Breaking News

Gandhari

చికిత్స పొందుతూ యువతి మృతి

గాంధారి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్దరాత్రి మృతి చెందినట్లు గాంధారి ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. మండలంలోని మాధవపల్లి గ్రామానికి చెందిన రాయల‌ సౌందర్య (21) గత నెల‌ 18 వ తేదీన వారి ఇంటి వద్ద ఖాలీ స్థలంలో పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి యువతిని నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ...

Read More »

గాంధారిలో వాటర్‌ ప్లాంట్లు ప్రారంభం

గాంధారి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని వివిధ గ్రామాల‌లో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను సోమవారం ప్రారంభించారు. సఫ ఆర్గానిక్‌ లిమిటెడ్‌ అధినేత, శాస్త్రవేత్త అయిన పైడి ఎల్లారెడ్డి తన సొంత ఖర్చుల‌తో మండలంలోని మేడిపల్లి, సితాయిపల్లి, పెట్‌ సంగేమ్‌, నర్సాపూర్‌ గ్రామాల‌లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా అయన ఆయా గ్రామాల‌ ప్రజాప్రతినిధుల‌తో కలిసి వాటిని ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజల‌కు మినరల్‌ వాటర్‌ అందించాల‌నే ఉద్దేశ్యంతో ...

Read More »

సమాచార హక్కుచట్టం క్యాలండర్‌ ఆవిష్కరణ

గాంధారి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాచార హక్కుచట్టం క్యాలండర్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌ శనివారం ఆవిష్కరించారు. 2021 కు సంబందించిన మొత్తం 12 నెలల క్యాలండర్‌ ఎంతో బాగుందని ఎమ్మెల్యే అన్నారు. సమాచార హక్కుచట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్యం, సమాచార హక్కుచట్టం జిల్లా కార్యదర్శి రమేష్‌, సంజీవులు, మండల ప్రతినిధులు సురేష్‌, కష్ణ, సాయిలు, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

నర్సరీలలో మొక్కలు సంరక్షించాలి

గాంధారి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి ఏపిడి, ఇంచార్జ్‌ డిపిఓ సాయన్న అన్నారు. శనివారం గాంధారి మండలకేంద్రంలో నర్సరీని అయన పరిశీలించారు. ఈ సందర్బంగా సీడ్‌ దిబ్లింగ్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించగా దానిని తిలకించారు. మొక్కలు పెంచే క్రమంలో వాటి విత్తనాలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నర్సరీల బాధ్యతలు స్వీకరించి వాటిని కాపాడే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, ఎంపీపీ ...

Read More »

బాధిత కుటుంబానికి కాంగ్రెస్‌ సాయం

గాంధారి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితునికి కాంగ్రెస్‌ నాయకులు సహాయం అందించారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన మద్దెల కాశయ్య ఇల్లు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న గాంధారి మండల కాంగ్రెస్‌ నాయకులు తగిన సహాయం అందించారు. బాధితునికి, కుటుంబానికి దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలరాజ్‌, కాంగ్రెస్‌ నాయకులు మదార్‌, లైన్‌ రమేష్‌, గడ రాజు, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

జాగృతి నాయకుల రక్తదానం

గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యా, వైద్య, ఆరోగ్యంతో పాటు స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో తెలంగాణ జాగతి సభ్యులు ముందుంటారని మరోసారి నిరూపించారు. రక్త దానం చేసి ఆదుకున్నారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన మంచాల రాములు కాలికి ఆపరేషన్‌ నిమిత్తం 0 పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని సమాచారం అందుకున్న జాగతి జిల్లా పిఆర్‌ఓ ఆవుసుల రాజు జాగతి సభ్యులు స్వామి గౌడ్‌, భైరయ్య, రవి, లత రణదీప్‌లు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ...

Read More »

మంగళవారం గాంధారికి మంత్రి రాక

గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మంగళవారం పర్యటించనున్నట్లు మండల తెరాస నాయకులు తెలిపారు. పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో జరిగే సభలో పాల్గొంటారని అన్నారు. మండల కేంద్రాలోని కేజీబీవీ ఆవరణలో నూతనంగా కోటి యాభై నాలుగు లక్షలతో నిర్మించిన నూతన కళాశాల భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మండలంలో నిర్మించే ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన ...

