చోర్‌ బజార్‌లో జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని సిరిసిల్లా రోడ్‌లో ఎస్‌బిహెచ్‌ బ్యాంకు ఎదురుగా వున్న వీధిలో సెల్‌ఫోన్‌ల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆ వీధిలోకి వెళ్తే వందలాది మంది సెల్‌ఫోన్‌లను చేతిలో పట్టుకుని రోడ్డుపై నిల్చుండి లావాదేవీలు జరుపుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. నోకియా మొదలుకొని శ్యాంసంగ్‌, ఎల్‌జి, మాక్రోమాక్స్‌, ...

Read More »

గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన

బోధన్‌, నవంబర్‌02: బోధన్‌ మండలం ఊట్‌పల్లిలో సోసైటీ గోదాం నిర్మాణానికి ఆదివారం సొసైటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా అమ్దాపూర్‌ సొసైటీ చైర్మెన్‌ కృష్ణ మాట్లాడుతూ గోదాం నిర్మాణానికి 10లక్షలు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ గోదాంను సొసైటీ పరిధిలో ఉన్న ఊట్‌పల్లిలో నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. సొసైటీ నిర్మాణ పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఊట్‌పల్లి సర్పంచ్‌ మారయ్య, సొసైటీల ఎఈ నరేష్‌, మాజీ ఎంపీటీసీ విఠల్‌గౌడ్‌, సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్‌, గ్రామస్తులు ఉన్నారు.

Read More »

బంది అయన గోదావరి

బాన్సువాడ,(కె.పండరినాథ్‌), నవంబర్‌02: మన రాష్ట్రప్రభుత్వ చేతగాని తనాన్ని పొరుగురాష్ట్రాలు అదునుగ తీసుకుంటున్నాయి. ఏం చేసిన అడ్డుకునే స్థితిలో లేదనే భావనతో నీటి ప్రవహాలకుఅడ్డుకట్టలువేసిఒడిసిపట్టుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గోదావరి, దాని ఉపనదులపై ప్రాజెక్టులు నిర్మించి నీటిని బందిస్తున్నాయి.ఫలితంగా ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర బరితెగించి అడుగడుగునా కట్టిన ఆనకట్టలతో గోదావరి బంది అయింది. అక్రమ కట్టడాలపై మనవారు గగ్గోలు పెడుతున్న మహారాష్ట్ర జంకులేకుండా బాబ్లీతో సహా 14 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ...

Read More »

కవి సమయం కోదారి శ్రీను

తెలంగాణ పాటలోకి దళిత బహుజన మైనారిటీ పారిభాషికా పదాలను, ముఖ్యంగా వారి సాంస్కతిక చిహ్నాలను తెచ్చి పాటను పరిపుష్టం చేసిన తీరు అభినందనీయం. ఆంతేకాదు, తన కవిత్వం ద్వారా హిందూ ముస్లింల సమైక్య జీవనాన్ని, ఊరుమ్మడి సాంస్కతిక అస్తిత్వాన్ని బలంగా ముందుకు తెచ్చిండు శ్రీను. అస్సోయ్ దూలా పాట ఒక్కమాటలో తెలంగాణ సమైక్యతకు నిండు నిదర్శనం. కోదారి శ్రీను. ఇది తన కలం పేరు. సాయుధ పోరాట వీరుడు కొమురయ్య (దొడ్డి) స్ఫూర్తితో తాను ఆ దారిని ఎంచుకుని కోదారి శ్రీను అయిండు. ఈ ...

Read More »

తెలంగాణ జర్నలిస్టు ఉద్యమంలో నవశకం

ఆరు దశాబ్దాల ఆరాటం.. నాలుగున్నర దశాబ్దాల కొట్లాట.. 1500లకు మిక్కిలి బలిదానాలు.. ఊరూవాడా ఒక్కటై ఢిల్లీ పాలకులను ఎదురించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి జర్నలిస్టులు నవశకానికి నాంది పలికారు. సీమాంధ్ర ఆధిపత్య మీడియా సంస్థల్లో తీవ్ర నిర్బంధంలోనూ పనిచేస్తూ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకమైన కలం వీరులు స్వీయ అస్తిత్వాన్ని చాటుకునేందుకు జర్నలిస్టుల జాతర వేదికగా సన్నద్ధమయ్యారు. తెలంగాణ ఆకాంక్షను పల్లెపల్లెకు చేర్చిన జర్నలిస్టులు నవ తెలంగాణ నిర్మాణంతో పాటు తమ హక్కుల సాధన కోసం కొత్త వేదికను ఏర్పాటు చేసుకున్నారు. జర్నలిస్టుల ...

Read More »

ఒగ్గు కథకు చిరునామా “మిద్దె రాములు” – ఓ తెలంగాణ కళాకారుడు

ఒగ్గు కథకు మారు పేరు ‘మిద్దె రాములు’. అతని పాటకు పల్లె పల్లవవుతుంది. అతని గొంతు గట్లను దాటుతూ పంట పొలాల్ని స్పృశిస్తుంది. అతని కథకు తంగెడుపూలు తలవూపుతూ స్వాగతం చెబితే, పల్లెలు, తండాలు ప్రాణం పోసుకుంటాయి. అతను ఆ రోజు ఊళ్లో కథ చెబుతాడంటే ఆ ఊరికి కొత్త కళ వచ్చేస్తుంది. అది ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ ఆడిటోరియం. చిరుగజ్జెల సవ్వడితో, నాట్య భంగిమలతో ఓ తెలంగాణ కళాకారుడు అద్భుతంగా ఒగ్గు కథ చెప్పాడు. స్టేజి దిగగానే జనమంతా ఆయన చుట్టుమూగి ‘ఆటోగ్రాఫ్‌ ...

Read More »