Breaking News

Features

వైభవంగా రథోత్సవం, జాతర

  మోర్తాడ్‌, మార్చి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తొర్తి గ్రామంలోగల శ్రీవెంకటేశ్వర ఆలయంలో మంగళవారం స్వామివారి రథోత్సవం, శ్రీవారి కళ్యాణోత్సవం, జాతర, అన్నదానం అత్యంత వైభవంగా నిర్వహించారు. గత ఐదురోజులుగా గ్రామ కమిటీ ఆద్వర్యంలో వేద పండితులతో బ్రహ్మూెత్సవాలు నిర్వహించారు. జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, మహిళలు, భక్తులు అదిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. విడిసి సభ్యులు బక్తులకు సౌకర్యాలు కల్పించారు.

Read More »

ఫలించిన కెసిఆర్ కల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కల ఫలించింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధపై గులాబీ జెండాను ఎగురవేశారు. గత ఎన్నికల్లో అప్పటి పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా పోటీ చేయని టిఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేంత వరకు ఈ అంశంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అందరూ ఊహించినట్లుగానే ఎన్నికల ఫలితాలను చూస్తే టిఆర్‌ఎస్ ఎవరి మద్దతు లేకుండా సొంతంగా మేయర్ స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇది నిజంగా చారిత్రాత్మక విజయంగా పేర్కొనవచ్చు. గత మూడు దశాబ్దాలుగా మజ్లిస్ సహకారం లేకుండా ఏ ...

Read More »

శీతల మృత్యు గహ్వరం సియాచిన్

యాచిన్’’అంటే స్థానిక భాషలో గులాబీల తోట! బహుశః మృత్యుదేవతకది గులాబీల తోటయ్యుంటుంది! సైనికులకది మృత్యు గహ్వరమే… ప్రపంచం మొత్తం మీద అత్యున్నత అత్యంత శీతల సైనిక స్థావరం అదే! సముద్ర మట్టానికి ఐదువేల ఏడువందల యాభై మూడు మీటర్ల ఎత్తున వున్న రుూ మంచు శిఖరం మీద అకస్మాత్తుగా చెలరేగే మంచు తుఫానుల వేగం గంటకి 160 కిలోమీటర్లుంటుంది. సియాచిన్ స్థావరాన్ని 1984లో పాక్ సైన్యాలను తరిమికొట్టి ఆక్రమించుకున్న మన పదాతి దళం- వీరజవాన్‌లు అప్పటినుంచీ, అహర్నిశలూ కాపలా కాస్తూనే వున్నారు. ఈ నిర్జీవ ...

Read More »

విదేశాంగ విధానంలో మార్పు రావాలి

విదేశాంగ విధానం ఓటు బ్యాంకు రాజకీయం ఆధారంగా నిర్వహించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం ఇదే విధానం కొనసాగింది. ఇజ్రాయిల్‌తో స్నేహం చేస్తే ముస్లిం ఓటర్లు దూరమవుతారని కాంగ్రెస్ భయపడింది. అందుకే కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇజ్రాయిల్‌తో స్నేషం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇజ్రాయిల్‌తో ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహించవలసి వస్తే దానిని అత్యంత గోప్యంగా ఉంచేవారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు అరబ్, ముస్లిం దేశాలతో చేసినంత స్నేహం ఇజ్రాయిల్‌తో చేయలేదు. గతంలో ...

Read More »

ప్రతిఒక్కరు పర్యావరణానికి కృషి చేయాలి

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో పర్యావరణం కోసం కృషి చేసిన గాడ్కే బాబా ఆశయాల మేరకు ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కృషి చేయాలని మోర్తాడ్‌, పాలెం, రామన్నపేట అంబేడ్కర్‌ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని మోర్తాడ్‌, రామన్నపేట, పాలెం గ్రామాల్లో గాడ్కేబాబా 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. దేశంలో రైతులకు వ్యవసాయ సాగుపై, కుమ్మరులకు మట్టి పాత్రలు తయారుచేయడంపై నేర్పించిన ఘనత ...

Read More »

రాహుల్ వ్యూహం ఫలిస్తుందా?

మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లే కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించినంత మాత్రాన రాజకీయంగా ఎదగవచ్చని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన వ్యూహకర్తలు భావిస్తే పప్పులో కాలు వేసినట్లే. రాహుల్ గాంధీ చాలా కాలం నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఒక వ్యూహం ప్రకారం ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ రాజకీయ దాడి చేస్తున్నారు. మోదీని విమర్శించేందుకు ఆయన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. మోదీది సూటుబూటు ప్రభుత్వం అంటూ రాహుల్ గాంధీ ప్రారంభించిన విమర్శల పర్వం సాకులతో ...