Read More »

క్రిస్టమస్‌ కిట్ల పంపిణి

గాంధారి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సబ్బండ వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ద్యేయమని గాంధారి జడ్పీటీసీ శంకర్‌ నాయక్‌, ఎంపీపీ రాదా బలరాం నాయక్‌ అన్నారు. సోమవారం గాంధారి మండలంలో సుమారు 150 క్రిస్టమస్‌ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా స్థానికంగా గల రెండు చర్చిలలో పర్యటించి కిట్లను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కషిచేస్తున్నారని అన్నారు. గుర్జాల్‌కు 20, గండివేట్‌కు ...

Read More »

ప్రేమ జంట ఆత్మహత్యయత్నం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసుకోగా చికిత్స పొందుతూ ప్రియురాలు మతిచెంది, ప్రియుడు చికిత్స పొందుతున్న సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండలం పొతంగల్‌ కలాన్‌కు చెందిన గాండ్ల సాయికుమార్‌ వడ్లూర్‌ గ్రామానికి చెందిన తన మరదలు గాండ్ల రమ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఈ నెల 11 వ తేదీన శుక్రవారం గాంధారి ...

Read More »

అక్కడ మొత్తం సర్పంచ్‌ భర్త పెత్తనం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అదో చిన్న గ్రామపంచాయతీ.. అక్కడ వారు దొరలు… ఆ పంచాయతీకి సర్పంచ్‌ జనరల్‌ మహిళా రిజర్వు కావడంతో ఎన్నికలలో దొరల కుటుంబంలోని మహిళ గెలుపొందారు. అప్పటినుండి వారు దొరలు కావడంతో సర్పంచ్‌ భర్త ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. గ్రామ పంచాయతీలో పెత్తనం అంతా ఆయనదే. ఈ విషయమై లోకాయుక్తలో పిర్యాదు వెళ్లగా కేసు నమోదు అయింది.. వివరాల్లోకి వెళితే…. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో తిమ్మాపూర్‌ అనే గ్రామ పంచాయతీ ఉంది. ఈ పంచాయతీకి ...

Read More »

మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం

గాంధారి, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని పొతంగల్‌ కలాన్‌ గ్రామంలో ఆదివారం స్థానిక సర్పంచ్‌ బాలరాజ్‌ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఐడీసీఎంస్‌ ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల వద్దనుండి మక్కలను కొనుగోలు చేస్తున్నట్లు అయన తెలిపారు. ముక్కలకు మద్దతు ధర క్వింటాలుకు 1850 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. పంచాయతీ పరిధిలో గల రైతులు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద టోకెన్‌లు పొంది కొనుగోలు కేంద్రంలో తాము పండించిన మక్కలను విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ...

Read More »

గాంధారి లాక్‌ డౌన్‌

గాంధారి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోన మహమ్మారి విస్తరిస్తున్నందున గాంధారిలో చాలా పాజిటివ్‌ కేసులు నమోదై ఉన్నాయని, ఇంకా పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయని గాంధారి గ్రామ పంచాయతీ పాల‌కవర్గ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో గాంధారి నిత్యావసరాల‌ వస్తువుల‌ దుకాణ సముదాయాల‌ వారు, వర్తక వాణిజ్య సంఘాల‌ వారు స్వతహాగా గాంధారి పాల‌కవర్గంతో పాటు గ్రామాభివృద్ధి కమిటీతో కలిసి పలు తీర్మానాలు చేశారు. దుకాణ సముదాయాలు జూలై 21వ తేదీ ...

Read More »

16, 17 తేదీల్లో పూర్తిగా బంద్‌

గాంధారి, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోన మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో గాంధారిలో చాలా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇంకా పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయని గాంధారి గ్రామ పంచాయతీ పాల‌కవర్గం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా మంగళవారం జరిగిన సమావేశంలో గాంధారిలో నిత్యావసరాల‌ వస్తువుల‌ దుకాణ సముదాయాల‌ వారు, వర్తక వాణిజ్య సంఘాల‌ వారు స్వతహాగా గాంధారి పాల‌కవర్గంతో పాటు గ్రామాభివృద్ధి కమిటీతో కలిసి పలు విషయాలు తీర్మానించారు. దుకాణ సముదాయాలు 16, 17వ తేదీలు ...

