Breaking News

Gulf News

తెగిన సంకెళ్ళు

  – కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కువైట్‌ దేశంలో అక్రమంగా పర్మిట్‌ వీసా లేకుండా శిక్షపడ్డ తెలంగాణ కార్మికులకు కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ, ఐటి శాఖ మంత్రి తారకరామారావు కువైట్‌ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. గల్ప్‌ జైళ్ళలో మగ్గుతున్న తెలంగాణ కార్మికులకు స్వదేశానికి రప్పించేందుకు నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అందుకు తగిన ఏర్పాట్లు ...

Read More »

గల్ప్‌ మోసాలపై ఉక్కుపాదం

  – నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ నిజామాబాద్‌ టౌన్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో గల్ప్‌ ఏజెంట్ల మోసాలు అరికట్టేందుకు గల్ప్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కమీషనర్‌ కార్తికేయ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్యువల్‌ క్రైమ్‌ రివ్యు-2017 సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో 2017 సంవత్సరంలో 6117 కేసులు నమోదైనట్టు, గత ఏడాదితో పోలిస్తే చైన్‌ స్నాచింగ్‌ కేసులు 8 శాతం ...

Read More »

ఎమిరేట్స్‌లో ప్రైవేటు రంగానికి మూడురోజుల సెలవు

ప్రైవేటు రంగంలో ప‌నిచేసే ఉద్యోగులు, కార్మికుల కోసం యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప్ర‌భుత్వం మూడురోజుల సెలవును ప్ర‌క‌టించింది. న‌వంబ‌ర్ 30వ తేదీ నుంచి డిసెంబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు ఆ దేశంలో ప్రైవేటు సంస్థ‌లకు సెల‌వు కొన‌సాగుతుంది. తెలుగువారితో పాటు ల‌క్ష‌లాది మంది భార‌తీయులు స్థిర‌ప‌డిన భ‌వ‌న నిర్మాణ‌రంగంతో పాటు అన్ని సంస్థ‌ల‌కూ మూడురోజుల సెల‌వు వ‌ర్తిస్తుంది. 46వ జాతీయ దినోత్సవం, అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మూడురోజుల పాటు సెల‌వును ప్ర‌క‌టించిన‌ట్టు ఎమిరేట్స్ మాన‌వ వ‌న‌రులు, ఎమిరేటైజేష‌న్ మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. డిసెంబ‌ర్ 3వ ...

Read More »

ఒమన్ లో తెలంగాణ జాగృతి రక్తదాన శిబిరం

ఈరోజు మస్కట్ లో తెలంగాణ జాగృతి మరియు తెలంగాణ ప్రవాస వాణి సంయుక్తంగా నిర్వహించిన రక్తధనశిబీరంలో  పాల్గొన్న ప్తతి ఓ క్కరి హ్రదయ పూర్వకంగా క్రూతజ్ఞతలు తెలియ చేస్తున్నము రక్తదానం (బ్లడ్ డొనేషన్) అనేది దాదాపుగా ప్రాణదానం లాంటిది. జనాభాలో నూరింట అయిదుగురు మాత్రమే రక్తదానం చేస్తామని ముందుకి వస్తున్నారు. ప్రమాదాలలో దెబ్బలు తగిలి రక్తం బాగా పోయినప్పుడు సర్వసాధారణంగా ఆపరేషను చేసి ప్రాణంలను కాపాడుతారు. ప్రాణాపాయస్థితిలో వున్న వ్యక్తికి రక్తం ఇచ్చి ప్రాణం కాపాడడమంటే… అంతకన్నా పరోపకారం ఏముంటుంది? అన్నదానం, విద్యాదానం, ఏ ...

Read More »

సినిమా లవర్స్ తప్పక చూడాల్సిన ‘గల్ఫ్’

పొట్టకూటి కోసం కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును వదిలేసి.. పరాయి దేశానికి వలస వెళ్లి.. అక్కడ బాధలను దిగమింగుకుని మరీ కుటుంబం కోసం కష్టాలు అనుభవిస్తున్న గల్ఫ్ కార్మికుల కోసం.. ఓ సినిమా వచ్చింది. సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ.. వంటి సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు తీసే పీ.సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ‘గల్ఫ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. గల్ఫ్ కష్టాలు, ఓ ప్రేమకథ, కన్నతల్లిదండ్రుల కోసం తపన.. ఇలా పలు అంశాలను స్పృసిస్తూ సునీల్‌కుమార్ ...