Read More »

ఘనంగా శివాజీ జన్మదిన వేడుకలు

  నందిపేట, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరాఠ్వాడాలో మొగల్‌ సామ్రాజ్యాన్ని అంతమొందించిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ అని పలుగ్గుట్ట మంగిరాములు మహరాజ్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం పాతూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి శివాజీ జయంతి జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగిరాములు మహరాజ్‌ మాట్లాడారు. హిందువుల సంస్కృతి, సంప్రదాయాలకు, పవిత్ర గోమాతకు హానికలుగుతున్న సందర్భంలో ఛత్రపతి శివాజీ దుష్టశక్తుల్ని ఓడించి హిందూ సామ్రాజ్యాన్ని స్తాపించారన్నారు. కార్యక్రమంలో రాంచందర్‌, భరత్‌, యువజన సంఘ సభ్యులు ...

Read More »

సిఎంకు పట్టుశాలువా అందజేసిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

  ఆర్మూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ జన్మదిన వేడుకలు అంబరాన్నంటేలా జరిగాయి. ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో సిఎం కెసిఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయనకు ముఖ్యమంత్రి దంపతులున్న పట్టుశాలువాను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మండలంలోని పెర్కిట్‌ స్తూర్బా పాఠశాలలో సిఎం జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌చేశారు. తెరాస ...

Read More »

మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత కమిటీలు

  – జిల్లా కలెక్టర్‌ యోగితా రాణా నిజామాబాద్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా ఉద్యోగుల రక్షణకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ యోగితా రాణా ఆదేశించారు. కనీసం పదిమంది మహిళలు పనిచేసేచోట అంతర్గత కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల నుంచి మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన చట్టం పట్ల అవగాహన కల్పించేందుకు రూపొందించిన కరపత్రాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ ...

Read More »

నీళ్ళు లేక, వానలు లేక అల్లాడుతున్న పల్లె తెలంగాణా!

మన పల్లెల్లో పరిస్థితి చాల విషమంగా ఉంది. వేసిన పంటలు ఎలాగూ చేతికి రావడం లేదు. కాని అది ఎవ్వరు ఆలోచించడం లేదు. బతకడానికి కనీసం తాగే నీళ్ళు కూడా కరువయ్యే కరువు పరిస్థితి ఈనాడు ఊర్లల్లో ఉంది. బోర్లకు నీళ్ళు అందడం లేదు. నా నాటికి పరిస్థితి దిగజారుతున్నది. వారం వారానికి తేడా వస్తున్నది. స్వాతంత్రం వచ్చి ఆరు పదులు దాటినా కనీసం తాగు నీళ్ళు అందించలేని పరిస్థితికి అందరం సిగ్గు పడాలి. “ఇండియా షైనింగ్ “, “మేక్ ఇన్ ఇండియా ” ...

Read More »

శనివారం నుంచి తల్లిపాల వారోత్సవాలు

రెంజల్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మపాలు నవజాత శిశువుకు అమృతంతో సమానం… పుట్టిన బిడ్డకు తల్లిపాలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతియేటా ఆగష్టు మొదటివారంలో తల్లిపాల వారోత్సవాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తుంది. అనేక దేశాల ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. తల్లిపాల సంస్కృతి ఒక సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.   శిశువు పుట్టిన అరగంటలోపే తల్లిపాలు పడితే పిల్లలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ...

Read More »

మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలి

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని 28వ వార్డు కౌన్సిలర్‌ ప్రభాకర్‌ అన్నారు. పట్టణంలోని 28వ వార్డులో గురువారం జ్యోతి సమాఖ్య మహాజనసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభాకర్‌ హాజరై మాట్లాడారు. మహిళా సమాఖ్యలు ప్రబుత్వం అందించే రుణాలు వినియోగించుకొని తద్వారా లబ్దిపొందాలని అన్నారు. సమావేశంలో 2014-15 సంవత్సరానికిగాను జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి చర్చించారు. ఆడిట్‌ రిపోర్టు చదివి వినిపించారు. ఈయేడాదివార్షిక నివేదికను నిర్ణయించారు. ...

Read More »

అంకూర్‌ చిత్ర ప్రదర్శన

నిజామాబాద్‌, మే 20 : తెలంగౄణలో 30 ఏళ్ల క్రీతం భూస్వాములు సాగించిన ఆరాచకాలన, దోపిడి వ్యవస్తను తెరకు ఎక్కించిన చిత్రం అంకుర్‌. 1974లో తీసిన ఈ సినిమా భూస్వాములకు వ్యతిరేకంగా యువత తీరును అద్దం పడుతుంది. క్లాసిక్‌ సినిమా, కల్చరల్‌ సోసైటీ ఆధ్దర్యంలో నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్‌లో ఈ చిత్రం ప్రదర్శించారు. ఇందూరు భారతి అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌ చిత్ర విశేషాలను వివరాణించారు. ఈ కార్యక్రమంలో మేక రామస్వామి, కె.సుదర్శన్‌, గురుమూర్తిలు పాల్గొన్నారు.

Read More »

వారం రోజుల పండుగ – అవతరణ వేడుక

  -జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ నిజామాబాద్‌ కల్చరల్‌, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అధికారులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, కళాకారులు, ప్రజలంతా జూన్‌ 1 నుంచి వారం రోజుల పాటు ఒక పండుగలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ పిలుపునిచ్చారు. శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించడానికి జిల్లా అధికారులు, ఆర్టీవోలు, మునిపిపల్‌, కమీషనర్లు, తహసీల్దార్లు, ఎంపిడివోలతో ...