Read More »

మొక్కజొన్నే గాంధారి ప్రాంత రైతుల‌ జీవనాధారం

గాంధారి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో చాలా ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలుగా ఉండడం, వర్షాధార పంటల‌కు అనుకూలం కావడంతో మక్కజొన్న తప్పించి మరే పంట కూడా రాలేని స్థితి ఉందని ఇక్కడి రైతులు అంటున్నారు. రైతులు ఊహించని విధంగా మొక్కజొన్న సాగు చేయవద్దని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం రైతు వ్యతిరేక చర్యల‌కు నిదర్శనమన్నారు. ఆయా గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న పంట సాగు చేయకపోతే రైతు తమ భూముల‌ను వదులుకొని అప్పుల పాల‌య్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ...

Read More »

గాంధారిలో రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే

గాంధారి, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల‌ కేంద్రంలోని ప్రధాన రహదారిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల‌ సురేందర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో దాదాపుగా 90 శాతం రహదారుల‌ పనులు పూర్తి కావస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలోనే సీతాయిపల్లి, సోమారం గ్రామాల‌ రోడ్లను కూడా ప్రారంభిస్తామని అన్నారు. ఈ సందర్భంగా గాంధారి మండల‌ ప్రజలు, గ్రామస్తుల‌ తరఫున సర్పంచ్‌ సంజీవ్‌ యాదవ్‌ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

ఘనంగా బాబూ జగ్జీవన్‌రాం జయంతి

గాంధారి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్‌రాం 111వ జయంతిని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం బాబు జగ్జీవన్‌రాం ఎనలేని కృషి చేశారన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగని బాలయ్య, లైని రమేశ్‌, సయ్యద్‌ అల్తాఫ్‌, తూర్పు రాజులు, గడ శంకర్‌, భాగ్యనాయక్‌, రెడ్డి రాజులు, గాండ్ల ...

Read More »

మాతు సంగెంలో కుస్తీ పోటీలు

గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని గ్రామంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కుస్తీపోటీలలో గ్రామంలోని కుస్తీ వీరులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, రాష్ట్రాల నుండి కుస్తీ వీరులు పాల్గొన్నారు. పది రూపాయల కుస్తీ నుంచి 5 వేల కుస్తీ వరకు పోటీలు నిర్వహించారు. అదేవిధంగా వెండి కడియం కుస్తీ కూడా నిర్వహించారు. కుస్తీ పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతితో ...

Read More »

బ్యాంకులకు నకిలీ రుణాల బెడద

  – నకిలీ పత్రాలతో పంట రుణాలు – రుణమాఫీ కాకపోవడంతో అనుమానం – బ్యాంక్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో రెవెన్యూ అధికారుల విచారణ – 745 ఖాతాలు నకిలీవని నిర్ధారణ – గండివేట్‌ సిండికేట్‌ బ్యాంకుకు 3.5 కోట్లు టోకరా గాంధారి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేము అధికారంలోకి రాగానే రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తాం. ఇది ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు చేసే వాగ్దానం. హామీ ఇచ్చినట్టుగానే ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే ...

Read More »

బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక శాతం నిధులు కేటాయించాలి

  గాంధారి, మార్చి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి బడ్జెట్‌ సమావేశంలోనైనా విద్యారంగానికి 30 శాతం నిదులు కేటాయించాలని పిడిఎస్‌యు జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ నాయక్‌, ప్రేమ్‌సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి విద్యారంగానికి సవతి తల్లిప్రేమ చూపిస్తుందన్నారు. కనీసం ఈ చివరి బడ్జెట్‌ సమావేశంలోనైనా విద్యారంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు విద్యారంగానికి ఎన్నో హామీలిచ్చినా తెరాస పార్టీ కెజి ...

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

  గాంధారి, మార్చి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కామరెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు జమునా రాథోడ్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మొదటగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు విద్యారంగంతో పాటు రాజకీయంగా ఎదగాలన్నారు. ఇప్పటికి కొన్నిచోట్ల మహిళలు రాణిస్తున్నారని, ఇంకా అభివృద్ది చెందాల్సిన అవసరముందన్నారు. మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ ...

Read More »