Read More »

ప్రవాసుల కోసం తక్షణం స్పందించే ‘మదద్’

విదేశాల్లోని భారతీయులకు బాసట గల్ఫ్ తో పాటు ఇతర దేశాలలో ఉన్న భారతీయులు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అసలే విదేశీ వ్యవహారం… సుదూర తీరంలో సమస్య. మనం ఇక్కడ… సమస్య ఎక్కడో…  సమస్యలను ఒక సామాన్య పౌరుడు నేరుగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసికెళ్ళే పరిస్థిలేదు, చైతన్యం లేదు. ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయుల కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మదద్’ వెబ్ సైట్ తో శ్రీకారం చుట్టింది. ఇది ప్రవాసి కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు ఒక వారధిలాగా ఉపయోగపడుతుంది. ...

Read More »

ఖతార్‌ సంక్షోభానికి మోక్షం ఏదీ?

Qatar issue గల్ఫ్‌ మండలిలోని అతిచిన్న దేశమైన ఖతార్‌పై ఇతర అరబ్‌దేశాలు విధించిన ఆంక్షలతో ఇతర దేశీయులకు ముఖ్యంగా భారతీయులకు పాట్లు ఎక్కువయ్యాయి. అక్కడి వీసాలపై పనిచేసేందు కువచ్చినవారికి ఇతర గల్ఫ్‌దేశాల్లో పనులు ఉపాధి లభిం చడంలేదు. ఆర్ధికపరంగా ఆంక్షలు విధిస్తూ ఖతార్‌ను ఏ కాకినిచేసే విధంగా గల్ఫ్‌దేశాలు ఒక్కటయ్యాయి. విమా నాలు రద్దయ్యాయి. మరికొన్నింటికి రూట్లు మార్చివేసా రు. ఖతార్‌ పౌరులపై ఇతర గల్ఫ్‌దేశాల్లో బహిష్కరణ వేటు విధించారు.ఇదంతా ఎందుకు ఉగ్రవాదానికి ప్రత్యే కించి ఐసిస్‌, ఆల్‌ఖైదా వంటి సంస్థలకు ఖతార్‌ మద్దతు ...

Read More »

దుబాయి రాజు సంచలన నిర్ణయం.. వెబ్‌సైట్ బ్యాన్..!

యూఏఈ: ఖతార్‌పై సౌదీ సహా ముస్లిం దేశాలు కత్తిగట్టిన తర్వాత.. ఆయా దేశాల మధ్య సంబంధాలు మరింతగా చెడిపోతున్నాయి. సౌదీ, యూఏఈ, ఖతార్, కువైట్, ఈజిప్ట్ సహా పలు ముస్లిం దేశాలు.. ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న కారణంతో ఖతార్‌పై నిషేధం విధించాయి. అంతే కాకుండా పాలు సరఫరా చేయకపోవడం వంటి పలు ఆంక్షలను కూడా మొదట్లో పెట్టాయి. అయితే ఆయా దేశాల మధ్య చర్చలు ఇంకా జరుగుతూనే ఉండటంతో.. సమస్యను మరింత జఠిలం చేసే కొన్ని పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. ఖతార్‌కు చెందిన ‘అల్ జజీరా’(Al-Jazeera) ...

Read More »

సోషల్ మీడియాలో యువతి వీడియోతో.. సౌదీలో కలకలం

రియాధ్: ఆరు సెకన్లు.. కేవలం ఆరు సెకన్ల వీడియో సౌదీలో వాతావరణాన్ని ఒక్కసారిగా హీటెక్కించింది. ఓ యువతి అసాధారణ చర్యతో సౌదీ వ్యాప్తంగా కలకలం మొదలైంది. సౌదీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఓ యువతి చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. సౌదీ రాజధాని రియాధ్‌కు 95 మైళ్ల దూరంలో ప్రముఖ సందర్శన స్థలమయిన ఉషాయ్‌కిర్ దగ్గర ఉండే నజ్డ్ అనే గ్రామ పరిసర ప్రాంతాలకు ఓ యువతి వెళ్లింది. వీకెండ్‌లలో ఎవరూ లేని సమయంలో అక్కడకు వెళ్లి.. సౌదీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దుస్తులు ధరించి ఓ వీడియో ...

Read More »

కొత్తగా దుబాయ్ వెళ్తున్నారా.. ఈ విషయం తెలుసుకోండి

దుబాయ్: ఎంతో మంది కొత్తగా దుబాయ్ వెళ్తుంటారు. వారికి దుబాయ్ ప్రభుత్వం ఒక సూచన చేస్తోంది. ప్రభుత్వ అధికార ప్రతినిధి సామిఅల్ షామి ఈ సూచన చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చెబుతున్నరంటే, కొత్తగా దుబాయ్ వచ్చే వారు పాస్‌పోర్టులు ఎవ్వరికీ ఇవ్వదొద్దని చెబుతున్నారు. అమాయకులను కొంత మంది దుబాయ్ ఎయిర్‌పోర్టులో మోసం చేస్తున్నారని ఆయన చెప్పారు. కొంతమంది కొత్తగా దుబాయ్ వచ్చేవారిని టార్గెట్ చేసుకుని వారి దగ్గరనుంచి పాస్‌పోర్టులు, డబ్బులు లాక్కుంటున్నారని అడిగితే తాము అధికారులం అంటూ వారిని నమ్మించే బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. ...