Read More »

”సుకన్య సమృద్ధి అకౌంట్‌”ను సద్వినియోగం చేసుకోండి

  నిజామాబాద్‌, మార్చి 19 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల జీవితాభివృద్ది కోసం సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్‌ డివిజన్‌ పోస్టాఫీసెస్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ అబిజిత్‌ బాన్సోడే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా తల్లిదండ్రులు గాని, చట్టపరమైన సంరక్షకులు గాని ఈ ఖాతాను ప్రారంభించవచ్చన్నారు. ఒక ఆడపిల్ల పేరుపై ఒక ఖాతా మాత్రమే ప్రారంభించవచ్చని, గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరుమీద కూడా ప్రారంభించవచ్చని, వారి వయసు ...

Read More »

వినియోగదారునిగా హక్కులు తెలుసుకోవాలి

నిజామాబాద్‌, మార్చి 15   నిజామాబాద్‌ న్యూస్‌ : ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఆదివారం ప్రగతిభవన్‌లో జిల్లా సంయుక్త కలెక్టర్‌ రవిందర్‌రెడ్డి, తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వినియోగదారుల ఫోరం, వినియోగదారుల సంఘాల సమాఖ్య సభ్యులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ వినియోగదారులకు చట్టాల పట్ల అవగాహన కల్పించి, ప్రశ్నించే తత్వం, గట్టిగా మాట్లాడే తత్వం అలవరుచుకునేందుకు చైతన్యవంతుల్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల ప్రయోజనాల కోసం అనేక రకాల ...

Read More »

నన్ను జర పట్టించుకోండ్రి

నిజామాబాద్‌, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ : అలో సారూ! నన్ను జర గుర్తువట్టిండ్రా? ఏం గుర్తువెట్టుకుంటరో ఇయ్యాలిటి దినంల గ ఈమేళ్లో, గీమేళ్లో గాని , పేసుబుక్కులచ్చిన సంది నన్ను యాడగుర్తువెట్టుకుంటుండ్రు. గదే పదేళ్ళ కిందైతే నానోట్ల చేతువెట్టంగానే మీ వోళ్ళు మంచిగుండ్రా, ఏం జేత్తుండ్రు, ఎట్లున్నరు అన్నది దబ్బున తెలుస్తుండే. కానీ గిప్పుడైతే నన్ను చెత్తకుప్పకంటే హీనంగ చూస్తుండ్రు. మరి గట్లనే నన్ను మొర్లపొంటి, పెంటకుప్పలపొంటి ఇడుస పెట్టుడే గాకుండ, గాళ్ళు, గీళ్ళు అచ్చుకుంట ఉమిసి పోతుండ్రు. మరి మీమీద గట్లనే ...

Read More »

అలరించిన మనోవైకల్య ,  అందుల , బదిరుల విన్యాసాలు 

ఘణంగా గా కవితక్క  జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి అధ్యక్షులు , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కల్వకుంట్ల  కవితక్క  జన్మదిన వేడుకలు తెలంగాణ జాగృతి విద్యార్ధి సమాఖ్య జిల్లా కన్వీనర్ పసుల చరణ్ ఆద్వర్యం లో స్థానిక కళా భారతి లో ఘనంగా జరిగాయి . ప్రభుత్వ అందుల పాటశాల , ప్రభుత్వ బదిరుల పాటశాల , మనో వికాస కేంద్రం , బాలసదన్ , ఆనంద నిలయం , సహాయ అనాదాశ్రమం లోని విద్యార్థుల ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది . మర్రిపెల్లి ...

Read More »

కామారెడ్డి జిల్లా కేంద్రంగా కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

-నెరవేరనున్న కామారెడ్డి వాసుల కల -ఫలించిన జిల్లా సాధన సమితి పోరాటం కామారెడ్డి ఫిబ్రవరి 13 (నిజామాబాద్ద్ న్యూస్.ఇన్ ): కామారెడ్డిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా సాధన సమితి ఆధ్యర్యంలో చేస్తున్న ఉద్యమానికి ఫలితం లభిచనుంది. కామారెడ్డి జిల్లా అవుతుందో లేదో అని డోలాయమానంగా ఉన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ప్రకటనతో దానికి తెరపడ్డట్టు అయ్యింది. కామారెడ్డి వాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. గురువారం జిల్లాలోని సదాశివనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ”ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డిని ...

Read More »

మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలిo

నిజామాబాద్‌, మార్చి 08   నిజామాబాద్‌ న్యూస్‌ : అవినీతి రహిత సమాజం కోసం మహిళలు ఎక్కువగా కృషి చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ.రవిందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి జిల్లా మహిళ శిశుసంక్షేమశాఖ, వివిద స్వచ్చంద సంస్థలు, మహిళా సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ర్యాలీని సంయుక్త కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఇప్పటికే ఎంతో చైతన్యవంతులై అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారని ఆయన అన్నారు. ...

Read More »