Read More »

కాఫీ కేఫ్‌లో పరాయి వ్యక్తితో భార్యను చూసిన భర్తకు షాక్..

కువైట్: ఆఫీసులో ఉండాల్సిన భర్త.. తన ప్రియురాలితో బయట షికార్లు చేస్తూ భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే.. ఇంట్లో ఉండాల్సిన భార్య.. మరో వ్యక్తితో కాఫీ కేఫ్‌లో తారసపడితే.. ఎదుటి వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఘోరంగా ఉంటుంది.. కానీ కువైట్‌లోని ఓ వ్యక్తికి ఇదే సంఘటన ఎదురైంది. రోజూలాగానే ఆఫీసుకు వెళ్లిన ఓ కువైట్ పౌరుడు.. స్నేహితుడు పిలిచాడని సిటీలోని ఓ కాఫీ కేఫ్‌కు వెళ్లాడు. ఎంచక్కా కూర్చుని కాఫీ ఆర్డరిచ్చారు. అయితే ఈలోపు ఊహించని సన్నివేశం అతడికి కనిపించింది. ఇంట్లో ఉండాల్సిన ...

Read More »

ఆమె గర్భం దాల్చడానికి తనకు సంబంధం లేదంటున్న భర్త

దుబాయ్: భార్య గర్భం దాల్చింది. అంతకు ముందే భర్త కనిపించకుండాపోయాడు. ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. ఒక వైపు డెలివరీ టైమ్ దగ్గరపడుతోంది. మరోవైపు డెలివరీకి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆ మహిళ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త కనిపిచడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇదేదో నయనతార నటించిన అనామిక సినిమాలోగే జరిగింది. అయితే ఇక్కడో ట్వీస్టు కూడా ఉంది. అదెంటంటే పెళ్లైన రెండు నెలలకే ఆమె భర్త కనిపించకుండాపోయాడు. తరువాత ఆమె ...

Read More »

‘పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గుంటే ఊరుకోం’

దుబాయ్: ఉపాధి కోసం గల్ఫ్‌దేశాలకు వెళ్లే కార్మికుల సంఖ్య అధికంగా ఉంటుంది. గల్ఫ్ వెళ్లిన వారిలో చాలా మందికి అక్కడి చట్టాలు, నిబంధనలపై అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫిలిప్పైన్స్ నుంచి యూఏఈ వెళ్లిన వారు ఇటీవల కష్టాలను ఎదుర్కొంటున్నారు. కొందరు ఫిలిప్పైన్లు పెళ్లవ్వకుండానే ఆడ, మగ  కలిసి ఒకే రూంలో అద్దెకు ఉంటున్నారు. లైంగిక సంబంధాలను కొనసాగిస్తున్నారు. గర్భం దాల్చడంతో పిల్లల్ని కూడా కంటున్నారు. ఈ విషయంపై యూఏఈ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిలిప్పైన్స్‌లో పెళ్లికి ముందు సెక్స్‌లో ...

Read More »

మరో సంచలన నిర్ణయం తీసుకున్న దుబాయి రాజు

దుబాయి: ఇరాన్‌ను పొగుడుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు పరోక్ష మద్దతునిస్తోందంటూ ఖతర్‌పై అయిదు ముస్లిం దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సౌదీతోపాటు యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్, యెమెన్ దేశాలు ఖతర్‌తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించి గల్ఫ్ దేశాల్లో సంచలనానికి తెరతీశాయి. యెమన్‌లో జరుగుతున్న యుద్ధంలో తమ నాయకత్వ కూటమి నుంచి ఖతర్‌ను వెలివేస్తున్నట్లు సౌదీ ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశంలోని ఖతర్ ప్రజలను వెళ్లిపొమ్మని యూఏఈ తేల్చిచెప్పింది. కాగా ఈ గల్ఫ్ సంక్షోభం ముదిరి పాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా యూఏఈ మరో సంచలన ...

Read More »

గల్ప్‌లో యువకుడి మృతి

బీర్కూర్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొట్టచేతబట్టుకొని ఉద్యోగం కోసం యువత గల్ప్‌ బాటపడుతున్నారు… అనుకోని పరిస్థితిలో ప్రమాదం జరిగినా, అనారోగ్యంతో మృతి చెందినా కుటుంబ సభ్యుల చివరి చూపు కూడా నోచుకోవడం లేదు… ఇలాంటి విషాద సంఘటనలు తెలంగాణలో ఎన్నో… తాజాగా కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలం మైలారం గ్రామానికి చెందిన తెల్లపురం లక్ష్మయ్య గల్ప్‌దేశంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. మూడునెలలు గడుస్తున్నా శవం ఇంటికి రాని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మూడునెలలుగా దిక్కుతోచని ...

Read More »

తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ డిమాండ్స్ డే

 14. 04. 2017 అధికారంలోకి వచ్చి 34 నెలలైనా…. ప్రవాసులను పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ! తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 10 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో, మరో 10 లక్షల మంది అమెరికా తదితర దేశాలలో నివసిస్తున్నారు. ‘తెలంగాణ ప్రవాసుల సంక్షేమం’ పేరిట టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక-2014 లో పలు హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటింది, 34 నెలలు గడిచిపోయాయి, ఇచ్చిన హామీల అమలు చేయడం లేదు. ఈ బడ్జెలో గల్ఫ్ ఎన్నారైల సంక్షేమానికి ...

Read More »

పదేళ్లుగా కడుపులో LED బల్బు

కడుపులో సూదులు చూశాం.. కణుతులు చూశాం.. తాజాగా LED బల్బుతో ఓ వ్యక్తి సంచలనం సృష్టించాడు. సౌదీకి చెందిన ఓ వ్యక్తి కడుపు నుంచి LED బల్బును బయటకు తీశారు డాక్టర్లు. సౌదీలోని అల్ అషాకు చెందిన 21ఏళ్ల యువకుడు కడుపునొప్పి, వాంతులతో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. వెంటనే సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు.. అతని కడుపులో అనుమానాస్పద వస్తువును గుర్తించారు. ఏంటా అని చూస్తే అది బల్బు. ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. దాన్ని బయటకు తీశారు. అసలు విషయంలోకి ...

Read More »

28 ఏళ్ల క్రితం ఇంట్లో పనిచేసిన మహిళ కోసం ఓ సౌదీ కుటుంబం..

సౌదీఅరేబియా: సౌదీలో ఇంట్లో పనిమనుషులుగా చేసేవారు చిత్రహింసలను ఎదుర్కొంటున్నట్లు ఎన్నో వార్తలు చదివి ఉంటారు. అక్కడ చట్టాలు కూడా సౌదీ పౌరులకు అనుకూలంగానే ఉంటాయి. యజమాని ఒప్పుకోనిదే వేరే చోట పనిచేయకూడదు. అసలు దేశం కూడా దాటనివ్వరు. చాలామంది యజమానులయితే పనిమనుషులను ఓ బానిసలా చూస్తుంటారు. వీళ్లలాగానే.. పనిమనుషులను తమ ఇంటివారిలాగా చూసుకునేవారు కూడా ఉంటారు. తమ ఇంట్లో పనిచేసిన మహిళను గుర్తు పెట్టుకుని మరీ చూసేందుకు వెళ్లింది. యోగక్షేమాలను కనుక్కుంది. అయితే ఆమె ఏ పక్క ఊరికో వెళ్లిందనుకుంటే పొరపాటే.. కేవలం పనిమనిషిని చూసేందుకు ...

Read More »

భార్య నుంచి ఫోన్.. భర్తకు కాదు అతడి స్నేహితుడికి

దుబాయ్: ఒక వ్యక్తి భార్య తన భర్తతో కలిసి పనిచేస్తోన్న మరో వ్యక్తితో చనువుగా ఉంటోంది. ఇది గమనించిన ఆమె భర్త జాగ్రత్తగా ఉండమని వారిద్దరిని హెచ్చరించాడు. అయిన వారి ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. దాంతో కోపం పెంచుకున్న భర్త తన స్నేహితుడిని చంపేశాడు. ఇది ఎలా జరిగిందంటే పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తి దుబాయ్‌లోని ఒక ఫుడ్‌కోర్టులో పనిచేస్తున్నాడు. అక్కడే అతడికి అసిస్టెంట్‌గా మరో వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. అయితే అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్న వ్యక్తి, పాకిస్తాని వ్యక్తి భార్యతో సానిహిత్యం పెంచుకున్నాడు. ...

Read More »

కువైట్‌లో 90 మందికి దేశ బహిష్కరణ

కువైట్: ఉపాధి కోసమంటూ దేశానికి వలస వచ్చి… అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాదాపు 90 మంది విదేశీయులను కువైట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆసియన్, ఆఫ్రికన్ దేశాల నుంచి వచ్చిన మహిళలు వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఎక్కడికక్కడ దాడులు నిర్వహించారు. మొత్తం మీద 50 మంది మహిళలను అరెస్ట్ చేశారు. వారితోపాటు మరో 40 మంది వలసదారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. యజమానులకు చెప్పకుండా పారిపోయి అక్రమాలకు పాల్పడుతూ కొందరు, వేరే పని చేసుకుంటూ ఇంకొందరు, వీసా గడువు ముగిసినా దేశంలోనే ...

Read More »